రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక కార్ల తయారీ సంస్థ వస్తోంది. రాష్ట్రంలో అత్యాధునిక ‘ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌’ వాహనాలను తయారు చేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని జపాన్‌కు చెందిన టాయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ తయారీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అఖిటో తఛిబనతో పాటు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో టాయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ తయారీసంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తయారు చేయబోయే కార్ల మోడళ్లను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రదర్శించారు. ఈ సంస్థ టొయోటా మోటార్‌ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ.

‘ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌’ వాహనాల తయారీలో ఉపయోగించే ఆధునిక టెక్నాలజీ, యంత్ర సామాగ్రి, పరికరాలు, వాహనాలకు ఉపయోగించే మెటీరియల్‌, వాటి సామర్థ్యం, కాలపరిమితి తదితర కీలకమైన అంశాలపై అఖిటో తఛిబన తన ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ రూపంలో వివరించారు. ఈ వాహనాలు అటు ఇంధనంతోనూ ఇటు బ్యాటరీతోనూ రెండు విధాలుగా పని చేస్తాయని సంస్థ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది. ఈ వాహనాలు ఛార్జింగ్‌తో తక్కువ దూరం ప్రయాణించే విధంగానే కాకుండా, ఎంత దూరమైనా ఇంధనంతో ప్రయాణించే వీలుండటంతో పాటు ఎక్కడైనా ఛార్జింగ్‌ చేసుకునే సౌలభ్యం ఉండేలా రూపొందిస్తున్నట్లు వారు వెల్లడించారు.

అఖిటో తఛిబన బృందం వివరించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. కంపెనీ ప్రతిపా దనలు బాగున్నాయని, తక్షణమే పనులు ప్రారంభించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అఖిటో తఛిబనతో సీఎం మాట్లా డుతూ ‘మీకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం అందించడానికైనా సిద్ధంగానే ఉన్నామని, సంస్థ ఏర్పాటుకు అవసరమైన వనరులు సమకూర్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రపంచస్థాయిలో అమరావతిని ఒక మోడల్‌ రాజధానిగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నామని’ చెప్పారు. ప్రాజెక్టులు ఆలస్యం అయితే రాష్ట్ర భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం పడుతుందని, సంస్థలు నిర్ధేశించిన సమయంలోనే కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న సదుపాయాలపై ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే అవ కాశం కల్పించినందుకు వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఉట్టిపడేలా రూపొందించిన కార్యక్రమాలు రాజధాని అమరావతికి మరింత శోభను ఇస్తాయన్నారు.

మనం కొంత మంది రాజయకీయ నాయకుల గురించి చెప్పిన మాటలు వింటూ ఉంటాం.. నమ్ముకున్నోళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్తారు అని... నమ్ముకున్నోళ్ళ చేస్తే ఉపయోగం ఏమి ఉంటుంది, ప్రజల కోసం చెయ్యాలి కాని... చంద్రబాబు నమ్ముకున్నోళ్ళ కోసం ఏమి చేశారో కాని, ప్రజల కోసం చేసేది మట్టికి కనపడుతూనే ఉంటుంది. కాని ఈ సంఘటన మనకు ఇప్పటి వరకు తెలీదు...

ఇది ట్విట్టర్ వేదికగా, SVR మూర్తి అనే ఒక సామాన్యుడు ట్వీట్ చేసింది. చంద్రబాబు సామాన్య ప్రజల సమస్యలు ఎలా, ఎంత వేగంగా పరిష్కరిస్తారు అనేదానికి ఒక ఉదాహరణ.

నిన్న కాకినాడ విజయం తరువాత, ట్విట్టర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ, ఒక ట్వీట్ చేశారు. దానికి SVR మూర్తి అనే ఒక సామాన్యుడు స్పందిస్తూ, "నేను మీకు 1999 నుంచి అభిమానిగా మారిపోయాను. దానికి కారణం మన దేశం కోసం పోరాడుతున్న ఒక వీర సైనికుడు చెప్పిన విషయం. దక్షిణ్ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ లో, వెళ్తూ ఉండగా ఒక సైనికుడు కార్గిల్ యుద్ధానికి నాతొ పాటే ట్రైన్ లో ప్రయాణం చేశారు. అప్పుడు ఆయన మీ గురించి చెప్తూ, 25 పైసల పోస్ట్ కార్డు లో, మా వ్యవసాయ భూమి కొంత మంది రాజకీయ నాయకులు ఖబ్జా చేశారు అని రాసిన కొన్ని రోజులకే, మా నాన్న గారికి ఫోన్ చేసి, మీ భూమి నుంచి వారు వెళ్ళిపోయారు, ఈ భూమి మీదే అని అధికారులు చెప్పారు. 25 పైసల పోస్ట్ కార్డుతో, చంద్రబాబు చేసిన వండర్ ఇది" అని SVR మూర్తి ట్వీట్ చేశారు.

