ఎలా అయినా 2019 ఎన్నికల్లో "నేనే సియం" అవ్వటానికి అన్ని అస్త్రాలు తీస్తున్న జగన్, పాదయత్ర అనే అస్త్రం తీసిన సంగతి తెలిసిందే... అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేసి తీరుతా అన్న జగన్ ఇప్పుడు, ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు...
ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన కోర్ట్ కేసు దీనికి ప్రధాన కారణం అంటున్నారు... శుక్రువారం కోర్ట్ హాజరు నుంచి మినహియింపు ఇవ్వాలని అని జగన్ కోరగా, కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, కోర్ట్ జగన్ అభ్యర్ధనను తిరస్కరించింది..
దీంతో జగన్ ఆలోచనలో పడ్డాడు... పాదయాత్ర మొదలుపెట్టి, ప్రతి గురువారం సాయంత్రానికి ఆపేసి, శుక్రువారం కోర్ట్ కి వెళ్లి, మళ్ళీ శనివారమో, ఆదివారమో మళ్ళీ హైదరాబాద్ నుంచి, మన రాష్ట్రానికి వస్తే, అది అసలకే మోసం వస్తుంది అని, ప్రజల్లో చులకన అవుతామని, తెలుగుదేశం చెడుగుడు ఆడుకుంటుంది అని, జగన్ ఆలోచనలో పడినట్లు చెప్తున్నారు... కోర్ట్ లో మరో సారి, శుక్రువారం నుంచి మినహాయింపు ఇవ్వాలని అడగి, అప్పుడు పాదయాత్ర గురించి నిర్ణయం తీసుకోనున్నారు... అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు... పాదయాత్ర వాయిదా.... తాత్కాలికమా ? నిరవధికమా ? అనేది తేలాల్సి ఉంది... కోర్ట్ శుక్రువారం నుంచి మినహాయింపు ఇవ్వకపోతే, బస్ యాత్ర అయినా ప్లాన్ చెయ్యాలి అనుకుంటున్నారు జగన్..
అయితే ఈ నెల 27న విజయవాడలో, వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది అని ముందు చెప్పారు... కాని అది కూడా వాయిదా పడింది... జగన్ కు అమరావతి రావటం ఇష్టం లేదని, మరో రెండు మూడు నెలలు ఇలాగే సాగదీసి, ఎన్నికల సంవత్సరంలో, విజయవాడ కార్యాలయం ఏర్పాటు చేసి, మమ అనిపించనున్నట్టు సమాచరం...