ఢిల్లీలో కేంద్రమంత్రులను కలుసుకుని రాష్ట్ర సమస్యలు, రావాల్సినా నిధులు, విధులపై చర్చించి, విజయవాడకు ముఖ్యమమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కృష్ణా జిల్లా రైతులు కలుసుకుని సన్మానించారు.

ఈ ఖరీఫ్ సీజనుకుగాను పట్టిసీమ నుంచి వందరోజుల్లో 64 టి.ఎం.సి. ల నీరిచ్చినందుకు హనుమాన్ జక్షన్ నుంచి వంద మంది రైతులు
వఛ్చి సీఎం చంద్రబాబుకు కృతజ్ఙతా పూర్వకంగా పూలమాలలు వేసి శాలువాలు కప్పారు. పట్టీసీమ నుంచి నీరందిస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు రైతులు.

తెలుగుదేశం పార్టీ రైతు సంఘం నాయకుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో గన్నవరం విమానాశ్రయానికి తరలివచ్చిన రైతులు పట్టీసీమ ద్వారా 100 రోజుల్లో 64 టీ ఎంసీల నీటిని నిర్విగ్నంగా అందిస్తున్నందుకు కృతజ్ఞతగా సన్మానం చేయడానికి వచ్చ్చామని తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాకా, అవినీతి బాగా ఎక్కువ ఉండేది. ఇది చంద్రాబాబు మార్క్ పాలన కాదు అని చాలా మందికి అసంతృప్తి ఉండేది... చంద్రబాబు కూడా ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు... ప్రభుత్వ అధికారులకి ఏమి కావలి అంటే ఇది ఇస్తున్నారు... భారీగా జీతాలు పెరిగినా ఉద్యోగుల్లో అవినీతి మాత్రం తగ్గలేదు... చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఉద్యోగులు లెక్క చేయలేదు...

దీంతో చంద్రబాబు దీని మీద ఫోకస్ చేశారు... ఎలా అయినా ఈ లంచాల అవినీతిని అరికట్టటానికి ప్రణాలికలు సిద్ధం చేశారు... దాదాపు యుద్ధం ప్రకటించారు.. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ చీఫ్‌గా నియమించారు. దీంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ ఏసీబీ అధికారులను ఉరుకులు పెట్టించారు.

అమరావతి సచివాలయంలోని హోంశాఖ నుంచే అవినీతిపరులపై దాడులు మొదలు పెట్టారు. ప్రతిరోజూ రెండు, మూడు ట్రాప్‌లు... వారానికి ఒకటి, రెండు ఆదాయానికి మించిన ఆస్తుల పోగేసిన వారి ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎంతటి వారి పైన అయినా దాడులు ప్రారంభించాలని, ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏసీబీకి ఈ మాటలు, మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.

లంచాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం కాదు, ఇన్నాళ్ళు ప్రజలను పీల్చి పిప్పి చేసిన వారి అంతం కూడా చూడామని చంద్రబాబు ఏసీబీ చీఫ్‌ కు స్పష్టం చేశారు. దీని ఎఫెక్ట్, ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్ చీఫ్ పాండురంగారావు మీద ఏసీబీ దాడి, 700 కోట్ల ఆస్తి గుర్తింపు... తాజాగా ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘు, 500 కోట్ల ఆస్తి గుర్తింపు...

20 వేలు సంపాదించుకుని, నెల గడవటానికి మనం ఇంతలా కష్టపడుతుంటే, ఈ అధికారులు మనల్నే పీల్చి పిప్పి చేసి, వేల కోట్ల ఆస్తులు వెనకేసుకుంటున్నారు... మొత్తానికి, వీళ్ళ పాపం పండినట్టే అనుకోవాలి...ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై ముప్పేట దాడి ప్రారంభమైంది. అది పతాక స్థాయికి చేరింది... తెగ బలిసిన పంది కొక్కులు బయట పడుతున్నారు...

ఏసీబీ దూకుడు, ప్రభుత్వ కాల్‌ సెంటర్‌ 1100, లంచాల సొమ్ము బాధితులకు వెనక్కి ఇవ్వడం... ఇప్పుడు ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది... అవినీతిపై జరుగుతున్న పోరాటంపై ప్రజలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాలు అందించాలి అని కోరుకుందాం...

ఆంధ్రప్రదేశ్ లో, రూ.4468 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులకు అక్టోబర్ 3న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, జల వనరుల మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యుల్ సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

పర్యటనలో భాగంగా రూ.1928 కోట్లు విలువైన, 415 కిలోమీటర్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభిస్తారు. అలాగే రూ.2539.08 కోట్లు విలువైన 250 కిలోమీటర్ల, రహదారి పనులకుశంఖుస్థాపనలు చేస్తారు.

దీంతో పాటుగా కేంద్రమంత్రి గడ్కరీ విజయవాడ- ముక్త్యాల మధ్య కృష్ణా నదిలో జల రవాణాకు సంబంధించిన ప్రాజెక్టుకు పునాదిరాయి వేస్తారు. 82 కిలోమీటర్ల ఈ జలమార్గం అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో తవ్వకపు పనులు ప్రారంభమయ్యాయని, జూన్‌ 2019 నాటికి పూర్తవుతాయని కేంద్రం వెల్లడించింది.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఫలితాలు ఇస్తుంది... సోమవారం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి పర్యటన ముగించుకున్న సిఎం చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి చేరుకుని, కేంద్ర జలవనరులు, రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా భేటీ అయ్యారు...

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి, రూ. 2800 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న నిధులు ఇవ్వటానికి కేంద్రం అంగీకరించింది...

నాబార్డుతో తాను మాట్లాడుతానని, పెండింగ్‌ నిధులు వారం రోజుల్లో వచ్చేలా చర్యలు తీసుకుంటానని గడ్కరీ హామీ ఇచ్చారు.... అక్టోబర్ ౩ న రాష్ట్రానికి వస్తున్నా గడ్కరీ పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శిస్తానని ముఖ్యమంత్రికి చెప్పారు...

Advertisements

Latest Articles

Most Read