సినిమా టికెట్ల వ్యవహారంలో, జగన్ మోహన్ రెడ్డి సర్కార తీసుకున్న నిర్ణయానికి, సినీ ఇండస్ట్రీలో అందరూ నెగటివ్ గానే స్పందించారు. మరీ ముఖ్యంగా మోహన్ బాబు, ఆర్ నారయణ మూర్తి, ఆర్జీవీ లాంటి వైసీపీ వీరాభిమానులు కూడా, ఈ టికెట్ల అంశంలో ప్రభుత్వాన్నే తప్పు బట్టారు. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి, జగన్ కు సపోర్ట్ గ ఒక్కరు కూడా మాట్లాడ లేదు. అయితే జగన్ కు అత్యంత సన్నిహితిడు అయిన నాగార్జున మొదటి సారి, ఈ అంశం పై స్పందిస్తూ, జగన్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చారనే చెప్పాలి. ప్రస్తుతం నడుస్తున్న సినిమీ టికెట్ల అంశం పై తన సినిమాక్కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని అన్నారు. వేరే సినిమాల సంగతి తెలియదని, తన సినిమాకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. టికెట్ ధర ఎక్కువ ఉంటే, ఇంకా కొంచెం ఎక్కువ కలెక్షన్ వస్తుంది తప్ప, నాకు ఇబ్బంది లేదని నాగార్జున అన్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరో నుంచి సపోర్ట్ రావటంతో, వైసీపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది.
news
జగన్ ఢిల్లీ టూర్ ఫలించింది... జగన్ గన్నవరంలో ల్యాండ్ అవ్వక ముందే, చల్లటి వార్త...
జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన దగ్గర నుంచి, ప్రతిపక్షాలు ఆయన పై విమర్శలు గుప్పించాయి. అసలు జగన్ ఢిల్లీ టూర్ ఎందుకో, ఎవరికీ తెలియదు. ఎందుకంటే, అక్కడ నుంచి అధికారిక సమాధానం ఉండదు. ఎవరికీ నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. ఏదో లీకులు ఇచ్చి, ఇదే మా అజెండా ని చెప్తారు. లోపల ఏమి జరుగుతుందో, ఎవరికీ తెలియదు. అయితే ఈ సారి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పై అనేక విమర్శలు వచ్చాయి. వివేక కేసు విషయం అని, తన సొంత కేసులు విషయం అని, షర్మిల పార్టీ విషయం అని, ఇలా అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఎట్టకేలకు, అసలు జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ వెళ్ళారో, అర్ధం అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రూ.2500 కోట్ల అప్పు తీసుకుని వచ్చారు. అలా జగన్ మోహన్ రెడ్డి గన్నవరం లో దిగారో లేదో, ఇలా అప్పు వచ్చేసింది. ఇందులో గొప్ప ఏముంది అనుకుంటున్నారా ? చాలా గొప్ప ఉందండి బాబు. ఎందుకంటే, మన ప్రభుత్వం అప్పుల విషయంలో చేసిన అవకతవకలు అన్నీ కేంద్రం పసి గట్టేయటంతో, అప్పులు లేకుండా పోయాయి. గాతంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి అప్పుల కోసం ఢిల్లీ వెళ్ళే వారు, తరువాత ప్రినిసిపల్ సెక్రటరీ వెళ్ళే వారు, ఆ తరువాత బుగ్గన వెళ్ళే వారు. రోజుల తరబడి ఢిల్లీలోనే ఉంటూ, అప్పుల కోసం ప్రయత్నాలు చేసే వారు.
అయితే ఈ సారి మాత్రం, బుగ్గన వెళ్ళినా పని అవ్వలేదు. ఏపి ప్రభుత్వం అన్ని అప్పులు ఎడా పెడా చేసేయటంతో, ఇక అప్పు ఇచ్చే వారు లేకుండా పోయారు. ఇక చేసేది లేక జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఢిల్లీ వెళ్లి, అప్పుల కోసం ప్రయత్నం చేసారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, ఆర్ధిక మంత్రిని కలిసి, కష్టాలు చెప్పుకున్నారు. ఈ సారి ఇంకా జీతాలు ఇవ్వలేదని, జీతాలు ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని, ఆదుకోవాలని చెప్పటంతో, రెండో రోజే ఆర్బిఐ నుంచి అదనపు అప్పు ఇస్తూ, కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అయితే అప్పు వచ్చిందో లేదో, గంటల్లోనే ఖాళీ అయిపొయింది. అందులో కొంచెం ఆర్బిఐ ఓవర్ డ్రాఫ్ట్ కింద మినాయించుకోగా, మిగిలినవి జీతాలకు సద్దారు. అయినా కూడా ఇంకా పూర్తిగా పెన్షన్లు జీతాలు ఇవ్వని పరిస్థితి. ఏదైతేనేం, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అప్పు సాధించుకుని వచ్చారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉండి. గడిచిన 8 రోజుల్లో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.4750 కోట్ల అప్పు చేసింది.
