తునిలో రైలు దహనం కేసుని కోర్టు కొట్టేసింది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. కానీ ఈ కేసు ఆధారాలు లేని కారణంగా కోర్టులో కొట్టివేయబడింది. ప్రభుత్వం నుంచి ఈ కేసు విచారణకి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు అందకపోవడం వల్లే ఈ కేసు పోయిందని న్యాయనిపుణుల విశ్లేషణ. వైసీపీ ప్రభుత్వం, ఈ కేసులో ఆధారాలు ఎందుకు ఇవ్వలేక పోయింది? అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. తుని రైలు దహనం కేసుని కొట్టేస్తూ విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 24 మంది సాక్షుల్లో 20 మందిని విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రైలు దహనం ఘటనలో ముద్రగడ, దాడిశెట్టి రాజా, నటుడు జీవీ సహా 41 మందిపై అప్పట్లో కేసులు నమోదు అయ్యాయి. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో ఉద్యమం ఆరంభించారు. ఈ ఉద్యమం వెనుక వైకాపా రహస్య అజెండా ఉందని అప్పట్లో విమర్శలు వినిపించాయి. దీనికి ఊతం ఇచ్చేలా ఆ తరువాత పరిణామాలు స్పష్టం చేశాయి. 2016 జనవరిలో ఆందోళనకారులు తుని సమీపంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్‌కి నిప్పుపెట్టారు. అప్పట్లో 41 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసు విభాగం, గవర్నమెంట్ రైల్వే పోలీసులు నమోదు చేసిన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్పీఎఫ్ కేసు పెండింగ్‌లో ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్లు 146, 147, 153, 174 (ఎ), (సి) కింద అప్పట్లో కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన రైల్వే కోర్టు తాజాగా కేసును కొట్టివేసింది. ఈ కేసులు కొట్టేసినా, ఎత్తేసిన తీరు చూస్తే వైసీపీ హస్తం దీని వెనుక ఉందనేది క్రిస్టల్ క్లియర్‌గా తెలిసిపోతోంది. కాపు రిజర్వేషన్లు కోసమే ఇదంతా జరిగిందనుకోవడానికి ఆస్కారమే లేనట్టు, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు ఉద్యమంని ముద్రగడ ఆపేశారు. కాపులకు ఈబీసీ నుంచి 5 శాతం టిడిపి ఇచ్చిన రిజర్వేషన్ని వైసీపీ ఎత్తేసినా ముద్రగడ నోరెత్తలేదు. రైళ్లు తగలబడలేదు. ఈ పరిణామాలన్నీ గుదిగుచ్చి చూస్తే వైసీపీ కోసం వైసీపీ చేయించిన పెయిడ్ ఉద్యమం అని తేలిపోతోంది. టిడిపిని దింపడానికే రత్నాచల్ తగలబెట్టడం, కాపు రిజర్వేషన్ ఉద్యమం పేరుతో ముద్రగడ డ్రామా ఆడారని.. టిడిపి ఓటమి-వైకాపా గద్దెనెక్కించే తన లక్ష్యం నెరవేరటంతో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అటకెక్కించేశారని కాపులే తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
news
టిడిపిని క్లీన్ స్వీప్ చేస్తానని ..క్లీన్ బౌల్డ్ అయిన బాలినేని
ప్రకాశం జిల్లాలో టిడిపియే లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు తానే వైసీపీలో ఉంటాడో లేదో అన్న చందంగా తయారైంది పరిస్థితి. మంత్రిగా ఉన్నప్పుడు మాటలు కోటలు దాటేలా ప్రవర్తించిన బాలినేని ఇప్పుడు వైరాగ్యం ప్రవచిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు జిల్లాలో ఉన్న నాలుగు టిడిపి స్థానాలు వైసీపీ ఖాతాలో పడేసి, క్లీన్ స్వీప్ చేసి చూపిస్తానంటూ శపథం చేశారు. అనంతరకాలంలో మంత్రి పదవి ఊడబీకేశారు. ప్రాంతీయ సమన్వకర్త పదవి ఇచ్చారు. అది కూడా నామ్ కే వాస్తే చేయడంతో బాలినేని ఏకంగా పార్టీ నుంచే బయటకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. చాలా రోజులుగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న బాలినేని ఇటీవల జిల్లా పర్యటనకి వచ్చినప్పుడు అలిగారు. అయితే బాలినేనితో బటన్ నొక్కించి కూల్ చేసిన సీఎం, మనసులో అసంతృప్తిని