ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలను, పీల్చి పిప్పి చేస్తుంది ఓటీఎస్ స్కీం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో, ఒక కుటుంబలోని బాలుడుకి ఒంట్లో బాగోక పోవటంతో, విశాఖలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం అని, రూ.15 వేలు అప్పు తీసుకున్నారు. అయితే ఆ రూ.15 వేలుని బలవంతంగా ఓటీఎస్ స్కీం కింద జమ వేసుకున్నారు. అసలకే పేద వాళ్ళు, వైద్యం కోసం డబ్బులు లేక అప్పు చెస్తే, ఆ అప్పుని ఈ స్కీం కింద లాగేసుకున్నారు అంటూ, ఈ రోజు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటెం వచ్చింది. ఈ కధనం చూసి చంద్రబాబు చలించిపోయారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, ఈ సందర్భంగా ఈ బలవంతపు వసూళ్ళు చేస్తున్న ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటాం అని, వెంటనే వైద్యం కోసం ఎంత ఖర్చు అయితే అంత తెలుగుదేశం పెట్టుకుంటుందని చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నం తీసుకుని వెళ్లి, ఆరోగ్యం బాగు చేసి, మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తాం అని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పిన వెంటనే, మునిరత్నం అనే వ్యక్తీ ముందుకు వచ్చి, తాను కూడా ఆ బాలుడి వైద్యానికి సహాయం చేస్తానని ప్రకటించారు. దీంతో చంద్రబాబు ఆ ముని రత్నం అనే వ్యక్తిని అభినధించి, ఈ దుర్మార్గుల పైన పోరాటానికి, అందరూ కలిసి రావాలని అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ, "పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఆనాడే ఎన్టీఆర్ అందించారు - కూడు, గూడు, బట్ట అనే నినాదంతో ప్రభుత్వాన్ని నడిపిన ఏకైన నాయకుడు ఎన్టీఆర్ - ఏజెన్సీ ప్రాంతాల్లో పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది - ఇల్లు అనేది ఓ సెంటిమెంట్ - ఎన్టీఆర్ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాకే మిగిలిన నేతలూ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు - జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో మోసం చేస్తున్నారు - ఇళ్లకు ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా? - పట్టా ఇవ్వడానికి జగన్ ఎవరు?.. స్థలం ఇచ్చావా? ఇల్లు కట్టించవా? - ఇప్పుడున్న సీఎం భూమి, రూణం, నిర్మాణ ఖర్చు ఇచ్చారా? - పేదలను దోచుకోవడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యం - ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా? - ఓటీఎస్ కట్టని వారిని వాలంటీర్లు వేధిస్తున్నారు - డబ్బులు కట్టకపోతే పథకాలు రద్దవుతాయని బెదిరిస్తారా? - బలవంతంగా వసూలు చేస్తూ.. స్వచ్ఛందమంటారా? - ఇంటి రుణం మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు - ఎన్నికల ముందు జగన్‌ది ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట - మాట తప్పి మడమ తిప్పిన జగన్‌పై చీటింగ్ కేసు పెట్టాలి - తప్పుడు కేసులు పెడితే భయపడతారు అనుకుంటున్నారా?" అని అన్నారు.