సచివాలయంలో గురువారం సాయంత్రం, ఆంధ్రా వంటకాలకు ప్రాచుర్యం కల్పించడం కోసం రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో పర్యాటకశాఖ ఆంధ్రా వంటకాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచింది. గంటికుడుములు, చింతచిగురు పప్పు, ములగపువ్వు కూర, కాకరకాయ ఉల్లికారం, అరటిపువ్వు పెసరకారం, దంపుడు బియ్యం పలావు, వెదురుబొంగు చికెన్‌ బిరియానీ... ఇలా ఆంధ్రాలోని కమ్మని వంటకాలన్నీ ఒకేచోట కొలువయ్యాయి..

చంద్రబాబు అన్ని స్టాల్స్ దగ్గరకి వెళ్లారు... అన్ని వంటకాల గురించి శ్రద్దగా అడిగి తెలుసుకున్నారు... ఆయనకు తెలిసింది చెప్పారు... ఎదో మమ అనిపించి వెళ్ళిపోకుండా, అక్కడ ఉన్న ప్రతి ఐటమ్ టేస్ట్ చేశారు... అక్కడ ఉన్న వారికి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ వంటకం తీసుకుంటే మంచిది, ఎలా వండుకుని తింటే ఆరోగ్యం లాంటివి చెప్పి, చంద్రబాబులోని మరో యాంగిల్ చూపించారు...

మరి, నిన్న కాస్త ఎక్కువగా లాగించినందుకు, భువనేశ్వరి గారు, ఇవాళ చంద్రబాబు గారికి టిఫిన్ పెట్టారో లేదో...

2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 11.72 శాతం వృద్ధి రేటును నమోదుచేసింది. ఇది జాతీయ వృద్ధి రేటు కంటే రెట్టింపుగా ఉండటం విశేషం. జాతీయస్థాయిలో తొలి త్రైమాసిక వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది. గడచిన 3 మాసాలకు గాను దేశంలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, బీహార్, తెలంగాణా, మహారాష్ట్ర తొలి 5 రాష్ట్రాలలో చోటు సాధించాయి.

తొలి త్రైమాసికంలో ప్రాథమిక రంగంలో 27.60 శాతం, పరిశ్రమ రంగంలో 8.05 శాతం, సేవారంగంలో 8.67 శాతం వృద్ధి నమోదయ్యింది. 2011-12 ధరల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మూడు రంగాలలో కలిపి జీవీఏ రూ.1,19,652 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలలో రూ.23,374 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.34,599 కోట్లు, సేవారంగంలో రూ.61,679 కోట్లుగా ఉంది.

ప్రాథమిక రంగంలో ఆకట్టుకునే వృద్ధి నమోదు అవడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ప్రాథమిక రంగంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో అద్భుతమైన వృద్ధి రేటు కనిపించింది. వ్యవసాయ రంగంలో నమోదైన 27.60 శాతం వృద్ధి రేటులో మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ ప్రధాన భూమిక వహించాయి. మత్స్యశాఖ 42.09 శాతం, పశు సంవర్ధక శాఖ 14.69 శాతం వృద్ధిని కనబర్చాయి. పరిశ్రమ రంగంలో తొలి త్రైమాసికంలో 14.65 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 8.05 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యింది. వీటిలో ప్రధానంగా మైనింగ్, క్వారీయింగ్ పరిశ్రమల్లో 8.2 శాతం, తయారీ రంగంలో 8.83 శాతం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాలలో 11.94 శాతం, నిర్మాణ రంగంలో 5.67 శాతం, పరిశ్రమ రంగంలో 8.05 శాతం వృద్ధి నమోదయ్యింది.

సేవారంగంలో తొలి త్రైమాసికంలో 13.90 శాతం లక్ష్యంగా నిర్ధేశించుకోగా, 8.67 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇందులో ట్రేడ్, హెచ్ అండ్ ఆర్ రంగంలో 11.08 శాతం, రవాణా, నిల్వ రంగంలో 9.04 శాతం, ఆర్థిక సేవల్లో 9.54 శాతం, రియలెస్టేట్, నివాస రంగాలలో 5.3 శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో 8.16 శాతం, ఇతర సేవలలో 9.24 శాతం వృద్ధి నమోదయ్యింది.

ఇవీ లక్ష్యాలు..
జీవీఏలో 74 శాతం వాటాగా వున్న 9 రంగాలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించి తగు లక్ష్యాలను నిర్దేశించారు. పశు సంవర్థక శాఖలో రూ.72వేల కోట్లు, తయారీరంగంలో రూ.67 వేల కోట్లు, ఉద్యాన శాఖలో రూ.62 వేల కోట్లు, నిర్మాణ రంగంలో రూ.62 వేల కోట్లు, వర్తకం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్ల రంగంలో రూ.61 వేల కోట్లు, మత్స్య, సముద్ర ఉత్పత్తుల రంగంలో రూ.60 వేల కోట్లు, రవాణ, నిల్వ రంగంలో రూ.60 వేల కోట్లు, వ్యవసాయ రంగంలో రూ.56 వేల కోట్లు, రియల్ ఎస్టేట్, నివాస రంగాలలో రూ.71 వేల కోట్లు చొప్పున జీవీఏ సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.

