ఆర్ధిక కష్టాల్లో ఉన్న జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఎక్కడ డబ్బులు అంటే అక్కడ తీసి వాడేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మన దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డబ్బులు చెల్లించకపోవటం పై హైకోర్టు సీరియస్ అయ్యింది. ముఖ్యంగా సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు జూన్ నెల డబ్బులు, ఇప్పటికీ ఇవ్వకపోవటం పై కోర్టు ఆదేశాలు ఇస్తూ, ఈ నెల 29 లోపు వారికి డబ్బులు చెల్లించాల్సిందే అని ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం తమకు జనవరి 15 వరకు సమయం కావాలని కోరగా, అందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. తమ ఆదేశాలు పాటించాల్సిందే అని, మేము చెప్పిన సమయం లోపు బకాయలు తీర్చక పొతే, కోర్టు ధిక్కరణ కేసు ఓపెన్ చేయాల్సి ఉంటుందని, అలాగే విద్యుత్ శాఖ ముఖ్య అధికారులను కూడా కోర్టుకు రాప్పించాల్సి ఉంటుందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక పక్క ప్రజల నుంచి ప్రతి నెల కరెంటు బిల్లులు వసూలు చేస్తూ, విద్యుతు ఉత్పత్తి సంస్థలకు డబ్బులు చెల్లించక పోతే ఎలా అంటూ, కోర్టు ఆగ్రహించింది. తాము ప్రతి త్రైమాసికానికి పేమెంట్లు చేయాలని కోరుతుంటే, మీరు మాత్రం, నెలకు విభజించి, నెల వారీగా చెల్లింపులు చేస్తామని ఎలా చెప్తారని, ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.

hc 09122021 2

గత రెండు క్వార్టర్ లకు సంబంధించి, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఎప్పటి లోగా చెల్లింపులు చేస్తారు అనేది, తమకు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒక పక్క వినియోగదారుల దగ్గర బిల్లులు వసూలు చేస్తూ, మరో పక్క సంస్థలకు మాత్రం బకాయిలు పెట్టటం సరి కాదు అంటూ, కోర్టు ఆక్షేపించింది. ఈ కేసుని ఈ నెల 29కి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ముందుకు వచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పీపీఏలను సమీక్ష చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, సింగల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వగా, సింగెల్ బెంచ్ తీర్పు పై హైకోర్టు డివిజినల్ బెంచ్ ను ఆశ్రయించాయి సోలార్, విండ్ కంపనీలు. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఇరు పక్షాలు హోరాహరీ వాదనలు వినిపించాయి. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, నిధులు మళ్ళించాం అని చెప్పటం కరెక్ట్ కాదని, తమకు కొంత సమయం కావాలని కోరగా, కోర్టు మాత్రం 29కే చెల్లించాలని, లేకపోతే కోర్ట్ ధిక్కరణ కింద పరిగణిస్తాం అని ఆదేశాలు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక స్కాంలు జరుగుతున్న విషయం పై, ప్రతిపక్షాలు, మీడియా ప్రతి రోజు ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. అయితే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, అది నిజమో, అబద్ధమో తెలిసే అవకాసం అయితే లేదు. ఒకటి మాత్రం నిజం, లెక్కల్లో తేడాలు అయితే ఉన్నాయి. తెస్తున్న అప్పుకు, పెట్టే ఖర్చుకి, అబివృద్ధి అనేది అసలు లేకపోవటంతో, చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంచితే, ఏపిలో సామాన్య ప్రజలకు కూడా తెలిసిన స్కాం, ఎఫెక్ట్ అయిన స్కాం ఏంటి అంటే, మద్యం. ఏపిలో మద్యం అంటేనే , అందరూ షాక్ అవుతారు. ముందుగా ఇక్కడ రేట్లు ఎక్కడా ఉండవు. అదేమిటి అంటే, ఎక్కువగా తాగకుండా ఉండటానికి, జగన్ మార్క్ స్కెచ్ అంటారు. తాగే వారు తగ్గుతున్నారా అంటే, ఆ దేవుడికే తెలియాలి. ఇక రెండోది బ్రాండ్లు. చిత్ర విచిత్రమైన బ్రాండ్ పేర్లు ఉంటున్నాయి. అసలు ఆ పేర్లు ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండవు. అలాంటి బ్రాండులు ఉంటున్నాయి. ఇక మూడోది ఆ పిచ్చి బ్రాండులు తయారు చేసే కంపెనీలు. ఆ కంపెనీలు ఎవరివో అందరికీ తెలిసిందే. అన్నిటి కంటే, ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. మద్యం షాపుల్లో కేవలం నగదు రూపంలోనే పేమెంట్ చేయాలి అనే కండీషన్ పెట్టారు. ఎక్కడా కార్డులు కానీ, ఇతర డిజిటల్ పేమెంట్ చేసే సదుపాయం లేదు.

