పొద్దున లెగిసిన దగ్గర నుంచి, తాను దూషించే పార్టీకి చెందిన ఎమ్మేల్యే గోరంట్ల ఇంటికి ముద్రగడ ఎందుకు వెళ్ళాడు ? కాపు ఉద్య‌మాన్ని పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేసి, చంద్రబాబుని తిట్టిన నానా బూతులు మర్చిపోయి, ఆ పార్టీ నేతనే కలిసారు అంటే, ఎందుకోసం ? కాపు ఉద్యమం గురించి, కాపుల సమస్యల గురించి ఒక్కసారి కూడా, అధికార పార్టీతో మాట్లాడని ముద్రగడ ఎందుకు ఇప్పుడు కలిసారు ?

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌ను పీడించుకుని తింటున్న ముద్రగడ వియ్యంకుడు కోసం, ఈ తాపత్రయం... ముద్ర‌గ‌డ‌కు కాపుల కంటే త‌న సొంత ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని మరోసారి రుజువైంది... త‌న వియ్యంకుడి అరాచకాలు సమర్ధించటం కోసం, త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన ఎన్నారైకి చేసిన ద్రోహం ఇది...

విషయంలోకి వస్తే, ముద్ర‌గ‌డ వియ్యంకుడు బార్ల‌మూడి ర‌వికుమార్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో త‌న‌కు చెందిన ఓ భూమిని డెవ‌ల‌ప్‌మెంట్ కోసం ఓ ఎన్నారైకి అప్ప‌గించారు. ఒప్పందం మేర‌కు ఆ భూమి డెవ‌లప్‌మెంట్‌లో భాగంగా ఆ ఎన్నారై దాదాపుగా కోట్లాది రూపాయల‌ మేర ఖ‌ర్చు చేశారు. ఇందులో భూ య‌జ‌మానిగా ఉన్న ర‌వికుమార్‌కు అడ్వాన్స్‌, స‌ద‌రు భూమి అపార్ట్‌మెంట్ల నిర్మాణం, ఆ భూమికి క‌ట్టాల్సిన ప‌న్నులు త‌దిత‌రాలు ఉన్నాయి. భూమికి ప‌న్నులు ర‌వికుమారే క‌ట్టాల్సి ఉన్నా, అత‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో... నిర్మాణ ప‌నులు ఎక్క‌డ ఆగిపోతాయోన‌న్న ఆందోళ‌న‌తో ఆ ఎన్నారై వాటిని చెల్లించారు. మొత్తం డెవ‌ల‌ప్‌మెంట్ పూర్తి అయిన త‌ర్వాత ఆ అపార్ట్‌మెంటులోని భూస్వామి హ‌క్కుల అగ్రిమెంట్ కింద‌ 75 ఫ్లాట్ల‌ను ర‌వికుమార్‌కు కేటాయించాల్సి ఉంది. అయితే నిర్మాణ ప‌నులు ఇంకా పూర్తి కాకుండానే, బిల్డ‌ర్ కు చెప్ప‌కుండా... అందులోని ఓ 18 ఫ్లాట్ల‌ను ర‌వికుమార్ అమ్మేసుకున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న డెవ‌ల‌ప‌ర్‌.. విష‌యాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నారై వాద‌న‌ను విన్న కోర్టు స‌ద‌రు ఫ్లాట్ల విక్ర‌యాల‌ను నిలిపివేస్తూ... ఫ్లాట్ల‌ను కొనుగోలుదారుల‌కు అప్ప‌గించ‌డానికి వీల్లేద‌ని చెబుతూ స్టే విధించింది. ఇక ఈ ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసిన వారి విష‌యానికి వ‌స్తే.. ముద్ర‌గ‌డ వియ్యంకుడిగా ఉన్న ర‌వికుమార్ పాపుల‌ర్ వ్య‌క్తి కావ‌డంతో ఆయ‌న చెప్పిందే త‌డ‌వుగా న‌గ‌రానికి చెందిన ఓ 18 మంది మిడిల్ క్లాస్ పీపుల్ వాటిని రూ.36 ల‌క్ష‌ల చొప్పున కొనుగోలు చేశారు. అయితే ఎంత‌కీ ఫ్లాట్లు త‌మ స్వాధీనంలోకి రాక‌పోవ‌డంతో వారంతా క‌లిసి ర‌వికుమార్‌పై ఒత్తిడి చేశారు. ఈ క్ర‌మంలోనే ర‌వికుమార్ వారిని ఫ్లాట్ల వ‌ద్ద‌కు తీసుకెళ్లి వాటికి వేసిన తాళాల‌ను ప‌గుల‌గొట్టించార‌ట‌. దీంతో షాక్ తిన్న ఎన్నారై... ఆ వెంట‌నే ఒప్పంద ప‌త్రాల‌ను ప‌ట్టుకుని కోర్టును ఆశ్ర‌యించారు.

