ఈ రోజు మెగా స్టార్ చిరంజీవిని, జగన్ మోహన్ రెడ్డి పిలిచారని, జగన్ తో లంచ్ మీటింగ్ ఉంటుంది అంటూ, ఉదయం నుంచి వార్తలు వస్తున్న నేపధ్యంలో, ఈ భేటీ పై రాజకీయ చర్చ కూడా జరుగుతుంది. చిరంజీవి కొద్ది రోజుల క్రితమే, నాకు సినీ పెద్ద అనే హోదా వద్దు అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. తరువాత మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ లాంటి జగన్ సన్నిహితులు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఈ లోపే మళ్ళీ చిరంజీవిని పిలిపించటం వెనుక, ఏమి ఉంది అనే చర్చ జరుగుతుంది. దీనికి కారణం, రెండు రోజుల క్రిందట చంద్రబాబు చేసిన వ్యాఖ్యలుగా చెప్తున్నారు. చంద్రబాబు రెండు రోజుల క్రిందట మాట్లాడుతూ, చిరంజీవి నాకు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ సన్నిహితుడే అని, ఆయన పార్టీ వల్ల నేను ఓడిపోయినా, ఎప్పుడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే, చిరంజీవికి కబురు రావటం పై చర్చ జరుగుతుంది. ఈ సినిమా వివాదం లేక ముందు కూడా, చిరంజీవితో జగన్ భేటీ అయ్యారు. రాజకీయంగా ఇద్దరూ ఒక్కటి అయ్యే అవకాసం ఉందని, చిరంజీవికి రాజ్యసభ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టాలి అంటే, చిరంజీవిని తన వైపు తిప్పుకోవటానికి, ఇదే మార్గం అని జగన్ భావించినట్టు ప్రచారం జరిగింది.

chiru 13012022 2

తరువాత సినిమా వివాదం వచ్చిన తరువాత, చిరంజీవి గత ఆరు నెలలుగా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న, పేర్ని నాని మధ్యలోకి వస్తున్నారు కానీ, జగన్ మాత్రం చిరంజీవికి అందుబాటులోకి రాలేదు. ఆ తరువాత, సిని పెద్దగా నేను ఉండను అని చిరంజీవి తేల్చి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ జగన్ నుంచి పిలుపు రావటంతో, చిరంజీవి వస్తున్నారు. ఇద్దరూ కలిసి లంచ్ చేసేది, దేని కోసం అనే చర్చ జరుగుతుంది. సినిమా ఇష్యూ కి ఫుల్ స్టాప్ పెడతారా ? లేక ఇది రాజకీయ మీటింగా అనేది కూడా తేలాలి. సినిమా టికెట్ల విషయంలో అయితే, చిరంజీవి ఒక్కడినే ఎందుకు రమ్మంటారు ? చిరంజీవిని సినీ పరిశ్రమ ప్రతినిధిగా పంపించిందా అంటే అదీ లేదు. మరి ఈ భేటీ ఏమిటి, దేని కోసం అనేది అయితే చూడాలి. వచ్చే ఎన్నికల్లో కాపులు, తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారని, జనసేన కూడా టిడిపితో కలిస్తే, ఇక తమ పని అయిపోయినట్టే అని వైసీపీ భావిస్తున్న ఈ తరుణంలో, చిరంజీవి ద్వారా ఆ కాపు ఓటు బ్యాంకులో చీలిక తెచ్చే రాజకీయ క్రీడ ఏమైనా ప్లాన్ చేసారా అనేది చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలకు ఎదురు తిరిగితే అంతే సంగతులు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పీఆర్సీ ప్రకటన సందర్భంగా తమకు అన్యాయం జరిగింది అంటూ, వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు, ప్రొబేషన్ విషయం పై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత మూడు నాలుగు రోజులుగా వారి ఆందోళన తారా స్థాయికి చేరింది. దీంతో ప్రభుత్వం వారికి బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయటం పై అఘ్ర వ్యక్తం చేసారు. విధుల నిర్వహణలో చట్ట నిబంధనలు పాటించ లేదని, విధుల పట్ల నిర్ల్యక్షంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ పై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో చెప్పాలి అంటూ, 24 గంటలు టైం ఇచ్చారు, అనంతపురం కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్. సమాధానం ఇవ్వకపోయినా, సంతృప్తిగా లేక పోయినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే మరో షాక్ ఇస్తూ, విధులకు హాజరు కావటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఒక రోజు జీతం కట్ చేసి, మరో షాక్ ఇచ్చారు. మొత్తానికి, తమకు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.

