ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకింగ్ రంగానిదే కీలకపాత్ర అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యాంకులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. రుణ మంజూరు పత్రాలతో వెళ్లినా బ్యాంకులు సకాలంలో స్పందించడం లేదని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెస్తోందని, బ్యాంకులు ఈ విషయంలో తమ పనితీరు మార్చుకోవటానికి వచ్చే నెల 31 వరకు సమయమిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

కొన్ని ప్రైవేటు బ్యాంకులు అభివద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావడం లేదన్న అంశం తమ దృష్టికి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఒక్క రైతుపేరిట కూడా ఆ బ్యాంకులు ఖాతాలను ప్రారంభించలేదని అన్నారు. ప్రభుత్వం నుంచి లబ్దిపొందుతూ, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనకపోవడం సరికాదని తెలిపారు. అటువంటి బ్యాంకులను నియంత్రించలేకపోతున్నామన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము ఆయా బ్యాంకులు ఏఏ రంగాలకు ప్రాధాన్యతనిస్తాయో అందుకు సంబంధించి సేవాస్థాయి ఒప్పందాల (Service level Agreement) ను వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరతామని, ఆయా బ్యాంకుల దగ్గరకు వెళ్లవద్దని తాము కూడా ప్రజలకు తెలియజేస్తామని, ఆయా బ్యాంకులలో అక్కౌంట్లు ప్రారంభించవద్దని సూచిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

కొన్ని బ్యాంకులు అనేక కారణాలు చెబుతూ అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇటువంటి అదనపు చార్జీల విధింపు పద్ధతులను మానుకోవాలని బ్యాంకులకు సూచించారు. ముప్ఫయ్ వేల రూపాయలతో గేదెల కొనుగోలుకు రుణం ఇవ్వడానికి గేదెల తనిఖీ చార్జీల కింద ఓ బ్యాంకు రూ.12,000 చార్జిచేసిందని ఓ అధికారి చెప్పినప్పుడు సమావేశంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ తగిన ఆధారాలతో వస్తే సదరు బ్యాంకు అధికారుల మీద చర్య తీసుకునేందుకు వీలవుతుందన్నారు. రుణ ఉపశమనం కింద మంజూరు చేసిన మొత్తంలో ఇంకా 16 కోట్లు బ్యాంకర్ల దగ్గరే ఉన్నాయని, వెంటనే లబ్దిదార్లకు అందజేయాలన్నారు.

బలహీన వర్గాల ప్రజలు రుణాలు తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి చెబుతూ ‘రుణాలు తీసుకోవటం, తిరిగి చెల్లించటం ఉండాలి. తిరిగి చెల్లిస్తేనే బ్యాంకులు రీషెడ్యూల్ చేసుకుంటాయి. లేకుంటే బ్యాంకులు పనిచేయటం సాధ్యంకాదు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల చెల్లింపు విషయంలో మాకు స్పష్టత ఉంది. అధికారులు సకాలంలో స్పందిస్తూ, సత్వర చెల్లింపులతో బ్యాంకులు సాఫీగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పలు కార్యక్రమాలు చేపట్టేందుకు అమెరికాకు చెందిన వివిధ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. సేంద్రీయ వ్యవసాయానికి ‘ఆమ్వే’ సంస్థ ముందుకురాగా, రాష్ట్రంలో ఒక్కో చిన్నారికి రూ. 150కే నిమోనియా వ్యాక్సిన్ వేస్తామని ‘ఫైజర్’ సంస్థ వెల్లడించింది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ‘భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం’ ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రంలో తామంతా అడుగుపెట్టేందుకు సిద్ధంగా వున్నామని ఫోరం ప్రతినిధులు ముఖ్యమంత్రికి పలు ప్రతిపాదనలను సమర్పించారు.

రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయం చేపట్టేందుకు ఆయుర్వేద ఉత్పత్తులలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ‘ఆమ్వే’ సంస్థ తమకు 500 ఎకరాలు కేటాయించాలని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. ఇప్పటికే తాము కర్నాటకలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్టు వివరించారు. కుప్పంలో సేంద్రీయ సాగుపై ముందుగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడి రహిత సేంద్రియ వ్యవసాయానికి కృషి చేస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న సుభాష్ పాలేకర్‌తో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

నిమోనియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రాష్ట్రంలో పెద్దఎత్తున వ్యాక్సినేషన్ వేసేందుకు ‘ఫైజర్’ (Pfizer) సంస్థ సన్నద్ధంగా వుంది. ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్‌తో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని ‘ఫైజర్’ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఒక్కో డోసు రూ. 4 వేలు విలువైన వ్యాక్సిన్‌ను రూ. 150కే వేసేందుకు సిద్ధమని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎక్కువుగా ఏపీలో నిమోనియా బాధిత చిన్నారులు వున్నందున తక్షణమే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

హిమోఫీలియా సహా అరుదైన వ్యాధుల నిర్ధారణ పరీక్షా కేంద్రాలను రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నెలకొల్పుతామని ‘షైర్ ఫార్మాస్యుటికల్స్’ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. వైద్య రంగానికి అవసరమైన ఐటీ సేవలను అందించేందుకు సిద్ధమని తెలిపారు. రాష్ట్రంలో వైద్యులు తమ విజ్ఞానాన్ని మరింత పెంచుకునేలా అంతర్జాతీయ స్థాయి శిక్షణకు వర్క్‌షాపులను నిర్వహిస్తామని అన్నారు. దేశంలోనే అమరావతిని రణగొణధ్వనులు, ప్రకంపనలు లేని తొలి నగరంగా తీర్చిదిద్దుతామని ‘నాయిస్ కంట్రోల్ సెంటర్’ ఏర్పాటు చేస్తామని ‘వెనెక్లాసెన్’ (Veneklasen) సంస్థ ప్రతినిధులు చెప్పగా, ఆర్గానిక్ ఫ్రూట్ జ్యూసుల తయారీ చేపట్టామని, శ్రీసిటీలో ఉద్యోగులకు గృహ సముదాయల నిర్మాణానికి సిద్ధమని పెప్సికో సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

కోటి ఎకరాల్లో ఉద్యానవనాల పెంపకం చేపట్టి రాష్ట్రాన్ని ప్రపంచానికి హార్టికల్చర్ హబ్‌గా చేయాలని, తద్వారా రైతు ఆదాయాన్ని మూడింతలు చేయాలని సంకల్పించామని ఫోరం ప్రతినిధులతో ముఖ్యమంత్రి అన్నారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా నిర్మించాలనేది తన లక్ష్యమని, ప్రజల్లో 80 సంతృప్తి సాధించాలని నిర్దేశించుకోగా, ఇప్పటికి 58% సంతృప్తిని తీసుకురాగలిగామని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుతో అందరికీ 15 ఎంబీపీఎస్ ఇంటర్‌నెట్, విద్యుత్ రంగంలో సంస్కరణలు తాము సాధించిన విజయాలని చెప్పారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెంచడం, నిల్వ చేయడం ద్వారా విద్యుత్ చార్జీలు తగ్గేలా చూస్తామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం సృష్టించామని, పూర్తి విశ్వాసంతో అడుగుపెట్టొచ్చని భరోసా ఇచ్చారు.

రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిని ‘భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం’ ప్రతినిధులు కొనియాడారు. అక్టోబర్ 9న న్యూఢిల్లీలో నిర్వహించే ‘రౌండ్ టేబుల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్’కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు.

15 రోజులు లండన్ పర్యటనలో సేద తీరి, నిన్న ఉదయం జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. 15 రోజుల ట్రిప్ కి, కోర్ట్ కూడా పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న అంతా ఇంటికే పరిమితమైన జగన్, ఇవాళ తనకిష్టమైన చోటికి వచ్చారు....

ఇవాళ శుక్రువారం కదా... గుర్తొచ్చిందా... అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ తో పాటు, A2 విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు.