మొత్తం వ్య‌వ‌హారాన్ని కోర్టు ముందుంచిన ఎన్నారై... ర‌వికుమార్ ఒప్పందాన్ని ఉల్లంఘించార‌ని, ఈ క్ర‌మంలో త‌న‌కు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. ఇది 30 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. కోర్టు కూడా బిల్డ‌ర్‌ వాద‌న వైపే మొగ్గి... ఎన్నారై బిల్డ‌ర్‌ ఖ‌ర్చు చేసిన మొత్తాన్ని చెల్లించాల‌ని, అదే స‌మ‌యంలో 18 ఫ్లాట్ల విక్ర‌యాలు చెల్ల‌వ‌ని ర‌వికుమార్‌కు తేల్చి చెప్పింది. వివాదం మ‌రింత ముదిరిన నేప‌థ్యంలో ర‌వికుమార్ త‌న వియ్యంకుడు ముద్ర‌గ‌డ‌ను ఆశ్ర‌యించారు. కాపుల సంక్షేమమే త‌న ల‌క్ష్య‌మంటూ బీరాలు ప‌లికే ముద్ర‌గ‌డ‌... త‌న వియ్యంకుడు వ‌చ్చేసరికి కాపు ఉద్యమానికి కాస్తంత విరామం ఇచ్చేశార‌ట‌. ముందుగా త‌న మ‌నుషుల‌తో బిల్డ‌ర్‌ను బెదిరించారు. అతను బెద‌ర‌క‌పోవ‌డంతో త‌న‌కు స‌న్నిహితంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌ను రంగంలోకి దించారు. ఈ క్ర‌మంలో వివాదాన్ని కోర్టు బ‌య‌టే సెటిల్ చేసుకోవాల‌ని ఎన్నారైకి ఆకుల నుంచి ఒత్తిడి వ‌చ్చింది. ఈ ఒత్తిడి నానాటికీ పెరిగిపోవ‌డంతో త‌ట్టుకోలేని స్థితిలో ఎన్నారై... అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల‌ను ఆశ్ర‌యించారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని వేడుకున్నారు. దీంతో విధిలేని ప‌రిస్థితుల్లో ముద్ర‌గ‌డ బుచ్చ‌య్య‌ను క‌ల‌వాల్సి వ‌చ్చింది.

ముద్రగడ గారు, జాతి మొత్తం మిమ్మల్ని నాయకులుగా చూస్తున్నప్పుడు మీరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నటు వంటి మీ వియ్యంకుడికి వకాల్తా తీసుకోవటం న్యాయమా.... మీ కులానికే చెందిన యువకుల ఆర్ధిక పరిపుష్టికి మీరు దాహోదపడాలి తప్పితే, మీ శక్తి మొత్తం ఉపయోగించి అక్రమాల వియ్యంకుడికి అండగా నిలవడం సరైన పద్ధతి కాదు...

