వరుస విపత్తులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇప్పుడు మరో గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండంగా మారింది. ఉత్తరాంధ్ర దిశగా వాయుగుండం వేగంగా కదులుతుంది. ఈ వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ రోజు రాత్రికి కానీ, రేపు కానీ తుఫానుగా మారే అవకాసం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫానుకు జవాద్‍ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వాయుగుండం, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. ఈ తుఫాను ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా తీరం మధ్య తీరం దాటే అవకాసం ఉందని భావిస్తున్నారు. ఈ రోజు మధ్యానం నుంచి రేపటి వరకు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. తుఫాను తీరం దాటే సమయంలో, 100 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాసం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈ తుఫాను ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పైన అధికంగా ఉండే అవకాసం ఉందని తెలుస్తుంది. అలాగే విశాఖ జిల్లా పైన ఒక మోస్తరుగా, తూర్పుగోదావరి జిల్లాపైనా తుఫాను ప్రభావం ఉండే అవకాసం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే షాకులకు సామాన్య ప్రజలే కాదు, ఉన్నత వర్గాల ప్రజలు కూడా బెంబేలెత్తి పోతున్నారు. ఇప్పటికే చిత్ర విచిత్రమైన పన్నులతో, ప్రజల పై భారం మోపిన సంగతి తెలిసిందే. చెత్త పన్ను, బాత్ రూమ్ పన్ను, ఇంటి పన్ను, కరెంటు చార్జీలు పెరుగుదల, ఇలా ఒకటి కాదు రెండు కాదు, వివిధ రకాలుగా పిండేస్తున్నారు. ఇప్పటికే, వన్ టైం సెటిల్మెంట్ పేరుతో, ప్రజల వద్దకు వస్తున్నారు. బలవంతం లేదు అని చెప్తూనే, ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ఈ రోజు పత్రికల్లో వచ్చిన కధనాలు చూస్తే మరో బదుడుకి రంగం సిద్ధం అయినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో, ప్రతి ఒక్కరి ఇంటి ప్లాన్ సేకరించే పనిని వార్డు సచివాలయ సిబ్బందికి అప్పచెప్పారు. ఇది ఎందుకో ఏమిటో క్లారిటీ లేదు కానీ, ఇంటి ప్లాన్ కాపీలు అడుగుతూ ఉండటంతో, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా వచ్చిన పన్ను విధానంతో, ఇప్పటికే పన్నులు పెరగగా, ఇప్పుడు ఇంటి ప్లాన్లు ఎందుకు అడుగుతున్నారో ప్రజలకు అర్ధం కావటం లేదు. అయితే ఇంటి ప్లాన్ ప్రకారం కాకుండా, ప్లాన్ కు విరుద్ధంగా ఇళ్లు కట్టుకుంటే, వారికి జరిమానా విధించటానికి, ఈ పని చేస్తున్నారని తెలుస్తుంది. సహజంగా నూటికి తొంబై మంది, ఇంటి ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకోరు. దీంతో ఇప్పుడు వీరందరికీ జరిమానా పడే అవకాసం ఉంది. అధికారిక ప్రకటన వచ్చే దాకా, దీని పైన క్లారిటీ లేదనే చెప్పాలి.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రోజు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ కు భారీ జరిమానా విధించింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కింద కట్టిన ఎత్తిపోతల పధకాలకు కూడా జరిమానాలు విధించింది. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ తీర్పు ఇచ్చింది. కొంత మంది పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, మాజీ ఎమ్మెల్యే వసంత కుమార్ దాఖలు చేసిన పిటీషన్లను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ చేసింది. పోలవరం ప్రాజెక్ట్ కు పర్యావరణ అనుమతులు తీసుకున్నారని, అయితే వాటిని ఉల్లంఘించి పోలవరం నిర్మాణాన్ని చేపడుతున్నారని ఆరోపిస్తూ కొంత మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లారు. అక్కడ తీసే మట్టి కానీ, అక్కడ ఊరు ఖాళీ చేసే సమయంలో పడగొట్టిన శిధిలాలు కానీ, అవి వేరే చోటికి తరలించే క్రమంలో, కొన్ని నిబంధనలు పాటించలేదు అంటూ, పోలవరం ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులను ఉల్లంఘించారు అంటూ, ఈ పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దీని పైన అనేక కమిటీలను కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు ఆధారంగా, ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తన తుది తీర్పుని ఇస్తూ, భారీ జరిమానా విధించింది.

