జై భీమ్ సినిమా ఎంతటి హిట్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో సూర్య హీరోగా నటించారు. హీరో సూర్య క్యారక్టర్, జస్టిస్ చంద్రుకి సంబందించింది. దీంతో ఆయన ఉన్నట్టు ఉండి ప్రచారంలోకి వచ్చారు. మానవ హక్కుల కోసం పోరాడారు అనే పేరు ఆయనకు ఉంది. జై భీమ్ సినిమా సదస్సు అంటూ, జస్టిస్ చంద్రు విజయవాడ వచ్చారు. దళితులు కొంత మంది ఆయన్ను తీసుకుని రావటంతో, ఆంధ్రప్రదేశ్ లో దళితుల పై జరుగుతున్న దమనకాండ విషయంలో, ఆయన మాట్లాడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయాన అనూహ్యంగా, వైసిపీ పార్టీ ఎప్పుడూ చేసే ఆరోపణలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. కోర్టులు జగన్ పాలనను అడ్డుకుంటున్నాయి అంటూ, పల్లవి అందుకున్నారు. కోర్టు ఊరికే అడ్డుకుంటాయా ? చట్ట ప్రకారం నిర్ణయాలు ఉంటే అడ్డుకుంటాయి. మరి జస్టిస్ గా చేసిన చంద్రు, ఇది కూడా ఆలోచించ కుండా ఎందుకు ఇలా ఆరోపణలు చేసారు అనే చర్చ జరుగుతుంది. జస్టిస్ చంద్రు కళ్ళకు ఎవరు గంతలు కట్టారు అనే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అనేక దళితుల దమనకాండలు గురించి, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పడుతున్నాయి. ఈ కింద జరిగిన సంఘటనలకు జస్టిస్ చంద్రు ఏమి సమాధానం చెప్తారని అడుగుతున్నారు.

chandru 12122021 2

" మాస్కులు అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ ను పిచ్చి వాడిని చేసి చంపేసాలా చేసారు. లిక్కర్ మాఫియాని ప్రశ్నించినందుకు ఓం ప్రాతప్ తరువాత రోజు చనిపోయాడు. ఇసుక మాఫియాని ఎదిరిస్తే, వైసీపీ నాయకుడైన కృష్ణమూర్తి, వరప్రసాద్‌ కు శిరోముండనం చేసాడు. మాస్కు పెట్టుకోలేదని ప్రకాశం జిల్లాలో కిరణ్ ని -కొట్టి చం-పా-రు. పల్నాడులో దళిత యువకుడు విక్రమ్‌ను హ-త్య చేయించారు. రాజమండ్రిలో 16 ఏళ్ల దళిత మైనర్‌ బాలికపై 12 మంది గ్యాంగ్‌ రే-ప్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పడేసారు. దళిత మేజిస్ట్రేట్‌ రామకృష్ణ ని వేధించి, జైలు పాలు చేసారు. మరో దళిత మేజిస్ట్రేట్‌ శ్రావణ్‌కుమార్‌ ను నిత్యం వేధిస్తున్నారు. దళిత డాక్టర్‌ అనితారాణిని మానసికంగా వేధించారు. అమరావతి దళిత రైతులను బూటు కాళ్ళతో తన్ని, వారి పైనే ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారు. దళితుల అసైన్‌మెంట్‌ భూములు లాక్కొన్నారు. దళితులకు పారిశ్రామిక రాయితీలు కోత పెట్టి, దళితుల ఎదగకుండా తొక్కారు. ఫ్రంట్ లైన్ వర్కర్ అయిన దళిత యువతి లక్ష్మీ అపర్ణను విశాఖ నడిరోడ్డులో పోలీసులు పడదోసి రెక్కలు విరిచి ఘోరంగా అవమానించారు. పులివెందులలో దళిత మహిళను మా-న-భం-గం చేసి హ-త్య చేస్తే దిక్కు లేదు." ఇలా అనేక సంఘటనలు ఉన్నాయని, వీటి పైన ఏమి చెప్తారని ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో బ్లూమీడియా చేసే మాయ అంతా ఇంతా కాదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించటం, ఆ బ్లూ మీడియా స్టైల్. వాళ్ళే తప్పులు చేస్తారు. ఆ తప్పులను ఎదుటి వాళ్ళ మీదకు ఆపాదించి, బురద చల్లుతారు. బ్లూ మీడియాలో వచ్చే అంశాలు, సోషల్ మీడియాలో పేటీయం బ్యాచ్ తీసుకుని, ప్రజలను మభ్య పెట్టి, నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి సంఘటనే నిన్న జరిగింది. ఏపి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంటి మీదకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే లక్ష్మీనారాయణ తన స్నేహితుడు కావటంతో, ఏబీఎన్ రాధాకృష్ణ అక్కడకు వెళ్లారు. అలాగే లక్ష్మీనారాయణ బంధువు అయిన పయ్యావుల కేశవ్ కూడా అక్కడకు వచ్చారు. ఇంకేముంది బ్లూ మీడియా రెచ్చిపోయింది. టిడిపి గ్యాంగ్ హాల్ చల్ అంటూ కధనాలు వండి వార్చింది. ఏబీఎన్ రాధాకృష్ణ, సిఐడి అధికారులను అడ్డుకున్నారని, లోపలకు రానివ్వటం లేదు అంటూ, కధనాలు రాసింది. టీవిలో వేయటమే కాక, తమ బులుగు పత్రికలో కూడా ఇదే రాసాయి. దీంతో కొంత మందికి కూడా ఇదే నిజం అని నమ్మారు. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ, ఏబీఎన్ యాజమాన్యం, అసలు నిజాలు, వీడియోలు రూపంలో బయటకు వదిలి, బ్లూ మీడియా ప్రచారాన్ని తిప్పి కొట్టింది.