పరిశ్రమల నుంచి గృహ విద్యుత్ వరకు వినియోగదారులు ఏ ఒక్కరిపైనా చార్జీల భారం మోపే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. చార్జీల పెంపు గురించి ఆలోచించకుండా మరింత చవకైన విద్యుత్‌పై దృష్టి పెట్టాలని, అలాగే వ్యయ భారం తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు క్రమంగా నిలిపివేయాలని సూచించారు. సౌర-పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఉత్పత్తి పెద్దఎత్తున జరిగేలా చూడాలని, రాష్ట్రంలో విద్యుత్ నిల్వ సామర్ధ్య వ్యవస్థ నెలకొల్పడం ద్వారా వ్యయభారం గణనీయంగా తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. సౌర, పవన విద్యుత్ లోటు వున్నప్పుడు ప్రత్యామ్నాయంగా గ్యాస్ ఆధారిత విద్యుత్‌ను వినియోగించుకోవాలని అన్నారు.

బుధవారం తన కార్యాలయంలో విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా, 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఏపీడిస్కంకు ఆదాయం కన్నా వ్యయం అధికంగా వుందని అధికారులు వివరించారు. ఆదాయం రూ. 25,290 కోట్లు రాగా, రూ. 27,621 కోట్ల వ్యయమైందని మొత్తంమీద రూ. 2,331 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. గోవా, పంజాబ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు 1,089 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయం ద్వారా రూ. 173 కోట్ల ఆదాయం అదనంగా ఆర్జించేందుకు అవకాశం వుందని చెప్పారు.

విద్యుత్ శాఖలో సేవలను ఇకపై ఔట్‌సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని, డిమాండ్-సప్లయ్ ఆధారంగానే సబ్ స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల కల్పన జరగాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఆక్వారంగంతో సహా అన్నింటా విద్యుత్ వినియోగంలో ఆదాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వినియోగదారులను వివిధ వర్గాలుగా విభజించి సేవలు సమర్ధవంతంగా అందించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు బకాయిపడ్డ విద్యుత్ బిల్లులను తక్షణం చెల్లించేలా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు అమర్చడం ద్వారా 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో 400 మెగావాట్ల వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నిర్దేశించారు. వ్యవసాయ అవసరాలకు పోగా మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వారా రైతులు ఆర్ధికంగా లబ్ది పొందవచ్చని చెప్పారు. ఈ తరహాలో నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు కింద 5 మె.వా. సౌర విద్యుత్‌ ఉత్పత్తి సాధించడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.

రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ – ఆగస్ట్ మధ్య కాలంతో ఈ ఏడాది పోల్చుకుంటే 7.3% విద్యుత్ ఉత్పత్తి అదనంగా వుందని, ఇదే సమయంలో 0.4% మేర విద్యుత్‌కు డిమాండ్ పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో 2.16 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను, విద్యుత్ ఆదా చేసే 2.55 లక్షల ఫ్యాన్లను, 17,779 విద్యుత్ ఆదా ట్యూబ్‌లైట్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా 15 వేల సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశామని అన్నారు. 110 పట్టణ ప్రాంతాల్లో 5.9 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు చేయగా, త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో 40 లక్షల ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు సిద్ధంగా వున్నామని చెప్పారు. విద్యుత్ రంగంలో రాష్ట్రానికి 2015-16 నుంచి 2016-17 వరకు 26 అవార్డులు వచ్చాయని అన్నారు.

సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో అనూహ్య వృద్ధి
సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం అనూహ్య ప్రగతి సాధించింది. సౌర విద్యుత్ ఉత్పత్తి 183%, పవన విద్యుత్ ఉత్పత్తిలో 154% వృద్ధి నమోదైంది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 600 మె.వా. పవన విద్యుత్, 2019-20 నాటికి 600 మె.వా. సౌర విద్యుత్ అందుబాటులోకి రానుంది.

