మనం ఏదైనా పని చేస్తామని చెప్పడం వేరు ఆ పని చేసి చూపించడం వేరు.. హామీ ఇవ్వడం వేరు ఆ విధంగా అడుగులు వెయ్యడం వేరు... తెలంగాణ ఐటి శాఖా మంత్రి కె. తారకరామారావు హామీ ఇచ్చారు.. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాంటి హామీ ఇవ్వకుండా చేసి చూపించారు. వివరాల్లోకి వెళితే కేటీఆర్ సరిగా రెండేళ్ల క్రితం రౌండ్ టేబుల్ స‌మావేశం ఏర్పాటుచేసి దేశ‌,విదేశాల్లోని ఎన్నారైలను ఆహ్వానించారు. వారి అభిప్రాయాల‌ను తీసుకున్నారు. ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం పంచుకునేందుకు నిర్ణ‌యాలు వెలువ‌రిస్తామ‌ని తెలిపారు. దీంతోపాటుగా తెలంగాణ‌లో అధికంగా ఉన్న గ‌ల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం మెరుగైన పాల‌సీ తెస్తామ‌ని ప్ర‌క‌టించారు.

కానీ దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోగా చాలా ఫైల్స్ మాదిరి అది కూడా అటక ఎక్కింది. తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవే అంశాలతో ఒక పాలసీని అమలు చెయ్యడానికి రంగం సిద్ధం చేశారు. ప్రవాసాంధ్రుల ప్రయోజనాల కోసం ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు (ఏపీ ఎన్‌ఆర్‌టీ) పాలక మండలి ప్రవా సాంధ్రుల సంక్షేమం – అభివృద్ధి కి సంబంధించి కొత్త పాలసీని ప్రకటించింది.

ఈ కార్యక్రమాల నిర్వహణకోసం రూ. 40 కోట్లను తొలివిడతగా కేటాయించిన ప్రభుత్వం... ఈ పాలసీలో భాగంగా .ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్‌, భరోసా, సహాయనిధి వంటి ముఖ్యమైన పథకాలకు శ్రీకారం చుట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు.ఏపీ ఎన్‌ఆర్‌టీలో సభ్యులుగా ఉన్న 42,600 మందికి ఈ కొత్తపాలసీ ద్వారా విస్తృత ప్రయోజనాలు కలిగేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ప్రమాదవశాత్తు మరణించినా, అంగవైకల్యం కలిగినా ప్రవాసాంధ్ర భరోసా పథకం ద్వారా రూ. 10లక్షల బీమా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి . విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి కోల్పోయినవారికి తక్షణ సాయం అందించేందుకు రూ. కోటితో ప్రవాసాంధ్ర సహాయ నిధిని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కలియుగ వైకుంఠ మూర్తికి పట్టువస్త్రాలు సమర్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయడు.

అలిపిరి ఘటనలో శ్రీవారి ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మారాలని, ప్రతి ఒక్కరికి తాగునీరు అందాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని శ్రీవారిని కోరుకున్నాని ముఖ్యమంత్రి అన్నారు. త్వరలో టీటీడీ పాలకమండలి నియామకం చేపడతామాని, తిరుమల భక్తులపై జీఎస్టీ భారం తగ్గించాలని కేంద్రాన్ని కోరరామన్నారు. 2018 క్యాలండర్‌, డైరీ, తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు.. వచ్చే ఎన్నికలకు గాను తన సైన్యాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని శాశ్వతం చేసుకునే విధంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణపై కూడా దృష్టి సారించారు..వివరాల్లోకి వెళితే ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో గెలిచే వాళ్ళకే టికెట్స్ ఇస్తానని ఒకటికి నాలుగు సార్లు సర్వే చేయించి మరి సీటు ఇస్తానని స్పష్టం చేశారు.

