మన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు కంటే, కొంత మంది చేసే ఓవర్ ఆక్షన్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అంతా ఒక పార్టీకి కొమ్ము కాసే వాళ్ళని, వాళ్ళ వాలకం చూస్తూనే అర్ధం అవుతుంది. వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, ఒక పార్టీ, ఒక నాయకుడి ప్రయోజనాలే ఎక్కువ. కానీ దానికి ఒక ముసుగు వేస్తారు. అలాంటిదే ఇప్పుడు మేధావుల ఫోరం అని చెప్పుకునే ఒక సంస్థ. ఆ సంస్థ, అమారావతి రైతుల పాదయాత్రను టార్గెట్ చేసింది. చిత్తూరు జిల్లాలో, పాదయాత్ర అడుగు పెట్టిన దగ్గర నుంచి, వీళ్ళ హడావిడి అంతా ఇంతా కాదు. అయితే వీళ్ళు అమరావతి రైతులను కాల్చటానికి, హైకోర్టు మీద తుపాకీ పెట్టారు. అయితే వీళ్ళు ఎక్కడా అధికార పార్టీని ప్రశ్నించరు. వీరి బాగోతం ఈ రోజు మరోసారి బయట పడింది. రాయలసీమలో హైకోర్టు కావాలని వీరు చేసే పోరాటం, కేవలం రాజకీయంగా ఒక పార్టీని కొమ్ముకాయటానికే అనే విషయం అర్ధం అయ్యింది. ఈ రోజు అమరావతి హైకోర్టు ఎదురుగా, మరో హైకోర్టు భవనానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు ఉన్న హైకోర్టుకి చోటు సరిపోక పోవటంతో, ఈ నిర్మాణం చేస్తున్నారు. మరి, ఈ మేధావులు, అక్కడే ఎందుకు హైకోర్టు బిల్డింగ్ కడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. కర్నూల్ రాజధాని అన్నారు కదా, మరి అక్కడ నిర్మాణాలు ఎందుకు అని అడగలేరు. ఎందుకు అడగలేరో, అర్ధం చేసుకోలెంత అమాయకులు కాదు ప్రజలు. వీరికి నిజంగా సీమలో హైకోర్టు కావాలని ఉంటే, ఈ రోజు జరుగుతున్న శంకుస్థాపన పై నిరసన ఎందుకు తెలపలేదు ?

తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ, ఇది కౌరవ సభ, గౌరవ సభ కాదు, మళ్ళీ సియం అయిన తరువాతే, ఈ గౌరవ సభలోకి అడుగు పెడతాను అంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్ ఆ పార్టీకి ఎంత ముఖ్యమో తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ ప్రక్రియ మొదలు పెట్టింది. వచ్చే ఎన్నికలకు అభ్యర్ధులు ఎంపిక ఎంత ముఖ్యమో, పార్టీ గుర్తించింది. ఇప్పటికే చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. ఈ సమీక్షల్లో చంద్రబాబు, పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్ళని, సస్పెండ్ చేయటం కూడా మొదలు పెట్టారు. అలాగే పనులు చేయకుండా, కేవలం ఫోటోలకు, ఫోజులు ఇచ్చే వారి పైన, కఠినంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు వారికి వార్నింగ్ ఇచ్చి, పధ్ధతి మార్చుకోవాలని చెప్తున్నారు. ఇక ఎన్నికలకు రెండేళ్ళ సమయం ఉండటంతో, ఇప్పటి నుంచి అభ్యర్ధుల ఎంపిక పై చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టారు. ఇది వరకు లాగా, చివరి నిమిషం వారకు నాన్చే ధోరణికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటి నుంచి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టారు. జిల్లల్లోకి సర్వే టీమ్స్ ని చంద్రబాబు పంపించారు. ప్రతి జిల్లాకు వెళ్తున్న ఈ సర్వే టీమ్స్, స్థానికంగా ఆన్ని విషయాల పై అధ్యయనం చేస్తున్నాయి.