ప్రజా రాజధానిలో బౌద్ధ చక్రం ఆకారంలో అతి పెద్ద జెయింట్ వీల్ ఏర్పాటుకు యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. అమరావతిలోని పర్యాటక నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.439.37 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటుచేస్తారు. మూడు దశలలో ప్రపంచానికే తలమానికంగా నిలిచే పర్యటక ఆకర్షణగా దీన్ని తీర్చిదిద్దుతామని యూరో డెస్టినేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి వివరించారు.

ఇటలీకి చెందిన ఫ్యాబ్రీ గ్రూపు ఈ జెయింట్ వీల్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తోంది. టర్కీకి చెందిన పోలీన్ వాటర్ పార్క్ జెయింట్ వీల్ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని జల ఆకర్షక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతుంది. యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం కృష్ణారావు, ఫ్యాబ్రీ గ్రూప్ అధ్యక్షుడు జియన్‌లుక ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు.

ప్రపంచంలో అతి పెద్ద జెయింట్ వీల్ అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో ఉంది. 167.6 మీటర్ల పొడవుతో (550 అడుగులు) ఉన్న ఈ జెయింట్ వీల్ గొప్ప పర్యాటక ఆకర్షణగా గుర్తింపుపొందింది. లాస్ వెగాస్ హై రోలర్‌తో పాటు దుబాయ్ ఐ, న్యూయార్క్ వీల్, సింగపూర్ ఫ్లయర్ వంటి ప్రఖ్యాత జెయింట్ వీల్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. వీటినన్నింటినీ తలదన్నేలా ‘అమరావతి బౌద్ద చక్ర’ నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సంస్థ ప్రతినిధులకు సూచించారు. తొలిదశలో దేశంలోనే అతిపెద్ద జెయింట్ వీల్‌గా, రాష్ట్ర పర్యాటక రంగానికే ప్రధాన ఆకర్షణగా దీన్ని నిర్మిస్తామని యూరో డెస్టినేషన్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. తొలిదశలో రూ.26.67 కోట్లు, రెండవ దశలో రూ.16.67 కోట్లు, మూడవ దశలో మరో రూ.16.67 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు వివరించారు.

‘అమరావతి బౌద్ధ చక్ర’గా దీనికి ముఖ్యమంత్రి ప్రాథమికంగా పేరు పెట్టారు. ఇక్కడే సుందరమైన జల క్రీడల కేంద్రం, ఐదు నక్షత్రాల రిసార్టులు, షాపింగ్ ఎరీనా, బడ్జెట్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఫ్యామిటీ రిక్రియేషన్ జోన్, సోషల్ క్లబ్, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. అమరావతి నవ నగరాలలో ఒకటైన పర్యాటక నగరంలో ముందు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని, ఆసక్తి గల సంస్థలను సంప్రదించి పారదర్శక పద్దతిలో టెండర్ల ప్రక్రియను నిర్వహించి అన్ని అర్హతలు ఉన్న సంస్థను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర పర్యటక శాఖ కార్యదర్శి మీనా, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొన్నారు.

నదులను పునరుజ్జీవింజేసి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నదులు రక్షణకు సద్గురు జగ్గీవాసుదేవ్ తీసుకున్న కార్యక్రమానికి తమ మద్దతు, సహకారం ఉంటాయని ప్రకటించారు. నదుల పునరుజ్జీవానికి ఆంధ్రప్రదేశ్ ను ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సభాముఖంగా ప్రకటించారు. ఆర్ధికంగా సహాయం కావాలన్నా ఇస్తామని, నదుల చుట్టుపక్కల వనాలు పెంచడానికి సిద్ధమేనని, నదుల పునరుజ్జీవానికి ప్రపంచంలో అనుసరించిన ఉత్తమ పద్ధతులను అనుసరిస్తామని తెలిపారు. నదుల రక్షణ విధానానికి శ్రీకారం చుట్టే రాష్ట్రం తమదే అవుతుందని, విధాన పత్ర రూపకల్పనకు తమ రాష్ట్రమే మొదటిది అవుతుందని అన్నారు. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో జగ్గీవాసుదేవ్ ప్రారంభించిన నదీ రక్షణ యాత్ర బుధవారం విజయవాడ చేరుకుంది. ఈ సందర్భంగా విజయవాడ పి.బి. సిద్ధార్ధ కళాశాల ప్రాంగణంలో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

