ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, సోము వీర్రాజు సంచలన ప్రకటన చేసారు. తాను 2024 తరువాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని, 2024 తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ సంచలన ప్రకటన చేసారు. 2024లో బీజేపీకి అధికారం ఇవ్వాలని సోము వీర్రాజు ఈ సందర్భంగా కోరారు. ఇటీవల జరిగిన కోర్ కమిటీ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలను బీజేపీ తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పైన, గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని విషయాల పైన దూకుడుగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతి ఉద్యమం దగ్గర నుంచి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకం, జగన మోహన్ రెడ్డి చేస్తున్న అప్పులు, ఇలా అన్ని విషయాల పైన పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత క్యాష్ చేసుకోవటం కోసం ఉద్యామాలు తీవ్రతరం చేయాలని, ఈ మధ్య కోర్ కమిటీ సమావేశం అయ్యి, గట్టిగా పని చేయాలని, ఎలాగైనా ఏపిలో బీజేపీని అధికారంలోకి తేవాలని, నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం మొత్తం కార్యచరణ సిద్ధం చేసారు. ఈ నేపధ్యంలో, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూనే, ముందు ఉండి నడిపించాలసిన సోము వీర్రాజు, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పటం పై, పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

veeraju 07122021 2

అనూహ్యంగా సోము వీర్రాజు, తాను 2024 తరువాత రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పటంతో, అటు బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా షాక్ అయ్యారు. సోము వీర్రాజు గత 42 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి, తరువాత బీజేపీలో కూడా అనేక పదవులల్లో పని చేసారు. చంద్రబాబు హాయంలో, టిడిపి సహకారంతో, ఎమ్మెల్సీ అయ్యి, ఎట్టకేలక సభలో అడుగు పెట్టారు. ప్రసుత్తం ఆయన బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన అధ్యక్ష పదవి కూడా చేపట్టి రెండేళ్ళు అవుతుంది. సహజంగా ప్రతి రెండేళ్లకు అధ్యక్షులను మార్చుస్తారు. ఈ సారి కూడా సోము వీర్రాజుని మార్చి కొత్త వారికి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలోనే సోము వీర్రాజు ఈ ప్రకటన చేయటం వెనుక, ఏమి వ్యూహం ఉందో, ఆయన ఆలోచన ఏమిటో తెలియదు కానీ, మొత్తానికి రాజకీయ సన్యాసం ప్రకటనతో, పలువురు విస్మయం వ్యక్తం చేసారు. ఆరోగ్య పరిస్థితి, వయసు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటన చేసారా ? లేదా ఇంకా ఏమైనా వ్యూహం ఉందా అనేది చూడాలి మరి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బాదుడే బాదుడుకి శ్రీకారం చుట్టుంది. అయితే ఈ బాదుడు సామాన్య ప్రజల పై డైరెక్ట్ బాదుడు కాదు కానీ, ఇన్ డైరెక్ట్ బాదుడు. ఇప్పటికే ఇంటి పన్నుని విలువ ఆధారంగా కట్టాలని ప్రభుత్వం చెప్పింది. దీంతో ఇంటి పన్ను, భారీగా పెరిగింది. తరువాత చెత్త పన్ను అన్నారు. తరువాత బాత్ రూమ్ పన్ను అన్నారు. ఇలా రకరకాలుగా బాదేస్తున్న, జగన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో మన ముందుకు వచ్చింది. ఎక్కడైనా ఒక లేఅవుట్ వేస్తే, అందులో 5% భూమి ప్రభుత్వానికి ఇవ్వాలి అంట. లేదా అక్కడ నుంచి మూడు కిమీ పరిధిలో ఎక్కడో ఒక చోట ఆ భూమి ఇవ్వాలి అంట. అదీ కుదరక పొతే, ఆ 5% భూమి విలువ ప్రభుత్వానికి కట్టాలి అంట. ఆ భూమిలో జగనన్న కాలనీలు నిర్మిస్తారాట. ఆహ్ షాక్ అయ్యారా. అవును అండి, ఇది నిజం. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేసారు. మనం సామాన్యంగా లేఅవుట్లు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఫ్లాట్లు వేసి అమ్ముతారు. సహజంగా ఇది కొనేది, మధ్య తరగతి వారే. తమ భవిష్యత్తు అవసరాల కోసం, రూపాయి రూపాయి కూడబెట్టుకుని, ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు. ఇది సహజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం. అయితే, ఇందులో సామాన్య ప్రజలకు ఏమి ఇబ్బంది, ఇది బొక్క పాడేది రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కదా అనుకుంటున్నారా ?