లండన్ పర్యటన నుంచి రాగానే, జగన్ తనకి బాగా ఇష్టమైన చోటికే వచ్చాడు అని, అక్కడ ఉన్న ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసినా, దానిని తప్పుగా చూసే ప్రతిపక్ష వైకాపా ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేక తలపట్టుకుంటుంది... ఇదే జగన్ ఆగ్రహానికి కారణం అయ్యింది. తాము చేసింది తప్పు అయినా సరే దానిని పట్టించుకోని వైకాపా, ప్రభుత్వం సరైన విధానంలో వెళ్తున్నా దానిని తప్పుగా చూస్తూ ఉంటుంది... అది పట్టిసీమ అయినా ఇటీవల కోర్ట్ లో కేసు వేసిన ఫైబర్ గ్రిడ్ అయినా సరే...

పట్టిసీమని వ్యతిరేకించిన వైకాపా ఆ తర్వాత రైతుల మద్దతు చూసి నిమ్మకుండిపోయింది.. తాజాగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ విషయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వేసిన కేసుని హైకోర్ట్ కొట్టేసింది... ఆ కేసులో ఆళ్ళ ఆరోపణ ఒక్కసారి చూస్తే నవ్వురాక మానదు.. " ప్రభుత్వం ప్రచార సాధనాల రంగంలోకి రావడం అనేది చట్టవిరుద్దమని పేర్కొన్నారు.

దీనిపై ఆళ్ళని ప్రశ్నించిన హైకోర్ట్ " ప్రభుత్వం ఈ రంగంలోకి రావడం చట్టవిరుద్దమని ఏ చట్టంలోనూ పేర్కొనలేదని చెప్పింది... మరి ఆళ్ళ ఆరోపించిన దాని ప్రకారం చూస్తే త్వరలోనే సాక్షి ఛానల్ ని కూడా మూసెయ్యాలి. వచ్చే రెండేళ్లలో అధికారంలోకి వస్తామని చెప్పే జగన్ అధికారంలోకి రాగానే సాక్షి ఛానల్ ని కూడా మూసేస్తామని ప్రకటిస్తే బాగుంటుందని తెలుగుదేశం ఎద్దావా చేస్తుంది.

సరిగ్గా ఇదే విషయం జగన్ దాకా చేరటంతో, లండన్ నుంచి రాగానే, ఆళ్ళకు క్లాసు పీకాడంట జగన్... ఇంత దూకుడు పనికిరాడు, కొంచెం స్లో అవ్వు అన్నారంట... సరైన హోం వర్క్ లేకుండా కేసులు వేసి, కోర్ట్ లలో బోల్తా పడటం, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావటమే కాకుండా, ఈ విషయంలో మనకు "సాక్షి" ఉంది అని మర్చిపోయావా అని ఆళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు జగన్. ఇలాంటి విషయాలు ముందుగా విజయసాయితో కాని, ప్రశాంత్ కిషోర్ తో కాని చర్చించి, అప్పుడు కేసులు వెయ్యమన్నాడంట.

అయితే ఇక్కడ అసలు విషయం వేరే ఉంది అంటున్నారు... ఈ మధ్య సదావర్తి భూముల్లో ఆళ్ళకి కొంచెం అనుకూలంగా తీర్పులు రావటంతో, అతను ఇటు వైకాపా పార్టీలో, అటు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు... స్వతహగా, తనకంటే ఎవరైనా హైలైట్ అయితే జగన్ తట్టుకోలేడు అనే అపవాదు ఉంది... తాజాగా రోజా ఉదంతం కూడా ఒక ఉదాహరణ... రోజాకి ఓవర్ హైప్ రావటంతో, రోజా అసలు మీడియా ముందుకు రాకుండా చేశాడు జగన్... ఇప్పుడు ఆళ్ళ కూడా మీడియాలో హైలైట్ అవ్వటంతో జగన్ తట్టుకోలేకపోతున్నాడని, అందుకే ఆళ్ళ మీద ఇలా రివెంజ్ తీసుకున్నాడని అంటున్నాయి పార్టీ వర్గాలు...

Advertisements

Latest Articles

Most Read