అక్రమఆస్తుల కేసులు ఎదుర్కుంటున్న జగన్ మోహన్ రెడ్డి, ఆ కేసులు విచారణకు మాత్రం హాజరు కావటం లేదు. ఎన్నికల్లో గెలవకు ముందు వరకు, ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే వారు. పాదయాత్రలో ఉన్నా సరే , పాదయత్రకు సెలవు పెట్టి మరీ కోర్టుకు వెళ్ళే వారు. కానీ ఇప్పుడు గెలిచిన తరువాత మాత్రం, ప్రతి శుక్రవారం ఏదో ఒక కారణం చెప్పి, ఆయన విచారణకు వెళ్ళటం లేదు. దీని పైన ఇప్పటికే తాను ప్రతి వారం విచారణకు రాలేను, నా బదులు, మా లాయర్ వస్తారని కోర్టుకు చెప్పగా, సిబిఐ కోర్టు ఆ పిటీషన్ ని తిరస్కరించింది. కోర్టు ముందు హోదాలు పని చేయవని, కోర్టు ముందు ఎవరు అయినా ఒక్కటే అని, విచారణకు హాజరు కావాల్సిందే అని తేల్చి చెప్పింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి సిబిఐ ఆదేశాలను అపీల్ చేస్తూ, తెలంగాణా హైకోర్టుకు వెళ్ళారు. ఆయన తెలంగాణా హైకోర్టులో తాజాగా పిటీషన్ దాఖలు చేసారు. సిబిఐ కేసుల విచారణ కోసం, వారానికి అయుదు రోజులు తాను కోర్టుకు హాజరు కాలేనని, తాను అన్ని రోజులు కోర్టుకు వస్తే, రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయి అంటూ, ఆయన కోర్టుకు వేసిన పిటీషన్ లో తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి వేసిన పిటీషన్ ను, నిన్న తెలంగాణా హైకోర్టు విచారణ చేపట్టగా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం ముందు విచారణ జరిగింది.

tg hc 04122021 2

ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తరుపున వాదనలు వినిపిస్తూ, కోర్టుకు రావాలి అంటే, పాలనా పరమైన ఇబ్బందులు ఉంటాయని, అలాగే ప్రోటోకాల్ పాటించాలి కాబట్టి, భద్రతాపరమైన ఇబ్బందులు ఉంటాయని కోర్టుకు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వస్తే, ఆయన్ను కలవటానికి ఎక్కువ మంది కోర్టుకు వస్తారని, ఇది కూడా ఇబ్బంది అవుతుందని కోర్టుకు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి సియం కాక ముందు ప్రతి వారం కోర్టుకు వచ్చే వారని, ఏమైనా ప్రత్యేక కారణాలు ఉంటే, కోర్టు అనుమతి తీసుకునే వారని, కోర్టుకు తెలిపారు. ఈ కేసులు చాలా ఉన్నాయని, అంశాలు కూడా సంక్లిష్టంగా ఉన్నాయని, కేసులు విచారణకు చాలా సమయం పడుతుందని, ప్రతి సారి విచారణకు హాజరు కావాలి అంటే ఇబ్బందులు వస్తాయని, ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు నిందితులుగ ఉంటే, వారిని ఇబ్బంది పెట్టవద్దు అంటూ గతంలో ఇచ్చిన తీర్పులను కూడా కోర్టుకు ఇచ్చారు. అయితే కోర్టు కలుగ చేసుకుని, పీవీ నరసింహారావు ఎన్ని సార్లు వచ్చారని ప్రశ్నించారు. బీహార్ లాంటి చోట అంటే, సాక్ష్యులు భయపడతారు కానీ, ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. సిబిఐ కౌంటర్ కోసం, కేసుని ఈ నెల 6కు వాయిదా వేసింది.

ఉమ్మడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, కొణిజేటి రోశయ్య ఈ రోజు తెల్లవారు జామున హైదరాబాద్ సనత్ నగర్ లోని తన నివాసంలో, నిద్రలోని మరణించినట్టు తెలుస్తుంది. ఆయనకు నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చినట్టు , ఆయన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ముందుగా ఇంటికి సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తీసుకు వెళ్ళగా, అప్పటికే ఆయన మరణించారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రోశయ్య గారి పార్ధివదేహం హాస్పిటల్ లోనే ఉంది. మరి కొద్ది సేపట్లో ఆయన పార్ధివదేహాన్ని ఇంటికి తీసుకు రానున్నారు. ప్రస్తుతం రోశయ్య గారికి 88 ఏళ్ళు. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

