ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే, అప్పుడే మీ సమస్య తీరుస్తా అంటూ, కిరాయికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు, జగన్ ఈ కార్యక్రమం మొదలు పెట్టాడు... ఈ మిస్డ్ కాల్ కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది అంటూ, వైఎస్ఆర్ పార్టీ ప్రకటించింది... ఇప్పటికి వరకు 47 లక్షల మంది మిస్డ్ కాల్ ఇచ్చి సమస్యలు చెప్పారని చెప్పింది..

అయితే, ఇక్కడ కూడా పీకే ఫేక్ బ్యాచ్, జగన్ పైడ్ బ్యాచ్ పోటా పోటీగా పని చేసి, ఈ కార్యక్రమం కూడా ఫేక్ చేసి పెట్టాయని తెలుగుదేశం ఐటి వింగ్ ఆరోపిస్తుంది...

లక్షలమంది మిస్డ్ కాల్స్ ఇచ్చి మరీ వైసీపీలో చేరుతున్నారని డప్పు కొట్టడం వెనుక ఉన్న నిజం ఏంటి? ఫోన్ స్పూఫింగ్ టెక్నాలజీ గురించి విన్నారా ? మీ ఫోనులోనుండే మీరు మీకిష్టమొచ్చిన నంబర్‌తో ఎవరికయినా ఫోన్ చేయవచ్చు. అవతలి వ్యక్తికి కాలర్ ఐడీలో మీ నంబర్ బదులు మీరు వాడిన దొంగ నంబర్ డిస్‌ప్లే అవుతుంది. సింపుల్‌గా ఒక స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ( అప్లికేషన్) డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో నుండి మీరు ప్రధానమంత్రి మొబైల్‌నుండి ఫోన్ చేస్తున్నట్లు కూడా అవతలి వాళ్ళని మభ్య పెట్టవచ్చు.

ఈ టెక్నాలజీ ద్వారా, పీకే ఫేక్ బ్యాచ్, జగన్ పైడ్ బ్యాచ్, దీనికోసమే పనిచేస్తోందని తెలుగుదేశం ఐటి వింగ్ చెప్తుంది. సిమ్‌కార్డుల షాపులు, గ్యాస్ ఏజెన్సీలు, డ్వాక్రా గ్రూపులు, ప్రైవేట్ ట్రావెల్స్, షాపింగ్ మాల్స్ ...ఇలా ప్రజల మొబైల్ ఫోన్ నంబర్ల డేటాబేస్‌ని ఈ ఫేక్ బ్యాచ్ సేకరించి, లిస్టు తమ ముందు పెట్టుకుని, స్పూఫింగ్ ద్వారా ఆ లిస్టులో ఉన్న మీలాంటి వ్యక్తుల ఫోన్ నంబర్లతో 9121091210 కి తామే మిస్డ్ కాల్స్ ఇచ్చుకుంటున్నారట.

రికార్డుల్లో మీ నంబర్‌ నుండే ఫోన్ వచ్చినట్లుగా కనబడుతుంది. తర్వాత వైఎస్సార్ కుటుంబానికి స్వాగతం ఫ్రం జగన్ అన్న, అని మీకు కాల్ వస్తే బిత్తర పోవడం మీ వంతు అవుతుంది...

ఇలా సర్వం ఫేక్ చేసే ఈ రెండు బ్యాచ్లకి టార్గెట్ ఇచ్చారు అంట... ఎవరు తక్కువ టైంలో, ఎక్కువ ఫేక్ చేస్తే, వారికి దీపావళి బోనస్ కూడా ప్రకటించారని లోటస్ పాండ్ టాక్... ఇది "వైఎస్సార్ కుటుంబం" కార్యక్రమం తీరు...

ప్రజా సేవ, ఆయన లక్ష్యం... ప్రజా సమస్యల పరిష్కారం నీతి కృత్యం... అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా... ప్రతిక్షం జనం గురించే, జనం కోసమే, జనమే ఊపిరిగా బ్రతికారు దివంగత నేత ఎర్రం నాయుడు... బడుగు, బలహీన వర్గాల కోసం పని చేస్తూ, ఆయన రాజకీయ జీవితంలో చివరి వరకు పోరాడారు...

