సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో, సిబిఐ పైన నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిన్న, సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో, సిబిఐ విచారణకు సంబంధించి, హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా, అటు సోషల్ మీడియా ప్లాట్ఫారం తరుపున న్యాయవాదులు, ఇటు హైకోర్టు తరుపు న్యాయవాది అశ్వినీ కుమార్, అదే విధంగా సిబిఐ తరుపు న్యాయవాదులు మధ్య తీవ్ర మాటల యుద్ధం నడించింది. విదేశాల్లో కూర్చుని, మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ పట్ల దుషణలు దిగటం పై హైకోర్టు ధర్మాసనం, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన వ్యవస్థ సత్తా ఏమిటో చుపించాల్సిన అవసరం ఉందని చెప్పి, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్న ధర్మాసనం అభిప్రాయ పడింది. పంచ్ ప్రభాకర్ కు విదేశీ పౌరసత్వం ఉందని సిబిఐ హైకోర్టుకు తెలపగా, హైకోర్టు తరుపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆయన బంధువులు ఎవరు ? ఆయన ఆస్తులు గురించి సిబిఐ ఎందుకు పట్టించుకోవటం లేదని, ఈ సందర్భంగా అశ్వినీ కుమార్ ప్రశ్నించారు. నిందితుల పరస్పర అప్పగింత ఒప్పందంలో భాగంగా సిబిఐ, ఈ దిశగా ఎందుకు ఆలోచన చేయలేక పోతుందని, సిబిఐ ఈ దిశగా ఎందుకు దర్యాప్తు చేయటం లేదని కూడా, ఆయన హైకోర్టులో ప్రశ్నించారు.

hc 14122021 2

సిబిఐ వేసిన అఫిడవిట్ లో ఎటువంటి కొత్త విషయాలు లేవని, అందరికీ తెలిసన అంశాలే అందులో ఉన్నాయని అన్నారు. గూగుల్ లో కొడితే ఈ విషయాలు, సామాన్య ప్రజలకు కూడా తెలుస్తాయని, ఇందులో సిబిఐ గొప్ప ఏమి లేదని, అశ్వినీ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారం విన్న అనంతరం, హైకోర్టు ధర్మాసనం కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో, కొంత మంది విదేశాల్లో కూర్చుని, న్యాయ వ్యవస్థ మీద, జడ్జిల మీద, హైకోర్టు మీద తీవ్ర దూషణలకు దిగుతున్నారని, దానికి విదేశీ పౌరసత్వం సాకుగా చూపించటం సరి కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే విధంగా నిందితులను పరస్పరం అప్పగించే ఒప్పందాలు అనేకం ఉన్నాయని, ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయటం లేదని హైకోర్టు ఏకీభవిస్తూ, అసలు సిబిఐ విచారణ ఎంత వరకు వచ్చింది ? ఏమి చర్యలు తీసుకున్నారు ? విదేశాల్లో ఉండే నిందితులను పట్టుకోవటానికి ఏమి చేస్తున్నారు, ఇవి ఎందుకు అరికట్ట లేక పోతున్నారు, ఈ వివరాలు అన్నీ తెలుపుతూ, తమకు సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు, ప్రాధాన న్యాయమూర్తి ధర్మాసనంతో పాటు, మరో ధర్మాసనం జస్టిస్ బట్టు దేవానంద్, ఈ రోజు జస్టిస్ చంద్రు వ్యాఖ్యల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యల పై చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తీవ్ర అసహనం వ్యక్తం చేయటమే కాకుండా, కొంత మంది జ్యుడిషియల్ సెలబ్రిటీలు లైం లైట్ లోకి ఉండేదుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి వ్యాఖ్యానించటంతో పాటుగా, ఇటువంటి వాటిని ఆపేస్తామని హెచ్చరించారు. మేము మనుషులమే అని, కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయని, హ్యూమన్ రైట్స్ గురించి అడ్డ్రెస్ చేయటానికి వచ్చి, ఆయన దాని గురించి మాట్లాడితే బాగుండేదని కూడా వ్యాఖ్యానించారు. మేము పరిధి దాటి మాట్లాడామని అంటున్నారు, అది సరి కాదని కూడా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేసారు. ఇక దీంతో పాటు హైకోర్టుని ఉద్దేశించి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యల పై, ఒక కేసు విచారణ సందర్భంగా, జస్టిస్ బట్టు దేవానంద్ కూడా తీవ్రంగా స్పందించారు. ఎంతో మంది ప్రాధమిక హక్కులను హైకోర్టు కాపాడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసారు. జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవి అని, మొత్తం హైకోర్టుని ఆయన ఎలా నిందిస్తారని ప్రశ్నించారు.