డిగ్రీ కళాశాలల యాజమాన్యం సీట్ల కోటా భర్తీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల పై, రాయలసీమ డిగ్రీ కళాశాలల యాజమాన్యం హైకోర్టులోకి పిటీషన్లు వేసారు. పిటీషనర్లు తరుపున న్యాయవాదులు శ్రీ విజయ్, వెంకట రమణ, వీరా రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న అనంతరం, రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం, ఈ రోజు తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనం తీర్పులో, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలినట్టు అయ్యింది. డిగ్రీ కళాశాలల్లో యాజమాన్యం కోటా సీట్ల భర్తీ విషయంలో ప్రభుత్వం విధించిన పలు నిబంధనలను హైకోర్టు కొట్టి వేసింది. యాజమాన్యం కోటా సీట్ల భర్తీకి సంబంధించి, నోటిఫికేషన్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలని ఏదైతే నిబంధనలు విధించిందో, ఆ నిబంధనలు కూడా హైకోర్టు పక్కన పెట్టేసింది. దీంతో పాటుగా యాజమాన్య కోటా సీట్లు భర్తీ కూడా కన్వీనరే చేపడతారని చెప్పి, అది కూడా కౌన్సిలింగ్ ద్వారా అవుతాయని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం పెర్కొనటాన్ని కూడా, హైకోర్టు కొట్టేసింది. యాజమాన్యం కోటాలో జాయిన అయిన వారికి, ఎవరు అయితే ఎస్సీ ఎస్టీ, బీసి, మైనారిటీ, ఓబీసిలు ఉన్నారో, అర్హులైన వారు ఎవరు అయితే ఉన్నారో వారి అందరికీ కూడా, జగన్ విద్యా దీవెన పధకం కూడా వర్తింప చేయాలని చెప్పి, హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ప్రభుత్వానికి ఆదేశించింది.

jagan 03122021 2

అంతకు ముందు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్లు వేసే సమయానికి, ప్రభుత్వం మాత్రం యాజమాన్యం సీట్లు కోటా భర్తీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ, ఓబీసిలు ఎవరు అయితే ఉన్నారో, వారికి జగనన్న విద్యా దేవేన వర్తించదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టటం పై, రాష్ట్ర హైకోర్టు అబ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా, ఇలాంటి నిబంధనలు పెట్టటం, అసంజసం , అన్యాయం అని చెప్పి స్పష్టం చేసింది. సీట్ల భర్తీ విషయంలో యాజమాన్యాలు స్వేఛ్చగా వ్యవహరించవచ్చు అని కూడా రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు డీగ్రీ కాలేజీల్లో 70 శాతం కౌన్సిలింగ్ ద్వారా సీట్ల భర్తీతో పాటుగా, యాజమాన్యం కోటాకు సంబంధించి 30% ఏదైతే సీట్ల భర్తీ ఉందో, ఆ సీట్ల భర్తీని యాజమాన్యం చేసుకోవచ్చు అని చెప్పి, మూడు నిబంధనలు అయిన నోటిఫికేషన్ ఇవ్వటం, సీట్ల భర్తీని ప్రభుత్వమే చేయటం, అదే విధంగా జగన్ విద్యా దీవేన వర్తింపు, ఇలా ఈ మూడు నిబంధనలు హైకోర్టు కొట్టేస్తూ, ఈ రోజు తీర్పు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం హెచ్చరిక పంపించింది. కేంద్ర ప్రభుత్వ పధకాలు పేర్లు మార్చి, జగన్ పేరు పెట్టుకోవటం కుదరదు అని చాలా స్పష్టంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, ఏపికి రాసిన లేఖలో చాలా స్పష్టంగా చెప్పింది. కేంద్ర పధకాలకు, జగనన్న గోరు ముద్ద, జగనన్న పాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ లాంటి పేర్లు పెట్టటం పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా, కేంద్ర పధకాలకు జగన్ పేర్లు పెట్టటం పై కూడా, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక నివేదికను కోరింది. మరో పక్క 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్, అదే విధంగా ఐసీపీఎస్ పథకాలకు కేటాయించినటు వంటి రూ.187 కోట్ల లెక్కలు కూడా తమకు చెప్పాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పధకాలకు, ఏపి రాష్ట్ర ప్రభుత్వం తమకు నచ్చిన పేర్లు పెట్టుకోవటం అభ్యంతరకరం అని కూడా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పధకాలకు, రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చటం కుదరదు అని కూడా చాలా స్పష్టం చేసింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన పధకాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్లు మార్చటం, కేంద్రం ఇచ్చే వాటికి, జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ అంటూ పేర్లు పెట్టటం పై కేంద్రం సీరియస్ అయ్యింది.

smriti 03122021 2

అయితే ఈ విషయం పై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్రానికి లేఖ రాసి ఈ విషయం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, పధకాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్రానికి ఏ మాత్రం క్రెడిట్ ఇవ్వకుండా, వాటి పేర్లు మార్చేసి, జగన్ పేరు, ఆయన తండ్రి పేరు పెడుతూ పధకాలు ఇవ్వటం పైన, రఘురామకృష్ణం రాజు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కేంద్రానికి లేఖ రాసారు. దీని పైన ఈ రోజు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రఘురామకృష్ణం రాజు రాసిన లేఖకు సమాధానం చెప్పాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. ఇక పైన కేంద్రం పధకాలకు పేర్లు మార్చవద్దు అంటూ స్పష్టం చేసారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ, మరీ ముఖ్యంగా సోము వీర్రాజు ఇలాంటి విషయాలు పట్ల, ఎందుకు తమ పార్టీనే ఉన్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళటం లేదో అర్ధం కావటం లేదు. రఘురామకృష్ణం రాజు ఈ విషయాలను లేవనెత్తి కేంద్రానికి చెప్పే వరకు, కేంద్రానికి ఈ విషయం తెలియదు అంటే, ఇక్కడ ఉన్న ఏపి బీజేపీ ఎవరి కోసం పని చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

Advertisements

Latest Articles

Most Read