అంతా అనుకున్నట్టే ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. గత కొన్ని రోజులుగా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సొమ్ములను ప్రభుత్వం తీసుకునే ప్రక్రియ, మొత్తం అనుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగ సంఘాల అభ్యంతరాలు కానీ, ఉద్యోగులు యొక్క ఆందోళన కానీ, ప్రభుత్వం కానీ, యూనివర్సిటీ పెద్దలు కానీ ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.దాదాపుగా నెల రోజుల క్రితం మొదలైన నిధుల బదలాయింపు ప్రక్రియ, నిన్నటితో ఒక కొలిక్కి వచ్చింది. రూ.400 కోట్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్స్ గా ఉన్నటు వంటి ఫండ్స్ ని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో ఉన్న ఏపి ఫైనాన్సు కార్పొరేషన్ కు తరలించాలనే ప్రక్రియ నిన్న ప్రారంభం అయ్యింది. దీని పై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు నిన్న అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న వీసితో భేటీ తరువాత, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సొంత సంస్థలో ఉన్న ఉద్యోగుల ఆవేదనను ఆయన అడ్డ్రెస్ చేయకుండా, మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ, స్వయంగా వీసీ చెప్పటం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈ రోజు ఉదయం కూడా, రిజిస్టార్ ని కలిసి, తమ అనుమానాలను, ఆవేదనను, వర్సిటీ పెద్దల ముందు ఉంచే ప్రయత్నం చేసారు.

university 30112021 2

అయినా కూడా యూనివర్సిటీ పెద్దల నుంచి ఎలాంటి సానుకూల స్పందన కానీ, సంప్రదింపులు ప్రక్రియ కానీ జరగక పోవటం పట్ల, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఉద్యోగులు అందరూ కలిసి ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న మీటింగ్ హాల్ లో, ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ మీటింగ్ కొనసాగుతుంది. ప్రభుత్వంతో పాటుగా, యూనివర్సిటీ పెద్దలు తీసుకున్న నిర్ణయం పట్ల, ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఇది వ్యక్తిగత సమస్యగా భావించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే జరిగితే కనుక ఉద్యోగుల జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదని నిర్ణయం తీసుకున్నారు. మరి కొద్ది సేపట్లో దీని పైన ప్రకటన చేయనున్నారు. అయితే నిన్న వీసీ మాట్లాడుతూ, తాను ఏమి చేయలేనని, బాస్ అడిగాడు ఇచ్చేసాను అని చెప్పటం పై, ఉద్యోగులు షాక్ తిన్నారు. ఆసలు ఈ బాస్ ఎవరు ? అనేది ఇప్పుడు చర్చగా మారింది ? బాస్ అంటే జగన్ మోహన్ రెడ్డి గురించి చెప్పారా ? లేక మరెవరైనా గురించి చెప్పారా అనేది తెలియాలి.

జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా ? ఈయన మాజీ హైకోర్టు జడ్జి. మన రాష్ట్రం కాదు, తమిళనాడు. అయితే ఎందుకో కానీ, ఈయన అంటే ప్రభుత్వ పెద్దలకు ఎక్కడ లేని మోజు. ఆ మోజు ఎందుకు అనేది ఇప్పటికీ తెలియదు. ఇప్పటికే ఆయనకు రెండు కీలక పదవులు ఇచ్చారు. రెండు పదవులు రూల్స్ కి విరుద్ధంగా ఇవ్వటంతో, కొంత మంది కోర్టుకు వెళ్ళటంతో, రూల్స్ ప్రకారం కనగరాజ్ నియామకం చెల్లేదని కోర్ట్ ఆ పదవుల నుంచి తొలగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు ఆయన పదవి కోర్టు ద్వారా పోయింది. అయినా మన రాష్ట్ర ప్రభుత్వం వదలటం లేదు. ఆయనకు ఈ సారి మూడో పదవి కూడా కట్ట బెట్టింది. 80 ఏళ్ళ వయసులో ఆయన పైన ఇంత ప్రేమ ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకు ఆయనకు పదవులు ఇవ్వాలనే ఆరాటం ప్రభుత్వ పెద్దలకు ఉందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇప్పుడు తాజాగా ఆయనకు ఒక కమిటీలో మెంబెర్ గా పదవి ఇచ్చారు. పీడీ చట్టం సలహా మండలిలో ఆయనకు చోటు ఇచ్చారు. పీడీ చట్టం అంటే, ప్రివెన్షన్ డిటెన్షన్. ఇది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఈ సలహా మదలనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ, ఇందులో ఒక మెంబెర్ గా మాత్రమే కనగరాజ్ ని నియమించారు. ఆయనకు ఈ సలహా మండలి చైర్మెన్ పదవి మాత్రం ఎందుకో కానీ ఇవ్వలేదు.