అలాగే ప్రస్తుత శాశన సభ్యుల పని తీరు సరిగా లేకపోయినా తనకు సన్నిహితులు అయినా ఎవరు అయినా వారికి సీట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.. ఇందులో భాగంగా కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి తన సైన్యాన్ని ప్రకటించారు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు ఆ విధంగానే తన టీంని ప్రకటించారు. ఉభయరాష్ట్రాలకు గాను పార్టీ అధ్యక్షులను , ఉపాధ్యక్షులను కార్యదర్శులను చంద్రబాబు ఎంపిక చేశారు.. వీటిలో పెద్దగా మార్పులు లేవనే చెప్పాలి.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావును నియమించగా, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, ఆరుగురు ప్రధాన కార్యదర్శులుతో పాటు 105 మందితో ఏపీ టీడీపీ కమిటీని ఎన్నుకున్న చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్‌.రమణను నియమించగా తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి ఎన్నుకున్నారు. ఈ కమిటీలో 11 మంది అధికార ప్రతినిధులు, మొత్తంగా 114 మంది తెలంగాణ టీడీపీ కమిటీలో ఉన్నారు. కాగా త్వరలోనే అనుబంధ సంఘాలను కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

రాష్ట్రంలో విమానశ్రయాలు రెండేళ్లుగా ప్రయాణికుల రద్దీతో కళకళలాడాయి. ఈ ఏడాది ఏప్రిల్ మొదలు ఆగస్టు వరకూ వివిద
విమానాశ్రయ నుంచి మొత్తం 17 లక్షల 42 వేల 291 మంది ప్రయాణించారు. గన్నవరం,తిరుపతి, విశాఖ నుంచి రోజురోజుకూ రద్దీ పెరుగుతూ వస్తోంది. తాజాగా కడప విమానాశ్రయం నుంచి సేవలు ప్రారంభించడంతో అక్కడ నుంచి రద్దీ పెరుగుతూ వస్తోంది.

గతే ఏడాది ఏప్రియల్-ఆగస్టు మధ్య కడప నుంచి 2373 మంది ప్రయాణిస్తే, ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 11 వేల 962మంది ప్రయాణించారు. ఈ క్రమంలో అక్కడ ప్రయాణికుల వృద్ధి 404 శాతం పెరిగినట్టు కనిపిస్తోంది. కేంద్ర విమానయాన శాఖ తెరపైకి తెచ్చిన ఉడాన్ పథకంలో భాగంగా దేశంలో ఉన్న 70 విమానాశ్ర యాలను కలుపుతూ తక్కువ ధరకు విమాన సౌకర్యం కల్పించిన నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి విమానాలు నడిపేందుకు ముందుకొచ్చిన విమానయాన సంస్థలకు కేంద్రం ప్రత్యేక రాయితీ ప్రకటించింది.

అక్టోబర్ నుండి కడప నుంచి విజయవాడ, చెన్నెలకు ఇక్కడ నుంచి విమానాలు నడపనుంది. విశాఖపట్నం నుంచి ప్రస్తుత విమాన సేవలు పరిశీలిస్తే, విజయవాడ, ముంబయి, దిల్లీ, హైదరాబాద్, భువనేశ్వర్, పోర్టుబ్లయర్, చెన్నె, కోల్కతా, సింగపూర్,రాయపూర్, జగదల్ పూర్, అహ్మదాబాద్,సింగపూర్, కౌలాలంపూర్, అగర్తలా, కొలంబో, తిరుపతి, అహ్మదాబాద్, కోయంబతూర్, లకు విమానాలు నడుస్తున్నాయి.. విశాఖ నుంచి, విమాన సంస్థలు నడిపేవి, జెట్ ఎయిర్వేస్, ఎయిరిండియా,ఎయిర్ ఆసియా, సిల్క్ ఎయిర్ (సింగపూర్), శ్రీలంకన్ ఎయిర్లైన్స్

విజయవాడ విమానాశ్రయం నుంచి.
దిల్లీ, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూర్, చెన్నె తిరుపతి, పుదుచ్చేరి. విజయవాడ నుంచి, విమాన సంస్థలు నడిపేవి, , ఎయిరిండియా, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్, ట్రూజెట్...

తిరుపతి నుంచి, విమానసేవలు....విజయవాడ, హైదరాబాద్, దిల్లీ, విశాఖపట్నం, బెంగళూర్... విమానసంస్థల్లు-ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్, స్పైస్ జెట్, ట్రూజెట్

రాజమహేంద్రవరం నుంచి-చెన్నై, హైదరాబాద్, బెంగళూర్... విమాన సంసలు - జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్, ట్రూజెట్

కడప విమానాశ్రయం నుంచి విమానసేవలు హైదరాబాద్, చెన్నై, విజయవాడ (అక్టోబర్ నుంచి ఆరంభం)... విమానసంస్థలు-ట్రూజెట్

Advertisements

Latest Articles

Most Read