ఐవైఆర్ కృష్ణా రావు... ఈయన మన నవ్యాంధ్ర రాష్ట్రానికి మొదటి చీఫ్ సెక్రటరీ... మొదట్లో చాలా సౌమ్యుడు, మంచి వాడు అనుకున్నారు అందరూ... అందరితో పాటే ముఖ్యమంత్రి కూడా నమ్మారు... రిటైర్డ్ అయిన తరువాత భ్రామ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు... తరువాత విషయం అందరికీ తెలిసిందే... జగన్ కి సపోర్ట్ చేస్తూ, అమరావతి మీద ఎలా విషం కక్కుతున్నాడో తెలిసిందే... చీఫ్ సెక్రటరీ హోదాలో, దొనకొండ రాజధాని చెయ్యమని కేంద్రానికి లేఖ రాసి, తద్వారా అక్కడ ఎక్కువ భూములు కొన్న జగన్ కు లాభం చేకూరేలా ప్లాన్ చేశారు... అంటే ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంటూ ఐవైఆర్ కృష్ణా రావు, జగన్ కోవర్ట్ గా పాని చేసారా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం... అయితే, తాజాగా సియం పేషీలో ఇంకా జగన్ కోవర్టులు ఉన్నారని, ఏ చిన్న మీటింగ్ జరిగినా, ఎంత కాన్ఫిడెన్షియాల్ మీటింగ్ అయినా, పేపర్లతో సహ మొత్తం జగన్ దగ్గరకి వెళ్ళిపోతుంది అనే అనుమానం ప్రభుత్వ వర్గాల్లో మొదలైంది... జగన్ కోవర్టులు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, సియం పేషీ నిర్ధారణకు వచ్చింది.

2G 21122017 3

అవి కాన్ఫిడెన్షియాల్ విషయాలు కాబట్టి, ఏయే విషయాలు జగన్ దాకా వచ్చాయో చెప్పట్లేదు కాని, ప్రజలకు తెలిసిన రెండు సందర్భాలు ఉదాహరిస్తున్నారు.. ఒకటి, పదవీ విరమణ వయసు 60 నుంచి 58కి తగ్గించటం... ఇది ఒక ముఖ్య సమావేశానికి, 75 శాతం మంది లేట్ గా వచ్చారని, వాళ్లకి చంద్రబాబు క్లాసు తీసుకుంటూ అన్న మాట ఇది... కొంత మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు...ఆ వ్యాఖ్యలు ఆధారంగా పదవీ విరమణ వయసు 60 నుంచి 58కి తగ్గిస్తూ ఫైల్ సిద్ధం చేశారు... విషయం తెలుసుకున్న చంద్రబాబు, ఇప్పుడు ఇలాంటివి ఏమి వద్దనీ, ఆ రోజు అంత మంది లేట్ గా రావటంతో ఆ వ్యాఖ్యలు చేశానని అనటంతో, ఆ ఇష్యూ క్లోజ్ అయ్యింది... కాని, సాక్షి పేపర్ లో, టీవీలో, ఆ ఫైల్ తో సహా చూపించారు... అక్కడ ఉన్న కొంత మంది, సాక్షికి కాని, జగన్ కి కాని ఇవ్వకుండా అది సాధ్యం కాదు...

2G 21122017 3

మరో సంఘటన, వృద్ధులకి 2 వేల రూపాయల పెన్షన్... ఒక ఉన్నత స్థాయి సమావేశంలో, మనం ఎలక్షన్స్ కి వెళ్ళే ముందు, వృద్ధులకి 2 వేల రూపాయల పెన్షన్ చేద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు... అయితే, అది జగన్ కి లీక్ కావటంతో, ముందుగా తనే ఈ విషయాన్నీ ప్లీనరీలో ప్రకటించాడు... అది విన్న వెంటనే, చంద్రబాబు కూడా షాక్ అయ్యారు అంట... ఇవన్నీ చూస్తున్న సియం పేషీ, మరీ ముఖ్యంగా చంద్రబాబు, ఎదో కుట్ర జరుగుతుంది అని, వీళ్ళని ఎలా పట్టుకోవాలి అని ఆలోచించి, చంద్రబాబు చెప్పిన ప్రకారం ఒక మాస్టర్ ప్లాన్ వేసారంట... ఈ ప్లాన్ ప్రకారం, ఆ కోవర్టులు ఎవరనేది ఈజీగా పట్టేయోచ్చని అంటుంది సియం పేషీ..

