సుప్రీం కోర్టు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సుప్రీం కోర్టు, దేవాలయాల్లో హిందూయేతరులకు షాపుల కేటాయింపుల పై ఇచ్చిన తీర్పుని జగన్ సర్కార్ అమలు చేయకపోవటం పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. జగన్ సర్కార్ పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో, ఏపి ప్రభుత్వం ఏదైతే జీవో విడుదల చేసిందో, అన్య మతస్థులకు, దేవాలయాల్లో షాపుల వేలంపాటలో పాల్గునటం పై ఇచ్చిన జీవోని హైకోర్టులో సవాల్ చేయగా, ఏపి హైకోర్టు కొట్టేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుని, సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించినప్పటికీ కూడా, జగన్ సర్కార్, కర్నూల్ లో ఉన్నటు వంటి శ్రీ బ్రమరాంభ మల్లిఖార్జున స్వామి దేవాలయం షాపు యజమానులను ఖాళీ చేయించటం జరిగింది. అయితే సుప్రీం కోర్టులో స్టే ఉన్నా కూడా, జగన్ ప్రభుత్వం, సుప్రీం కోర్టు స్టే ని అమలు చేయకుండా ఉండటంతో, సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ ను దాఖలు చేయటం జరిగింది. ఆ ధిక్కార పిటీషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ చేసారు. న్యాయమూర్తులు చంద్రచూద్, బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం, గతంలో ఇచ్చిన సుప్రీం కోర్ట్ తీర్పుని అమలు చేయాలని మరో సారి స్పష్టం చేసింది. ఏపి ప్రభుత్వం ఇచ్చిన జీవోని కొట్టేసి, హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టింది.
news
తిరుపతి స్టేజ్ మీదుగా, అసలు నిజం ఒప్పుకున్నా కన్నా లక్ష్మీనారాయణ...
ఈ రోజు తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల ముగింపు సభలో అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. వైసిపీ పార్టీ మాత్రమే అమరావతి సభకు మద్దకు ప్రకటించలేదు. అయితే అమరావతి సభలో, బీజేపీ నుంచి హాజరైన కన్నా లక్ష్మీనారాయణ అసలు నిజాన్ని ఒప్పుకున్నారు. అమరావతి పాదయాత్రలో తాము ముందు నుంచి మద్దతు ఇస్తున్నా, సభలో పాల్గున లేదని అన్నారు. అమిత్ షా గారు తిరుపతి వచ్చి తమకు చెప్పిన తరువాతే, అమరావతి సభలో పాల్గున్నాం అంటూ, అసలు నిజాన్ని ఒప్పుకుని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి విషయంలో బీజేపీ వైఖరి పై, రాష్ట్రంలో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ముగ్గురు బీజేపీ నేతలు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుతో, బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్ అయ్యింది. తిరుపతి వచ్చిన అమిత్ షా, పార్టీ పరిస్థితి పైన రివ్యూ చేసిన సందర్భంలో, అమరావతి రాజధాని పాదయాత్రకు మద్దతు ఇవ్వక పోవటం, అలాగే మరిన్ని ఇతర అంశాల పై కూడా పార్టీ పై సీరియస్ అయ్యారు. ఆ విషయం పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది. అయితే అప్పట్లో బీజేపీ ఆ కధనాలు ఖండించింది. అయితే ఈ రోజు బహిరంగ వేదిక పైనే కన్నా లక్ష్మీ నారాయణ, తాము అమిత్ షా సుచనలను తరువాతే కదిలామని చెప్పారు.
అయితే మరో పక్క ఈ సభకు బీజేపీ ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు రాలేదు. అలాగే విష్ణు వర్ధన్ రెడ్డి , జీవీఎల్, సునీల్ దియోధర్ లాంటి నేతలు కూడా హాజరు కాలేదు. ముందు నుంచి అమరావతికి మద్దతుగా ఉన్న కన్నా లక్ష్మీ నారయణ ఈ సభకు వచ్చారు. తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉండగా, ముందు నుంచి అమరావతికి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. అమరావతికి ఆ రోజున అందరి మద్దతు ఉందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులు రికార్డు సృష్టించారని అన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అమరావతికి ఖర్చు చేసారని అన్నారు. ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి ఒక్క అవకాసం తరువాత, అమరావతిలో దోచుకోవటానికి ఏమి లేదని, విశాఖలో దోచుకోవటానికి ఈ ప్లాన్ వేసారని, నేను మొదటి నుంచి చెప్తున్నాని అన్నారు. వీళ్ళ దెబ్బకు విశాఖ ప్రజలు భయపడి పోతున్నారని అన్నారు. అన్నీ పడేయటమే తెలిసిన వీరు, అభివృద్ధి అనటం సిగ్గు చేటు అని అన్నారు. ఈ రెండున్నరేళ్ళలో , రాయలసీమకు ఏమి చేసారని ప్రశ్నించారు.
వ్యుహ్యం మార్చి, సర్ప్రైజ్ ఇచ్చిన రఘురామ రాజు...