ఈ రోజు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో సినిమా దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. సినీ పరిశ్రమ గురించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలని ప్రసన్నకుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎవరు బలిసారు ? మా బలుపు మీరేమి చూసారు అంటూ ఫైర్ అయ్యారు. మీ ఎమ్మెల్యేలు ఎంత ఎంత తింటున్నారో వాటి గురించి మాట్లాడదామా అని సవాల్ విసిరారు. మీ అవినీతి పై ఓపెన్ డిబేట్ కు వచ్చే దమ్ము మీకు ఉందా అని ప్రశ్నించారు. ఎవరికి బలిసిందని మీరు అంటున్నారు, ఎవరిని మెప్పించటానికి ఈ వ్యాఖ్యలు చేసారు అని అన్నారు. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత అని అన్నారు. మీ ఆస్తులు, మా సినిమా వాళ్ళ ఆస్తులు ఎంత ఉందో లెక్క తీద్దాం రండి అని అన్నారు. మేము కష్టపడి సంపాదిస్తున్నామని, సినిమా ఊరుకే బయటకు రాదని, ఎంతో మంది కష్టపడితే వచ్చే ప్రాజెక్ట్ అని అన్నారు. కోట్లు ఖర్చు పెడితే పైసా పైసా ఏరుకుంటున్నామని అన్నారు. మీరేమో రూపాయి పెట్టి, దోచుకుంటున్నారని అన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, మా బలుపు కాకుండా, మీ బలుపు సంగతి చూసుకోండి అని అన్నారు.

tammareddy 12012022 2

అసలు ఇండస్ట్రీలో కుల ప్రస్తావన ఏంటి అని అన్నారు. మీరు ఒకే సామాజికవర్గం ఓట్లు వేస్తే గెలిచారా అని అన్నారు. మీరు కులాలు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సినీ ఇండస్ట్రీలో టాప్ ఇద్దరు ప్రొడ్యూసర్ లు , మీ సామాజికవర్గం వారే అని అన్నారు. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు అని ప్రశ్నించారు. మీ బలుపు సంగతి చూసుకోండి అంటూ హెచ్చరించారు. అలాగే మరో వైసీపీ నేత, పుష్ప సినిమాలో విలన్లకు ఒక సామాజికవర్గం పేర్లు పెట్టామని, దీనికి కారణం ప్రొడ్యూసర్ కమ్మ సామాజికవర్గం అంటూ, ఆ ప్రొడ్యూసర్ పేరు వెనుక చౌదరి అనే తోక తగిలించారని అన్నారు. సినిమాని నేను మళ్ళీ చూశానని, అసలు ఆ ప్రొడ్యూసర్ పేరు వెనుక చౌదరి అనే పేరే లేదని, ఈయన తగిలించి, లేని పోనివి అన్నీ సృష్టించి, కులాల మధ్య కూడా మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు ఇలా ఎప్పుడూ వ్యవహరించ లేదని అన్నారు. ఇప్పుడు తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఒక పక్క సినిమా ఇండస్ట్రీ పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కక్ష సాధింపు ధోరణి కొనసాగుతుంటే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం, నాగార్జున సినిమాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క-రో-నా విపరీతంగా పెరిగిపోతుందని, అనేక ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో ప్రధానంగా నైట్ కర్ఫ్యూ కాగా, మరొకటి సినిమా ధియేటర్లలో 50 శాతం మాత్రమె ఆక్యుపెన్సీతో సినిమా హాల్స్ నడవాలి అని. అయితే మొదటగా, నిన్నటి నుంచే ఇవి అమలులోకి వస్తుందని చెప్పారు. అయితే ఉన్నట్టు ఉండి, వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పండగల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, 17 నుంచి ఇవి అమల్లో ఉంటాయని ఉత్తర్వులు ఇచ్చారు. కరోనా ఆంక్షలు అంటే, పెట్టాల్సిందే ఇప్పుడు కదా, అనే అభిప్రాయం వ్యక్తం అవుతంది. పండుగలకు ఎక్కువ మంది గుమికూడకుండా, మరీ ముఖ్యంగా సినిమా హాల్స్ లో ఆంక్షలు ఉండాలి. అలాంటి ప్రభుత్వం వాయిదా వేసింది. 14న బంగార్రాజు సినిమా వస్తుంది. ఇది నాగర్జున నటించిన సినిమా కావటం, పండుగ సీజన్ లో విడుదల కావటం, మరే సినిమా కూడా లేకపోవటం, ఇప్పుడు ప్రభుత్వ ఆంక్షలు కూడా లేకపోవటంతో, నాగర్జునకి ఈ నిర్ణయం ఒక గిఫ్ట్ అనే చెప్పాలి. మొన్న నాగర్జున , జగన్ ను సమర్ధిస్తూ మాట్లాడారు కాబట్టి, ఇది రిటర్న్ గిఫ్ట్ ఏమో అంటూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read