నవ్యాంధ్రలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకు, ప్రమ్కుఖ బాలీవుడ్ దర్శకుడు ముందుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ మంగళవారం మధ్యాహ్నం అమరావతిలో కలిశారు.

ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రితో చెప్పారు.

ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ పరంగా సహకారం అందించాలని చంద్రబాబును సుభాష్ ఘాయ్ కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ, ఏ రకమైన సహకారం అయినా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మరోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే 1500 పెన్షన్ ఇస్తున్న వికలాంగులకి, ఉచితంగా హోండా యాక్టివా ఇవ్వనున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మూడు చక్రాల బండి వేసుకుని తిరుగుతున్న వారికి, మూడు చక్రాల బండి స్థానంలో హోండా యాక్టివా మోటర్‌ సైకిళ్లనుఇవ్వనున్నారు.

తొలివిడతగా 2500 మందికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వికలాంగులకి వీలు పడేలా వీటి డిజైన్ ఉంటుంది. ఈ వాహనం ఖరీదు రూ.70వేల వరకు ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దీనికోసం రూ.20కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఇవి తీసుకోవాలి అంటే, దానికి ఉండాల్సిన అర్హతలు, నిబంధనలు ఖరారు చేయన్నున్నారు. వారిని ఎంపిక చేసేందుకు త్వరలోనే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు. దానిద్వారా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగైదు రోజుల్లో అధికార ప్రకటన వెలువడనుంది.
అలాగే అంధులకు కూడా ప్రత్యేక ల్యాప్‌ట్యా్‌పలు, కంప్యూటర్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. కీబోర్డుపై చేతితో టైప్‌ చేసే అక్షరాల శబ్దం వినిపించేలా వారికి శిక్షణ ఇచ్చిన అనంతరం వీటిని అందిస్తారు. అలాగే, మూగ, చెవిటివారికి సెల్‌ఫోన్లు ఇవ్వనున్నారు. వీడియో కాలింగ్‌ ద్వారా సంజ్ఞలతో మాట్లాడుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.

సమాజంలో మేమేమి తాక్కువ కాదు అని వీరు అనుకోకుండా, వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ, చిన్నచిన్న పనులు, వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశం...

ఒక పక్క, కాకినాడ ఎలక్షన్ చిచ్చు వల్ల, జగన్ కు, విజయసాయి రెడ్డికి చెడింది అని వార్తలు వస్తున్న టైంలో, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్‌ పిటిషన్‌ను హాట్ టాపిక్ అయ్యింది.

జగన్‌ అక్రమాస్తుల కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ విజయసాయిరెడ్డి, డిశ్చార్జ్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.

దీనికి సీబీఐ గెట్టి కౌంటర్ ఇచ్చింది... జగన్ కి ఆడిటర్‌ అయిన విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ పెట్టుబడిదారులను బెదిరించేవారు అని, దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి అని కోర్ట్ కి చెప్పింది, సిబిఐ.. క్విడ్‌ ప్రో కో కుట్ర కేసులో జగన్‌తో విజయసాయిరెడ్డి కుమ్మక్కయ్యారని పేర్కొంది..

ఈ పిటిషన్‌ను ఈ నెల 8న ప్రత్యేక కోర్టు విచారించనుంది...

కేంద్ర మంత్రివర్గంలో జరిగిన మార్పులు రాష్ట్ర ప్రయోజనాలకు సానుకూలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం, అంతర్గత జల రవాణా మార్గాల ఏర్పాటు వంటి కీలక అంశాలకు ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలు వుంటే త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర జల వనరులు, నదుల అభివృద్ధి, నౌకాయానం శాఖలను, రహదారులు, రవాణాశాఖకు అనుసంధానం చేసి నితిన్ గడ్కరీకి అప్పగించడం అనుకూలాంశమని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఆయనతో నిన్ననే మాట్లాడానని ముఖ్యమంత్రి సోమవారం రాత్రి పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులపై జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. క్షేత్రస్థాయిలో పోలవరం పనుల పరిశీలన కోసం అవసరమైతే కేంద్ర మంత్రిని రాష్ట్రానికి ఆహ్వానిద్దామని అన్నారు.

ఇప్పటి వరకు 27 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు పనులలో పాలుపంచుకుంటున్న నిర్మాణ సంస్థ ‘త్రివేణి’ అతి పెద్ద యంత్రాన్ని వినియోగంలోకి తెచ్చిందని, 30 క్యూబిక్ మీటర్ల పని సామర్ధ్యం గల ఈ యంత్ర సహాయంతో రోజుకు 9 వేల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. ఈ రాత్రి నుంచి రాత్రింబవళ్లూ ఎర్త్ వర్క్ చేస్తున్నామని, అలా చేయడం ద్వారా 18 వేల క్యూబిక్ మీటర్ల మేర పని పూర్తిచేయగలమని తెలిపారు. స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు ఈనెలాఖరులోగా పూర్తిచేస్తామని వెల్లడించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెండు పంపులు పూర్తిస్థాయిలో పనిచేయిస్తున్నామని అధికారులు చెప్పారు. మూడవ పంపును బిగింపు పనులు పూర్తి చేశామని, 4 వ పంపును సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్ణిత సమయంలోగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులు పూర్తికాకపోవడానికి మోటార్లు అందించాల్సిన బీహెచ్ఈఎల్ సంస్థ నిర్లక్ష్య వైఖరే కారణమని చెప్పారు. రేడియల్ గేట్లు, ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం వంటి అన్ని పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయాల్సివుందని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

ఈనెల 7, 8, 9 తేదీలలో ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు విస్తృతంగా కురియవచ్చని షార్ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాయలసీమ జిల్లాలలో వచ్చేవారం 30 నుంచి 40 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావచ్చునని చెప్పారు. వచ్చే పది రోజులలో తుంగభద్రకు 20 టీఎంసీల నీరు చేరవచ్చునని అంచనా వేస్తున్నట్టు అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఉన్న జలవనరులను వాస్తవ సమయంలో వివరించేందుకు www.apwrims.ap.gov.in పేరిట వెబ్ పోర్టల్‌ను సిద్ధం చేశామని అధికారులు చెప్పారు.

ఈ జియో పోర్టల్ ఇంటరాక్టీవ్ మ్యాప్‌ను అందిస్తుందని, సూక్ష్మ, మధ్య తరహా సాగునీటి వనరులు సహా రాష్ట్రంలో వున్న అన్ని సాగునీటీ వనరుల సమగ్ర వివరాలు అందుబాటులో వుంటాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 923.81 టీఎంసీల మేర జలవనరుల లభ్యత ఉన్నట్టు చెప్పారు. ఈనెల 6, 7, 8 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక పండగ వాతావరణంలో ప్రజల మధ్య ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తొలిరోజు విశాఖ జిల్లా శారదనది, తోటపల్లి రిజర్వాయర్ దగ్గర జరిగే కార్యక్రమాలలో తాను పాల్గొంటున్నానన్నారు.

Advertisements

Latest Articles

Most Read