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామరాజు ఏపి ప్రజలకు సర్ప్రైజ్ ఇచ్చారు. రఘురామకృష్ణం రాజు తరుచూ మీడియా ముందుకు వస్తున్నా, ఆయన ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటారు. దానికి కారణాలు కూడా ఆయన అనేక సార్లు చెప్పారు. తాను ఏపిలో అడుగుపెడితే, దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయటానికి చూస్తున్నారని, తన చుట్టూ ఎస్సీలని పెట్టటం, లేదా ఎస్సీ పోలీసులను పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి అరెస్ట్ చేయాలని ప్లాన్ వేస్తున్నారని, అందుకే తాను ఏపిలో అడుగు పెట్టనని చెప్పారు. అయితే ఆయన మొన్నటి వరకు హైదరాబద్ వస్తూ ఉండే వారు. అక్కడ కూడా ఆయనకు నివాసం ఉంది. అయితే మొన్న సిఐడి అధికారులు రాజద్రోహం కేసు అని చెప్పి, అక్కడకు కూడా వెళ్లి అరెస్ట్ చేయటంతో, ఆయన ఇప్పుడు అక్కడ కూడా జాగ్రత్త పడుతున్నారు. ఆయన ఢిల్లీకే పరిమితం అయ్యారు. అయితే రఘురామకృష్ణం రాజు, అమరావతి రైతులకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు జరిగే పాదయత్ర ముగింపు సభకు రావాలని నిర్ణయించుకున్న రఘురామరాజు, చాలా వ్యూహాత్మికంగా వ్యవహరించారు. నాలుగు రోజులు క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలిసిన రఘురామరాజు, తాను తిరుపతి సభకు వెళ్తున్నానని, ముందుగానే హోంమంత్రికి చెప్పారు.
అయితే ఈ విషయం మీడియాలో రావటంతో, మళ్ళీ ఏపి పోలీసులు ఏ కేసు అయినా పెట్టి అరెస్ట్ చేస్తారేమో అని, తాను విర్చ్యువల్ గా సభలో పాల్గుంటానని నిన్న మీడియాకు చెప్పారు. మళ్ళీ ఈ రోజు వ్యూహం మార్చి అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ, రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఈ రోజు సభలో పాల్గుని, ప్రసంగించనున్నారు. అయితే రఘురామరాజు రాక తెలుసుకుని అమరావతి రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఏపి పోలీసులు అక్రమ కేసులు పెడతారానే అనుమానంతో, రఘురామరాజు ఇంత జాగ్రత్త పడుతున్నారు. మరి ఈ రోజు పోలీసులు ఏమి చేస్తారో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అమరావతి సభ తిరుపతిలో ప్రారంభం అయ్యింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహా, అన్ని పార్టీల నేతలు ఈ సభకు వస్తున్నారు. అన్ని పార్టీల నేతలు వేదిక పంచుకోనున్నారు. ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఇక మరో పక్క పోలీసులు యధావిధగా, సభకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని, ఆరోపణలు వస్తున్నాయి.
చంద్రబాబు తిరుమల పర్యటనలో, భద్రతా సిబ్బంది అత్యుత్సాహం...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుపతిలో పర్యటిస్తున్నారు. అమరావతి పాదయాత్ర ముగింపు సభలో పాల్గునటానికి చంద్రబాబు తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు, అక్కడ నుంచి నేరుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం చంద్రబాబు, కిందకు వచ్చి, అమరావతి సభలో పాల్గుననున్నారు. అయితే చంద్రబాబు వైకుంఠం క్యూకాంప్లెక్స్ దగ్గర టిటిడి సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు.సాధారణంగా చంద్రబాబు ఎప్పుడు తిరుమలకు వచ్చినా కూడా, స్వామి వారి పై ఉన్న భక్తీ విశ్వాసాలతో, ఆలయ నిబంధనలు పాటిస్తూ వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచే, స్వామి వారి ఆలయంలోకి వెళ్తారు. ఈ సారి కూడా చంద్రబాబు వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి వెళ్తున్న సమయంలో, ఎప్పుడూ లేనట్టుగా, ఎస్పీఎఫ్ సిబ్బంది చంద్రబాబు భద్రతా సిబ్బందిని కూడా తనిఖీ చేయటం వివాదాస్పదం అయ్యింది. చంద్రబాబుతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేయటంతోనే, ఇలా చేసినట్టు తెలుస్తుంది. ప్రముఖులు వచ్చిన సందర్భంలో, వారి భద్రతా సిబ్బందిని తనిఖీ చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని, చంద్రబాబుతో పాటు ఉన్న అందరినీ కూడా తనిఖీ చేసారని టిడిపి శ్రేణులు అంటున్నాయి.
ఇది కొత్త నిబంధన అయితే, అందరికీ, అందరి విఐపిలకు కూడా ఇలాగే చేస్తే అభ్యంతరం లేదు కానీ, కేవలం చంద్రబాబు టార్గెట్ గా ఇలా చేస్తున్నారని వాపోయారు. అందుకు భిన్నంగా ఇక్కడ వ్యవహరించారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే అక్కడ జరుగుతున్న తతంగం మొత్తం గమనిస్తున్న చంద్రబాబు, అన్నీ గమనిస్తూనే, ఏమి అనుకుండా, మౌనంగా ముందుకు వెళ్ళిపోయారు. చంద్రబాబు శ్రీవారి దర్శనం అనంతరం, మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు అమరావతి రాజధాని అని, ఇదే అందరి కోరిక అని చంద్రబాబు అన్నారు. పాదయాత్ర చేసిన వారికి మద్దతు ఇచ్చేందుకే ఇక్కడ వరకు వచ్చానని అన్నారు. అమరావతి మహా సభలో హాజరు అవుతానని, అక్కడ ప్రసంగిస్తానని చంద్రబాబు అన్నారు. మరో పక్క ఇప్పటికే సభ ప్రారంభం అయ్యింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఈ సభకు వచ్చి మద్దతు పలికారు. కేవలం వైసీపీ మాత్రమే ఈ సభకు రాలేదు.