రాయలసీమ ప్రాంతానికి చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సెటిల్మెంట్ వ్యవహారం, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అధికార పార్టీ ఎంపీగా ఉన్న వ్యక్తీ గతంలో ఒక సర్కిల్ స్థాయి అధికారిగా గతంలో రాయలసీమ ప్రాంతంలో పని చేసారు. సర్కిల్ స్థాయి అధికారిగా పని చేస్తున్న సమయంలో, ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే వారు. ఎక్కడైతే వివాదాస్పద అంశాలు ఉంటాయో, అక్కడ హడావిడి చేసి హైలైట్ అయ్యే విధంగా, తాను గతంలో పని చేసిన చోట ఈ ఎంపీ ఉండే వారనే గుర్తింపు ఉంది. ఈ వివాదాలు నేపధ్యంలోనే, పది ఏళ్ళ క్రితం ఒక దళిత మహిళకు సంబంధించి, ఒక వివాదం నడుస్తుంది. అప్పటి నుంచి ఒక అత్యాచారం కేసు ఆరోపణలు ఆ ఎంపీ ఎదుర్కుంటున్నారు. దాదాపుగా పదేళ్ళ క్రితం నాటి కేసు, ఇప్పటికీ లైవ్ లో ఉండటం, మళ్ళీ ఆ కేసు వెలుగులోకి రావచ్చు అనే అభిప్రాయం ఉండటంతో, ఆ ఎంపీ, గతంలో తన బ్యాచ్ మేట్స్ గా ఉన్నవారిని రంగంలోకి దింపారు. ఈ కేసుని ఏ విధంగా అయినా సరే మూసేయాలని, ఎలాగైనా సరే బాధితులతో మాట్లాడి, కేసు కొట్టివేసే విధంగా తనకు సహకరించాలని కూడా, ఆ ఎంపీ తన బ్యాచ్ మేట్స్ ను రంగంలోకి దింపారు. దీంతో తమ స్నేహితుడు కోరికను తీర్చటానికి వారు కూడా రంగంలోకి దిగారు.
ఇందులో భాగంగానే వాళ్ళు అందరూ రంగంలోకి దిగి, ఈ కేసును ఎలాగైనా కొట్టేసే విధంగా చేయటానికి ప్లాన్ వేసారు. దీంతో విజయవాడలోని ఒక పెద్ద హోటల్ లో, రెండు నెలలు క్రితం ఒక సీక్రెట్ సెటిల్మెంట్ నిర్వహించినట్టు, ఈ రోజు ఒక ప్రముఖ పత్రికలో కధనాలు వచ్చాయి. ఈ సెటిల్మెంట్ లో భాగంగా, దళిత సామాజికవర్గానికి చెందిన ఆ మహిళ తరుపు కొంత మంది వ్యక్తులను కూడా పిలిపించి, దాదాపుగా రెండు రోజులు పాటు, అక్కడే ఉంచి, ఈ కేసుని కాంప్రమైజ్ చేయాలని, ఈ కేసు కొనసాగితే ఎంపీకి ఇబ్బంది అవుతుందని కూడా, వాళ్ళు హెచ్చరికలు జారీ చేసారు. కేసుని కాంప్రమైజ్ చేసేలా, కుటుంబం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. మొత్తానికి కొంత మొత్తానికి, బేరం చేసుకుని, ఈ కేసు విషయంలో రాజీకి వచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావటంతో, ఆ మహిళ మళ్ళీ ఒక డీఎస్పీ స్థాయి అధికారిని కలిసి, కేసుని కొనసాగించాలని కోరినట్టు కధనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.