ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కాకినాడలో, భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్రమే చొరవ తీసుకోవాలని, ఏపి విభజన చట్టంలో స్పష్టం చేసారు. ఆ మేరకు కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి అంటూ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. దానికి సంబందించిన సాధ్యా సాధ్యాల పైన కూడా అధ్యయనం జరిగింది. రూ.32,901 కోట్ల వ్యయంతో, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు, అప్పటి ప్రభుత్వంతో, గెయిల్, హెచ్పీసీఎల్ లు కూడా ఒప్పందం చేసుకున్నాయి. 2017 జనవరి 27న ఒప్పందం చేసుకున్నాయి. అయితే వయబులిటీ గ్యాప్ ఫండింగ్ విషయంలో, గెయిల్, హెచ్పీసీఎల్ తరువాత మెలిక పెట్టాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో లాభ నష్టాలకు సంబంధించి ఏమైనా గ్యాప్ వస్తే, ఆ గ్యాప్ ని మాత్రం, రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని, ఆ కంపెనీలు ప్రతిపాదన పెట్టాయి. ఏపి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పెట్టాయి. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాలి అంటే, ఈ వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, భరించాల్సి ఉంటుందని, ఆయిల్ కంపెనీలు మెలిక పెట్టాయి. వయబులిటీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ప్రతిపాదన పెట్టాయి.
అయితే ఈ వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ను సమకూర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం పలు సార్లు కోరింది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఎప్పటి లాగే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, రాజ్యసభలో ఈ కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సంగతి ఏమిటి అంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి సమాధానం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ సమకూర్చాలని, కేంద్రం పలు సార్లు కోరిందని కేంద్ర మంత్రి చెప్పారు. పెట్రో కెమికల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు, భారీ మూల ధన వ్యయం, అలాగే పెట్టుబడులు అవసరం కూడా ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇది ఆర్ధికంగా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని, పన్నులు వస్తాయని, అందుకే రాష్ట ప్రభుత్వం, ఈ వయబులిటీ గ్యాప్ ఫండింగ్ పైన ఎక్కువ ఆలోచన లేకుండా, తగిన నిర్ణయం తీసుకుంటే, రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు.