జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ఒక రోజు నోట్లో నోట్లో స్వీట్లు తినిపించుకుంటారు, మరో రోజు తిట్టుకుంటారు. దావత్ లు చేసుకుంటారు, మరో పక్క జగన్ చెల్లెలు షర్మిల పార్టీ పెట్టి, కేసీఆర్ ని తిడతారు. గత ఏడాది కాలంగా కేసీఆర్ , జగన్ లకు మాటలు లేవని, ఇద్దరూ తమ తమ రాష్ట్రాల కోసం ఒకరి పై ఒకరు విమర్శలు చెసుకుంటున్నారు అనే వాతావరణం వచ్చింది. అయితే అనూహ్యంగా, ఆంధ్రప్రదేశ్ లో వరదలు ఉన్నా, అవేమీ పట్టించుకోకుండా, హైదరాబాద్ లో పెళ్లికి వెళ్లి, కేసీఆర్ పక్కన కూర్చుని విందులు చేసుకున్నారు. ఇద్దరి మధ్య బాగానే ఉంది అని అందరూ అనుకుంటున్న సందర్భంలో, మూడు రోజులు కూడా గడవక ముందే, జగన్ కు, కేసీఆర్ జర్క్ ఇచ్చారు. మరి ఇది అయినా నిజమో, లేక డ్రామానో తెలియదు కానీ, ఈ నిర్ణయంతో మాత్రం, వేలాది మంది ఏపి రైతులు నష్టపోనున్నారు. నిన్న రాత్రి నుంచి కర్నూల్ నుంచి తెలంగాణా వెళ్తున్న వడ్లు లోడుతో వెళ్తున్న వాహనాలను, తెలంగాణా పోలీసులు, తమ రాష్ట్ర సరిహిద్దులో ఆపేసారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వడ్లు లోడుతో వస్తున్న లారీలను, తెలంగాణాలోకి ఎంటర్ అవ్వకుండా, తెలంగాణా పోలీసులు ఆపేస్తున్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఆపెస్తున్నామని చెప్తున్నారు.
అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా, అసలు ఎందుకు పోలీసులు ఆపేస్తున్నారో అర్ధం కాక, లారీ డ్రైవర్లు , వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లా అనే కాక, ఇతర కోస్తా ప్రాంతాల నుంచి వస్తున్న లారీలను కూడా, తెలంగాణా పోలీసులు ఆపెస్తున్నట్టు తెలుస్తుంది. పోయిన ఏడాది ఇదే సీజన్ లో, ఏపి నుంచి రైతులు తెలంగాణా వెళ్లి అమ్ముకునే వారు. ఈ సారి తెలంగాణాలో కొనుగోళ్ళు ప్రారంభం కావటంతో, కర్నూల్ జిల్లా నుంచి కొంత మంది రైతులు, వ్యాపారులు, తెలంగాణా వెళ్తూ ఉండగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు దిక్కు తోచక అక్కడే ఉండి పోయే పరిస్థితి వచ్చింది. ఏపి ప్రభుత్వం, తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి, ఈ సమస్య పరిష్కారం చేయాలని, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక పక్క మళ్ళీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ చెప్తున్న నేపధ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఇలాగే క-రో-నా కాలంలో, ఏపి నుంచి వెళ్తున్న అంబులెన్స్ లను ఆపేసిన సంగతి తెలిసిందే. మరి జగన్, కేసీఆర్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారో లేదో చూడాలి.