rrr 09122021 2

ఇది కూడా ఒక పెద్ద స్కాం అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదే విషయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్లమెంట్ లో ఈ విషయం లేవనెత్తారు. మన దేశం డిజిటల్ ఇండియా అంటూ, డిజిటల్ పేమెంట్స్ ని ప్రోత్సహిస్తుందని అన్నారు. దీని ద్వారా అవినీతి కూడా తగ్గుతుందని అన్నారు. అయితే మా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తి వ్యతిరేకంగా జరుగుతుందని అన్నారు. మా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎక్కువగా మద్యం నుంచి వస్తుందని, దాదాపుగా 40 వేల కోట్ల రూపాయల ఆదాయం కేవలం మద్యం మీద వస్తుందని అన్నారు. ఇంత పెద్ద మొత్తం, కేవలం క్యాష్ రూపంలోనే జరుగుతుందని, ఎక్కడా డిజిటల్ పేమెంట్ ఒప్పుకోవటం లేదని అన్నారు. ఇదే విషయం మా ముఖ్యమంత్రికి ఇచ్చిన ఏమి లాబ్ధం లేదని అన్నారు. ఇలా చేస్తే పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడే అవకాసం ఉంటుందని, అందుకే మా రాష్ట్రంలో మద్యం అమ్మకాల పై డిజిటల్ పేమెంట్స్ కూడా పెట్టేలా చూడాలని, తద్వారా అవినీతి లేకుండా ఉంటుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో భారీ యూ-టర్న్ తీసుకుంది. ఈ మధ్య కాలంలో వరుస పెట్టి, యూ-టర్న్ లు తీసుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ రోజు మరో యూ-టర్న్ తీసుకుంది. అదికూడా హైకోర్టులో. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే చాలా నిర్ణయాలు తల తిక్క నిర్ణయాలు అంటూ, ఇప్పటికే అనేక మంది ప్రతి అంశంలో విమర్శలు చేస్తూ ఉంటారు. కోర్టులలో కూడా అనేక నిర్ణయాలు కొట్టేసారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు మమ్మల్నే ఎదిరిస్తారా ? మమ్మల్నే విమర్శిస్తారా అని ఎదురు తిరిగే వారు. అయితే, ఈ మధ్య కాలంలో తత్త్వం బోధ పడి మడమ తిప్పను, మాట తప్పను అనే వాళ్ళే, ఇప్పుడు భారీ భారీ యూ-టర్న్ లు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల పై వెనక్కు తగ్గారు. మళ్ళీ పెడతాం అని చెప్తున్నా, అది జరిగే పనిలా కనిపించటం లేదు. అలాగే శాసనమండలి పైన కూడా వెనక్కు తగ్గారు. తాజాగా ఈ రోజు గ్రామ కార్యదర్శులనుగా పని చేసే వారిని మహిళా కానిస్టేబుళ్లు అంటూ తీసుకున్న నిర్ణయం పై వెనక్కు తగ్గారు. ఈ నిర్ణయం ప్రకటించినప్పుడే అనేక మంది విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం, పోలీస్ పదవులు, ఇలా ఎలా ఇస్తారు అంటూ, అనేక మంది విమర్శలు చేసినా, ప్రభుత్వం లెక్క చేయలేదు.