చల్లార్చలేకపోయారు. తాజాగా సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన సందర్భంగా సీఎం పిలిచి మాట్లాడారు. తన బావ వైవీ సుబ్బారెడ్డి తనను ఎలా ఇబ్బందులు పెడుతున్నదీ బాలినేని సీఎంకి వివరించారు. సొంత జిల్లాలో తనకి ప్రాధాన్యత తగ్గించడంపై బాలినేని అధిష్టానానికి వివరించినా అటు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇక తెగతెంపులేనని తేలిపోయింది. చాలారోజులుగా బాలినేని జనసేనతో టచ్‌లోకి వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం జగన్ రెడ్డి కరెప్షన్ అంతా సెంట్రలైజ్ చేశాక, ఆయనకి తెలియకుండా తన వియ్యంకుడి భాస్కర్‌రెడ్డితో కలిసి వేలకోట్ల దందాలు చేస్తున్నారని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకి అనుమానాలు పొడసూపాయి. జాతీయ, అంతర్జాతీయ డీలింగ్స్, మంత్రిగా రష్యా పర్యటన, చెన్నైలో హవాలా సొమ్ముకోట్లు పట్టుబడటం, ట్రమడాల్ తయారీ సేఫ్ ఫార్మాలోనూ వాటాలు, మైత్రి మూవీ మేకర్స్‌లో పెట్టుబడులు ఇలా చాలా పెద్ద అవినీతి సామ్రాజ్యమే జగన్ రెడ్డికి విజిలెన్ష్కి దొరక్కుండా నిర్మించుకున్నారని జగన్ రెడ్డి అక్కసుతో ఉన్నారని సమాచారం. ఏపీలో దోచిన వేలకోట్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో లావాదేవీలతో తమని మించిపోయారనే కోపంతో ఉన్న జగన్ రెడ్డి చివరికి బాలినేనిని పొమ్మనకుండా పొగబెట్టారని తెలుస్తోంది.
ఇదేమి పైత్యం ? ఈ జగన్ కు ఏమైంది ? మళ్ళీ మళ్ళీ ఈ పెళ్లి దేనికి ?
వైసీపీ వాళ్ల ప్రచార పిచ్చి చూస్తుంటే యావగింపు కలుగుతోంది. గతంలో కియా మోటార్స్ విషయంలోనూ ఇలాగే ప్రవర్తించి తాము బకరాలు కావడమే కాదు, ఏకంగా తమ కోసం పనిచేసే వైసీపీ పేటీఎం బృందాలనీ గొర్రెలని చేసేశారు. కియా మోటార్స్‌ని ఎంతో కష్టపడి రాష్ట్రానికి చంద్రబాబు తీసుకొచ్చారు. ఆ సమయంలో కమీషన్ల కోసం బాబు తెచ్చారని, అమ్ముడుపోని కార్ల కంపెనీ పెట్టించారని వైకాపా పెద్దలే ఆరోపించారు. తీరా కియా కార్ల ఉత్పత్తి ప్రారంభమై ఏపీ పేరు మారుమోగడంతో ఆ క్రెడిట్ ఎలాగైనా కొట్టేయాలని రాజశేఖర్ రెడ్డి బతికి వున్నప్పుడే కియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆ యాజమాన్యానికి లేఖ రాసినట్లు ఓ ఫేక్ లెటర్ సృష్టించారు. అంటే జగన్ చేస్తేనే అభివృద్ధి. జగన్ వేస్తేనే శంకుస్థాపన అనే చందంగా తయారయ్యారు వైసీపీ టీమ్. వైకాపా అధినేత జగన్ రెడ్డిని సంతృప్తి పరచడానికి సొంత పార్టీ నేతలే కాదు, అధికారులు కూడా గతంలో టిడిపి ప్రభుత్వం చేసిన శంకుస్థాపనలపై మళ్లీ శంకుస్థాపనలు చేయిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రంలో గత ప్రభుత్వం వేసిన శంకుస్థాపనలని పూర్తి చేస్తారు. దీనికి భిన్నంగా ఆ ప్రాజెక్టుపై గత ప్రభుత్వ ముద్ర ఉండకూడదనే కోణంలో ఏకంగా అదే ప్రాజెక్టులకి మళ్లీ పేర్లు మార్చి మరీ శంకుస్థాపన చేసుకుంటున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఉత్తుత్తి శంకుస్థాపన చేసిందని, తామే చేస్తున్నదే గట్టి శంకుస్థాపన అని ప్రచారం చేసుకుంటున్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకి 4 ఏళ్ల క్రితమే అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పుడు కేసులు వేయించి నిర్మాణాలు ముందుకు సాగకుండా అడ్డుకున్నది వైసీపీ అధినేత జగన్ రెడ్డే. ఇప్పుడు అదే నోటితో భోగాపురం ఎయిర్ పోర్టు తాను కడుతున్నానని, అదే చేత్తో మరోసారి శంకుస్థాపన చేశారు. ఐటీ హబ్‌గా విశాఖ తీర్చిదిద్దేందుకు 2019 సంవత్సరంలో ఫిబ్రవరి 14న అదానీ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకి ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మళ్లీ అదే అదానీ డేటా పార్క్ కి ఇప్పుడు జగన్ శంకుస్థాపన చేశారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం 2007 జూన్ 10న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భూమిపూజ చేశారు. వైఎస్ చనిపోవడంతో ఆ ఫ్యాక్టరీ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే పూనుకుంటుందని ప్రకటించిన అప్పటి సీఎం చంద్రబాబు 2018లో శంకుస్థాపన చేశారు. తన తండ్రి ఓసారి, చంద్రబాబు మరోసారి కడప ఉక్కుకి చేసిన శంకుస్థాపనలని పరిగణనలోకి తీసుకోకుండా 2019లో సీఎం అయిన జగన్ రెడ్డి డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తాను టెంకాయ కొట్టానని ప్రకటించుకున్నారు జగన్ రెడ్డి. చంద్రబాబే కాదు, తన తండ్రి చేసిన శంకుస్థాపనలని కూడా ఓర్వలేని జగన్ రెడ్డి పేరుమార్చి ప్రతీ ప్రాజెక్టుకూ మరోసారి శంకుస్థాపన చేయడంపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
జగన్ మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలపై చంద్రబాబు అదిరిపోయే స్టైల్ సైటెర్లు
జగన్ మీ బిడ్డని ఆశీర్వదించమంటున్నాడని, ఆయన బిడ్డ కాదు రాష్ట్రం పాలిట క్యాన్సర్ గడ్డ అని చంద్రబాబు సెటైర్లు పేల్చారు. జగన్ అనే క్యాన్సర్ గడ్డ జనానికే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చేసిన భోగాపురం ఎయిర్పోర్ట్, అదానీ డేటా సెంటర్లకి మళ్లీ జగన్ సీఎం అయ్యాక శంకుస్థాపనలు చేయడంపై చంద్రబాబు చాలా వ్యంగ్యంగా స్పందించారు. ప్రజావేదిక కూల్చివేత విద్వంసంతో జగన్ రాష్ట్రంలో రివర్స్ పాలనకు తెరతీశారని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారని వివరించారు. మేము తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్, రూ. 67,000 కోట్లు, స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ప్రాజెక్టు అమరావతి రూ. 50,000 కోట్లు, ప్రకాశం జిల్లాలో కాగిత పరిశ్రమ రూ. 28,000 కోట్లు, రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ తిరుపతి రూ. 15,000 కోట్లు, అమర్ రాజా లిథియం అయాన్ బ్యాటరిస్ ,చిత్తూరు రూ. 9,500 కోట్లు, లూలూ గ్రూపు విశాఖ రూ. 2,200 కోట్లు, టైట్రాన్ బ్యాటరీస్, చిత్తూరు రూ. 727 కోట్లు, ప్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖ రూ. 450 కోట్లు, జాకీ అనంతపురం రూ. 290 కోట్లు పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకుంటే జగన్ రెడ్డి వాటిని కమీషన్ల కోసం వాటిని పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని ఆరోపించారు. కియా కార్స్ టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసి మొదటి కారును కూడా మేము విడుదల చేస్తే, జగన్ రెడ్డి అదే కియాని మరోసారి ప్రారంభించారని ఎద్దేవ చేశారు. ఏటీసీ టైర్స్, అపోలో టైర్స్, ఏసియన్ పెయింట్స్, కర్నూలు ఓర్వకల్ ఎయిర్ పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఇవన్నీ నాడు మేం శంకుస్ధాపన చేస్తే జగన్ రెడ్డి సిగ్గులేకుండా మళ్లీ శంకుస్దాపన చేస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ పూర్తి చేసి 2019లో శంకుస్ధాపన చేశామని, ప్రతిపక్షనేతగా నాడు జగన్ బోగాపురం ఎయిర్ పోర్ట్ కి రైతులు భూములివ్వొద్దని, ఇచ్చిన భూములు మేం అధికారంలోకి వస్తే వెనక్కి ఇస్తామని చెప్పి కోర్టుల్లో కేసులు వేసి ఎయిర్ పోర్ట్ నిర్మాణం ముందుకు సాగకుండా అడ్డుపడ్డారని తేదీలు, సాక్ష్యాలతో బాబు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అదే జగన్ రెడ్డి నేడు భోగాపురం ఎయిర్ పోర్టుకి మళ్లీ శంకుస్దాపన పేరుతో డ్రామాలాడుతున్నారని వివరించారు. తన శైలికి భిన్నంగా చాలా వివరాలతోనూ, చాలా వ్యంగ్యంగానూ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.