నేడు తాను ఇద్దరు ప్రముఖులతో వేదిక పంచుకుంటున్నానని, ఒకరు జలసంరక్షణ ఉద్యమ స్ఫూర్తిదాత రాజేంద్రసింగ్, అని, రెండో వ్యక్తి సద్గురు జగ్గీవాసుదేవ్ అని అభివర్ణించారు. తాను 1995 సంవత్సరం, ఆ సమయంలో నదుల పునరుజ్జీవానికి జలసంరక్షణకు స్ఫూర్తినిస్తున్న రాజేంద్రసింగ్ తో కలసి పనిచేశామని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. స్వర్ణముఖి నదిని పునరుజ్జీవింపజేయడానికి చేసిన కృషిని గుర్తు చేశారు. జగ్గీ వాసుదేవ్ దేశానికి అవసరమైన మానవీయకోణం, మంచి సంకల్పంతో నదుల రక్షణ యాత్ర చేపట్టారని చంద్రబాబు ప్రశంసించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నదులకు కృతజ్ఞత తెలిపేందుకు, మన బాధ్యత గుర్తు చేయడానికి అఖండ హారతి నిర్వహించామని, కృష్ణా పుష్కరాల సందర్భంలో పవిత్ర హారతి ప్రవేశపెట్టామన్నారు.

రాజేంద్రసింగ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ‘ మీరు నాకు మంచి మిత్రులు. వాజ్ పేయి ప్రభుత్వ కాలంలో నదుల అనుసంధానానికి మనం కలసి పనిచేశాం. ఈ దేశాన్ని పీడించేవి కరవులు, వరదలు రెండే రెండు. వీటిని నిరోధించాలంటే నదుల అనుసంధానమే పరిష్కారం అని నాడు ప్రధాని వాజపేయీకి వివరించగా ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేడు కేంద్రమంత్రిగా ఉన్నసురేష్ ప్రభు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ వేయడానికి నిర్ణయించారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నదుల అనుసంధానం, టాస్క్ ఫోర్సు, తదితర అంశాలను నిర్లక్ష్యం చేశాయి’ అని చంద్రబాబు అన్నారు.

ఈ సమస్య మీద ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తాను ఒక్కటే అడుగుతున్నానని, వారితో ఏకీభవిస్తున్నానని, నదుల అనుసంధానం తాత్కాలికమైనదేనని, కానీ నదుల పునరుజ్జీవనం శాశ్వతమైన పరిష్కారమేనని తెలిపారు. . నదులను రక్షించాలనడంలో జగ్గీవాసుదేవ్ సెంటిమెంట్ ను తాను నేను గౌరవిస్తానని చెబుతూ.అదే సమయంలో తక్షణపరిష్కారానికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

గోదావరి-కృష్ణా నదుల అనుసంధాన చేశామంటే ఇదొక చరిత్ర,. కృష్ణా డెల్టాని కాపాడుకోగలిగాం. రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో 20, మధ్య కోస్తాలో 18, దక్షిణకోస్తాలో 12, రాయలసీమలో 19 నదులున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. వీటిని పునరుజ్జీవింజేస్తే రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊపు వస్తుందన్నారు. దేశంలో జలసంరక్షణ ఉద్యమ మార్గదర్శి రాజేంద్ర సింగ్ ను ఉద్దేశించి ప్రత్యేకంగా చెబుతూ రాష్ట్రంలో 40,817 చెరువులు, 50,587 చెక్ డ్యాములు నిర్మించామి వివరించారు. 6 లక్షల 20 వేల సేద్యపుకుంటలు తవ్వామని చెప్పారు. భూగర్భంలోకి జలాలు చేరేలా 54,000 ఇంకుడుగుంతలను తవ్వించామని ముఖ్యమంత్రి వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 16 లక్షల గొట్టపుబావులు వేయించామని, అన్ని స్థాయులలో కలపి 1140 ఎత్తిపోతల పథకాలున్నాయని చెప్పారు. వీటన్నింటి ఉద్దేశం ప్రజలకు జీవనాధారాన్ని సుసంపన్నం చేయడమేనన్నారు. అది తమ నిబద్ధతకు నిదర్శనమని చంద్రబాబు వివరించారు.దేశంలో, రాష్ట్రంలో ఇప్పటికీ 65% మంది వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్నారని చెప్పారు.

