తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాధిగా మారిన అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన చిన్నారి లక్ష్మీ ప్రసన్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాసటగా నిలిచారు. తాడిపత్రిలో నివాసం ఉండే రామసుబ్బారెడ్డి, జులై 4వ తేదీ తెల్లవారు జామున 4.౩0 గంటల ప్రాంతంలో భార్య సులోచనాదేవిని అతిక్రూరంగా చంపి ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు ప్రత్యూష (21), సాయిప్రతిభ(19)లపై సుత్తితో దాడిచేసి హతమార్చాడు. ఆ తర్వాత ఆయన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

చెడువ్యసనాలకు బానిసై అప్పలు చేసి, ఆ అప్పలు తీర్చేందుకు తన పేరు పై ఉన్న వ్యవసాయ భూములను విక్రయించేందుకు ప్రయత్నించాడు. ఇందుకు ఆయన భార్య అడ్డు తగిలారని ముగ్గురు కుమార్తెల వివాహాలు ఎలా చేస్తారని ప్రశ్నించడంతో ఉద్రేకం పెంచుకున్న రామసుబ్బారెడ్డి ఒక పథకం ప్రకారం భార్యా ఇద్దరు కుమార్తెలను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని కనగనపల్లి మండలం ముక్తాపురం గ్రామంలో నిర్వహించిన రైతు కృతజ్ఞతా సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సభకు రామసుబ్బారెడ్డి కుమార్తె లక్ష్మీప్రసన్న హాజరై తన తండ్రి తనను అనాధ చేశారని, తల్లితో పాటు ఇద్దరు చెల్లెలను చంపి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె సీఎంను కలిసి విన్నవించుకున్నారు. లక్ష్మీప్రసన్నను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆమెకు వివాహం చేసే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదని అప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం లక్ష్మీప్రసన్నపేరుపై రూ.20 లక్షలను ఫిక్షెడ్ డిపాజిట్ చేస్తుందని ప్రకటించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్ష్మీప్రసన్నపేరు పై ఈ డిపాజిట్ చేయాలని సభావేదిక పై ఉన్న జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో లక్ష్మీప్రసన్నపేరుతో గురువారం ఫిక్షెడ్ డిపాజిట్ ను బ్యాంకుద్వారా తయారు చేయించి ఆమెకు అందజేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ కార్యాలయాలు ఆధునీకరించ బడ్డాయి అంటే ప్రజా సేవలు సులభతరం కాబడ్డాయి అని అర్ధం...

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. 150 ఏళ్లకు గుర్తుగా భవనం ఆవరణంలో ఏర్పాటు చేసిన స్మారక చిహ్నాన్ని ఆయన ఆవిష్కరించారు.

పక్కన ఏర్పాటు చేసిన నూతన భవన శిలాఫలకం, మున్సిపల్ ఆవరణం బయట ఉన్న విద్యుత్తు ఉప కేంద్రం మార్పు చేసేందుకు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అక్కడ నుంచి నేరుగా నూతన భవనంలోకి ప్రవేశించారు.

వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ముఖ్యమంత్రిని నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు స్వాగతం పలికారు. లోపలకు వెళ్లగానే నేరుగా పై అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్రూంను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూం ఆవశ్యకతను కమిషనర్ విజయ్రామరాజు వివరించారు.

నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు, పురపాలకసంస్థ చేపట్టే పనులు, చెత్త సేకరణ, ఇతర అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే మేయర్ ఛాంబర్ను పరిశీలించారు. చివరిగా కింది అంతస్తులో ఏర్పాటు చేసిన బుధుడి విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నూతన భవనాన్ని విద్యుత్తు దీపాలతో సుందరంగా తీర్చి దిద్దారు. దారిపొడవునా విద్యుత్తు దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అలాగే నగర జిల్లా పోలీస్ నూతన కార్యాలయ భవన సముదాయాన్ని , సిఐడి ప్రాంతీయ నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు.

A2 విజయసాయి రెడ్డి బాటలోనే, A1 జగన్ పయనిస్తున్నారు... మొన్న A2 విజయసాయి రెడ్డి, నాకు జగన్ కేసులతో సంబంధం లేదు అని డిశ్చార్జ్‌ పిటిషన్‌ వేస్తే, నిన్న A1 జగన్ కూడా నాకు నా అక్రమాస్తులతో సంబంధం లేదు అని కేసులు నుంచి తప్పించమని A1 జగన్ కూడా డిశ్చార్జ్‌ పిటిషన్‌ వేశారు...

అయితే, దీనికి గెట్టి కౌంటర్ ఇచ్చింది సిబిఐ... జగన్ ముమ్మాటకి పెద్ద మోసగాడే అనే కోర్ట్ కి తేల్చి చెప్పింది... జగతిలో పెట్టుబడులు కోసం, తన పెట్టుబడిదారులను మోసం చేశారని సీబీఐ పేర్కొంది. పత్రిక ప్రారంభించిన ఐదారేళ్లు నష్టాలు తప్పవన్న సంగతి తెలిసి కూడా.. జగన్ ఆ విషయాన్ని పెట్టుబడిదారులకు చెప్పకుండ మోసం చేశాడు అని కోర్ట్ కి చెప్పింది.

జగన్‌ ప్రోద్బలంతో ఆడిటర్‌ విజయసాయిరెడ్డి పాత తేదీలతో జగతి పబ్లికేషన్‌ విలువను పెంచి డెలాయిట్‌ సంస్థ నుంచి నివేదిక తెప్పించారని తెలిపింది. జగన్ చైర్మన్ గా ఉన్న సమయంలో.. కంపెనీతో సంబంధం లేని వ్యక్తుల నుంచి పెట్టుబడులు స్వీకరించారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్దంగా జగతి పబ్లికేషన్స్ షేర్ ధరను ఆయన పెంచారని సీబీఐ చెప్పింది.

జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయాలని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్ శుక్రవారం ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరగనుంది.

అదో బృహత్తర ప్రాజెక్టు. సీమను సస్యశ్యామలం చేసి నాలుగు జిల్లాల ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఉద్దేశించిన పథకం. 33 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకుంది ఈ ప్రాజెక్టే హంద్రీనీవా. కర్నూల్ జిల్లాలోని ముచ్చమర్రి గ్రామం వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతి మొదటి దశ రెండవ ప్యాకేజీలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జాతికి ఆంకితం చేయనున్నారు.

దీనివల్ల రాయలసీమలోని కర్నూల్, కడప, చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల ప్రజలకు మంచినీరు అందుతుంది. ముచ్చుమర్రి నుంచి హంద్రీ-నీవా కాల్వకు 4 పంపుల ద్వారా 1320 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 3 పంపుల నుంచి 750 క్యూసెక్కులు శుక్రవారం నుంచి ఎత్తిపోయనున్నారు.

రాయలసీమకు పట్టిసీమగా భావించే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రూ.326 కోట్లతో చేపట్టారు. శ్రీశైలం జలాశయం 790 అడుగుల మట్టం నుంచి నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అప్రోచ్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తికాకపోవడంతో 809 అడుగుల వద్ద నీటిని తీసుకోవలసి ఉంటుంది. కేసీ కాల్వకు 4 పంపుల ద్వారా 1,000 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 12 పంపుల ద్వారా 3,960 క్యూసెక్కులు తీసుకుంటారు..

మేఘా సంస్థ ప్రభుత్వం ఇచ్చిన ఎత్తిపోతలను సవాల్ గా తీసుకుని నిర్దేశించిన గడువుకన్నా ముందే పూర్తిచేసి రికారుల్లోకి ఎక్కింది.

Advertisements

Latest Articles

Most Read