ఇంద్రకీలాద్రి పై వెల‌సిన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గమ్మ ఆల‌యంలో అంతరాలయం టిక్కెట్‌ ధరలను తగ్గిస్తూ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ.300 టికెట్‌ ధరను రూ.150కు, రూ.100 టికెట్‌ ధరను రూ.50కు తగ్గించాల‌ని దుర్గగుడి పాలక మండలి తీర్మానం చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే తగ్గించిన ధరలు అమలులోకి వస్తాయని ఆలయ ఛైర్మన్ య‌ల‌మంచిలి గౌరంగబాబు తెలిపారు.

సోమ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ పాత‌బ‌స్తీలోని మాడపాటి వసతిగృహంలో జరిగిన పాల‌క‌మండ‌లి సమావేశంలో ఆలయ ఈవో సూర్యకుమారి, పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబుతో పాటు సభ్యులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా సమావేశంలో ప‌లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇంద్రకీలాద్రి పై దసరా నవరాత్రుల ఏర్పాట్లు, గుడిపై జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆలయంలో కొత్త పూజల ప్రారంభం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నట్టు ఈవో సూర్యకుమారి తెలిపారు. ఉత్సవాల సమయంలో ఘాట్‌ రోడ్డు ద్వారానే భక్తులను అనుమతిస్తామన్నారు. రెండు కొత్త పూజలకు పాలకమండలి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

ఈ సమావేశ ఏజెండాలో మొత్తం 47 ప్రతిపాదనలు రాగా వాటిలో 45 ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని వివ‌రించారు.

తమిళనాడు అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్ పదవి నుంచి బహిష్కరణకు గురైన దినకరన్‌‌కు సోమవారం సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. అక్రమ లావాదేవీలు నిర్వహించారంటూ ఫెరా చట్టం కింద 20 యేళ్ల క్రితం దినకరన్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణ మూడు నెలల్లో పూర్తి చేయాలని మద్రాసు హైకోర్టు, క్రింది కోర్ట్ ను ఆదేశించింది.

హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దినకరన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు మరికొంత సమయం కావాలని కోరారు. దీనికి సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 ఏళ్ళు అయినా ఇంకా టైం కావాలా ? ఇలాంటి కేసులతో వస్తే, మీ లాంటి వారికి రూ.10 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ఇప్పుడు ఈ కేసు తీర్పు విన్న మన జగన్ దిమ్మ తిరిగింది. ఒక పక్క కోర్ట్ లు, ఇలాంటి కేసులను త్వరతిగతిన పూర్తి చెయ్యాలని తీర్పు ఇస్తున్నాయి. మరో పక్క ఇప్పటికే జగన్ చాలా సార్లు కోర్ట్ లకు వెళ్లి విచారణ లేట్ అయ్యేలా చూస్తున్నారు అని, సిబిఐ కూడా చెప్తుంది. ఇప్పుడు జగన్ ఇలాంటి పిటిషన్ వేస్తే, సుప్రీమ్ చెప్పినట్టు రూ.10 లక్షలు జరిమానా విధించి పంపుతుంది. జరిమానా మనోడికి పెద్ద లెక్క కాదు కాని, కేసులు కనుక ఫాస్ట్ గా మూవ్ అయితే, ఆ పరిస్థితి తలుచుకుంటేనే లోటస్ పాండ్ లో ప్రకంపనలు వస్తున్నాయి.

రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది... ప్రజలు మాకు కుల రాజకీయాలు వద్దు అని వరుస తీర్పులు ఇచ్చినా, రాష్ట్రంలోని ఒక పార్టీకి సిగ్గు రాలేదు... మరో సారి అలాంటి ప్రయత్నమే జరిగింది... ముఖ్యంగా రాజధాని ప్రాంతం అయిన విజయవాడలో అల్లర్లు సృష్టించాలి అనే దుర్మార్గపు ఆలోచనతో జరిగిన నాటకమే విజయవాడ ఎపిసోడ్..