ఆయన వారసత్వం తీసుకుని, సిక్కోలు యువ సింహంలా గర్జిస్తూ... ఎర్రన్న అడుగుజాడల్లో ప్రజలకోసం ఉద్యమిస్తూ...
ప్రజాగళాన్ని...పార్లమెంటులో వినిపిస్తున్న యువ కిశోరం... కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా, తండ్రి బాటలోనే ప్రజా సమస్యలు తీరుస్తున్నారు... మంత్రి అచ్చెం నాయుడు కూడా సోదరుడి అడుగుజాడల్లో నడుస్తూ, అబ్బాయితో కలిసి సిక్కోలు ప్రజలకి సేవ చేస్తున్నారు...

తాజాగా ఒక సంఘటన వేలుగులోకే వచ్చింది... ఈ బాబాయ్ - అబ్బాయ్ కలిసి చేసిన పని చూసి, సిక్కోలు ప్రజలు ఎర్రన్నని గుర్తు చేసుకుంటున్నాం అంటున్నారు... సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటన బాగా వైరల్ అవటంతో, మంత్రి నారా లోకేష్ కూడా, రామ్మోహన్ నాయుడుని మెచ్చుకున్నారు...

రవి కుమార్ సీరపు అనే యువకుడి మాటల్లో, జరిగిన సంఘటన, తన పోస్ట్ యదాతధంగా...

"గత నెల 30 తేది రాత్రి 9 గంటలు సమయంలో మా పక్కటి అమ్మయి పురిటి నోప్పులతో భాదపడుతు టెక్కలి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేస్తే అ సమయంలో అక్కడ వైద్యులు అందుబాటులో లేరు.దసరా ఉత్సవాలు కు స్దానిక వైద్యలు విశాఖపట్నం,హైదరాబాదు లో ఉన్నారని తెలిసింది. ఇదే విషయాన్ని మా స్దానిక ఎమ్.ఎల్.ఎ (మంత్రి వర్యులు కింజిరాపు అచ్చెన్నాయడు కు ఫొన్ లో సమచారం ఇస్తే 5 నిమాషల వ్యవది లో అంబులెన్స్ సౌకర్యం కల్పించి శ్రీకాకుళం RIMS హాస్పిటల్ లో జాయిన్ చేసి వైద్యులు డిలావరి చేయడం జరిగింది. మరుపటి ( 1-10-2017) విజయ దశమి రోజు ఉదయం 8 గంటల సమయంలో శ్రీకాకుళం ఎమ్. పి శ్రీ (కింజరాపు రామ్మెన్నాయడు గారు) నాకు ఫొన్ చేసి అ తల్లిబిడ్దల యెగ క్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలు సమయంలో మన రవాణా & బి.సి సంక్షేమ మంత్రి వర్యులు (కె.అచ్చెన్నాయడు గారు) నాకు ఫొన్ చేసి విజయ దశమి శుభాకాంక్షలు తెలియపరచి నన్ను అభినందిచడ‌‌౦ జరిగింది.
నేను చేప్పేది ఏమిటంటే ...ఎల్లప్పుడూ ఏ సమయంలో తెలుగు ప్రజలకు ఆపద వస్తే అదుకోనే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే...
బాబయ్-అబ్బాయ్ లకు నా ధన్యవాదాలు...
మీ
యస్. రవికుమార్ రెడ్డి"

ఒకప్పుడు సెక్యూరిటీని ఒంగోపెట్టి, అతని వీపు మీద మైకులు పెట్టి, అరగంట ప్రెస్ మీట్ పెట్టిన చరిత్ర... ఇప్పుడు ఒంగోపెట్టే స్థాయి నుంచి, ఎవరు కనిపిస్తే వాళ్ళ ముందు ఒంగునే దాకా వచ్చాడు... అతని అహంభావం తెలిసిన వాళ్ళు ఎవరూ, ఆశ్చర్యపోక మానరు...