ngt 02122021 2

పోలవరం ప్రాజెక్ట్ కు మాత్రమే రూ.120 కోట్ల జరిమానా విధించారు. అలాగే పోలవరం కింద ఉన్న ఎత్తిపోతల పధకాలు అయిన, పురుషోత్తంపట్నం, పట్టిసీమ, చింతలపూడి లాంటి ఎత్తిపోతల పధకాలకు కూడా జరిమానా విధించింది. అసలు వీటికి పర్యావరణ అనుమతులు కూడా లేవని, ప్రభుత్వం తీసుకోలేదని, దీనికి కారణం, ఈ ప్రాజెక్ట్ లు అన్నీ పోలవరం ప్రాజెక్ట్ లో భాగమే కాబట్టి, పోలవరం పూర్తయ్యే లోగా, నీళ్ళను ఉపయోగించటం కోసమే, ఈ ప్రాజెక్ట్ లు తీసుకుంటున్నాం కాబట్టి, వీటికి ప్రత్యేకమైన పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఏపి ప్రభుత్వం వాదించింది. అయినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి ఒప్పుకోలేదు. పోలవరం ప్రాజెక్ట్ కే కాకుండా, కింద ఉన్న ఎత్తిపోతల పధకాలకు కడు జరిమానా విధించింది. పురుషోత్తంపట్నంకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90 కోట్లు, చింతలపూడికి రూ.73.6 కోట్లు జరిమానా కట్టాలని, మూడు నెలల్లోగా ఈ జరిమానాను చెల్లించాలని, ఏపి కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి. ముఖ్యంగా ఏపిలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పైన, గత రెండేళ్లుగా హైకోర్టు అనేక మార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. హైకోర్టు చివరకు, డీజీపీని కూడా కోర్టుకు పిలిచింది. హైకోర్టు ఇంత ఆగ్రహంగా ఉన్నా సరే, ఎక్కడా తప్పులు సరి చేసుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దల ఒత్టిడో లేక మరేదైనా కారణమో కానీ, పోలీసులు తీరు మారటం లేదు. నిన్న ఒక కేసు సందర్భంలో హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఎవరినైనా అదుపులోకి తీసుకున్న సమయంలో, వారికి 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరచాలని, ఎన్ని సార్లు చెప్పినా ఎందుకు పాటించటం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా మీ దగ్గరే ఎందుకు నిర్భందిస్తున్నారు అని కోర్టు ప్రశ్నించింది. ఒకటి కాదు రెండు కాదు, రోజులకు రోజులు మీ దగ్గరే వారిని ఉంచితే, పోలీసులు లాలూచిపడ్డారని అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని హైకోర్ట్ ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమంగా పోలీసులు నిర్బందిస్తున్నారని, హైకోర్టు ముందుకు అనేక పిటీషన్లు విచారణకు వస్తున్నాయని, ఇదే వైఖరి కొనసాగితే, రాష్ట్ర డీజీపీని కోర్టు పిలిపించాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ తమ దగ్గరకు వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.

hc 02122021 2

ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర స్పందిస్తూ, ఇలాంటి కేసులు విషయంలో, గతంలో తాను పని చేసిన చోట ఏమి చేసానో, రికార్డులు చూసుకోండి అంటూ ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేసారంటే, ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎలాంటి వారో తాము చెప్పటం లేదని, వారికి ఉండే హక్కులు గురించి చెప్తున్నామని, ఎవరిని అరెస్ట్ చేసినా, 24 గంటల్లో మేజిస్ట్రేట్‌ ముందు ఉంచాలని ఆదేశించింది హైకోర్టు. పులివెందులలో, ఓబుల్‌రెడ్డి వెంకటప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తిని అక్రమంగా నిర్బంధించటం పై నివేదిక ఇవ్వాలని పులివెందుల స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోని హైకోర్టు ఆదేశించింది. అలాగే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తమ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి అక్రమ నిర్బంధాల పై గతంలో కూడా అనేక సార్లు హైకోర్టు సీరియస్ అయినా , పోలీసుల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు.

Advertisements

Latest Articles

Most Read