chandaru 13122021 2

ఒక డాక్టర్ ని పోలీసులు రోడ్డు పైన విచక్షణా రహితింగా కొట్టారని, హక్కులు గురించి పోరాడాలని అంటే, విశాఖకు వెళ్లి మంచి డైరెక్టర్ తో, ఆ సంఘటన పై మంచి సినిమా తీయించండని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని ఇతర హైకోర్టులతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, న్యాయమూర్తి నుంచి కక్షిదారుల వరకు, ఏపి హైకోర్టులో కనీస సౌకర్యాలు కూడా లేవని, ఈ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు. కనీస సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, మర్చిపోవద్దు అని కూడా ఆయన స్పష్టం చేసారు. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే, సిబిఐ విచారణకు ఆదేశించటం తప్పు ఎలా అవుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలాగే చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా అసహనం వ్యక్తం చేస్తూ, మీరు మాట్లాడిన విషయాలు సరి కాదని స్పష్టం చేసారు. హ్యుమన్‌రైట్స్ డేను మాట్లాడటానికి వచ్చిన ఆయన, మా మీద మాట్లాడటం సరి కాదని, తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తీసుకున్న మరో చట్ట విరుద్ధమైన నిర్ణయంతో, హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. జగనన్న విద్యా దీవెన పధకం అమలుకు సంబంధించి, రాష్ట్ర హైకోర్టులో ఏపి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానంగా విద్యా దీవెన పధకం కింద, విద్యార్ధులు ఫీజు నిమిత్తం చెల్లించే డబ్బు అంతా కూడా, తల్లులు ఖాతాలో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇన్నాళ్ళు ఫీజులు, ప్రభుత్వం కాలేజీలు ఖాతాల్లో వేస్తూ వస్తుంది. అయితే తమకు ఎన్నికల్లో లబ్ది కోసం అని, రూల్స్ మార్చేసి, ప్రభుత్వం ఆ డబ్బు అంతా కూడా విద్యార్ధుల ఖాతాలో వేస్తాం అని, అక్కడ నుంచి తల్లులు, కాలేజీలకు వేయాలని ప్రభుత్వం చెప్పింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. దీంతో రాయలసీమకు సంబంధించి, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలు అన్నీ కూడా రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో దీని పైన సుప్రీం కోర్టు సింగల్ జడ్జి విచారణ చేసి, ఈ డబ్బులు తల్లులు ఖాతాలో వేయటం ఏమిటి అని, నేరుగా కాలేజీల ఖాతాలో వేయొచ్చు కదా అని చెప్తూ, అదే తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పు పైన రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. తల్లులు ఖాతా నుంచి, అక్కడ నుంచి కాలేజీల ఖాతాలోకి వేయటానికి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం రివ్యూకి వెళ్ళింది.