ఒక సైకో మనస్తత్వం ఉన్నవాడు, తనకు ఎదురు తిరిగితే సహించ లేడు... ఎదురు తిరిగిన వారి అంతు చూసే దాకా నిద్రపోడు... నంద్యాలలో బలిజలు, కాకినాడలో కాపులు ఒకే పార్టీకి సపోర్ట్ ఇవ్వటంతో, తట్టుకోలేని ఆ నేత, కులాల మధ్య గొడవలు పెట్టి, ఆ కులం వారికి చెడ్డ పేరు తీసుకు రావాలి అని చేసిన ప్రయత్నం ఇది.

తన భార్య తరుపు సొంత బంధువు చేతే, ఆ కులాన్ని తిట్టించి, తరువాత తనే పార్టీ నుండి సస్పెండ్ చేసి నాటకం రక్తి కట్టించారు... తన రాజకీయ అవసరానికి ఆ కులస్తులను పావులా వాడుకుంటున్నాడు... తన రౌడీ మూకాలతో, రైళ్ళు తగలబెట్టించి, ఆ కులం మీద అపవాదు వేసాడు... ఇప్పుడు ఈ కొత్త నాటకం... ఇప్పటి వరకు ఆ సస్పెండ్ అయిన నేత స్పదించలేదు అంటే, అర్ధం ఏంటి ? నాటకం కాక ఇంకేంటి ?

అయినా ఇలాంటి నాయకులు తెలుసుకోవాల్సింది, కాలం మారింది... బెజవాడా మారింది... రాష్ట్రం కూడా మారింది... గొడవల కోసం, SRR కాలేజీ నుంచి, KBN కాలేజీ నుంచి, గుణదల నుంచి, కృష్ణలంక నుంచి వచ్చే బ్యాచులు ఎప్పుడో పోయాయి... ఇప్పుడు వీటికి దూరంగా చదువుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటూ ప్రసాంతమైన జీవితం కోరుకుంటున్నారు... కాని కొంత మంది DNA మారలా... జిల్లాలు మారొచ్చు, రాష్ట్రాలు విడిపోవచ్చు కానీ అదే పద్దతి... కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటం... రాజకీయ లక్ష్యాలను సాధించటం...

ఫైనల్ పాయింట్... ప్రజలు పిచ్చ వాళ్ళు కాదు...


వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో వంగవీటి రాధ, సొంత పార్టీ మీదే ఫైర్ అవుతున్నారు. అయితే, వంగవీటి రంగాపై తమ పార్టీ నేత పూనురు గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసిపి ఆదివారం ఖండించింది. గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తూ కొత్త డ్రామాకి తెర తీసింది.

కాని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన వంగవీటి రాధ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నట్టే కనిపిస్తుంది. ఒక పక్క గౌతంరెడ్డిని తిడుతూనే, సొంత పార్టీని కూడా ఏకి పడేశాడు రాధ. ఒక మనిషి చనిపోయిన తరువాత, ఇంత దారుణంగా ఎవరన్నా మాట్లాడుతారా ? మా పార్టీ ఇలాంటి వెధవలని ప్రోత్సహించింది కాబట్టే, ఈ రోజు పార్టీ పరిస్థితి ఇలా ఉంది అంటూ, వైసీపీ పార్టీని ఏకి పడేశాడు రాధ.

మరో పక్క, రత్న కుమారి, రాధ అరెస్ట్ గురించి, నిన్నటి నుంచి జగన్ బ్యాచ్ విష ప్రచారం చేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు కాపుల మీద కక్ష కట్టారు అని, విస్తృతంగా ప్రచారం చేసేంది. దీనికి కూడా రాధ సమాధానం చెప్తూ, ప్రభుత్వం మమ్మల్ని ఇలా అరెస్ట్ చెయ్యమంటుంది అని నేను అనుకోవట్లేదు, ప్రభుత్వానికి మా మీద కక్ష సాదించే అవసరం ఏముంది ? ఇదంతా పోలీసుల అత్యుత్సాహం అంటూ కొట్టి పారేసాడు రాధ...

రాధ చేసిన ఈ వ్యాఖ్యలతో, వైసిపి పార్టీలో గందరగోళం నెలకొంది. రాధ, జగన్ వ్యైఖరి మీద చాలా అసంతృప్తిగా ఉన్నాడు అనేది ఈ వ్యాఖ్యలతో అర్ధమవుతుంది అని, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని వైసిపి శ్రేణులు అనుకుంటున్నాయి.

Advertisements

Latest Articles

Most Read