ఇది చంద్రబాబు గురించి మనకు తెలియని మరో కోణం... సమస్య ఉంది అని ఆయన దృష్టికి వెళ్తే, సమస్యను బట్టి వీలైనంత తొందరగా పరిష్కరిస్తారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ...

cbn 02092017 2

సోషల్ మీడియాలో జరుగుతున్న వికృత క్రీడ మీరు గమనించే ఉంటారు... రాజకీయంగా పబ్బం గడుపుకోవటానికి, యువతకు విష బీజాలు నాటి, కుల ఉన్మాదులగా తయారు చేస్తున్నారు. కులాలకి మేము వ్యతిరేకం అంటూ కలరింగ్ ఇస్తూనే, కుల జపం చేస్తూ ఉంటారు.

మా కులం చంద్రబాబు అంతు చూస్తుంది అంటాడు ఒకడు... చంద్రబాబు చచ్చే దాక, మా జాతి పండగలు చేసుకోడు అంటాడు ఇంకొకడు... చంద్రబాబు చేసిన పాపం ఏంటి అయ్యా అంటే అభివృద్ధి చెయ్యటం కాదు, పలానా కులంలో పుట్టటం... ఆ కులంలో పుట్టాడు కాబట్టి, చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంత చేసినా, మాకు మా కులమే గొప్ప అంటూ, కులం పేరు చెప్పి చంద్రబాబుని సాదిస్తున్నారు కొంత మంది.

వీరి పైత్యం ఏ స్థాయికి చేరింది అంటే, ఒక కులం పేరుతో ఫేక్ ఎకౌంటు తాయారు చేసి, ఇంకో కులం వాళ్ళని తిడతారు...ఇలా కులాల మధ్య వీరే గొడవలు పెడతారు. దీని కోసం, ఒక ప్రధాన పార్టీకి చెందిన పత్రిక/టీవీ ఆఫీస్ లో, ఒక ప్రత్యక విభాగం వారే నడుపుతున్నారు.

ఇలాంటి వారికి చెంప చెల్లు మనిపించే తీర్పు ఇచ్చారు నంద్యాల, కాకినాడ ప్రజలు.. అన్ని వర్గాలు ప్రజలు వన్ సైడ్ గా అభివృద్ధికి పట్టం కట్టారు... మా జీవితాలు ఎవరైతే బాగు చేస్తారు అని నమ్మరో, వారికే మద్దతు పలికారు... ఈ సోషల్ మీడియా కుల పిచ్చ గాళ్ళు తెలుసుకోవాల్సింది, చంద్రబాబు సామాజిక వర్గం ఈ రెండు చోట్ల, కనీసం 2 % కూడా లేదు...

ఈ రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి మాత్రమే... ఇది మూడ్ అఫ్ ది స్టేట్... ప్రాంతం, కులం, మతం ఏమి లేదు... ఉన్నదల్లా రాష్ట్రమే... ఈ క్లారిటీతో ఉన్న ప్రజలకి, అభివృద్ధి చేసే వాడు ఎవరనేదాని పై పూర్తి అవగాహన ఉంది.

సోషల్ మీడియాలో గుడ్డలు చించుకుంటున్న, కుల పిచ్చ గాళ్ళు ఎగురుతూనే ఉంటారు... సామాన్య జనం మాత్రం కులం వైపు చూడరు, చూడబోరు...

జగన్ నామస్మరణ పనికిరాడు అనుకున్నాడో ఏమో, బీహార్ బాబు మరో చచ్చు సలహాతో ముందుకు వచ్చారు... మూడున్నరేళ్ల క్రితం వరకూ క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి, తర్వాత పెద్దగా ప్రచారానికి నోచుకోని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మళ్లీ తెర పైకి తీసుకువచ్చేందుకు వైసీపీ కన్సల్లెంట్ ప్రశాంత్ కిశోర్ ప్లాన్ వేశారు. 9121091210కు మిసిడ్ కాల్ ఇచ్చి వైఎస్ కుటుంబంలో చేరమంటున్నారు... చేరగానే మీ సమస్యలు ఏవైనా చెప్తే తీర్చేస్తారు అంట... కాని ఇక్కడ ఒక షరతు... జగన్ సియం అయినాకే మీ సమస్య తీరుస్తారు... అప్పటి వరకు ప్రభుత్వంతో పోరాడటం లాంటి పనులు ఉండవు.. అన్న సియం అవ్వాలి, మీ సమస్య తీరాలి...

ఈ మిసిడ్ కాల్ కుటుంబంలో, రాష్ట్రం లోని కోటి మందికి వైసీపీని నేరుగా చేర్చే ప్రణాళికకు పదునుపెట్టినట్లు "పికె' వర్గాలు చెప్పాయి. వైఎస్ వర్ధంతి పురస్కరించుకుని పులివెందులలో జగన్ ఇది మొదలు పెట్టారు. మూడున్నరేళ్ల క్రితం వరకూ వైఎస్ పొటోను విపరీతంగా వినియోగించుకుని, ఆ సానుభూతి ఓట్లు దక్కించుకున్న వైసీపీ నాయకత్వం, ఎన్నికల తర్వాత కొద్ది నెలలకే ఆయన నామస్మరణ మానేసింది.

అయితే, నంద్యాల ఉప ఎన్నికలో దారుణ పరాభవం తర్వాత కంగుతిన్న జగన్, పార్టీకి దూరమవుతున్న ముస్లింలు, చీలిక వచ్చిన దళితులను ఎలా దరిచేర్చుకోవాలో సూచించాలని తన కన్సల్లెంట్ పీకేను కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సానుభూతి తప్ప, నీ మొఖం చూసి ఎవరూ ఓట్లు వెయ్యరు అని, మళ్లీ వైఎస్ ని వాడుకోవాలని పీకే సలహా ఇచ్చారు.

మిసిడ్ కాల్ చెయ్యకపోతే వదలరు అంట, శిక్షణ పొందిన నాలుగున్నర లక్షల మంది ప్రతి ఇలూ తట్టి ఆ కుటుంబ సభ్యులను వైఎస్ కుటుంబంలో చేర్చుకోవాలని ప్రణాళిక రూపొందించారు. సభ్యత్వ నమోదులో ప్రతి ఇంటి నుంచి ఒకరిని సభ్యులుగా చేర్పించాలని యోచిస్తున్నారు. ఈ విధంగా జగన్ను ప్రజలకు చేరువ చేయాలన్నదే ఈ ప్రణాళిక లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇంకెందుకు ఆలస్యం మిసిడ్ కాల్ ఇవ్వండి... ఆయన ఎప్పుడూ సియం అవుతారో, అసలు అవుతారో లేదో తెలీదు కాని, మీ సమస్య మట్టికి, ఆయన సియం అయ్యిన వెంటనే పరిష్కరిస్తారు అంట..... నమ్మండి....

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్, మళ్ళీ రెచ్చిపోయాడు... తన తండ్రి వర్ధంతి రోజు, తండ్రి గురించి చెప్పుకోకుండా, ఈ రోజు కూడా చంద్రబాబు మీద తిట్ల దండకమే. తండ్రి వయసు ఉన్న చంద్రబాబుని పట్టుకుని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తండ్రికి గౌరవం ఇస్తే కదా, తండ్రి లాంటి చంద్రబాబు గౌరవం ఇచ్చేది అంటారా... అదీ నిజమే...

జగన్ మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే, ఈ పిచ్చి వాగుడుకి, నంద్యాల ప్రజలు లాచి లాచి కొట్టారు, కాకినాడ ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసారు. అయినా జగన్ మారలేదు సరికదా ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు.

తాజాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని పురస్కరించుకొని పులివెందులలో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని అన్నారు. దీంతో అక్కడ కార్యకర్తలు మరో సారి అవాక్కయ్యారు. ఇతను మారడు, మన ఖరం ఇంతే అనుకుంటున్నారు. అంతే కాదు 6 నెలల తన పాదయత్ర పూర్తయ్యేలోపు, చంద్రబాబు పాలన కూడా అంతమైపోతుందని అని జగన్ అంటున్నారు.

ఏదైనా అది ఒక మాలోక ప్రపంచం... జనాలు బుద్ధి చెప్తే, తప్పులు సరి చేసుకోలేనోడు, పెద్దలని గౌరవించలేనోడు, 6 నెలలు కాదు, 60 సంవత్సరాలు తిరిగినా ఏమి ఉపయోగం ఉంటుంది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read