ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న, ప్రభుత్వం విడుదల చేసిన టికెట్ రేట్ల జీవోని హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే, హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పైన, అపీల్ కు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉంటే, ఈ అంశం పై బాలయ్య మొదటి సారి స్పందించారు. ఈ రోజు అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రి వచ్చిన బాలయ్య మీడియాతో మాట్లాడారు. అఖండ సినిమా విజయం సాధించిన సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చిత్ర యూనిట్ పర్యటనలు చేస్తుంది. ఈ నేపధ్యంలో విజయవాడ వచ్చిన బాలయ్యను, ఆన్లైన్ టికెట్ల విషయం పై స్పందించమని కోరగా, బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆ రోజు మేము అందరం చర్చించుకున్నామని, మా నిర్మాత, దర్శకుడు, మా టీం అంతా మాట్లాడుకున్నామని, ఏదైతే అది అయ్యింది అనుకుని, సినిమాని నమ్ముకున్నాం, సినిమా బాగా వచ్చింది, మనం సినిమా విడుదల చేద్దాం అని, ఆ పరిస్థితిలో కూడా విడుదల చేసాం. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన జీవోని కోర్టు కొట్టేసిందని, మళ్ళీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తాం అంటుందని, చూద్దాం ఏమి జరుగుతుందో అని బాలయ్య అన్నారు. అఖండ సినిమాను, మేమైతే ధైర్యంగా, అప్పుడున్న పరిస్థితిలో విడుదల చేసాం.

balayya 15122021 2

అన్నిటికీ ప్రిపేర్ అయ్యాం, మా అభిమానులు మీద, ఇనీ ప్రేక్షకులు మీద నమ్మకంతో, అమ్మవారి ఆశీస్సులతో తప్పుకుండా విడుదల చేద్దాం, విజయం సాధిస్తుందని నమ్మం అని బాలయ్య అన్నారు. విడుదల చేయటానికి అందరూ భయపడుతున్నారు, వాళ్లు వస్తే మనం వెళ్దాం అని సందిగ్ధంలో ఉంటే, మా పని మీద మాకు నమ్మకంతో విడుదల చేసాం, ప్రేక్షకులు ఆదరించారని బాలయ్య అన్నారు. మేము రిలీజ్ చేసిన తరువాత, అందరికీ ధైర్యం వచ్చిందని, సినిమా బాగుంటే, ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వచ్చిందని బాలయ్య అన్నారు. ఈ సినిమా రిలీజ్ చేయాలి, విజయం సాధించాలని అందరూ కోరుకున్నారని అన్నారు. తాను కూడా తన వంతుగా, ఏపి ప్రభుత్వంలోని కొంత మందితో, టికెట్ ధరల విషయమై మాట్లాడానని, ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, ఏమి జరుగుతుందో చూద్దామని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే సినిమా అని అందరూ తీసుకున్నారని, తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే మల్టీ స్టారర్ సినిమా తీయటానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని బాలయ్య అన్నారు.

లోక్‌సభ వేదికగా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అధ్వానంగా ఉందని, మిథున్ రెడ్డి వాపోయారు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఆయన విలపించటం ఒకటే తక్కువ అని చెప్పాలి. ఈ రోజు లోక్‌సభలో అదనపు పొద్దుల పై జరిగిన చర్చలో, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లడారు. దానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది, దేశ పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ఆందోళన కరంగా ఉందని, భరించలేని స్థాయిలో ఆర్ధిక పరిస్థితి ఉందని, ఈ ఆర్ధిక పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బయట పడేయాలి అంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే ప్రాదేయ పడ్డారు. విభజన చట్టాలులో ఉన్న అంశాలు అన్నీ పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ పట్ల సానుభూతి చూపించాలని, ఏపీ పట్ల ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాపాడాలని ఆయన వేడుకున్నారు. విభజన సమయంలో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, భవిష్యత్తు పై చాలా ఆందోళన చెందుతున్నామని, ఆర్ధికంగా భరించే స్థాయిలో లేమని, దీని నుంచి బయట పడే మార్గం కూడా తమకు కనిపించటం లేదని ఆయన చెప్పారు.

