ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ మినహా, మన రాష్ట్ర విషయాలు మాత్రమే చెప్పే ఛానల్ ఇంకోటి లేదు... మిగతా చానల్స్ అన్నీ రెండు రాష్ట్రాల వార్తలు ప్రసారం చేస్తూ వస్తున్నాయి... హైదరాబాద్ నుంచి నడుస్తున్న ఈ చానల్స్ అన్నీ ఎక్కువగా తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలే కాపాడుతున్నాయి... ప్రతి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష చూపిస్తున్నాయి... మన అమరావతి నుంచి టీవీ ప్రసారాలు ఉంటే బాగుండు అని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు... ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వార్తలే చూపిస్తున్నా, ఆపరేషన్స్ అన్నీ హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయి...

ఈ క్రమంలో ఐ వెంకటరావు లాంటి దిగ్గజ జర్నలిస్ట్ సారధ్యంలో మొదలైన మహా టీవీ, ఇప్పుడు మన రాష్ట్ర వార్తలు మాత్రమే ఎక్కువగా చూపించనుంది. మరో 3-4 నెలల్లో ఆపరేషన్స్ మొత్తం అమరావతి నుంచే జరగనున్నాయి. మహా టీవీ యాజమాన్యం కూడా మారింది. ఇప్పుడు మహా టీవీని, సీనియర్ పాత్రియకేయుడు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం జనరల్ సెక్రటరీగా ఉన్న, మరెల్ల వంశీ కృష్ణ లీడ్ చేస్తున్నారు....

నిన్న విజయ దశమిని పురస్కరించుకుని, మహా టీవీ కొత్త లోగోను ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రారంభించారు.. మహా టీవీ లుక్ కూడా ఇప్పుడు మారిపోయింది... స్పష్టమైన సౌండ్, పిక్చర్ క్వాలిటితో మరింత ఆకర్షణీయంగా మారింది. నవ్యాంధ్ర నిర్మాణానికి మహా న్యూస్ దృఢసంకల్పంతో ఉంది అని, మహా న్యూస్ తరుపున అన్ని సహకారాలు అందిస్తామని టీవీలో స్క్రోలింగ్ వస్తుంది.

ఏది ఏమైనా, త్వరగా అన్ని చానల్స్ అమరావతిలో కూడా ఆపరేషన్స్ స్టార్ట్ చెయ్యాలని, అందరూ ఇక్కడే స్టూడియోలో నిర్మించుకుని, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ, నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావలి అని కోరుకుందాం...

నోటి దురుసుతో, బూతులతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలని బెంబేలెత్తించిన రోజా, ఇప్పుడు కువైట్‌లో కూడా అదే హడావిడి చేసి ఆబాసుపాలైంది...

కువైట్‌లోని ఓ హోటల్‌లో వైకాపా కువైట్‌ విభాగం సభ్యులు ఏర్పాటు చేసిన ‘నవరత్నాలు’ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. కువైట్‌లో ‘నవరత్నాలు కార్యక్రమం ఏంటో వాళ్ళకే తెలియాలి...

అయితే అక్కడ ఈ బ్యాచ్ అంతా హడావిడి చేశారు... ఆంధ్రప్రదేశ్ అనుకున్నారో, లేక అక్కడ ఉంది చూసి చూడనట్టు వదిలేసే చంద్రబాబు అనుకున్నారో, కువైట్‌లో రెచ్చిపోయారు... పార్టీ శ్రేణులు చేసిన హంగామా శృతిమించటంతో, స్థానిక పోలీసులు వచ్చి అందరినీ అరెస్ట్ చేశారు... జై జగన్ జై జగన్ అంటుంటే, కువైట్‌ పోలీసులకి ఏమి అర్ధం కాక, మొత్తాన్ని లోపాలకి తోసారు.. చివరకి తేలింది ఏంటి అంటే, అక్కడ పర్మిషన్ కూడా లేకుండా వీళ్ళు హడావిడి చేస్తున్నారు అని.

ఈ సందర్భంగా రోజాను కూడా అరెస్ట్ చేశారు... కాని వెంటనే విడుదుల చేసినట్టు సమాచారం... అయితే రోజా మాత్రం తనను ఎవరూ అరెస్ట్ చెయ్యలేదని, నిర్వాహకులని మాత్రమే అరెస్ట్ చేశారని ఒక వీడియో బైట్ వదిలారు....

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కు ఇప్పుడు ఢిల్లీలో కీలక బాధ్యతలు వచ్చాయి... పార్లమెంట్ స్టాండింగ్ కమిటిలో మెంబర్‌గా, కేంద్ర రక్షణ శాఖ స్టాండింగ్ కమిటి మెంబర్‌గా గల్లా జయదేవ్ నియమితులు అయ్యారు... వీటితో పాటు చంద్రబాబు ఇటీవల ప్రకటించిన పార్టీ సెంట్రల్ కమిటీలో జయదేవ్ కు, అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు...

