తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ సారి దసరా పండుగని, ఫ్యామిలీతో కలిసి బెజవాడలో జరుపుకోనున్నారు... ఈ నెల 27 కాని, 28 కాని, కేసీఆర్ విజయవాడ పర్యటన ఉంటుంది అని తెలంగాణా సియం పేషీ అధికారులు, దుర్గగుడి అధికారులకి తెలియ చేశారు.

పర్యటనలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని ఆయన మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం తెలంగాణ దేవుళ్ల మొక్కులు తీర్చుకుంటున్నారు. దాదాపు 75 లక్షలతో తెలంగాణా ప్రభుత్వం తరుపున, కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్నారు కేసీఆర్.

కేసీఆర్ తో పాటు, కుటుంబ సభ్యులు కూడా, అమ్మరవారికి ప్రత్యెక పూజలు చెయ్యనున్నారు. ఈ పర్యటనలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి, ఇరు రాష్ట్రాల సమస్యలు కూడా చర్చించే అవకాశం ఉంది.

ఇండియా A, జట్టు న్యూజిలాండ్ A జట్టుతో మూలపాడులోని క్రికెట్ గ్రౌండ్ లో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్న సంగతి తెలిసిందే... సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు మొదటి టెస్ట్ మ్యాచ్... సెప్టెంబర్ 30 నుంచి, అక్టోబర్ ౩ వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది...

దీంట్లో భాగంగా నిన్న మొదటి టెస్ట్ మొదలైంది... న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 147 పరుగులకి ఆల్ అవుట్ అయింది. ఇండియా జట్టు, 71 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది.

అయితే ఇండియా మాజీ స్టార్ బాట్స్ మెన్, రాహుల్ ద్రావిడ్, ఇండియా A కోచ్ కావటంతో, ఆయన కూడా విజయవాడ వచ్చారు... గ్రౌండ్ అంతా తిరిగి, పిచ్చి పరిస్థితిని, అవుట్ ఫీల్డ్ ని పరీక్షించారు... అలాగే న్యూజిలాండ్ మాజీ స్టార్ బౌలర్ షేన్ బాండ్ కూడా వచ్చారు.

దసరా సెలవులు కావటంతో, పెద్ద ఎత్తున యువత వచ్చారు... రాహుల్ ద్రావిడ్ ని చూసి కేరింతలు కొట్టారు... ఇవాళ ఆదివారం కావటంతో, ఎక్కువ మంది మ్యాచ్ చూడటానికి వచ్చారు....

చంద్రబాబు ప్రభుత్వం నీరుకి ఎంత ప్రాదాన్యత ఇస్తుందో తెలిసిందే.. ఒక పక్క రాష్ట్రాన్ని కురువురహితం చేస్తూ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తున్న చంద్రబాబు, ఇప్పుడు జలసిరికి హారితి అంటూ, నీటిని పూజించ మంటున్నారు.

శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జలసిరికి సంబంధించిన పాట ’జల జల జల జలసిరికి హారతి... జన జన జన జనసిరికి హారతి’ని చంద్రబాబు విడుదల చేశారు.

ఈ పాటని ప్రముఖ సినీ గేయ రచయిత అనంతశ్రీరామ్‌ రచించారు...

నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మారిన రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారాయన్నది ఎవరు కాదనలేని వాస్తవం. ప్రతిపక్షంలో తమకు భవిష్యత్తు లేదనుకున్న ఎందరో శాశనసభ్యులు , నియోజకవర్గ ఇంచార్జులు అధికార పార్టీలోకి వెళ్ళడానికి గాను రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే గతంలో జగన్ ఊపు చూసి ఆ పార్టీలోకి వెళ్లిన కొంత మంది నేతలు మళ్ళి చంద్రబాబు దగ్గరకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు...వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం...

జగన్ పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్ రెడ్డి అభిమానం జగన్ కి బాగానే కలిసి వచ్చింది.. జగన్ ముఖ్యమంత్రి కావాలి అనుకున్న వారు ఉన్నారు... ఈ ఊపు చూసిన ఇతర పార్టీల నేతలు రాజీనామాలు చేసి మరి జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరి ఓదార్పులో తమ వంతు కృషి చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కొంత మంది గెలిచారు కొంత మంది ఇంచార్జులుగానే మిగిలిపోయిన పరిస్థితి ఉంది...

గెలిచిన వాళ్ళని కాసేపు పక్కన పెట్టి గెలవని వాళ్ళని ప్రస్తావిస్తే... గత ఎన్నికల్లో జగన్ ఊపుతో గెలుస్తామన్న ఎందరో నాయకులు తమకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై నోటికి వచ్చిన విధంగా కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఓడిపోవడంతో ఆ నేతలు దాదాపు కనుమరుగు అయిపోయారనే చెప్పాలి.. రాజకీయం అంటే ఆశక్తితో ఉన్న కొందరు మాత్రం ఇక తమకు ఆ పార్టీలో ఉంటె భవిష్యత్తు లేదని తిరిగి తెలుగుదేశంలోకి వెళ్తే తమకు ఎంతో కొంత గుర్తింపు ఉంటుందని భావించి మళ్ళి తెలుగుదేశం గడప తొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.. ఇందుకోసం తమకు సన్నిహితంగా ఉండే తెలుగుదేశం నేతలతో వారు టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read