ఈ సాములోరిని, కేసీఆర్ అయితే ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీ మీదే కూర్చోబెట్టాడు... పాపం జగన్ కు, ఆ కుర్చీ లేదు కాబట్టి, వెళ్లి నేల మీద కూర్చుని ఒక ఫోటో దిగారు...

ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ ప్రవర్తన చూసి, షాక్ అయ్యారు, జగన్ తో పని చేసి, చేస్తున్న నాయకులు... నిన్న అయితే, అయినలో ఒక అపరిచితుడిని చూసాం అంటున్నారు... అంబటి లాంటి వాళ్ళు అయితే, ఛీ పోండి ఆయన మా జగన్ కాదు,మా అన్న స్టైల్ ఇది కాదు అంటూ మీడియాతో అంటున్నారు...

నిజానికి జగన్ చాలా బలుపుతో ఉంటాడు... ఎవరినీ లెక్క చెయ్యని మనస్తత్వం... తండ్రితో సమాన వయసు ఉన్న వారు కూడా, అతని ముందు నుంచుని చేతులు కట్టుకుని మాట్లాడాల్సిందే... సినిమా ఆక్టర్ రాజశేఖర్ చెప్పినట్టు, జీన్స్ ఫ్యాంట్ వేసుకు వచ్చినా తట్టుకోలేడు.. అలాంటిది, నిన్న చినజీయర్‌ ని కలిసిన వేళ, జగన్ ఆక్టింగ్ ఇరగదీసాడు అని సినీ వర్గాలు కూడా మెచ్చుకుంటుయి...

చినజీయర్‌ ని కలిసిన టైంలో పూర్తి వినయపూర్వకంగా వ్యవహరించారు. చేతులు కిందికి వదలకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా ఆయనతో నడిచారు. జగన్‌కు జీయర్‌ స్వామి కింది దాకా వచ్చి వీడ్కోలు పలికారు. అలా వెళ్లే సమయంలో... జగన్‌ తొలుత చేతులతో నమస్కరించి, ఆపై రెండు పాదాలను తాకి నమస్కరించి జీయర్‌ ఆశీస్సులను పొందారు.

ఆ విధంగా, జగన్ లోని మరో కోణం చూసామని, ఇంత వినయంగా మాతో కూడా ఉంటే, ఈ పాటికి పరిస్థితి వేరేలా ఉండేది అని, లోటస్ పాండ్ లో ఉన్న నాయకులు అంటున్నారు...

విశాఖలో ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం ప్రవేశపెట్ట బోతోంది. కేంద్ర ప్రభుత్వ ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)సహకారంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులకు ఈ వాహనాలను సమకూర్చనున్నారు.

ప్రస్తుతం జిల్లాలో 230 అద్దె వాహనాలు ప్రభుత్వ శాఖల్లో వినియోగంలో ఉన్నాయి. ఇప్పడు వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నారు. వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ కూడా ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేయనుంది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని నగరాలకు ఈఈఎస్ఎల్ ఈ వాహనాలను సమకూరు స్తోంది. విశాఖను ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

ఈఈఎస్ఎల్ సంస్థ నుంచి ఈ వాహనాలను సమకూర్చే కాంట్రాక్ట్ టాటా మోటార్స్ సంస్థ దక్కించుకుంది. 500 వాహనాలను నవంబర్లో ఈఈఎస్ఎల్ కి టాటా మోటార్స్ అందించనుంది.

ఈ కార్లు విశాఖ నగరానికి డిసెంబర్, జనవరిల్లో వచ్చే అవకాశముందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఈఈఎస్ఎల్ సంస్థే అందజేస్తుంది.

ఒక్కో కారు ధర రూ.11.20లక్షల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. అయిదేళ్ళ వారంటీతో ఈ కార్లను టాటా మోటార్స్ సరఫరా చేయనుంది.

Advertisements

Latest Articles

Most Read