రేపు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇంత అర్జెంట్ గా జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అనే చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రధాన మంత్రి, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ని జగన్ మోహన్ రెడ్డి కోరినట్టు తెలుస్తుంది. ప్రధానంగా గత కొన్ని నెలలుగా, పరిష్కారం కాని రెండు రాష్ట్రాల జల వివాదాల పై చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అనేక సార్లు రెండు రాష్ట్రాలు కూర్చుని చర్చించినా, ఎలాంటి ఉపయోగం లేకపోవటంతో, ఇవి కొలిక్కి రావటం లేదని, అందుకే ఈ విషయాల పై జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీ దగ్గరే తేల్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని, ఇందులో భాగంగానే ప్రధాని మోడి అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా విభజన హామీలు ఇప్పటి వరకు పరిష్కారం కానివి చాలా ఉన్నాయని, దాంతో పాటుగా పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి పెండింగ్ బకాయలతో పాటుగా, సవరించిన అంచనాలు ఇంకా ఆమోదించక పోవటం పైన కూడా చర్చిస్తారని, వీటికి పరిష్కారం తీసుకొచ్చే విధంగానే, జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేసారని, ఢిల్లీకి వెళ్తున్నారని ప్రభుత్వ వర్గాలు లీక్ లు ఇస్తున్నాయి. ఈ అంశాలు అన్నిటితో పాటుగా, రాష్ట్రంలో రాజకీయ పరిణామాల పై కూడా వివరించటానికి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేసే అవకాసం ఉంది.

delhi 02022022 2

ముఖ్యంగా గత కొంత కాలంగా, బీజేపీ విపరీతంగా వైసిపీని టార్గెట్ చేయటం, అలాగే విజయవాడ మీటింగ్ పెట్టి, త్వరలోనే ఇక్కడ బెయిల్ పై ఉన్న నేతలు జైలుకు వెళ్తున్నారని చెప్పటం కూడా జగన్ మోహన్ రెడ్డిలో ఒక విధమైన భయం పట్టుకుందని, అందుకే ఢిల్లీకి వెళ్తున్నారు అంటూ, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బీజేపీ దూకుడుతో, వైసిపీ ఇబ్బంది పడుతుంది. అయితే బీజేపీలో,కొంత మంది వైసీపీ కోవర్ట్ లు ఉండటంతో, వైసీపీకి బీజేపీని మ్యానేజ్ చేయటం తేలిక అవుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో అమిత్ షా వచ్చి క్లాస్ పీకటంతో, మొత్తం మారిపోయింది. అప్పటి నుంచి, బీజేపీ ఆక్టివ్ అయ్యింది. జగన్ కు వ్యతిరేకంగా ఉండే బ్యాచ్ కు, ప్రాధాన్యత పెరిగింది. విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, దాదాపుగా సైలెంట్ అయిపోయారు. విజయవాడ మీటింగ్ లో బెయిల్ పై ఉన్న నేతలు జైలుకు వెళ్తారని, ఏకంగా కేంద్ర మంత్రి చెప్పటంతో, నాలుగు రోజుల తరువాత, జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం, ఇవన్నీ చూస్తూనే, ఏదో జరగబోతుందని అర్ధం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ సంఘాలకు ఎదురైన ఒక వింత అనుభవాన్ని తెలుగుదేశం పార్టీ నేత, పర్చూరి అశోక్ బాబు వివరించారు. ఆయన మాట్లాడుతూ "తాను అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కారిస్తానని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఆ హామీలు ఎందుకు అమలు చేయటం లేదు? సీపీఎస్ వారంలో రద్దు చేస్తామని చెప్పి మూడేళ్లు కావొస్తున్నా ఎందుకు రద్దు చేయలేదు? పిఆర్ సి ఎందుకు అమలు చేయటం లేదు? ఉద్యోగులను చర్చల కోసం అని పిలిచి ప్రతిసారి రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పంపుతున్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఇలా ఉందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఏమి అడగవద్దు అని చెప్పటమే కదా. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రాష్ట్ర ఆర్దిక పరిస్తితి బాగోలేదని కుంటి సాకులు చెబుతున్నారు. జగన్ రెడ్డి చేతకాని పాలన వల్లే రాష్ట్రం ఆర్దిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధిక లోటు వేధిస్తున్నా వెనకడుగు వెయ్యకుండా తెలంగాణా ఉద్యోగులతో సమానంగా గత తెలుగుదేశం ప్రభుత్వం 43 శాతం పిట్ మెంట్ ఇచ్చింది. పిట్ మెంట్ 29 శాతం అడిగితె 43 శాతం పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే.‎10వ పీఆర్సీకి బకాయి పడ్డ దాదాపు రూ 4 వేల కోట్లను మూడు విడతల్లో చెల్లించారు.

employees 02012022 2

"హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చిన శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఉచిత వసతి, వారంలో 5 రోజుల పనిదినాలు,కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం కోసం ఆరోగ్య కార్డులు,30 శాతం అద్దె భత్యం,ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్ల నుండి 60 ఏళ్లకు పెంపు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు 20 శాతం పెంపు, సమైక్యాoధ్ర ఉద్యమంలో 81 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లింపు. 11 వ పిఆర్ సి నివేదిక ఆలస్యం మైనందుకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. నాడు తీవ్రమైన ఆర్దిక లోటులో ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు అన్ని విధాల మేలు చేస్తే జగన్ రెడ్డి మాత్రం తాను ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారు. జగన్ రెడ్డికి ఉద్యోగుల ఓట్లు కావాలి కానీ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు పట్టవా?
" అని అశోక్ బాబు అన్నారు.

ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకులు తరువాత, చంద్రబాబు కొద్ది సేపు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అనేక విషయాలు ప్రస్తావనకు తెచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంచనా వేయలేనంత ఇదిగా తయారు అయ్యిందని అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రిలను చూసాం కానీ, ఇలా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన వారు ఎవరూ లేరని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని, ఈ దుర్మార్గులు నాశనం చేస్తున్నారని అన్నారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా, పారిశ్రామిక వేత్తల నుంచి కూలీల వరకు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లి బ్రతికే పరిస్థితికి తెచ్చారని అన్నారు. గతంలో ఒరిస్సా లోని భువనేశ్వర్ నుంచి, విశాఖకు కూలీలు వలస వచ్చే వారని, ఇప్పుడు రివర్స్ లో మన వాళ్ళే ఉపాధి కోసం భువనేశ్వర్ వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. వీళ్ళకు తెలిసిందల్లా వ్యవస్థలను అడ్డు పెట్టుకుని బెదిరించటం అని, ఏసిబీ , సిఐడి లను అడ్డు పెట్టుకుని, ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. చాలా మంది ఈ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నా, గౌరవానికి భంగం కలిగిస్తారని సైలెంట్ గా ఉంటున్నారని అన్నారు.

cbn 01012022 2

మరి కొంత మంది, ఈ ఉన్మాదులతో మనకెందుకు అని, గొడవలెందుకని ఇంకొందరు పట్టించుకోవటం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు భరిస్తారని, ఎన్నికల్లో వాళ్ళ సంగతి తేలుస్తారని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారు. ముందస్తు ఎన్నికల గురించి ప్రచారం జరుగుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణాతో పాటు ఎన్నికలకు వెళ్తారని తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఇక పొత్తుల విషయం పై తాను ఏమి స్పందించను అని చంద్రబాబు అన్నారు. నాయకులు పని చేయాల్సిన అవసరం ఉందని, పార్టీకి భారం అయితే, ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. పని చేయని వారిని పక్కన పెట్టేస్తాం అని చంద్రబాబు అన్నారు. ఎవరు పని చేయకపోయినా మారి పోతారని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ కు ఇచ్చిన ఒక్క చాన్స్ అయిపోయిందని, ప్రజలకు మొత్తం క్లారిటీ వచ్చిందని చంద్రబాబు అన్నారు.

దాసరి నారయణరావు మరణం తరువాత, టాలీ వుడ్ లో, పెద్ద దిక్కు కోల్పోయాం అనేది సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి అన్నిట్లో ఉండటం, ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఉండటం చేస్తున్నారు. అందరినీ కలుపుకుని వెళ్ళటం లేదు, నలుగురుని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. దాసరి తరువాత ఆ స్థానాన్ని చిరంజీవి భర్తీ చేస్తున్నారనే అందరూ అనుకులే చిరంజీవి అన్నిట్లో ముందుకు వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న వైఖరితో, సినీ ఇండస్ట్రీలో సంక్షోభం వచ్చింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వంతో చర్చలు జరపటానికి మాత్రం, ఎవరూ ఇండస్ట్రీ నుంచి ముందుకు రాలేదు. అసలు చిరంజీవి అడిగితేనే ఆన్లైన్ టికెట్లు పెట్టాం అని ప్రభుత్వం కూడా చెప్పింది. ఈ నేపధ్యంలో చిరంజీవి పై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. జగన్ తో చిరంజీవి చర్చలు జరుపుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఈ రోజు చిరంజీవి ఒక కార్యక్రమంలో పాల్గుని, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను సినీ పెద్దగా ఉండను అని, ఆ పదం నాకు ఇష్టం లేదని, ఇద్దరి మధ్య గొడవలు నేను తీర్చలేనని, ఇండస్ట్రీ మొత్తం బాగు కోసం, ఏమైనా చేయమంటేనే చేస్తాను కానీ, అన్నిట్లో పులుముకొనని అన్నారు.

chiru 01022022 2

ఆయన ఏమన్నారు అంటే, "పెద్దరికం అనేది, ఒక హోదా గానో, అలా అనిపించుకోవటమో నాకు ఇష్టం ఉండదు. నేను సినీ పెద్దగా ఉండను. కానీ బాధ్యతగల బిడ్డగా మాత్రం ఉంటాను. అసవరం వచ్చినప్పుడు అడిగితే వస్తాను. కానీ అనవసరంగా మాత్రం, అన్నిటికీ ముందుకు వచ్చే ప్రసక్తే లేదు, ముందుకు రాను, ఉండను, ఆ సినీ పెద్ద హోదా నాకు వద్దు. అవసరం వస్తే, నేను భుజం కాయాల్సి వస్తే మాత్రం, నేను ఉంటాను. కానీ ఇద్దరు ఎవరో వచ్చి కొట్టుకుంటే, ఆ తగువులు మాత్రం నేను తీర్చను. అవసరం మేరకు, అయితే ఉపాధి పరంగా, ఆర్ధిక పరంగా, ఆరోగ్య పరంగా సమస్యలు ఉంటే నేను ఉంటాను తప్ప, సమగ్రంగా పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని ఉంటాను కానీ, ఇద్దరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని, నన్ను తీర్చమంటే నేను తీర్చను. ఇలాంటి పంచాయతీలు నేను చేయను. ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవటం నాకు ఇబ్బంది. కార్మికుల కోసం మాత్రం ఏదో ఒకటి చేస్తాను." అని చిరంజీవి అన్నారు.

Advertisements

Latest Articles

Most Read