sakshi 122122021 2

అక్కడ జరిగిన సంఘటనను, కొన్ని మీడియా చానల్స్ వీడియో తీసాయి. ఆ వీడియోలు పరిశీలిస్తే, ఎక్కడా రాధాకృష్ణ సిఐడి అధికారులను అడ్డుకున్నట్టు లేదు. మీరు ఎందుకు అరుస్తారు, సిఐడి అధికారులకు సహకరించండి, వారే పని చూసుకుని వెళ్ళిపోతారు అని రాధాకృష్ణ చెప్పిన మాటలు స్పష్టంగా వీడియోలు ఉంది. అయినా అప్పటికే సిఐడి అధికారులు లోపల ఉన్నారు. మరి రాధాకృష్ణ అడ్డుకోవటం ఏమిటో, బ్లూ మీడియాకే తెలియాలి. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, మీరు వారితో వాదన పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. మీరు వారికి సహకరించండి అని చెప్పారు. దీంతో అక్కడ పరిస్థితి కూల్ అయ్యింది. అలాగే సిఐడి అధికారులు కూడా, మీరు ఇక్కడే కొద్ది సేపు ఉండండి, మీరు ఉంటే వాళ్లు సహకరిస్తారు అంటూ సిఐడి అధికారులు రాధాకృష్ణతో చెప్పిన మాటలు కూడా వీడియోలో ఉన్నాయి. నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అని ఆర్కే చెప్పగా, అవసరం లేదు మీరు ఉండండి, మా పనికి ఇబ్బంది లేదు అని సిఐడి అధికారులు అన్నారు. దీంతో ఈ వీడియో విడుదల చేసిన రాధాకృష్ణ, దీనికి ఏమి సమాధానం చెప్తారు అంటూ, బ్లూ మీడియాను ఛాలెంజ్ చేసారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ వైఖరి పైన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పని చేస్తున్నట్టు కనిపించటం లేదు అంటూ, కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో, ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ లేదు. రాజధాని గ్రామాల్లో, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవటం పైన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. అసలు రాజధాని గ్రామాల్లో ఉన్న ప్రజలు దేని కిందకు వస్తారు అని కోర్టు ప్రశ్నించింది. వారు పురపాలక ప్రాంతానికి చెందిన వారా ? లేక నగర పాలక ప్రాంతానికి చెప్పిన వారా అని ప్రశ్నించింది. ప్రభుత్వం దీని పైన జవాబు ఇవ్వాలని ఆదేశించింది. అక్కడ ఇన్నాళ్ళు ఎన్నికలు నిర్వహించక పోతే, ప్రజలు వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించింది. ప్రజా ప్రతినిధులు లేక పొతే, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించింది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్, కోర్టుకు ఇచ్చిన వివరాలు చుస్తే, అసలు మీరు స్వతంత్రంగా పని చేసే వారేనా అనే అనుమానం కలుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికలు నిర్వహించే క్రమంలో మీరు, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా, లేదా అనే అనుమానం కలుగుతుందని, ఎలక్షన్ కమిషన్ ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.