mithun 14122021 2

అంతే కాకుండా, ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, లేకపోతే ఈ ఆర్ధిక పరిస్థితి నుంచి తాము బయట పడటం చాలా కష్టం అవుతుందని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అన్నీ కూడా, అవి కూడా పదేళ్ళ లో పూర్తి చేయాలనీ ఉందని, ఇప్పటికే ఎనిమిది ఏళ్ళు గడిచి పోయాయని అన్నారు. అయితే ఈ రోజు మిథున్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులుఎ మీ అయిపోతున్నాయో తెలియదు. ఒక పక్క అప్పులు పుట్టటం లేదు. భూములు అమ్మకానికి పెట్టారు. మద్యం ఆదాయం తాకట్టు పెట్టారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అన్నీ వాడేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి ఏమి తోచటం లేదు. హామీలు అన్నీ అటక ఎక్కాయి. ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కత్తి వేలాడుతుంది. అభివృద్ధి ఆగిపోయింది. ఆదాయం లేదు. మెడలు వంచుతాం అని చెప్పిన వాళ్ళు, ఇప్పుడు ఢిల్లీలో బేలగా చూసే పరిస్థితి వచ్చింది. ఎక్కడి వరుకు వెళ్తామో మరి.

వైఎస్ వివేక కేసు, చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారి, న్యాయమూర్తి ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరి పైన, ఇప్పుడు మరో ట్విస్ట్ ఏర్పడింది. దస్తగిరిని అప్రూవర్ గా మార్చటం, ఆ తరువాత అతన్ని అరెస్ట్ చేయకుండా, క్షమాభిక్ష పెట్టినట్టుగా, సిబిఐ తమ అఫిడవిట్ లో పేర్కొనటం పైన, ఎర్ర గంగిరెడ్డి దీన్ని హైకోర్టులో సవాల్ చేసారు. రెండు రోజుల క్రితం పిటీషన్ వేయగా, దీని పైన ఈ రోజు వాదనలు జరిగాయి. ఈ విచారణ సందర్భంగా, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, ఆదినారాయణ రావు, వాదనలు వినిపించారు. సిబిఐ ఏదైతే క్షమా భిక్ష పెట్టటం, అది క్షామార్హం కాదని కూడా ఆయన వాదనలు వినిపించారు. ఈ విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి, 164 స్టేట్మెంట్ ఇస్తే, న్యాయమూర్తి ముందు, దాన్ని మీరెలా ఎలా పరిగణలోకి తీసుకుంటారని, ఆ విధంగా ఆయన్ను అరెస్ట్ చేయకుండా వదిలి వేయటం పైన కూడా, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇది ఐపీసిలోని పలు సెక్షన్ లను ఉల్లంఘించినట్టే అని ఆయన వాదనలు చేసారు. అయితే సిబిఐ మాత్రం, తాము కౌంటర్ వేసేందుకు సమయం కావలని, హైకోర్ట్ ని సిబిఐ అభ్యర్ధించింది. దీంతో హైకోర్టు, సిబిఐ కౌంటర్ తరువాత, ఇరు వాదనలు పరిశీలించిన అనంతరం, ఒక నిర్ణయం ప్రకటిస్తామాని చెప్పింది.

