జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల పై సిబిఐ వైఖరి మారుతుంది. ఇన్నాళ్ళు సిబిఐ, జగన్ కేసుల్లో సాగుతూ వెళ్తుందనే విమర్శలు వచ్చాయి. ఎప్పుడో 2012లో చార్జ్ షీట్ వేసిన కేసులు కూడా, ఇప్పటికీ ట్రయిల్స్ వరకు రాలేదు. ఇంకా ఏదో ఒక కారణంతో, డిశ్చార్జ్ పిటీషన్లు అని, అదని, ఇదని, ఇంకా అక్కడే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణంగా సిబిఐ వైపే వేళ్ళు చూపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ, రఘురామకృష్ణం రాజు వేసిన బెయిల్ రద్దు పిటీషన్ లో, సిబిఐ ఏ వైఖరి చెప్పకుండా, రెండు నెలలు పాటు కేవలం సిబిఐ ఈ కేసుని సాగదీసిన విధానం చూసి, అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఎందుకో ఏమో కానీ, ఈ మధ్య సిబిఐ వైఖరి మారుతుంది. సాగదీసే ధోరణి, తటస్థానంగా ఉండే వైఖరిని సిబిఐ పక్కన పెట్టింది. తాజాగా నిమ్మగడ్డ ప్రసాద్, వాన్‌పిక్‌, వేసిన డిశ్చార్జ్ పిటీషన్ల సందర్భంగా, సిబిఐ చేసిన వాదనలతో అందరూ షాక్ తిన్నారు. జగన్ మొహన్ రెడ్డి పై ఘాటుగా వ్యాఖ్యలు చేసింది సిబిఐ. కేవలం క్విడ్ ప్రోకో కోసమే వాన్‌పిక్‌ తో డీల్ జరిగినట్టు సిబిఐ వాదించింది. జగన్ కంపనీల్లో రూ.854కోట్ల పెట్టుబడి పెట్టారని, దానికి ప్రతిఫలంగానే, రాజశేఖర్ రెడ్డి, రూ.17వేల కోట్ల విలువ చేసే వాన్‌పిక్‌ ప్రాజెక్ట్ ఇచ్చారని వాదించింది. దీని వెనుక క్విడ్ ప్రోకో ఉందని, సిబిఐ కోర్టు ముందు గట్టిగా వాదనలు వినిపించింది.

cbi 01122021 2

ఈ మొత్తం కేసుని కలిపి చూడాల్సి ఉందని, మాకేమి సంబంధం లేదు అంటే కుదరదు అని చెప్తూ, ఒక ఉదాహరణ కోర్టు ముందు సిబిఐ వినిపించింది. అందరూ కలిసి కుట్ర పన్నితే, నిందితుల పాత్రను వేరుగా చూడకూడదని చెప్పింది. ఒక బాంబు తాయారు చేయటానికి ఒకడు డబ్బులు ఇస్తాడు, ఇకొకడు కోరిటర్ చేస్తాడు, ఇంకొకడు సామగ్రి తెస్తాడు, మరొకడు తయారు చేస్తాడు, ఇంకొకడు బాంబు పెడతాడు, అయితే వీరందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది, విడిగా చూస్తే ఎవరిదీ తప్పు కాదంటారు అంటూ వాదనలు వినిపించారు. ఇందులో జగన్, విజయసాయి రెడ్డి, ఇలా అందరి పాత్ర ఉందని సిబిఐ కోర్టు ముందు వాదించింది. అయితే వాన్‌పిక్‌ తరుపు న్యాయవాది మాత్రం, ఇందులో ఒక్క ఆధారం కూడా వారు చూపించటం లేదని, క్యాబినెట్ ని, ఒక వ్యక్తి ప్రభావితం చేస్తారా అని వాదించారు. జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చి వాన్‌పిక్‌ కు భూములు ఇచ్చారని చెప్పటానికి ఆధారాలు లేవని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, తీర్పుని రిజర్వ్ చేసింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు, రాజ్యసభ సాక్షిగా గంగలో కలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ప్రతి దానికి ఎంత హడవిడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ముందుగా బులుగు మీడియాలో హడావిడి చేస్తారు, తరువాత పేటీయం బ్యాచ్ ని పెట్టుకుని సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు, తరువాత వందల కోట్లతో పేపర్ ప్రకటనలు ఇస్తారు, ఇంత హడవిడి చేసిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతారు. బటన్ నోక్కటమో, లేదా ఏదో వీడియో తీసి వదలటమో చేస్తారు. ఇది వైసీపీ మార్క్ చేసే హడావిడి. ఆ పని అవుతుందా లేదా అనేది తరువాత సంగతి. ఈ హడావిడి చూసి నేషనల్ మీడియా కూడా బుట్టలో పడుతుంది. జగన్ మోహన్ రెడ్డి అద్భుతాలు చేస్తున్నారు అంటూ వాళ్ళు కూడా ఊదరగొడతారు. ఇలా అనేక అంశాలు ఉన్నా, అందులో ఒకటి దిశ చట్టం. హైదరాబాద్ లో అ-త్యా-చా-రాని-కి గురైన దిశ పేరుతో, జగన మోహన్ రెడ్డి దిశ చట్టం అని ఒకటి చేసారు. అయితే ఇది పుర్తిగా రాజ్యాంగానికి విరుద్ధం. 21 రోజుల్లో ఉరి శిక్ష, అదీ ఇదీ అంటూ హడావిడి చేసారు. అసెంబ్లీలో కేసీఆర్ కు హాట్స్ ఆఫ్ కూడా చెప్పారు. ఇప్పటికే ఉన్న నిర్భయా యాక్ట్ లను కూడా పక్కన పడేసి, ఈ దిశ యాక్ట్ తెచ్చారు. దిశ దిశ అంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే, ఇది అసలు చట్టమే అవ్వలేదు.