hc 11122021 2

ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలి కానీ, ప్రభుత్వాన్ని ఎన్నికలకు సహకరించాలని అభ్యర్దించటం వింతగా ఉందని, కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించి, రాజ్యాంగం లోబడి పని చేయాలని అనుకుంటుందా, లేకపోతే ప్రభుత్వంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటుందా అంటూ, కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయం పైన తమకు స్పష్టత ఇవ్వాలని కోర్టు చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే మూడు రాజధానుల బిల్లుని రద్దు చేసింది కాబట్టి, సీఆర్డీఏ చట్టం మళ్ళీ తిరిగి అమలులోకి వచ్చింది కాబట్టి, అమరావతి ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ పైన, తమ అభిప్రాయాలను కోర్టుకు తెలపాలని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు పైన విచారణకు వారం రోజులకు వాయిదా వేసింది. రాజధాని పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ, కొంత మంది స్థానికులు హైకోర్టుని ఆశ్రయించిన కేసు విచారణలో భాగంగా, కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రక్షాళన చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి క్రూయల్ పార్టీని ఎదుర్కోవాలి అంటే, కొత్త తరం నేతలు రావాలని, ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు కొంత మంది పని చేయకుండా, అధినేత ముందు షో చేస్తున్నారని, మరి కొంత మంది నేతలు, డబుల్ గేం ఆడుతూ కోవర్ట్ లుగా మారిపోయారని, ఇన్నాళ్ళు పార్టీ కార్యకర్తలు, తమ అధినేత ముందు గోడు చెప్పుకుంటూ వచ్చే వారు. చంద్రబాబు కూడా పాత రోజుల్లో లాగా కాకుండా, ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవటం, మొహమాటాలకు పోవటంతో, ఇలాంటి నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా తాయారు అయ్యింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో, కొన్ని చోట్ల గెలిచినా, కొన్ని చోట్ల పోటీ ఇచ్చినా, కొన్ని చోట్ల మాత్రం ఘోరంగా ఓడిపోయారు. ఈ ఓటమి కేవలం పార్టీలో ఉన్న కోవర్ట్ ల వల్లే అని చంద్రబాబు వద్ద పూర్తి సమాచారం ఉండటంతో, చంద్రబాబు కూడా ఇక రంగంలోకి దిగారు. ఇన్నాళ్ళు క్యాడర్ కోరుకున్న పని చేయటం మొదలు పెట్టారు. ప్రక్షాళన మొదలు పెట్టారు. గత వారం రోజులుగా వరుస పెట్టి సమీక్షలు చేస్తున్న చంద్రబాబు, కుప్పం సమీక్ష సందర్బంగా ఒక కీలక వ్యాఖ్య చేసారు. పార్టీలో కోవర్ట్ లు ఉన్నారని, ఒక్కొక్కరిని ఏరి పడేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలు, ఇప్పుడు ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు.

cbn 11122021 2

ఈ రోజు నెల్లూరు కార్పొరేషన్ ఓటమి పై చంద్రబాబు సమీక్ష చేసారు. ఈ సమీక్ష సందర్భంగా, పాత చంద్రబాబుని చూసారు అక్కడ నాయకులు. నెల్లూరులో ఒక్క సీటు కూడా గెలవకుండా ఓడిపోవటం పై చంద్రబాబు నేతల పై సీరియస్ అయ్యారు. పార్టీలో ఉంటూ కోవర్ట్ గా పని చేసిన కిలారి వెంకటస్వామి నాయుడు సహా మరో నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. నగర నేతలు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లకు వార్నింగ్ ఇచ్చారు. పని తీరు మార్చుకోక పొతే కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు. అంతే కాదు, చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకుంటూ, నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలు అన్ని రద్దు చేసారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తరువాత, మరిన్ని సస్పెన్షన్ లు ఉంటాయని అన్నారు. ఇక నుంచి కుమ్మక్కు రాజకీయాలు ఉండవని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. కులం, మతం కార్డు ఉపయోగించి, రాజకీయాలు చేసే వారు, ఈ పార్టీలో అవసరం లేదని, పార్టీలో యువ రక్తాన్ని ఎక్కించి, పార్టీని లైన్ లో పెడతానని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read