భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ శరణార్ధులకు 620 టన్నుల ఆహార పదార్ధాలను కాకినాడ డీప్ వాటర్ సీపోర్టు నుండి ప్రత్యేక నౌకలో సోమవారం పంపించారు. ఈ పంపిణీ ఆహార పదార్ధాల రవాణాను జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా పోర్టులో పరిశీలించి, నౌకను బంగ్లాదేశ్ పంపారు.

ఈ సంద‌ర్భంగా కలక్టర్ కార్తికేయు మిశ్రా మాట్లాడుతూ భారత ప్రభుత్వం నాఫెడ్ సూచనల మేర బంగ్లాదేశ్ శరణార్ధుల కోసం 620 టన్నుల ఆహార పదార్ధాలను 62 వేల ప్యాకెట్లలో ఐయన్యస్ ఘరియూర్ నౌకలో పంపడం జరిగిందన్నారు. ఈ ఆహార పదార్థాలను రావులపాలెంలో 40 వేలు, చొల్లంగిలో 22 వేలు ప్రాకింగ్ చేయడం జరిగిందన్నారు. ప్రతీ ప్యాకెట్లో 5 కేజీల బియ్యం, 2 కేజీల పప్ప, ఒక లీటర్ ఆయిల్, ఒక కేజీ ఉప్ప, ఒక కేజీ అముల్ మిల్క్ పౌడర్, దోమతెర, సబ్బులు, టీపొడి, కలిపి ఒక్కొక్కటి 11.50 కేజీలు ఉన్నాయన్నారు.

సోమవారం నాడు కాకినాడ నుండి బయలుదేరిన ఈ నౌక ఈ నెల 28వ తేదీ ఉదయం 5 గంటలకు చిట్టిగ్యాంగ్ పోర్టుకు చేరుకొంటుందన్నారు. ఈ ఆహార పదార్ధాల ప్యాకింగ్లో జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరించి ఆదివారం సాయంత్రానికి ఈ ప్యాకెట్లను పోర్టుకు చేర్చి నౌకలో లోడ్ చేయడం జరిగింన్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం , ఈ నౌకలో ఆహార పదార్ధాలను లోడ్ చేసి పంపడం జరిగిందని కలక్టర్ తెలిపారు. ఈ నౌకలో కెప్టెన్ స్వరాజ్ జేమ్స్ రబీరాతో పాటు అధికారులు, సిబ్బంది క‌లిపి మొత్త 120 మంది ప్రయాణమై వెళ్ళారు.

కడప కేంద్రంగా ఓఎన్‌జీసీ మరో యురేనియం ప్లాంటు పెట్టటానికి సిద్ధమవుతుంది. దేశంలోనే రెండో యురేనియం నిల్వల కేంద్రంగా పేరొందిన పులివెందుల నియోజక వర్గంలో ఇప్పటికే ఒక యురేనియం ప్లాంటు వినియోగంలో ఉండగా కనంపల్లె వద్ద రెండో ప్లాంటు దిశగా భారత అణుశక్తి సంస్థ అడుగులు వేస్తోంది.

తుమ్మలపల్లె వద్ద 48.49 మిలియన్‌ టన్నుల ముడి యురేని యం నిల్వలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. దేశంలో జార్ఖండ్‌ తర్వాత అంత భారీ నిల్వలు ఉన్న ప్రాంతం ఇదే. రూ. 1103.98 కోట్లు పెట్టుబడితో ఆరంభమైన తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ప్రస్తుతం రోజుకు 2 వేల నుంచి 2500 టన్నుల ముడి యురేనియాన్ని వెలికి తీస్తున్నారు. దాన్ని శుద్ధి చేసే ప్రక్రియలు చేపట్టిన అనంతరం నెలకు 240 టన్నుల ప్రాథమిక శుద్ధి యురే నియంను ఉత్పత్తి చేసి హైదరాబాద్‌కు పంపిస్తున్నారు.

తాజాగా కడప బేసిన్‌ కేంద్రంగా కడప, అనంతపురం జిల్లాల్లోనే కాక కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, పాణ్యం, అనంతపురం జిల్లా పరిధి లోని తాడిపత్రి, యల్లనూరు ప్రాంతాల్లో ప్రాథమిక అధ్యయనం పూర్తి అయింది. ప్రస్తుతం కడప పరిధిలో వీరపునాయునిపల్లె , వేంపల్లె, వేముల పరిసరాల్లో అన్వేషణ కొనసాగుతోంది. కడప బేసిన్‌లో నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ అయితే సీమకు మహర్థశ పట్టినట్లే.

సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను తీసుకొంటుంది. అయితే విజయవాడలో మాత్రం ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి నియమాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా కౌన్సిలింగ్, కేసులు రాయటం లాంటివి చేశారు. ఈ నెల 26 నుంచి, మరింత కఠినంగా ఉండేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.

ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా అమలు చేసే నిమిత్తం విజయవాడ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.హెల్మెట్ ధరించిన వారికే బంకుల్లో పెట్రోల్ విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేశారు.

ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గౌతం సవాంగ్. తల్లిదండ్రులు తమ పిల్లలకు అధిక సామర్థ్యం గల ద్విచక్రవాహనాలను ఇవ్వొద్దని, పిల్లలు హెల్మెట్లు ధరించేలా చూసే బాధ్యత వారి తల్లిదండ్రులదేనని ఈ సందర్భంగా గౌతం సవాంగ్ సూచించారు.

అవినాష్ రెడ్డి... వై.ఎస్ తమ్ముడు భాస్కర్ రెడ్డి కుమారుడు... యూ.కె లో ఎంబీఏ చేసి వచ్చి రాజకీయాలు చూసుకుంటూ, జగన్ వెంట నిలిచి, 2014లో కడప ఎంపీ అయ్యారు... నిజానికి 2014 కడప ఎంపీ స్థానాన్ని చెల్లి షర్మిల అడిగినా, జగన్ మాత్రం అవినాష్ రెడ్డి వైపే మొగ్గు చూపారు...

అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి, మీద జగన్ ఫోకస్ పడింది... నిజానికి అవినాష్ రెడ్డి చలా మెతకగా ఉంటారని పేరు ఉంది... అందరినీ మర్యాదగా పలకరిస్తారు... అయితే, ఈ మెతక స్వభావం జగన్ కు అస్సలు నచ్చట లేదు అంట...

అవినాష్ మెతకతనం వల్ల కడప జిల్లాలో వైసీపీ దెబ్బ తింటోందని ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇవ్వటంతో, జగన్ కూడా ఆలోచనలో పడ్డారు అంటున్నారు... ఈ సారి టికెట్ కష్టమే అనే ఫీలింగ్స్ పంపిస్తున్నారు అంట...

అందుకే అవినాష్ రెడ్డి ఈ మధ్య కొంచెం దూకుడు పెంచి, కేసి ఆయకట్టుకు నీరు అందించకపోతే, అక్టోబర్ 2 నుంచి నిరాహార దీక్ష చేస్తానంటూ, ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు... ఇదంతా జగన్ దృష్టిలో పడతానికే అంటున్నారు... అయితే జగన్ స్వభావం తెలిసిన వారు మట్టికే, ఈ సారి అవినాష్ రెడ్డికి సీట్ లేదు అనే చెప్తున్నారు... కుటుంబం నుంచి ఎవరూ లేకుండా చూసుకోవటానికి జగన్ ప్రయత్నిస్తున్నారని, అందుకే వివేకాను, షర్మిలను పక్కన పెట్టినట్టే, అవినాష్ రెడ్డిని కూడా పక్కన పెట్టటానికి జగన్ స్కెచ్ వేసాడు అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read