జై భీమ్ సినిమా ఎంతటి హిట్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో సూర్య హీరోగా నటించారు. హీరో సూర్య క్యారక్టర్, జస్టిస్ చంద్రుకి సంబందించింది. దీంతో ఆయన ఉన్నట్టు ఉండి ప్రచారంలోకి వచ్చారు. మానవ హక్కుల కోసం పోరాడారు అనే పేరు ఆయనకు ఉంది. జై భీమ్ సినిమా సదస్సు అంటూ, జస్టిస్ చంద్రు విజయవాడ వచ్చారు. దళితులు కొంత మంది ఆయన్ను తీసుకుని రావటంతో, ఆంధ్రప్రదేశ్ లో దళితుల పై జరుగుతున్న దమనకాండ విషయంలో, ఆయన మాట్లాడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయాన అనూహ్యంగా, వైసిపీ పార్టీ ఎప్పుడూ చేసే ఆరోపణలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. కోర్టులు జగన్ పాలనను అడ్డుకుంటున్నాయి అంటూ, పల్లవి అందుకున్నారు. కోర్టు ఊరికే అడ్డుకుంటాయా ? చట్ట ప్రకారం నిర్ణయాలు ఉంటే అడ్డుకుంటాయి. మరి జస్టిస్ గా చేసిన చంద్రు, ఇది కూడా ఆలోచించ కుండా ఎందుకు ఇలా ఆరోపణలు చేసారు అనే చర్చ జరుగుతుంది. జస్టిస్ చంద్రు కళ్ళకు ఎవరు గంతలు కట్టారు అనే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అనేక దళితుల దమనకాండలు గురించి, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పడుతున్నాయి. ఈ కింద జరిగిన సంఘటనలకు జస్టిస్ చంద్రు ఏమి సమాధానం చెప్తారని అడుగుతున్నారు.
" మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ ను పిచ్చి వాడిని చేసి చంపేసాలా చేసారు. లిక్కర్ మాఫియాని ప్రశ్నించినందుకు ఓం ప్రాతప్ తరువాత రోజు చనిపోయాడు. ఇసుక మాఫియాని ఎదిరిస్తే, వైసీపీ నాయకుడైన కృష్ణమూర్తి, వరప్రసాద్ కు శిరోముండనం చేసాడు. మాస్కు పెట్టుకోలేదని ప్రకాశం జిల్లాలో కిరణ్ ని -కొట్టి చం-పా-రు. పల్నాడులో దళిత యువకుడు విక్రమ్‌ను హ-త్య చేయించారు. రాజమండ్రిలో 16 ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12 మంది గ్యాంగ్ రే-ప్ చేసి పోలీస్ స్టేషన్ ఎదుటే పడేసారు. దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణ ని వేధించి, జైలు పాలు చేసారు. మరో దళిత మేజిస్ట్రేట్ శ్రావణ్‌కుమార్ ను నిత్యం వేధిస్తున్నారు. దళిత డాక్టర్ అనితారాణిని మానసికంగా వేధించారు. అమరావతి దళిత రైతులను బూటు కాళ్ళతో తన్ని, వారి పైనే ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారు. దళితుల అసైన్మెంట్ భూములు లాక్కొన్నారు. దళితులకు పారిశ్రామిక రాయితీలు కోత పెట్టి, దళితుల ఎదగకుండా తొక్కారు. ఫ్రంట్ లైన్ వర్కర్ అయిన దళిత యువతి లక్ష్మీ అపర్ణను విశాఖ నడిరోడ్డులో పోలీసులు పడదోసి రెక్కలు విరిచి ఘోరంగా అవమానించారు. పులివెందులలో దళిత మహిళను మా-న-భం-గం చేసి హ-త్య చేస్తే దిక్కు లేదు." ఇలా అనేక సంఘటనలు ఉన్నాయని, వీటి పైన ఏమి చెప్తారని ప్రశ్నిస్తున్నారు.