jagan 09122021 2

గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా నియమిస్తూ జీఓ నెంబరు 59న పైన, కొంత మంది హైకోర్టుకు వెళ్ళారు. దీని పైన ఈ రోజు విచారణ జరిగింది. దీని పైన ఈ రోజు ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలలో ఉన్న మహిళా కార్యదర్శులను, మహిళా పోలీసులుగా నియమిస్తూ జారీ చేసి, వారికి ఒక ప్రత్యెక డ్రెస్ కోడ్ కూడా ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవోని ఉపసంహరించుకుంటున్నాం అని, కోర్టుకు తెలిపారు , ప్రభుత్వం తరుపు న్యాయవాది. డ్రెస్ కోడ్ ని కూడా తీసేస్తున్నాం అని అన్నారు. అయితే వారి సేవలను ఎలా ఉపయోగించు కోవాలి అనే విషయం ప్రభుత్వం చర్చిస్తుందని కోర్టుకు తెలిపారు. ఈ పూర్తి విషయాలు అన్నిటినీ, ఈ పూర్తి సమాచారాన్ని, వచ్చే విచారణ లోపు కోర్టుకు చెప్తాం అని చెప్పారు. దీంతో కోర్టు ఈ కేసు వాయిదా వేసింది. మొత్తానికి 13 వేల మందిని ఇష్టం వచ్చినట్టు, పోలీసులగా నియమిస్తూ, తీసుకున్న నిర్ణయం పై వెనక్కు తగ్గింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభాజించే సమయంలో, మన రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ చట్టంలో కూడా పెట్టారు. దాదాపుగా 18 హామీలు కేంద్రం ఇచ్చింది. గత టిడిపి హాయాంలో, పోరాటాలు చేసి చేసి, పాక్షికంగా కొన్ని రాబట్టింది అప్పటి ప్రభుత్వం. చంద్రబాబు ఏమి సాధించ లేడు, నన్ను గెలిపించండి, నేను ఢిల్లీ వెళ్తాను, మోడి మెడలు వంచి హోదాతో పాటుగా, అన్ని విభజన హామీలు తీసుకుని వస్తానని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి హామీ నమ్మి, ప్రజలు భారీగా ఓట్లు వేసి, ఆయన్ను గెలిపించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి గెలిచిన తరువాతే, మోడీకి పూర్తి మెజారిటీ ఉంది, ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప మనం ఏమి చేయలేం అని తేల్చి చెప్పారు. ఇక ఇదే అలుసుగా తీసుకున్న కేంద్రం, ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా అప్పటి నుంచి ఇవ్వలేదు. నిజానికి రాజ్యసభలో వైసీపీ సభ్యులు మద్దతు బీజేపీకి చాలా అవసరం. మీరు మా హామీలు నెరవేర్చితేనే, మేము మీ బిల్లుకి మద్దతు ఇస్తాం అని, కేంద్రం ఒప్పుకోక ఏమి చేస్తుంది ? తాజాగా నిన్న కేంద్రం పార్లమెంట్ లో ఒక కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇక రైల్వే జోన్లు ఎవరికీ ఇవ్వం అని చెప్పింది, అయితే ఇప్పటికే వైజాగ్ కి రైల్వే జోన్ ప్రకటించినా, ఆ పేరు మాత్రం ఇప్పటికే ప్రకటించిన లిస్టు లో ఇవ్వలేదు.

ramu 09122021 2

దీంతో ఇక విశాఖకు రైల్వే జోన్ అంశం కూడా అస్సాం అనే చెప్పాలి. అయితే ఈ అంశం పై వైసీపీ నుంచి అంత మంది ఎంపీలు ఉన్నా, ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ అంశం పై పార్లమెంట్ లో ఒత్తిడి పెట్టలేదు. ఈ రోజు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు జీరో హావర్ లో ఈ అంశం లేవనెత్తారు. మా రాష్ట్రానికి రైల్వే జోన్ అనేది చట్టంలో ఉందని అన్నారు. అయితే 2019లో కేంద్రం ప్రకటన చేసినా, దీని పై మూడేళ్ళు అయినా అడుగు పడలేదని అన్నారు. అయితే ఈ మధ్య కేంద్రాన్ని ఒక ప్రశ్న అడిగితే, విశాఖ రైల్వే జోన్ కోసం 40 లక్షలు ఇచ్చాం అన్నారని, ఇది మా రాష్ట్రాన్ని అవమానించటమే అని రామ్మోహన్ అన్నారు. ఆ డబ్బులతో ఒక బిల్డింగ్ కూడా రాదనీ అన్నారు. అయితే నిన్న కేంద్రం మళ్ళీ అసలు విశాఖ రైల్వే జోన్ గురించి చెప్పకుండా, కొత్తవి కూడా ఏర్పాటు చేయం అని చెప్పిందని, అసలు ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు కాబట్టి, కేంద్రం ఈ అంశంలో తమకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. విశాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా ప్రారంభించాలని, ఈ మొత్తం అంశం పై కేంద్రాన్ని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. ముగ్గురు టిడిపి ఎంపీలే ఇలా గర్జిస్తుంటే, మరి 22 మంది వైసిపీ ఎంపీలు ఏమి చేస్తున్నారో ? పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/wGKthXsat7I

Advertisements

Latest Articles

Most Read