చంద్రబాబు తన వ్యక్తిగత జీవితంలో ఎంత క్రమశిక్షణ పాటిస్తారో అందరికీ తెలిసిందే... తినే ఆహరం దగ్గర నుంచి, వ్యాయామం దాకా, గత నలభై ఏళ్ళ నుంచి ఒకటే కొట్టుడు... ముఖ్యమంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడు అయినా, బస్సు యాత్ర అయినా, పాద యాత్ర అయినా, ఈయన లైఫ్ స్టైల్ మారాదు.. చివరకి అమెరికా వెళ్ళినా, దావోస్ వెళ్ళినా ఆయన తినేది రాగి ముద్దే... అందుకే, 70 ఏళ్ళ వయసులో కూడా, యువకులకంటే స్పీడ్ గా ఉంటారు... రోజుకి 18 గంటలు కష్టపడతారు...

నిన్న చంద్రబాబు ప్రెస్ తో మాట్లడుతూ, మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు... "రోజు 45 నిమిషాలు వ్యాయామం ఎలా చేస్తానో, 15 నిమషాలు విజువలైజేషన్ చేసుకుంటాను... నేనేంటి, ఎక్కడి నుంచి వచ్చా, ఎలా పెరిగా... నేను ఏం చేయాలి, నా లక్ష్యం ఏంటి ఆలోచిస్తా..." అంటూ మంచి విషయం చెప్పారు...

అలాగే చంద్రబాబు తన డైట్ గురించి కూడా చెప్పారు.. తాను బతకటం కోసం తింటానానని, తినటం కోసం బతకనని చెప్పారు. ఉదయం రాగి లేదా జొన్నతో చేసిన ఇడ్లీ, అటుకుల ఉప్మా, మధ్యలో టీ లేదా కాఫీ తాగుతా. మధ్యాహ్నం జొన్న లేదా రాగి సంకటి, రెండు కూరలు, మొలకలు తీసుకుంటా. సాయంత్రం 6.30- 7 గంటల మధ్య సూప్‌, ఓ చిన్న ఫ్రూట్‌, ఎగ్‌ వైట్‌‌‌తో కూడిన అల్పాహారాన్ని తీసుకుంటానని వెల్లడించారు... ఆరు గంటలు మాత్రమే నిద్ర పోతానని చెప్పారు.

నిజానికి, ఎవరైనా ఇలా విజువలైజేషన్ చేసి ఆలోచిస్తే, జీవితంలో చాలా క్లారిటీ ఉంటుంది... మనం ఏ స్థాయిలో ఉన్నా, మనం ఎక్కడ నుంచి వచ్చాం, ఎంత కష్టపడి పైకి వచ్చాం ఇలా ఆలోచిస్తే, మన ఇగో కూడా కంట్రోల్ లో ఉంటుంది. అలాగే, మనం ఈ రోజు ఏమి చెయ్యాలి, నిన్న చేసిన తప్పులు ఏంటి, మన లక్ష్యం వైపు ఎలా వెళ్తున్నాం అనేది అలోచిస్తే, జీవితంలో చాలా క్లారిటీ ఉంటుంది... చంద్రబాబులా, మనం డైట్ కంట్రోల్ చేసుకోలేము కాని, ట్రై చేద్దాం... వ్యాయామం కూడా రోజు ఒక అరగంట అన్నా చేస్తే, ఫిట్ గా ఉండొచ్చు, మన పనులు పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు...

ॐ ..శరన్నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ శనివారం విజయవాడలో అమ్మవారి అలంకారం- *శ్రీ గాయత్రీ దేవి* ॐ

ముక్తా విద్రుమ హేమ నీలధవళ
చ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్
తత్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదా భయాం కుశకశా
శ్శుభ్రం కపాలం గదామ్
శంఖం చక్రమధార విందం యుగళమ్
హసైర్వహం తీం భజే

గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.

అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది

dasara day 3 2017 2

అర్జున అవార్డు గ్రహీత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని క్రవారం మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసారు. అలాగే సాకేత్ మైనేనికి, రూ.75 లక్షలు నజరానా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.

విశాఖపట్నం పట్నంలో ప్రభుత్వం తరపున, టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేసి, శిక్షణ ఇప్పించాలని సాకేత్ మైనేని చంద్రబాబు కోరారు. ఆంద్రప్రదేశ్ లో క్రీడలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారాని ముఖ్యమంత్రిని సాకేత్ కొనియడారు.

ఇప్పటికే పుల్లెల గోపిచంద్ కు, అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే... కొన్ని రోజుల క్రితం కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన వారికి కూడా ప్రోత్సాహం ఇచ్చిన సంగతి తెలిసిందే.

క్రిందటి ఏడాది, ముస్సోరి శిక్షణా కేంద్రంలో ట్రైనీ ఐఏఎస్ లకు, మీరు ఏ ముఖ్యమంత్రి ప్రసంగం వినాలనుకుంటున్నారు అంటే, అక్కడ ఉన్న ట్రైనీ ఐఏఎస్ లు అందరూ, చంద్రబాబు పేరు సూచించారు. క్రిందటి ఏడాది చంద్రబాబు ముస్సోరి వెళ్లి, 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారులతో పాటు, పదిహేనేళ్ళు సర్వీస్ పూర్తిచేసుకున్న వారికి కూడా "సివిల్ సర్వీసెస్ ఇన్ ఏ గొల్బాల్ వరల్డ్" అనే అంశం పై ప్రశంసించారు...

ముస్సోరి శిక్షణా సంస్థ డైరెక్టర్ ఆహ్వానం మేరకు, రెండో సారి కూడా చంద్రబాబు ముస్సోరి వెళ్లి, ఐఏఎస్, ఐపీఎస్‌లకు పాఠాలు చెప్పనున్నారు. ఈ నెల 25న ముస్సోరిలో యువ ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు 1986 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లను ఉద్దేశించి ప్రశంగిస్తారు.

ప్రధానంగా మూడు అంశాలపై ముస్సోరిలో మాట్లాడాలని బాబు నిర్ణయంచారు. రాష్ట్ర విభజన తర్వాత పాలనా పగ్గాలు అందుకోవడం.. రాజధాని నిర్మించే అరుదైన అవకాశం రావడం.. పరిపాలనలో సాంకేతిక వినియోగంపై చంద్రబాబు మాట్లాడనున్నారు.

Advertisements

Latest Articles

Most Read