viveka 14122021 2

సిబిఐ కౌంటర్ వేసేందుకు సమయం ఇస్తూ, ఈ నెల 24వ తేదీకి కేసుని వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే, వివేక మాజీ పీఏ కృష్ణా రెడ్డి, నిన్న కడప ఎస్పీని కలవటం, మరో చర్చకు దారి తీసింది. తనకు వివేక కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని, తనను కాపాడాలని, కడప ఎస్పీని కలిసి వేడుకున్నారు. కృష్ణా రెడ్డి దాదాపుగా, 30 ఏళ్ళ పాటు, వివేక పీఏ గా పని చేసారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, ఆయనకు వివేక కుమార్తె, అలాగే వివేక అల్లుడు, వివేక బావ మరిది నుంచి ప్రాణ హాని ఉందని చెప్పటం, మరో హైలైట్. ఆయన ఫిర్యాదును పోలీసులు తీసుకుని, విచారణ జరుపుతున్నారు. గత కొన్ని రోజులుగా, ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. దీంతో కొత్తగా వివేక కూతురు, అల్లుడుని టార్గెట్ చేస్తూ జరుగుతున్న వ్యవహారం పలువురుని ఆశ్చర్యనిక గురి చేస్తుంది. ఇది ఎక్కడి వరుకు వెళ్తుందో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. మరో పక్క, ఈ కేసులు పెద్దలను ఇప్పటి వరకు సిబిఐ విచారణ చేయటం లేదనే, ప్రచారం కూడా జరుగుతుంది.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, మరో సారి హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 35ను కొద్ది సేపటి క్రితం రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత విధానంలో సినిమా టికెట్ రేట్లను నిర్ణయం తీసుకునేందుకు, పిటీషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. సినిమా టికెట్ రెట్లను తగ్గిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేస్తూ, ధియేటర్ ల యాజమాన్యాలు, హైకోర్టులో పిటీషన్లు వేసాయి. ఈ పిటీషన్ పైన, ఈ రోజు హైకోర్టులో వాడీ వేడీ వాదనలు జరిగాయి. సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది, ఆదినారాయణరావు, ఆడే విధంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది దుర్గా ప్రసాద్ పిటీషనర్ల తరుపున వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో జారీ చేసిందని హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. హైకోర్టు టికెట్ రేట్లకు సంబంధించి, కొన్ని మార్గదర్శక సూత్రాలు విడుదల చేసిందని, దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 35 ను విడుదల చేసిందని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఏ విధంగా ఈ జీవోలో తప్పులు ఉన్నాయి, అదే విధంగా హైకోర్టు మార్గదర్శక సూత్రాలు ఏ విధంగా ప్రభుత్వం ఉల్లంఘించింది అనేది కూడా ఆయన హైకోర్టుకు వివరించారు.

hc cinema 14122021 2

ఈ నేపధ్యంలోనే హైకోర్టు ప్రభుత్వం వైపు నుంచి కూడా వాదనలు విన్న అనంతరం, జీవోని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు తగ్గింపు పై కోర్టు ఆదేశాలు ఉన్నాయని కూడా, న్యాయవాదులు తీసుకుని వచ్చారు. కొత్త సినిమాల విడుదల సమయంలో రేట్లు పెంచుకునే హక్కు ధియేటర్లకు ఉంటుందని వాదించారు. సినిమా టికెట్ ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని, అయితే రీజనబుల్ రేట్స్ ఉండాలి అనేది తమ వాదన అని అన్నారు. ఈ వాదనలతో రాష్ట్ర హైకోర్టు ఏకీభవించింది. ముఖ్యంగా బీ, సి సెంటర్ల లో, నేల టికెట్లను మరీ 5 రూపాయలకు తగ్గించటం అనేది, సహేతుకం కాదు, సమంజసం కాదని, ఇవి ధియేటర్ యాజమాన్యులకు నష్టాలు మిగులుస్తాయని చెప్పి, నిర్వహణ కూడా చేయలేక పోతున్నారని, కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో హైకోర్టు కూడా ఏకీభవిస్తూ, టికెట్ రేట్లు తగ్గిస్తూ గతంలో ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో, దాన్ని కోర్టు సస్పెండ్ చేసింది. దీంతో కొత్తగా విడుదల అయిన సినిమాలకు ఊరట అనే చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read