జగన్ వ్యవహార శైలి నచ్చక, తన సొంత మనిషే ఎదురు తిరుగుతున్నాడా ? అన్నిట్లో A1, A2 గా ఉండే జగన్, విజయసాయి మధ్య గొడవలు జరుగుతున్నాయా ? కాకినాడ ఫలితాలు తరువాత అవి తీవ్ర స్థాయికి చేరి, జగన్ అక్రమాస్తుల కేసులో, విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారే దాకా వెళ్ళాయా ? అవును అనే అంటున్నాయి లోటస్ పాండ్ వర్గాలు.
కాకినాడ ఎన్నికల ప్రచారం మొత్తం, విజయసాయి రెడ్డి దగ్గర ఉండి చేశారు.. తీరా ఫలితాలు చుస్తే నంద్యాల కంటే ఘోరంగా వచ్చాయి.. ఫలితాలు వచ్చిన తరువాత, జగన్, విజయసాయి రెడ్డిని పిలిచి కాకినాడ ఎన్నికకు బాధ్యత తీసుకున్నారు కాబట్టి, ఈ రిజల్ట్ కి కారణం ఏంటో రిపోర్ట్ ఇవ్వమన్నారని, దాంతో ఒళ్ళు మండిన విజయసాయి రిపోర్ట్ దాక ఎందుకు, ఈ రిజుల్ట్ ఇలా రావటానికి, మీ వ్యవహార శైలే కారణం అన్నారు అని సమాచారం.
ఈ సమాధానం విని, షాక్ అయినా, తేరుకుని, కనీసం మీడియా ముందుకు వెళ్లి మాట్లాడమన్నారు అంట జగన్. దీంతో విజయసాయి రివర్స్ అయ్యి, నాకేమి సంబంధం, అధినేత మీరు, మీరు వెళ్లి నంద్యాలలో చెప్పినట్టు, కొట్టాడు, కొట్టించుకున్నాం అని చెప్పండి అనటంతో, సహనం కోల్పోయిన జగన్, విజయసాయి రెడ్డిని అనరాని మాటలు అన్నారని సమాచారం. దీంతో విజయసాయి రెడ్డి, నీ కోసం కేసుల్లో ఇరుకున్నాను, తెలివి ఉండి కూడా నీ వల్ల దొంగోడిగా, అన్నిట్లో A2గా ముద్ర వేసుకుని తిరుగుతున్నాను, పార్టీని చూసి, నిన్ను చూసి ప్రజలు ఇచ్చిన తీర్పు, నా మీదకు రుద్దాలని చూస్తావా, అదేమిటి అంటే నన్ను తిడతావా అంటూ ఆవేదన చెంది... నిన్ను భరించటం చాలా కష్టం, అవసరమైతే అన్ని కేసుల్లో అప్రూవర్ గా మారిపోతాను అని చెప్పి, అక్కడ నుంచి వెళ్ళిపోయారు...
అందుకే నిన్న వైఎస్ వర్ధంతి పులివెందులలో ఘనంగా జరిగినా ఎక్కడా కనపడలేదు, ఇవాళ కేంద్ర కేబినేట్ విస్తరణ జరిగినా ఎక్కడ కనపడలేదు... లేకపోతే ఈ పాటికే అందరి కొత్త మంత్రులని కలిసి, ఒక బోకే ఇచ్చి, ఫోటో ఫేస్బుక్ లో పెట్టేవారు... మొత్తానికి, కాకినాడ ఎన్నికల ఫలితాలు తరువాత, జగన్ కు, విజయసాయి కి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, అవి ఎటు దారి తీస్తాయో అని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.