జక్కంపూడిలో జెట్ సిటీ
కృష్ణాజిల్లా జక్కంపూడిలో జెట్ సిటీ పేరుతో ఆర్థిక నగరం ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీకారం చుట్టారు. 265 ఎకరాలలో నెలకొల్పుతున్న ఈ భారీ ప్రాజెక్టులో ఆర్థిక కార్యకలాపాల కోసం 2.5 మిలియన్ చదరపు అడుగులు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం 2 మిలియన్ చదరపు అడుగుల మేర నిర్మాణాలు జరుపుతారు. ఇందులో 15 వేల నివాస గృహాలు రానున్నాయి. 22 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది.
మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా పబ్లిక్ సెక్టారు నుంచి రూ.3 వేల కోట్లు, ప్రైవేట్ సెక్టారు నుంచి రూ.10 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. దీంతోపాటు 250 ఎకరాలలో ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ సిటీ, 215 ఎకరాలలో అపెరల్ సిటీలతో పాటు 980 ఎకరాలలో మరో 6 పొటెన్షియల్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు.

తలసరి ఆదాయంలో 6 వ స్థానం
2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో తలసరి ఆదాయం రూ.1,22,376. 2016-17లో దేశంలో తలసరి ఆదాయం రూ.1,03,219. గత ఏడాదితో పోల్చితే తలసరి ఆదాయం 13,1 శాతం వృద్ధితో రూ.14,214 పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా హర్యానా (రూ.1,80,174) నిలిచింది.

పోలవరం ప్రాజెక్ట్ ఒక మిషన్ గా తీసుకుని, ప్రతి సోమవారం సమీక్ష చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది నాటికి పోలవరం నీటిని విడుదల చేయాలని భావిస్తున్న చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మొదటి నుంచి పోలవరం పనుల్లో జాప్యం వహిస్తూ వస్తున్న, ప్రధాన కాంట్రాక్ట్‌ సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌కు నోటీసులు ఇచ్చింది. ట్రాన్‌స్ట్రాయ్‌కి 60-సి కింద నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. న్యాయ పరమైన చిక్కులు కూడా రాకుండా, వేరే సంస్థలకు పనులు అప్పగించటానికి మార్గం సుగుమం అయ్యింది. ట్రాన్‌స్ట్రాయ్‌ చేయలేని పనులను వేరే సంస్థలకు పనులు అప్పగించడం వల్ల నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టు పూర్తికి మార్గం సుగమమం అవుతుంది.

ఇప్పటికే L&T, Bauer, Putzmeister,Triveni Engineering లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పోలవరంలో పని చేస్తున్నాయి. ట్రాన్‌స్ట్రాయ్‌ ని తీసివెయ్యటంతో, ఇప్పుడు మేఘ ఇంజనీరింగ్ కు ఆ పనులు అప్పచెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే మేఘా కు రికార్డు టైంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి పూర్తి చేసిన ట్రాక్ రికార్డు ఉండటంతో, ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ త్వరతిగతిన పూర్తి చెయ్యటానికి, మేఘా వైపు మొగ్గు చూపుతుంది...

క్రికెట్, టెన్నిస్ లాంటి క్రీడాకారులేనా, ప్రభుత్వాలకి వేరే ఆటలు, వాళ్ళ ప్రతిభలు కనపడవా అనే వారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అతీతం అని తెలుసుకోవాలి... 10 ఏళ్ళ బాలుడు స్కేటింగ్ లో వరల్డ్ రికార్డు సృష్టిస్తే ప్రోత్సహించారు... అర్చరీలో ప్రతిభ చూపించన వారిని ప్రోత్సహించారు... ఇప్పుడు కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకా లు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులని ప్రోత్సహించారు...

గుంటూరుకు చెందిన రాగాల వెంకట రాహుల్‌, వరుణ్‌తో పాటు, విజయనగరంకు చెందిన మహిళా వెయిట్‌లిఫ్టర్‌ మత్స సంతోషి, కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. వీరు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసారు...

ఈ సందర్భంగా చంద్రబాబు.. రాహుల్‌కు రూ. 15 లక్షలు, వరుణ్‌కు రూ. 10 లక్షలు, సంతోషికి రూ. 10 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు. వారికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాహుల్‌ తండ్రికి 2 ఎకరాల పొలం ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. రాహుల్‌ కోచ్‌ మాణిక్యాలరావుకు కూడా రూ. 5 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు...

కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాలు సాధించినా ఎవరూ పట్టించుకోలేదని, చంద్రబాబు మమ్మల్ని గుర్తించి, సన్మానించి, మాకు గుర్తింపు ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటామని, రాష్ట్రానికి మరిన్ని పతకాలు తెచ్చి పెడతామన్నారు...

Advertisements

Latest Articles

Most Read