ఐటిసి లిమిటెడ్ నవ్యాంధ్ర మీద అమితమైన ప్రేమ చూపిస్తుంది... ఇప్పటికే ఐటీసీ హెడ్ క్వార్టర్స్ గుంటూరుకు మార్చింది... ఆగ్రి డివిజన్ కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చింది... మొన్న పేపర్ మిల్ కూడా పెడతామని అని అధికారులని స్థలం కోరింది... ఇప్పుడు ఐటిసి డెయిరీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో డెయిరీని నెలకొల్పేందుకు రెడీ అవుతోంది. దీనికోసం అనుమతులని కూడా అధికారులని అడిగింది. సాధ్యమైనంత త్వరగా స్థల సేకరణను పూర్తి చేసి ప్లాంట్ నిర్మాణం చెయ్యనున్నారు.. డెయిరీతో పాటు, అనుబంధ ఉత్పత్తులను కూడా ఇక్కడ ఉత్పత్తి చెయ్యనున్నారు..

ఇప్పటికే ఐటిసి ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో డెయిరీలను నిర్వహిస్తోంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కడుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ కోసం, ముఖ్యమంత్రి చంద్రబాబు డిజైన్ ల విషయంలో రాజమౌళి సలహా అడిగిన విషయం తెలిసిందే... అయితే ఇప్పుడు ప్రధాని మోడీకి తను చేపట్టబోయే మిషన్ లో సపోర్ట్ చెయ్యమంటూ రాజమౌళికి లెటర్ రాసారు..

దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్బంగా రానున్న అక్టోబర్ 2 వ తేదిన మ‌హాత్మా గాంధీ జ‌యంతి రోజున దేశ ప్రజలు 'స్వచ్ఛత హి సేవా' ఉద్యమంలో పాల్గొనాలని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌జ‌ల‌కు పిలుపుఇచ్చారు.. ఉన్నారు.ప్రజలకు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని , అందుకోసం మీ మద్దతు కావాలని రాజమౌళికి రాసిన లేఖ‌లో మోడీ కోరారు.

లేఖ అందుకున్న రాజ‌మౌళి స్పందిస్తూ, ఒక మంచి కార్య‌క్ర‌మం చేపట్టిన ప్ర‌ధానికి నా హృద‌య‌పూర్వ‌క అభింన‌ద‌న‌లు.. స్వ‌చ్చ్ భారత్ వంటి కార్య‌క్ర‌మంలో త‌న‌ను బాగ‌స్వామ్యం చేయ‌డం నాకు ల‌భించిన గౌర‌వంగా భావిస్తున్నా . స్వ‌చ్చ‌త హి సేవా కార్య‌క్రమంలో చిత్త‌శుద్దిగా పాల్గొంటానంటూ త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నాడు రాజ‌మోళి.

విశాఖపట్ననానికి మరో భారీ రభుత్వ రంగ సంస్థ రానుంది. కర్ణాటక కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్ కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ లిమిటెడ్‌, మన రాష్ట్రంలో ౩౦౦ కోట్ల పెట్టుబాడితో భారీ పెల్లెట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

ఏటా 15 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయ్యబోయే ఈ ప్లాంట్ కోసం, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతులు కోరారు.

ఈ ప్లాంట్‌ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisements

Latest Articles

Most Read