kanagaraj 30112021 2

ఈ పీడీ చట్టం సలహా మండలి చైర్మెన్ గా, మరో హైకోర్టు జడ్జిని నియమించారు. ఆయన పేరు సంజీవ రెడ్డి. అయితే ఈయన కూడా ఎప్పుడో పని చేసారు. ఇప్పుడు ఈయనకు 85 ఏళ్ళు. మరి ఇంత వయసు ఉన్న వాళ్ళను చైర్మెన్ గా, మెంబెర్లుగా నియమించి, ఏమి చేద్దామని అనుకుంటున్నారో తెలియదు కానీ, మొత్తానికి పదవులు అయితే ఇచ్చేస్తున్నారు. అయితే ఇది కూడా ముఖ్యమైన మండలి కావటం, దీనికి కూడా రూల్స్ ఉంటాయి కాబట్టి, ఇంత వయసు ఉన్న వారికి ఈ పదవి ఇవ్వచ్చో ఇవ్వకూడదో చూడాలి మరి. మళ్ళీ ఎవరైనా ఏదైనా రూల్ పట్టుకుని కోర్టుకు వెళ్తే, కనగరాజ్ పదవి ఉంటుందో, పోతుందో చూడాలి. ముందుగా ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియమిద్దామని తీసుకుని వచ్చారు. అయితే నిమ్మగడ్డ వెంటనే కోర్టుకు వెళ్లి, ఆయన నియామకం క్యాన్సిల్ చేపించారు. తరువాత మళ్ళీ ఆయనకు రెండో పదవి ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్‌ అథారిటీకి చైర్మన్‌గా నియమించారు. అయితే ఇది కూడా రూల్స్ కు వ్యతిరేకం కావటంతో, ఇది కూడా ఊడింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి పదవి ఇచ్చారు. మరి ఇది ఏమి అవుతుందో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, వైఎస్ వివేక కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసు సిబిఐ విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కేసు విషయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే శివశంకర్‌రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. అలాగే, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వివేక డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మొత్తం విషయం బయట పడింది. వివేకను ఎలా వేసేసింది, ఎవరు వేయించింది, మొత్తం చెప్పాడు. ఈ విషయం మీడియాలో వచ్చిన నాలుగో రోజే శివశంకర్‌రెడ్డిని నాటకీయ పరిణామాల మధ్య సిబిఐ అరెస్ట్ చేసింది. శివశంకర్‌రెడ్డి హాస్పిటల్ లో ఉన్నా సరే, సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత అసెంబ్లీలో ఇదే విషయం పై రచ్చ జరిగింది, చంద్రబాబు ఈ విషయం లేవనెత్తగానే, చంద్రబాబు పై బూతులతో దా-డి చేయటంతో చంద్రబాబు తట్టుకోలేక పోయారు. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మా చిన్నాన్నను మేమే చం-పు-కుం-టా-మా ? దీని వెనుక చంద్రబాబే ఉన్నాడు అంటూ అసెంబ్లీ వేదికగా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసారు. అయినా సిబిఐ మాత్రం ఫోకస్ద్ గా ముందుకు వెళ్తుంది.

viveka 29112021 2

అయితే ఈ తరుణంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏకంగా సిబిఐ టార్గెట్ గా ఈ అడుగు పడింది. అంతే కాదు, పోయిన వారం, ఏకంగా వివేక కూతురు అల్లుడు పైన కూడా ఆరోపణలు చేసారు. ఇప్పుడు ఈ ట్విస్ట్ చోటు చేసుకుంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చాడు. సిబిఐ అధికారులు, వివేక అనుచరుల నుంచి తనకు ముప్పు ఉంది అంటూ, అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసారు. వివేక హ-త్య తానే చేసానని ఒప్పుకోవాలని, శివశంకర్‌రెడ్డి తనకు పది కోట్లు ఒఫెర్ చేసారని, దీని వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పాలి అంటూ, సిబిఐ అధికారులు తన పైన ఒత్తిడి తెచ్చారని, తనకు డబ్బులు కూడా ఆఫర్ చేసారు అంటూ, ఫిర్యాదు చేసారు. అంతే కాదు తనకు సెక్యూరిటీ కూడా పెంచాలని కోరాడు. ఈ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు శివశంకర్‌రెడ్డి అనుచరుడు. ఇది ఇలా ఉంటే, ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతుంది. ఇప్పటికే దస్తగిరి ఒప్పుకున్నాడని సిబిఐ చెప్తుంటే, ఇప్పుడు మళ్ళీ ఇతను చేసాడని సిబిఐ ఎందుకు ఒత్తిడి తెస్తుంది ? ఎందుకు డబ్బులు ఇస్తుంది ? చూద్దాం పోలీసులు ఏమి తెల్చుతారో. ఏకంగా సిబిఐ పైనే ఆరోపణలు కాబట్టి ఏమి జరుగుతుందో చూడాలి.

రాష్ట్ర విభజన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా కోలుకుంటుందా అని అందరూ అనుకున్న సమయంలో, ప్రజలు చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు. ఆయన తన అనుభవంతో, విజన్ తో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాల మీద నిలపటానికి, ఒక ఆక్షన్ ప్లాన్ తయారు చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, పక్క రాష్ట్రాలతో పోటీ పడేలా చేసి, చాలా విషయాల్లో ఏపి ది బెస్ట్ అనే విధంగా ముందుకు తీసుకుని వెళ్లారు. అటు అభివృద్దిలో, ఇటు సంక్షేమంలో ఏపి దూసుకుపోయింది. అయితే తరువాత జరిగిన ఎన్నికల్లో, ప్రజలు ఒక్క చాన్స్ కు ఓటు వేసి, జగన్ మోహన్ రెడ్డిని గెలిపించారు. అప్పటి నుంచి మొదలైంది ఏపి పతనం. ఈ పతనం, విభజన గాయాల కంటే ఘోరమైంది. ఇసుక సంక్షోభంతో మొదలు పెట్టి, ఇప్పుడు ప్రతి అంశంలో ఏపి ఎదురీదుతూనే ఉంది. తాజాగా ఇదే విషయం ఇండియా టుడే స్పష్టం చేసింది. ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ అఫ్ స్టేట్స్ సర్వేలో, దేశంలో వివిధ రాష్ట్రాలలో, అనేక అంశాల పై ఒక సర్వే చేసి, ప్రతి అంశం పైన ర్యాంకులు ప్రకటించింది. ఇండియా టుడే నిర్వహిస్తున్న ఈ సర్వే ఇప్పటిది కాదు. గత అయిదు ఏళ్ళుగా ఈ సర్వే వస్తూనే ఉంది. ప్రతి ఏడాది లాగే , ఈ ఏడాది కూడా ఇండియా టుడే, ఈ సర్వే చేసి, ఈ సర్వే వివరాలను ప్రచురించింది.

indiatoday 29112021 2

అయితే గతంలో ముక్యమైన రంగాల్లో టాప్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నేడు పాతాళంలోకి పడిపోయింది. ఇక రంగాల వారీగా చూసుకుంటే, ముఖ్యమైన రంగాల్లో ఏపి పరిస్థితి దారుణంగా ఉంది. వ్యవసాయ రంగంలో 12 స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, అంటే 2019లో చూస్తే ఏపీ 6వ స్థానంలో ఉండేది. ఇక శాంతిభద్రతల విషయానికి వస్తే, 2018లో తెలుగుదేశం హయాంలో మెరుగైన పోలీసింగ్ తో దేశంలో 6వ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో 12వ స్థానానికి పడిపోయింది. ఇక సుపరిపాలన విషయానికి వస్తే, చంద్రబాబుగారి హయాంలో పాలనాపరంగా 2018లో నాలుగు, 2019లో 8 ర్యాంకులతో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఒకేసారి 18వ స్థానానికి పడిపోయింది. మొత్తంగా అన్ని రంగాల అభివృద్హి పరంగా చూస్తే, తెలుగుదేశం హయాంలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, 2021లో వైసీపీ హయాంలో 6వ స్థానానికి పడిపోయింది. ఈ నివేదిక చూసిన వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా దిగాజారిపోవటం చూసి, బాధ పడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read