తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, సినిమాలకి మంచి అనుబంధం ఉంది... సినిమాల్లో నుంచి వచ్చిన ఎన్టీఆర్ ఏకంగా ఇందిరా గాంధీని ఎదిరించి ముఖ్యమంత్రి అయ్యారు... తాజాగా పవన్ కళ్యాణ్ అటు సినిమాలు చేస్తూనే, రాజకీయాల్లో ఉన్నారు..

కాని ఇప్పుడు మనం చెప్పుకునే ట్రెండ్ కొంచెం డిఫరెంట్... సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూసాం.... రాజకీయాలు నుంచి సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా అరుదు..

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒక సినిమాలో నటించనున్నారు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పని చేసి, ఇటీవలే తమిళనాడు గవర్నర్ గా రిటైర్డ్ అయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రోశయ్య ఇప్పుడు సినిమాల్లో కనిపించబోతున్నారు...

బాహుబలి సినిమాలో ప్రభాస్ కి డుబ్ గా చేసిన వ్యక్తి హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో రోశయ్య కేంద్ర మంత్రిగా నటిస్తున్నారట... మరి రాజకీయాల్లో తన చతురత చూపించి తన మార్క్ చూపించిన రోశయ్య, సినిమాల్లో ఎలా చేస్తారో చూద్దాం...

పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు... వార్నింగ్ లు కూడా ఇచ్చారు... కాని, ఎవరూ ఈ మాటలు లెక్క చెయ్యట్లేదు... మేము చేసేది మేము చేస్తాం అంటున్నారు...

కర్నూలు జిల్లా దేవరగట్టులో, దసరా పండుగ రోజున కర్రల సమరం జరుగుతుంది... ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేశారు... నేడు అర్ధరాత్రి కర్రల సమరం జరగనున్నది...

ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈ సందర్భంగా ఎస్పీ గోపినాథ్ శెట్టి మాట్లాడుతూ.. బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయంగా జరుపుకోవాలని సూచించారు.

రింగుల కర్రలతో ఈ ఉత్సవంలో పాల్గొనవొద్దని చెప్పారు. లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

మరి అక్కడ ప్రజలు పోలీసులు మాట వింటారా ? ఎప్పటిలాగే తలకాయలు పగలుకొట్టుకుంటారా ? చూడాల్సిందే...

దుర్గమ్మవారి తెప్పోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.... శనివారం సాయంత్రం 5.30గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుంది... అంతకు ముందు ఉత్సవమూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా కృష్ణానది వద్దకు తీసుకువస్తారు... తెప్పోత్సవం 90 నిముషాల పాటు సాగుతుంది.

ఈసారి అమ్మవారి ఉత్సవమూర్తులు, వేదపండితులు, అర్చకులు, భజంత్రీలు తదితరులు సుమారు 25 మంది వరకు ప్రధాన హంసవాహన పంటుపై ఉంటారు... వీవీఐపీలు, వీఐపీల కోసం ఒక బోటును, పరిమిత సంఖ్యలో అనుమతిస్తూ మీడియా కోసం మరో బోటును ఏర్పాటు చేస్తున్నారు...

ఈసారి స్పెషాలిటీ, హంస వాహనం ప్రదక్షణ చేసే నది మధ్య భాగంలో ఒక ఫంట్‌పై లేజర్‌షోను ఏర్పాటు చేస్తున్నారు. లేజర్‌ షో ఉన్న ఫంట్‌ చుట్టూ ప్రదక్షణగా హంసవాహనం తిరుగుతుంది. దీంతోపాటు బాణసంచాను కూడా కాల్చుతారు. లేజర్‌ షో, బాణసంచా కాంతులు చూపరులకు కనువిందు చేయనున్నాయి. పండితుల వ్యాఖ్యానంతో పాటు, హంసవాహనంపై ఉన్న వేదపండితులు వేదం చదువుతుంటారు.

తెప్పోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దుర్గాఘాట్‌లోకి పాస్‌లున్నవారినే అనుమతిస్తారు. ఇతరులు బ్యారేజిపై నుంచి తిలకించాల్సి ఉంటుంది.

తెప్పోత్సవంగా పిలిచే ఈ హంస వాహన సేవ అమ్మకు ప్రీతిపాత్రం... అసలు ఈ ఉత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు? హంస వాహనం వెనుక కథ గురించి తెలుసుకుందాం...

దుర్గమ్మ త్రిశక్తి స్వరూపిణి... మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. ఈ ముగ్గురమ్మలలో సరస్వతీ దేవికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. దుర్గమ్మ జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అలంకరిస్తారు. అందుకే సరస్వతీ దేవి వాహనంగా హంసను వినియోగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, కొన్ని లక్షల మంది ప్రజలకు లబ్ది చేకూర్చే నాలుగు కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలు ఒక పండగ వాతావరణంలో, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నర్యి

రైతులకు మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల:
ఇప్పటి వరకు రెండు విడతలుగా రుణమాఫీ చేశారు. అక్టోబర్ 2న, 28 లక్షల మంది రైతులకి, వడ్డీతో సహా, రూ.3609 కోట్ల రుణమాఫీ జరగనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం నిర్మించిన లక్ష గృహాల్లో గృహ ప్రవేశ ఉత్సవాలు:
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 12,03,576 గృహాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబరు 26 నాటికి 1,01,898 గృహాల నిర్మాణం పూర్తి చేసింది. ఈ లక్ష గృహాల్లో అక్టోబరు 2న రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తునంరు. ఈ లక్షకు పైగా గృహాల కు ప్రభుత్వం రూ.1,252.11 కోట్ల ఖర్చు పెట్టింది.

ప్రతి గ్రామంలో నూతన గృహాల్ని అందంగా అలంకరించి ఒక పండుగలా గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమాల ఫొటోలను గృహ నిర్మాణశాఖ వెబ్ సైట్లో పొందుపరిచి, వాటిని సీఎం డ్యాష్ బోర్డుతో అనుసంధానిస్తారు. ప్రతి లబ్దిదారునికి రెండు పండ్ల మొక్కలు పంపిణీ చేసి, వాటిని ఆ కొత్త ఇంట్లో నాటి, జియో ట్యాగింగ్ చేసి వనం మనం కార్యక్రమంలో భాగంగా వెబ్ సైట్లో పొందుపరుస్తారు.

రెండో సంవత్సరానికి మార్పులు చేర్పులతో రూపొందించిన చంద్రన్న బీమా పథకం:
గత సంవత్సరం ప్రారంభించిన చంద్రన్న బీమా పథకంలో పాలసీదారులకు మరింత లబ్ది చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ప్రధాన మంత్రి జీవన బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసి, సరికొత్త పథకంగా తీర్చిదిద్దింది. దీని పేరుని ప్రధాన మంత్రి చంద్రన్న బీమా పథకంగా మార్చింది. ఆసంఘటిత రంగంలోని 2.20 కోట్ల మంది పాలసీదారుల తరపున ప్రభుత్వమే రూ.288 కోట్ల ప్రీమియం చెల్లిస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్ళు వారంతా ఈ పథకం పరిధిలోకి వస్తారు.

స్వచ్చాంధ్ర మిషన్ అవార్డుల ప్రదానోత్సవం:
స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో నిర్వహించిన పోటీలకు, ఉత్తమంగా ఎంపికైన సంస్థలకు అవార్డులు ప్రదానం చేస్తారు.

Advertisements

Latest Articles

Most Read