దేశం గర్వించ దగ్గ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, కృష్ణా జిల్లా డిప్యూటీ కలెక్టర్ పూసర్ల వెంకట సింధు, సామాజిక బాధ్యతను చాటుకున్నారు... బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు...

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు, ఎంత గెలుచుకుంటే అంత బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇస్తాను అని ముందే చెప్పారు... చెప్పినట్లుగానే, రూ. 25 లక్షలు గెలుపొందిన మొత్తాన్ని, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.

బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి వర్గాలు కూడా, ఈ విషయాన్ని తెలియ చేశాయి.. క్యాన్సర్‌పై జరిపే పోరాటంలో, అందరూ పాల్గునాలి అని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది, భాగస్వాములు అవుతారని తాము ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

మన రాష్ట్రంతో సోషల్ మీడియా పైడ్ బ్యాచ్ తో, పాటు, హైదరాబాద్ లో కూర్చుని నిత్యం ఆంధ్ర రాష్ట్రము మీద ఏడ్చే మేధావి వర్గం ఒకటి, ఎప్పుడూ చంద్రబాబు ఎప్పుడు నోరు జారతాడా, లోకేష్ ఎప్పుడు నోరు జారతాడా అని వాళ్ళ స్పీచ్లు గంటలు గంటలు చూసి, అందులో ఎదో ఒక చోట తడబడితే, ఆ తడబాటుని తీసుకుని సునకానందం పొందే వాళ్ళని చూస్తూనే ఉన్నాం... ప్రజా సమస్యల పైన కాని, ప్రభుత్వ విధానాల పై కాని, ఇలాంటివి చెయ్యటం వారికి చేత కాకి, ఇలాంటి చిల్లర ఎవ్వారాలు చూసుకుంటూ ఉంటారు...

అయితే ఈ చిల్లర గాళ్ళకి, ఇప్పుడు తెలంగాణా మంత్రి హరీష్ రావు పెద్ద జర్క్ ఇచ్చాడు... నిన్న ఒక సభలో మాట్లాడుతూ, "తెలంగాణా అభివ్రుధ్దిని అడ్డుకుంటున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే" అని సెలవిచ్చారు... నిజానికి, ఇది ఎదో తడబాటులో మాట్లాడిన మాటలు.. ఇది వరకు ఇలాంటివి ఎవరూ పట్టించుకునేవారు కాదు...

ఈ మధ్య ఈ పైడ్ బ్యాచ్, ఏడ్చే బ్యాచ్, సోషల్ మీడియాలో కేవలం లోకేష్, చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని చేస్తున్న క్యాంపైన చూసి, ఆ చిల్లర గాళ్ళ కోసం, ఇది హైలైట్ చెయ్యాల్సి వచ్చింది... హరీష్ ను చూసి నేర్చుకోవాలి అని చెప్పే బ్యాచ్, మరి ఇప్పుడు చెప్పండి, ఏమి నేర్చుకోమంటారు...

ఖర్మ ఫలం అనుభవించాలి... అన్నీ తిరిగి ఇచ్చెయ్యాలి, లేకపోతే లావు అయిపోతాం... ఇప్పటికైనా, ఇలాంటి చిల్లర ఎవ్వారాలు మాని, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలని నిలదియ్యండి...

అంబేద్కర్ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలిపేలా అంబేద్కర్ స్మృతివనం నిర్మింపజేయాలని, అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆరందబాబు విజయవాడ రాష్ట్ర అతిధి గ్యహంలో నిర్వహించిన విలేకరుల నమావేశంలో వెల్లడించారు.

అంబేద్కర్ 126వ జయంతి వేడుకల సందర్భంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి అంబేద్కర్ స్మృతివనంకు భూమిపూజ నిర్వహించారని మంత్రి తెలిపారు. అంబేద్కర్ స్మృతివనం ప్రపంచ స్థాయి నిర్మాణాలలో ఒకటిగా నిలిపేలాగా ప్రముఖులు, ప్రజల అభిప్రాయాలను జోడించి అత్యున్నత స్థాయి నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు.