parimal 01122021 2

ఇది కేవలం బిల్లు రూపంలోనే ఇంకా ఉంది. ఈ బిల్లుని కేంద్రం వద్దకు పంపించినా, కేంద్రం ఈ బిల్లుని తిప్పి పంపించింది. ఇందులో అనేక అంశాల పై తమకు సందేహాలు ఉన్నాయని తిప్పి పంపించింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, దిశ చట్టం ఉందని, దిశ చట్టం కింద శిక్షలు కూడా పడ్డాయి అంటూ, ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా శిక్షలు పడలేదు. ఇంకా ఇంకా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. టిడిపి ఈ విషయం అనేక సార్లు లేవనెత్తినా, దిశ చట్టం ఉంది అంటూ ఎదురు దా-డి చేసే వారు. ఇప్పుడు వైసీపీ పరువు సొంత పార్టీ ఎంపీనే తీసేశారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ దిశ చట్టం గురించి రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగారు. దానికి కేంద్రం సమాధానం చెప్తూ, దిశ బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని, అందుకే ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదానికి పంపిచలేదని తెలిపింది. దిశ బిల్లు పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరాం అని , అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ వచ్చే దాకా ఏమి చేయలేం అని చెప్పింది. దీంతో వైసీపీ చెప్తున్నవి అబద్ధాలే అని, వైసీపీ ఎంపీ ప్రశ్నతోనే తేలిపోయింది.

ప్రజా ప్రతినిధుల కేసులు ఉపసంహరణకు సంబంధించి, ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు, ఈ కేసులు విచారణను సుమోటోగా స్వీకరించి, విచారణ చేస్తుంది. ముఖ్యంగా జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని, జక్కంపూడి రాజా, మేక వెంకట ప్రతాప్ అప్పారావు, మల్లాది విష్ణు, ఎంపీ మిదున్ రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి. ఇలా వీరి అందరి మీద, క్రిమినల్ కేసుల ఉపసంహరణకు సంబంధించి, హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రజా ప్రతినిధుల కేసుల ఉపసంహారణ మీద హైకోర్టు విచారణ చేపట్టింది, గతంలో కూడా సుప్రీం కోర్టు ఈ కేసులు ఉపసంహరణకు సంబంధించి, ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను, ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. కేసులు ఉపసంహరణకు సంబంధించి, జీవో విడుదల చేసిన హోం శాఖ ప్రినిసిపల్ సెక్రటరీ, సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధులకు సంబందించి, ఎన్ని కేసులు ఉపసంహరణ కోసం ప్రతిపాదనలు వచ్చాయో, రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అదే విధంగా విజయవాడలో ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టుకు ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