ఈ నియామకం వెనుక చంద్రబాబు వ్యూహం ఉంది అంటున్నాయి పార్టీ వర్గాలు... గల్లా జయదేవ్ కు ఢిల్లీ సర్కిల్స్ లో మంచి పేరు ఉంది... లోక్‌సభలో చర్చల్లో కూడా చాలా సమర్ధవంతంగా మాట్లాడుతూ, టీడీపీకి మంచి పేరు తీసుకువచ్చేవారు.. అంతే కాకుండా, కేంద్రంలోని బీజేపి పెద్దలతో, కేంద్ర మంత్రులతో మంచి సంబంధాలు ఉన్నాయి.. బిజినెస్‌మెన్‌గా ఆయనకు వివిధ రంగాలపై స్పష్టమైన అవగాహన కూడా ఉంది.

వీటన్నిటినీ గుర్తించి చంద్రబాబు, జయదేవ్ కు కీలకమైన పదవి ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో జయదేవ్ సమర్ధత ఉపయోగపడుతుంది అని చంద్రబాబు భావిస్తున్నారు... ముఖ్యంగా, రాజధాని, పోలవరం విషయంలో నిధులతో పాటు, మిగిలిన అనుమతులు సంపాడించటంలో జయదేవ్ అవసరం ఎంతో ఉందని నాయకత్వం భావిస్తుంది.

జగన్.. బీజేపీతో పార్టీకి లొంగిపోయాడు అని అందరికీ తెలిసిన విషయమే... అయితే నంద్యాల ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చి ఉంటే, ఈ పాటికి రాష్ట్ర రాజకీయం మరోలా ఉండేది...

జగన్ తన కేసులు రాజీ కోసం, ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ తీసుకుని చర్చించటం, తరువాత ప్రత్యేక హోదా విషయం అస్సలు పట్టించుకోకపోవటంతో, జగన్ పూర్తిగా లొంగిపోయాడు అని ప్రజలకి అర్ధమైపోయింది... BJP పార్టీ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఎదగటానికి, జగన్ ను కలుపుకోవాలని, జగన్ పార్టీ BJPలో విలీనం చేస్తే, కేసులు ఎత్తేస్తాం అని ఒప్పందం అయినట్టు వార్తలు వచ్చాయి.... నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు తరువాత, ఈ వార్తలకి కామా పడింది...

అయితే ఈ ప్రయత్నాలు మళ్ళీ మొదలు అయ్యాయి... ఈసారి ఎలా అయినా ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్న జగన్, బీజేపీలో పార్టీని విలీనం చేసి, కేసులు కొట్టేయించుకోవటానికి కూడా వెనకాడట లేదు... లండన్ నుంచి వచ్చిన తరువాత ప్రజలకి తన మొఖం ఇప్పటి వరకు చూపించంలేదు.... కోర్ట్ కి తప్ప, లోటస్ పాండ్ దాటి రాలేదు... అయితే, దుర్గాష్టమి రోజున, భద్రతా సిబ్బందికి కూడా తెలియకుండా వ్యక్తిగత వాహనంలో జగన్ రెండు గంటలు బయటకు వెళ్లారు...

దుర్గాష్టమి రోజునే మాట్లాడుకుందాం రమ్మని, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీకి చెందిన ముఖ్యులు చెప్పటంతో, జగన్ ఆ రోజు వెళ్లి వారిని కలిసారనే ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ కుమారుడు ఇంటిలో ఈ చర్చలు జరిగాయి.

ఈ మొత్తం ప్రక్రియలో, విలీనమా, పొత్తా అన్నదే సస్పెన్స్... పొత్తుతో బీజేపికి వచ్చే లాభం ఏమి ఉండదు కాబాట్టి, దాదపుగా విలీనం అనే వార్తలు వస్తున్నాయి. నీకేంటి, నాకేంటి అనే లెక్కలు నడుస్తున్నాయి... జగన్ వైపు నుంచి ముఖ్యంగా కేసులు మాఫీ అయితే, బీజేపి వైపు నుంచి విలీనం అనే ప్రాధమిక ఒప్పందం జరిగినట్టు సమాచారం...

తన పాదయాత్రకు ఆటంకాలు లేకుండా కోర్టు నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేలా చేస్తే, ఏమి చెప్తే అది చేస్తానని, జగన్ వారితో చెప్పారని సమాచారం... జగన్ అంతరంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నేతలు, ఢిల్లీ చేరవేశారు, మరి రిజల్ట్ ఏంటో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read