cbn 13122021 2

నేతలు, కింద స్థాయి నాయకులు, క్యాడర్, ప్రజలు, ఇలా అందరి అభిప్రాయాలూ తీసుకుంటున్నారు. పలానా నేత ఎలా పని చేస్తున్నారు, వేరే నేత అయితే ఎలా ఉంటుంది, ఎవరు ప్రజల్లో ఉంటున్నారు, ఎవరు ప్రజల తరుపున పోరాడుతున్నారు, ఎవరు అందుబాటులో ఉంటున్నారు, అధికార పార్టీతో లాలూచి పడుతున్నది ఎవరు, ఇలా అనేక విషయాల పైన చర్చిస్తున్నారు. మొక్కుబడిగా పార్టీలో ఉండే నేతలను పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.ముఖ్యంగా ఈ సారి యువతను రంగంలోకి దింపటానికి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గ్రూపులు పెట్టే వారిని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఇప్పుడు క్షేత్ర స్థాయి సమాచారం కోసం, సర్వే టీమ్స్ ని రంగంలోకి దించారు. వాళ్ళు ఇచ్చే సమాచారం ప్రకారం, అందరితో మరోసారి చర్చలు జరిపి, ఇంచార్జ్ ల పై నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ సీరియస్ గా చేస్తున్న ఈ కార్యక్రమం పై, నేతలకు టెన్షన్ మొదలైంది. తమ భవిత ఏమిటి, సర్వే రిపోర్ట్ లో ఏముంది అనే దాని పైన ఇప్పుడు వాళ్ళకు టెన్షన్ పట్టుకుంది. మొత్తం మీద చంద్రబాబు ఒక మంచి పని చేస్తున్నారని, క్యాడర్ అంటుంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అసెంబ్లీలో వైసిపీ మాట్లాడిన బూతులు పైన ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. దీని పైన పవన్ కళ్యాణ్ మొదటి సారి స్పందించారు. ఆయన ఈ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో విశాఖ ఉక్క కోసం ఒక రోజు దీక్ష చేసారు. ముగింపు సందర్భంగా అయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పైన, అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరు పైన పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ మాటలలోనే "ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్ లో లా అండ్ ఆర్డర్ చాలా అధ్వానంగా ఉందని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటి అన్నిటికీ మించి పోయింది. ఎమ్మల్యేలే రౌడీజం చేసే స్థాయికి వచ్చింది. మొన్న చట్ట సభల్లో ఒక మాజీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టారని వారు బాధపడ్డారని వార్తలు వస్తే, బాధ అనిపించింది. చట్ట సభలు అనేది ఒక శాసనాలు చేసే చోటు. అక్కడ బూతులు మాట్లాడుతున్నారు. బుతులే శాసనాలు అయ్యాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, వచ్చిన వార్తలు ప్రకారం, మన ప్రతిపక్ష నేతని, ఆయన భార్యని మీరు ఆ స్థాయిలో తిడితే, రోడ్డు మీద ఒక ఆడ బిడ్డకు మీరు ఏమి రక్షణ ఇస్తారు ? ప్రజా ప్రతినిధులు ఈ స్థాయికి దిగజారితే, ఆడ బిడ్డలకు రక్షణ ఏది ?రేపు రేపులు చేసే వారికి, మీ మాటలు ఎంత ప్రోత్సాహం కలిగించి ఉంటుందో మీరు అర్ధం చేసుకోండి."