courts 01122021 2

అయితే గతంలో జగ్గయ్య పేట ఎమెల్యే సామినేని ఉదయ భానుకు సంబందించి, ఆయన పైన ఉన్న పది కేసులు ఉపసంహరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో పై, హైకోర్టులో, అనేక మంది పిటీషన్లు దాఖలు చేసారు. ఈ పిటీషన్ల పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటీషన్ల తరుపున హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు కూడా వినిపించారు. ఈ నేపధ్యంలోనే ఈ రోజు మొత్తం ఈ కేసులు ఉపసంహారణకు సంబంధించి, సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా అటు రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటుగా, విజయవాడలో ఉన్న ప్రజా ప్రతినిధుల కోర్టు నుంచి కూడా సంపూర్ణ నివేదిక కావాలని, ఎవరు ఎవరు ఈ సిఫార్సులు చేసారో చెప్పాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోపు తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే కేసులు కొట్టేస్తూ, ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఇది షాక్ అనే చెప్పాలి. చూద్దాం ఏమి జరుగుతుందో.

అప్పులు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏది ఏమైనా అప్పులు చేయటం, స్వాహా చేయటమే పనిగా పెట్టుకుంది. ముందుగా ఆర్‌బీఐ నుంచి అప్పులు తేవటం మొదలు పెట్టారు. ఏడాదికి ఇచ్చిన అప్పులు లిమిట్ ను, కేవలం నాలుగు నెలల్లో లాగేసారు. ఆర్‌బీఐ అప్పులు ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్పటంతో, కేంద్రంతో తంటాలు పడి అప్పులు పెంచుకున్నారు. రెండు నెలల్లో ఇదీ లాగేశారు. మద్యం ఆదాయం పై అప్పులు తెచ్చారు. అనేక బకాయలు బాకీ పడ్డాయి. ఇలా విచ్చల విడిగా అప్పులు చేస్తూ, ఏమైనా చేస్తున్నారా అంటే, అభివృద్ధి అనే మాటే రాష్ట్రంలో లేకుండా పోయింది. ఇక ఇప్పుడు చివరకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డబ్బులు లాగేసే కార్యక్రమం మొదలు పెట్టారు. దీని కోసం ఒక లిమిటెడ్ కంపెనీ పెట్టారు. అదే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్పొరేషన్‌. అనేక ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, ఇలా ఏది పడితే అది, వాళ్ళు దగ్గర ఉన్న డిపాజిట్లు అన్నీ ఈ ఎకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశాలు వెళ్ళాయి. కొంత మంది మనకు ఎందుకులే అని వెంటనే బదిలీ చేసారు. కొంత మంది ఎదురు తిరిగారు. వారి పైన నేరుగా చీఫ్ సెక్రటరీ ఒత్తిడి చేయటంతో, ఇక చేసేది ఏమి లేక వారు కూడా ఇచ్చేసారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి, 400 కోట్లు కొట్టేయటం, తాజా ఉదాహరణ.

rbi 01122021 2

అయితే ఈ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పై, ఆర్‌బీఐకు ఆరా వచ్చింది. వెంటనే ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. అసలు ఈ కార్పొరేషన్ ఏమిటి ? దానికి ఎవరు బాధ్యులు ? వాళ్ళు ఏమి చేస్తారు ? ఇలా రకరకాలుగా తొమ్మిది ప్రశ్నలు సంధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ లేఖలు రాసింది. ఒకసారి కాదు రెండు సార్లు కాదు, ఏకంగా మూడు సార్లు రాసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వారికి సరైన రిప్లై ఇవ్వలేదు. ఆర్‌బీఐకి చిక్కకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్ర విచిత్రాలు చేస్తుంది. మొత్తం ఈ కార్పొరేషన్ ఆడిట్ ఇవ్వాలని ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో , ఆ శాఖలకు సంబంధించిన బ్యాంకు డిపాజిట్లు ఉంటాయి. ఆ బ్యాంక్ డిపాజిట్లు అన్నీ వివిధ శాఖల నుంచి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్పొరేషన్‌ అనే కంపెనీ పెట్టి, అందులోకి నిధులు మొత్తం పోగేసి, అక్కడ నుంచి తన అవసరాలు కోసం వాడుకుంటుంది. అప్పులు పుట్టక పోవటంతో, ఇలాంటి విన్యాసాలు చేస్తుంది.

Advertisements

Latest Articles

Most Read