ఈ మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్ పార్టీ, సాక్షి టీవీ/పేపర్, ఏ ఇష్యూ తీసుకున్నా, సెల్ఫ్ గోల్స్ వెయ్యటంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఉండరు... సదావర్తి భూములలో 1000 కోట్ల కుంబకోణం అంటూ, హడావిడి చేసి కోర్ట్ టైం వేస్ట్ చేసి, చివరకు 60 కోట్లకు సర్డుకుపోవటంతో, వీళ్ళ డొల్లతనం బయటపడింది.

అయితే ఆ 60 కోట్లకు పాడుకున్న కడపకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ యజమానులు శ్రీనివాసరెడ్డిని కూడా , సాక్షి టీవీలో స్పెషల్ ఎపిసోడ్ లు వేసి, అతను చంద్రబాబు భినామీ అని, మంత్రి ఆది నారయణ రెడ్డి బినామీ అని అతని పరువు తీసారు... దీంతో, ప్పుడు ఆ భూములు తమకు వద్దని పాటదారులు అంటున్నారు శ్రీనివాసరెడ్డి. వైసీపీ చేసిన ఆరోపణల వల్లే తాము వెనక్కి తగ్గామని, ఈ గోల మాకెందుకు అని అంటున్నారు. గడువు ముగిసినా పాటదారులు సొమ్ము చెల్లించలేదు.

మరి ఇప్పుడు, రెండో అతి పెద్ద పాట పాడిన వారికి ఆ భూములు ఇస్తారా, లేక మళ్ళీ వేలం నిర్వహిస్తారా, కోర్ట్ ఏమి చెప్పుద్దో చూడాలి... మొత్తానికి, జగన్ బ్యాచ్ ఈ భూములు విషయంలో మొదటి నుంచి రాద్దాంతం చేస్తూ, ఇవాళ ఎక్కువ ధర వచ్చినా, వాళ్ళని కూడా బెదిరించి, బయటకు పంపారు... కోర్ట్ ఈ విషయంలో , ఆళ్ల చెప్పినట్టు వెయ్య కోట్లు అతని దగ్గర నుంచి తీసుకుని, ఈ ఇష్యూ ని క్లోజ్ చెయ్యాలని కోరుకుందాం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీ ఉపయోగించి సమర్ధవంతమైన పాలన ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే... 90ల్లోనే టెక్నాలజీ ఉపయోగించిన మొదటి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు..

సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో, అన్నిట్లో టెక్నాలజీ ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు... పెన్షన్స్ లో, రుణ మాఫీలో నకిలీ లబ్ధి దారునాలి ఏరేయ్యటం మొదలు, సియం డ్యాష్ బోర్డు దాకా, అన్నిట్లో టెక్నాలజీ ఉపయోగించి సమర్ధవంతమైన పాలన చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా పోలీసులు కూడా, తెలికిగా సమర్ధవంతంగా విధులు నిర్వహించటానికి, "Hoverboard"లని అందించారు. ముందుగా వైజాగ్ లో పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టనున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యటానికి, పెట్రోలింగ్ చెయ్యటానికి, ఫుట్ పాత్ క్లియర్ చెయ్యటానికి, బీచ్ లలో విధులు నిర్వహించటానికి, ఇలా అన్ని పనులు తేలికగా చేసే వీలు, ఈ "Hoverboard"లో ఉంటుంది.

మీరు కూడా ఈ వీడియోలో చూడండి, వైజాగ్ లో పోలీస్ ఈ "Hoverboard" ఉపయోగించి ఎలా పని చేస్తున్నారో..

నిత్యం కాంట్రవర్సీలు చుట్టూ తిరిగే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకి విజయవాడ కోర్ట్ షాక్ ఇచ్చింది... నా ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తా, చుస్తే చూడు లేకపోతే లేదు అనే వర్మ కాన్సెప్ట్ బెడిసికొట్టింది... క్రితం సంవత్సరం తీసిన, వంగవీటి వివాదం ఇంకా చల్లారనే లేదు.

‘వంగవీటి’ సినిమాకు సంబంధించి, తమ కుటుంబాన్ని అవమానపర్చారంటూ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలని కాదని వంగవీటి సినిమా తెరకెక్కించిన వర్మ పై వంగవీటి రాధ పిటీషన్ దాఖలు చేశారు.

దీని పై పలుదఫాలుగా విచారించి, విజయవాడ కోర్టు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో, దర్శకుడు రాజమౌళి పొద్దున భేటి అయ్యారు. అమరావతి నిర్మాణాలకు, నర్మన్ పోస్టర్ ఇచ్చిన డిజైన్ లకు, రాష్ట్ర, దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సలహాలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం రాజమౌళిని కోరింది.

ఫ్లయిట్ ఆలస్యం అవడం వల్ల, అనుకున్న సమయానికి అంటే లేట్ గా, చంద్రబాబుతో భేటి అయ్యారు.. కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉండటంతో, చంద్రబాబు కొద్ది సేపు చర్చించి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మరోసారి సీఎంతో, రాజమౌళి భేటీ అవుతారు.

దర్శకుడు రాజమౌళితో నిర్మాణాలు అని అమరావతి వ్యతిరేకులు హేళన చేస్తున్నారు. నిజానికి, రాజమౌళి నిర్మాణాల ప్లాన్ ఇవ్వరు, తెలుగు సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్ లలో చెయ్యాల్సిన మార్పులు చెప్తారు... తెలంగాణాలో యాదాద్రి ఆలయం మొత్తం, సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి డిజైన్ చేశారు... హైదాబాద్ లో కూర్చున్న తెలంగాణా మేధావులు, ఇది తెలుసుకుంటే మంచిది... సినిమా వాడికి, డిజైన్ లు గురించి ఎందుకు అనే వాళ్ళు, హైదరాబాద్ లో కులుకుతూ, ఆంధ్ర రాష్ట్రానికి సియం అవ్వటం ఎందుకు అనే లాజిక్ మర్చిపోయారు..

రాజమౌళి, వీళ్ళందరికీ దిమ్మ తిరిగేలా, ప్రపంచ స్థాయి రాజధాని కోసం, నర్మన్ పోస్టర్ తో, కలిసి, అటు ఆధునికత, ఇటు, మన తెలుగు సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆకృతులు ఇవ్వాలని ఆశిద్దాం...

Advertisements

Latest Articles

Most Read