layout 07122021 2

ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు 5% భూమి ప్రభుత్వానికి ఇచ్చినా, అంత విలువ చేసే డబ్బులు కట్టినా, ఆ భారం వేసేది, అక్కడ ఫ్లాట్లు కొనుక్కునే మిడిల్ క్లాస్ వారి పైనే. లక్ష రూపాయాలలో, 5 వేలు ఇవ్వాలి అంటే, ఎవరికైనా బాదే కదా. అది మన మీద భారం వేస్తారు. అయితే ఇందులో ప్రభుత్వం ప్లాన్ మాత్రం, అద్భుతం అనే చెప్పాలి. ఇప్పడు లేఅవుట్ లు వేస్తే, అందులో 5% పేదల భూములకు ఇవ్వాలి అంటున్నారు. అంటే మిడిల్ క్లాస్ ఉండే చోట, ఇవి కడతారు. అంటే సామాజిక ఇబ్బందులు తలెత్తే అవకాసం ఉంటుంది. అందుకే భూమికి బదులు, ఎక్కువ మంది డబ్బు ఇవ్వటానికే ఇష్ట పడతారు. ఆర్ధిక కష్టాలలో ఉన్న ప్రభుత్వానికి, డబ్బు అవసరం కాబట్టి, చక్కగా ఈ రూపంలో డబ్బు అందుతుంది. ఈ ఐడియా ఎవరు ఇచ్చారో కానీ , అద్భుతం అనే చెప్పాలి. అయితే ఈ నిర్ణయం పైన, అసలు ఇది చట్టబద్దమా కాదా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ అంశం పైన ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు ఏమి అంటుందో చూడాలి. అయినా ఇప్పుడు లేఅవుట్ లో వాటా అడిగే వారు, రేపు మన సంపాదనలో కూడా వాటా అడగరు అనే గ్యారంటీ ఏమిటి ? ఈ ధోరణి ఎక్కడి వరకు వెళ్తుందో మరి.

"ఒక పరసంటా, అర పరసంటా చెప్తాం కదా.. వెయిటు.. ఎందుకు కంగారు పడతారు. వి విల్ కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్ బై డిసెంబర్ 2021" అంటూ అసెంబ్లీ సాక్షిగా రంకెలు వేసిన మంత్రి అనిల్ కుమార్ , మొన్న సోషల్ మీడియాలో హెవీ ట్రోలింగ్ కు గురయ్యారు. దీని పై స్పందించిన మంత్రి, మేము ఏమి చేయం, ఇదంతా చంద్రబాబు కుట్ర అని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కు కొత్త డేట్ ఇచ్చింది. అదే ఏప్రిల్ 2022. అయితే ఈ రోజు కేంద్రం పోలవరం విషయంలో అసలు విషయం చెప్పేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పోలవరం పై ఒక స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేయటం అసాధ్యం అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2022 ఏప్రిల్ లోపు పోలవరం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నా కూడా, అనేక అడ్డంకులు వల్ల, పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరుగుతందని కేంద్రం చెప్పింది. అలాగే ఈ పోలవరం పనులు ఎంత వరుకు జరిగాయి, ఏ పని ఎంత వరకు వచ్చిందో కూడా, కేంద్రం వివరణ ఇచ్చింది. కేంద్ర జల శక్తి సహాయ మంత్రి ఈ వివరాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు, కేంద్ర జల శక్తి సహాయ మంత్రి, ఈ వివరణ ఇచ్చారు.

polavaram 06122021 2

కేంద్ర మంత్రి సమాధానం బట్టి, ఒక ప్రణాళిక ప్రకారం అయితే, పనులు జరగటం లేదు అనేది స్పష్టం అవుతుంది. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి అవ్వటం అసాధ్యం అని చెప్తూనే, ఆ తరువాత ఎప్పటికి ఈ పనులు పూర్తవుతాయి అనే విషయం కూడా, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఇక ఈ పనుల్లో జాప్యం జరగటానికి కారణం, పునరావాసం, పరిహారం పనుల్లో కూడా చాలా జాప్యం జరుగుతుందని, అది కూడా ఒక కారణం అంటూ , కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. స్పిల్ వే చానెల్ పనులు 88 శాతం పూర్తయితే, అప్రోచ్ ఛానెల్ ఎర్త్ వర్క్ పనులు 73 శాతం అయ్యాయని, పైలట్ చానెల్ పనులు అయితే కేవలం 34 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. మరో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు, కేలవం పోలవరం నీటి ప్రాజెక్ట్ కు మాత్రమే తాము నిధులు కేటాయించినట్టుగా చెప్పారు. కేవలం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు మాత్రమే ఇస్తాం అని చెప్తూ, 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి కాదని తేల్చి చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు బూతులు తిట్టటంలో సిద్ధ హస్తులు అనేది అందరికీ తెలిసిందే. చివరకు అసెంబ్లీ వేదికగా కూడా ఈ వ్యాఖ్యలు చేయటం, అది ఎంత రచ్చ అయ్యిందో చూసాం. బూతులు మాట్లాడితే, ప్రత్యర్ధి సైలెంట్ అయిపోతాడు అనే వ్యూహమో ఏమో కానీ, ఇప్పుడు ఇదే వ్యూహం పార్లమెంట్ లో కూడా అమలు చేసినట్టు, రఘురామరాజు ఏకంగా ప్రధానికి, లోక సభ స్పీకర్ కు ఇచ్చిన ఫిర్యాదు చూస్తే అర్ధం అవుతుంది. ఈ రోజు జీరో హావర్ లో తాను అమరావతి రైతుల పాదయాత్ర, పోలీసులు పెడుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడుతూ ఉండగా, వైసీపీ ఎంపీ అయిన నందిగం సురేష్, తనను ల.కొడకా అని బూతులు తిట్టారని రఘురామరాజు ప్రధాని మోడీకి, లోక సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. ఆ మాటను పదే పదే వాడారని, గతంలో కూడా తన ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తానని మాట్లాడాడని, ఆ విషయం పై ఇప్పటికే ఫిర్యాదు చేసానని, దాని పై ఏమి చర్యలు తీసుకోలేదు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలు సభలో అన్నారేమో అని రఘురామరాజు లేఖలో తెలిపారు. ఆ వీడియోలు పరిశీలించి, అతిని పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ వార్త చూసిన పలువురు, ఈ బూతులను చివరకు పార్లమెంట్ కు కూడా తీసుకుని వెళ్ళటం పై ఆశ్చర్య పోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read