ఇక నుంచి టిడిపి రాజాకీయం మారుతుంది... సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు..
గత 40 ఏళ్ళుగా ఎన్నో రాజకీయ పార్టీలను, నేతలను ఎదుర్కుని, డీ కొట్టి రాజకీయాలు చేసి, నిలిచిన తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం తన రాజకీయ శైలిని మార్చుకునే పనిలో పడింది. అవతల వాళ్ళు రాజకీయం చేయకుండా, రౌడీజం చేస్తున్న ఈ తరుణంలో, ఇక నుంచి తాము కూడా గేర్ మార్చాలని తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయ్యింది. సంప్రాదాయ రాజకీయాలు చేస్తుంటే, ప్రత్యర్ధికే కాదు, ప్రజలకు కూడా దూరం అవుతున్నాం అని గుర్తించిన తెలుగుదేశం పార్టీ, గేర్ మార్చింది. నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, త్వరలో జరగబోయే 22 మునిసిపాలిటీల నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసారు. ఇక మన రాష్ట్రంలో సాంప్రదాయ రాజకీయాలు నడవవు అని, ఢీ అంటే ఢీ అనే వారే కావాలని, అందుకే మనం కూడా అలాగే మారదాం అని, రేపు అభ్యర్ధులను కూడా అలాంటి వారినే పెడుతున్నాం అని చంద్రబాబు అన్నారు. రేపు జరిగే 22 మునిసిపాలిటీలలో ఎక్క్కాద్ నామినేషన్లలో తేడా కొట్టినా, అక్కడ ఆన్న ముఖ్య నేతలదే బాధ్యత అంటూ చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ఇది ఒక్కటే కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్న వారి పైన కూడా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు.
అధికారంలో ఉన్నప్పుడు, కొంత మంది నేతలు, పార్టీ గురించి ఆలోచించ కుండా, పార్టీ కోసం మంచి చేసిన కార్యకర్తలను ప్రోత్సహించకుండా, వారికి ఇష్టమైన వారికి పదవులు, ఇతర లబ్ది చేకుర్చారని, ఇప్పుడు మనకు అధికరం పోగానే, వారు ప్రత్యర్ధుల పార్టీలోకి వెళ్ళిపోయి పబ్బం గడుపుతుంటే, మా కార్యకర్తల మాత్రం మనల్నే అంటి పెట్టుకుని ఉన్నారని అన్నారు. ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగవు అని, ఇవన్నీ గుర్తు పెట్టుకుని, ముందుకు వెళ్తానని చంద్రబాబు అన్నారు. రేపు జరగబోయే 22 మునిసిపాలిటీల ఎన్నికలు తమకు సంబంధం లేదు, తాము పోటీలో లేము కదా అని నేతలు అనుకుంటే కుదరదు అని అన్నారు. ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, గట్టి పోటీ ఇచ్చి, విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. ముఖ్యంగా ఓట్లు తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతుందని, ఓట్లు తొలగించకుండా, దొంగ ఓట్ల నమోదు చేయకుండా, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మొత్తం బాధ్యత ముఖ్య నేతలదే అని స్పష్టం చేసారు.
ఢిల్లీలో ఆ కేంద్ర మంత్రి వద్ద ఈ సారి కూడా జగన్ కు నో అపాయింట్మెంట్ !
జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటుగా, కొంత మంది కేంద్ర మంత్రులను కూడా జగన్ మోహన్ రెడ్డి కలిసారు. అయితే ఎప్పటిలాగే ఢిల్లీలో మాత్రం ఈ సారి కూడా అమిత్ షా అపాయింట్మెంట్ జగన్ మోహన్ రెడ్డికి లభించ లేదు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళే ముందు, ప్రధాని మోడీతో పాటుగా, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా జగన్ అడిగారని ప్రచారం జరిగింది. అయితే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అయితే దొరికింది కానీ, ఈ సారి కూడా అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. గతంలో కూడా నాలుగు అయుదు సార్లు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డికి, అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. సోమవారం, మంగళవారం కూడా జగన్ కార్యాలయం, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసారు. నిన్న ఉదయమే వచ్చేయాల్సి ఉండగా, మధ్యానమైనా అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుందేమో అని ఎదురు చూసినా, అమిత్ షా అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. దీంతో మూడు గంటలకు జగన్ మోహన్ రెడ్డి గన్నవరం బయలు దేరి వచ్చేసారు. అయితే అసలు అమిత్ షా అపాయింట్మెంట్ కోరలేదని వైసీపీ వర్గాలు చెప్తున్నా, అంత మంది కేంద్ర మంత్రులను కలిసిన జగన్, కీలకమైన అమిత్ షా అపాయింట్మెంట్ కోరకుండా ఎందుకు ఉంటారు ?