pk 12122021 2

"మీ ఇంట్లో వాళ్ళకు తెలుస్తుంది నేను చెప్పే మాటలు, మీకు అర్ధం అవుతుందో లేదో మరి. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి అనేది ఇందుకే. " అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వైసీపీ పైన విరుచుకు పడ్డారు "స్టీల్ ప్లాంట్ కార్మికులు, భూ నిర్వాసితులకు నా సంఘీభావం – సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడే జనసేన గుర్తుకువస్తోంది – ఓట్లు వేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకురావాలని కోరుతున్నా – పని చేసే క్రమంలో పదవి రావాలి, పదవి కోసం పని చేయొద్దు – ప్రజల సంక్షేమం కోరుకునే వాడిని కాబట్టే పదవి లేకపోయినా పోరాటం చేస్తున్నా – వైసీపీ నేతలు జనసేనకు శత్రువులు కాదు, వారి విధానాలతో మాత్రమే వ్యతిరేకం – సమస్యపై ప్రశ్నిస్తే వైసీపీ నేతలు మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు – వ్యక్తిగత, కుటుంబ దూషణలు జనసేన ఎప్పుడూ చేయదు – స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో 150 మందికిపైగా చనిపోయారు – అభివృద్ధిలో కీలకమైన స్టీల్ ఉత్పత్తిలో మనం రెండో స్థానంలో ఉన్నాం – 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం పోరాడారు – ఎంతోమంది ప్రాణత్యాగాలతో విశాఖకు స్టీల్ ప్లాంట్ వచ్చింది - ప్రధాని మోదీతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు – అమరావతిని రాజధానిగా గుర్తిస్తామని అమిత్ షా నాతో అన్నారు – విలువలు లేని వైసీపీకి రాజ్యాంగం విలువ తెలియదు - జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడారు"

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల మ్యనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ పై, ఏపి సిఐడి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు సందర్భంగా, సిఐడి విధులుకు ఆటంకం కలిగించారు అనేది ఈ ఎఫ్ఐఆర్ లో ప్రధాన అభియోగంగా ఉంది. శుక్రవారం ఉదయం సోదాలు జరిగిన సమయంలో, రాధాకృష్ణ అక్కడ సిఐడి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, బ్లూ మీడియా ఒక విష ప్రచారం చేసింది. దీంతో ఏబిఎన్ అక్కడ జరిగిన మొత్తం వీడియో ఫూటేజ్ ని విడుదల చేసి, ఏ విధంగా బ్లూ మీడియా వక్రీకరించింది అనేది, ప్రసారం చేసారు. అయితే ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగితే, శనివారం రాత్రి, అంటే 36 గంటలు గరువత ఈ ఎఫ్ఐఆర్ ని నమోదు చేయటం పైన, విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 36 గంటలు తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, వాస్తవాలు ఈ విధంగా ఉంటే, ప్రచారం మాత్రం ఇలా చేస్తున్నారు. ఏబిఎన్ అక్కడ ఫూటేజ్ మొత్తం ప్రసారం చేసిన దాంట్లో, రాధాకృష్ణ అక్కడకు వెళ్ళిన తరువాతే, అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. పైగా అక్కడ రాధాకృష్ణ కూడా, నేను ఇక్కడ వచ్చిన తరువాతే, వీళ్ళు సహకరించారని మీరు చెప్తున్నారు కదా, అది కూడా మీ పంచనామాలో రాయండి అని కూడా ఆ వీడియోలో ఉంది.

case 12122021 2

విచారణను అడ్డుకుని ఉంటే కనుక, అప్పుడే అక్కడ ఉన్న హైదరాబాద్ పోలీసులకు, ఏపి సిఐడి ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది కూడా ప్రధాన ప్రశ్నగా మారింది. ఒక వేళ నిజంగానే అక్కడ విచారణని అడ్డుకుని ఉంటే, సిఐడి అధికారులు, వెంటనే ఫిర్యాదు చేసే వారు కదా అనే ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడ సిఐడి అధికారులు, అక్కడ పని మొత్తం ముగించుకుని, విజయవాడ వచ్చిన తరువాత, ప్రభుత్వం పెద్దల ఒత్తిడి మేరకే, ఈ ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని, ఆరోపణలు వస్తున్నాయి. వీడియో ఫూటేజ్ మొత్తాన్ని ప్రసారం చూసినా, అందులో ఎక్కడా అలా లేకపోయినా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఐపీసీ 353, 341, 186, 120(బి) సెక్షన్ల కింద ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేసి, గుంటూరులో కోర్టుకి ఇచ్చి, ఇది హైదరాబాద్ పోలీసులకు దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలని సిఐడి పోలీసులు కోరారు. ఈ రోజు సెలవు కావటంతో, రేపు ఈ ప్రాసెస్ నడవనుంది. మొత్తానికి, ఈ విధంగా రాధాకృష్ణ పైన కేసు పెట్టారు.

Advertisements

Latest Articles

Most Read