ఇది దేశ జలసంరక్షణలో ఒక రాష్ట్రం తీసుకున్న చర్యలలో చాలా ఎక్కువ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడే ఒడిసిపట్టి సంరక్షించాలని చెప్పారు. మన రాష్ట్రంలో ఇప్పుడు భూగర్భ జలమట్టం 11.77 మీటర్లుందని, గడచిన మేలో 14.79 మీటర్లుండేదని చెప్పారు. రాయలసీమలో 18.5 మీటర్లుగా ఉందన్నారు. కోస్తాంధ్రలో 8.78 మీటర్లుందని వివరించారు. మూడు మీటర్లలోపే నీరు లభించే ప్రాంతం 21% ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 8 మీటర్లలోతులో లభించే నీరున్న ప్రాంతం 28%, అలాగే 51% 8 మీటర్లకంటే పైన ఉండే అవకాశం వుందని గణాంకాలను ముఖ్యమంత్రి వివరించారు.

వ్యవసాయదారులు కూడా ప్రాంతాలకు అనుగుణంగా పంటల మార్పిడి విధానం పాటించాలని, నీరు తక్కువగా అవసరమయ్యే తోటపంటలవైపు మళ్లాలని, వియత్నాం దేశంలో రైతులు వరి పంట నుంచి ఉద్యానపంటల సాగుకు వెళ్లి 20 రెట్లు అధికాదాయం సాధించిన అంశాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాల భూమి ఉందని, కోటి ఎకరాల్లో పండ్ల తోటలుండాలని, మరో కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఉండాలని అన్నారు.
జల సంరక్షణ ఎంత ముఖ్యమో, జలనిర్వహణ కూడా అంతే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. జగ్గీవాసుదేవ్ 16 రాష్ట్రాలలో 4 వేల కి.మీ మేర యాత్ర చేపట్టారని, ఇదెంతో స్ఫూర్తినిచ్చే యాత్ర అని, ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సద్గురు జగ్గీవాసుదేవ్ ‘అందరికీ వందనములు’ అంటూ తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. సాధారణంగా తాను ఎవరినీ పొగడనని, భగవంతుని దేశంగా పిలిచే కేరళను సందర్శించానని, అక్కడ పచ్చదనం, జలవనరులను అనుసరించే భగవంతుని దేశం అంటున్నారని, చెన్నయ్ తర్వాత, అమ్మో విజయవాడ వెళ్తున్నామా, అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది అనుకున్నామని, ఆంధ్రకు వచ్చినప్పడు కొంచెం వేడి ఉన్నప్పటకీ, ఆహ్లాదంగా ఉందని, ఇక్కడా జలవనరులు అనేకం కన్పించాయని, జాతీయ రహదారికి ఇరుపక్కలా పచ్చగా ఉందని. మధ్యలో పుష్పాల మొక్కలతో వర్ణశోభితంగా ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో 50% పచ్చదనం తీసుకురావటం తమ ధ్యేయమని చెప్పారని, ఇవాళ చంద్రబాబు చేసింది దేశమంతా చేయాల్సి ఉందని కొనియాడారు.

Advertisements

Latest Articles

Most Read