ఇందులో భాగంగా 4 నమూనా అంబేద్కర్ స్మృతివనాలను రూపొందించడం జరిగిందన్నారు. ఆ డిజైన్ల వివరాలను వీడియో క్లిపింగ్లతో పాటు వెబ్ సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీనుకురావడం జరిగిందన్నారు. ఈ డిజైన్ లను పరిశీలించి వాటిలో అత్యుత్తమమైన వాటిని ప్రజలే ఎంపిక చేసేలాగా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచామన్నారు.
http://103.210.73.30/AmbedkarSmritiVanamProject/

నాలుగు నమూనా వీడియో చిత్రాలను అందుబాటులో ఉంచామని, వాటిలో ఉత్తమమైన వాటిగా ప్రజలు గుర్తించిన దాని పై ఎంపిక చేసి అందుకు కారణాలు వ్యక్తుల వివరాలు తెలియజేసే సౌలభ్యాన్ని కలుగజేస్తున్నామన్నారు.

అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్ట్ లో భాగంగా 125 అడుగుల అమెడ్కర్ విగ్రహం, 5oo మంది కూర్చునేలాగా బుద్ధిస్ట్ జ్ఞాన కేంద్రం, 10 వేల పుస్తకాలు, చేతి వ్రాతలు, నివేదిక రూపంలో ఉన్న సిడీలు, ఆడియో కాసెట్లతో అంబేద్కర్ మొమోరియల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామన్నారు. అంబేద్కర్ మొమోరియల్ హాల్లో 500 మందితో సమావేశాలు నిర్వహించే నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. బహుళార్ధక ఉపయోగకరంగా ఉండే 3 వేల మంది పట్టేలాగా కన్వెషన్ హాలు నిర్మిస్తున్నామన్నారు. 2 వేల మంది జనాభా పట్టేలాగా ఒపెన్ ఎయిర్ ధియేటర్ నిర్మాణం కూడా స్మృతివనంలో భాగంగా నిర్మిస్తామన్నారు.

ఈ డిజైన్ లు, మీరు చూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి...
http://103.210.73.30/AmbedkarSmritiVanamProject/

కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.13,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ వల్ల 20 వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగనుంది.

పెనుకొండ మండలంలో పరిశ్రమకు అవసరమైన భూమిని అధికారులు కేటాయించారు. అమ్మవారిపల్లి, ఎర్రమంచి, పరిసర భూముల్లో 599 ఎకరాలను ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా సేకరించింది. ఇందులో 535 ఎకరాలు కియా పరిశ్రమకు అప్పగించగా.. మిగిలిన భూమిని రోడ్డు, ఇతర మౌలిక వసతులకు ఉపయోగించేలా ప్రణాళిక తయారు చేశారు. పరిశ్రమకు కేటాయించిన భూముల్లో చదును, విద్యుత్‌ కోసం 220కేవీ సబ్‌స్టేషన్‌, వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్లాంటు నిర్మాణం చేపట్టారు.

జూలై నెలాఖరుకు భూమి చదును పనులు పూర్తి చేసి ఆగస్టు నుంచి పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కియా ప్రతినిధులు తెలిపారు. 2018 మార్చి నాటికి ట్రయల్‌ రన్‌, 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.

పనుల వేగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కియా ప్రతినిధులతో, జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. వచ్చే నెలలో ప్రధాని కియా కంపెనీ భూమి పూజకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి..

ఈ పరిశ్రమలో 4 వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 7 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తారు. పరోక్షంగా మరో 11 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు సమాచారం.

దక్షిణకొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం కియా పరిశ్రమ 15వ ప్లాంటు కోసం దేశంలోని పలు రాష్ర్టాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు గట్టిగా పోటీపడ్డాయి. ఈ పరిస్థితిలో సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఆ పరిశ్రమను అనంతపురం జిల్లాకు వచ్చేలా చేశారు.

Advertisements

Latest Articles

Most Read