hc 13122021 2

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై, రివ్యూ పిటీషన్ దాఖలు చేయటంతో, ఈ రోజు ఈ కేసు డివిజినల్ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ రివ్యూ పిటీషన్ పై, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించగా, ఇటు వైపు నుంచి కాలేజీల యాజమాన్యం తరుపున, సీనియర్ న్యాయవాది వెంకటరమణ వాదనలు వినిపించారు. ఈ వాదనలు పూర్తయిన అనంతరం, హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో సింగల్ జడ్జి ఏ తీర్పు అయితే ఇచ్చారో, ఆ తీర్పుని సమర్ధించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం వేసిన రివ్యూ పిటీషన్ ని కూడా కోర్టు కొట్టివేసింది. జగనన్న విద్యా దీవెన పధకం కింద, తప్పనిసరిగా, ఈ డబ్బులు అన్నీ కూడా కాలేజీల ప్రిన్సిపాల్ ఎకౌంటు లోనే వేయాలని చెప్పి, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తల్లులు ఖాతాలో డబ్బులు వేయలని గతంలో ఇచ్చిన జీవో ఉందో, ఆ జీవోని కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. మరి దీని పైన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందో, లేక సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి, అక్కడ కూడా చెప్పించికుంటుందో చూడాలి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘరామకృష్ణం రాజు, జగన్ మోహన్ రెడ్డిని వదలి పెట్టటం లేదు. జగన్ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి, బెయిల్ రద్దు చేసి, 11 చార్జీ షీట్ల పై విచారణ చేయాలి అంటూ, దాఖలైన పిటీషన్ పై, తెలంగాణా హైకోర్టు విచారణ చేసింది. విచారణలో భాగంగా, జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, తనకు సియం పదవి వచ్చిన తరువాత, ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్ష్యులను ప్రభావితంలా చేసేలా ఉన్నాయని, అలాగే ఈ 11 చార్జ్ షీట్లలో దర్యాప్తు కూడా ముందుకు వెళ్ళటం లేదు కాబట్టి, వెంటనే ప్రజా ప్రతినిధుల కేసులు అన్నీ కూడా, త్వరతిగతిన పూర్తీ చేయాలని సుప్రీం కోర్టు ఏ ఆదేశాలు అయితే ఇచ్చిందో, ఆ ఆదేశాలకు అనుగుణంగా, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి, పూర్తి స్థాయిలో ఈ 11 చార్జ్ షీట్లలో విచరణ చేయాలని రఘురామకృష్ణం రాజు, తెలంగాణా హైకోర్టులో పిటీషన్ వేసి, వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డికి, తెలంగాణా హైకోర్టు నోటీసులు జారీ చేయటం జరిగింది. నోటీసులు అందుకున్న తరువాత, దాని పైన, జగన మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్తారు, ఎలాంటి వాదనలు వినిపిస్తారు అనేది చూడాల్సి ఉంది.

tg 13122021 2

ఈ కేసులో తదుపరి విచారణకు హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. రెండు వారాల తరువాత, జగన్ మోహన్ రెడ్డికి చెందిన న్యాయవాది, తన వాదనలు వినిపించే అవకాసం ఉంటుంది. ఈ పిటీషన్ కు సంబంధించి, రోజు వారీ విచారణ కొనసాగుతుందా, లేక పొతే ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని పైన, రెండు వారల తరువాత జగన్ మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చిన తరువాత, దీని పైన కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, ఇప్పటికే రఘరామకృష్ణం రాజు, సిబిఐ కోర్ట్ లో బెయిల్ రద్దు పిటీషన్ దాఖలు చేసారు. అయితే సిబిఐ కోర్టులో ఈ కేసుని కొట్టేసారు. దీంతో రఘురామరాజు, ఈ విషయం పై తెలంగాణా హైకోర్టుకు వచ్చారు. ఇక్కడ గతంలోనే పిటీషన్ వేయగా, కొన్ని కారణాలతో పిటీషన్ కొట్టేసారు. మళ్ళీ రఘురామరాజు పిటీషన్ వేయటంతో, ఈ కేసు విచారణకు వచ్చి, జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. మరి ఈ కేసులో సిబిఐ అభిప్రాయం గురించి కూడా కోర్టు అడిగే అవకాసం ఉంటుంది. మరి అప్పుడు సిబిఐ ఏమి చెప్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read