రాష్ట్ర హైకోర్టులో ఈ రోజు కుప్పం నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి, ప్రత్యేక అధికారిని నియమించాలని, అదే విధంగా కుప్పం ఎన్నికల కౌంటింగ్ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేయించాలని తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్ధులు, ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ రోజు ఉదయం లంచ్ మోషన్ పిటీషన్ విచారణకు వచ్చిన తరువాత, 12 గంటల ప్రాంతంలో విచారణ చేస్తాం అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర హైకోర్టులో పిటీషనర్ తరుపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వరులు , గింజుపల్లి సుబ్బారావు వీరు ఇరువురూ కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనల నేపధ్యంలోనే ప్రభుత్వం వైపు నుంచి ఎన్నికల కమిషన్ వైపు నుంచి కూడా వాదనలను హైకోర్టు వింది. విన్న తరువాత, కుప్పం ఎన్నికల మొత్తానికి ప్రత్యెక అధికారిగా , అంటే కౌంటింగ్ ని పరిశీలన చేసేందుకు ప్రత్యేక అధికారిగా, ఎన్ ప్రభాకర్ రెడ్డిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. కుప్పం ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి, బ్యాలట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తీసుకుని వచ్చే దగ్గర నుంచి, కౌంటింగ్ ప్రక్రియ మొత్తం అయిపోయే వరకు కూడా, మొత్తం వీడియో రికార్డింగ్ చేయించాలని కూడా, ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశించింది.

kuppam 16112021 2

ఈ ఎన్నికల కమిషన్ కు, ఆదేశాలు జారీ చేయటంతో పాటుగా, వీడియో రికార్డింగ్ మొత్తాన్ని కూడా తీసి, ఈ మొత్తం వీడియో రికార్డింగ్ ను వచ్చే సోమవారం నాటికి, హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. కుప్పం ఎన్నికల్లో దొంగ ఓట్లు ఎక్కువగా వేయటం వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా దెబ్బతింది, పోలింగ్ ప్రక్రియ కూడా తేడాగా ఉందని, మొత్తం అరాచకాలకు తెగ బడ్డారని, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఓటర్లను తరలించారని, అందుకే తమకు కౌంటింగ్ పై కూడా నమ్మకం లేదని, గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమకు అన్యాయం జరిగిందని, అందుకే కౌంటింగ్ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేయించాలని పిటీషనర్ తరుపున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు వీరి ఇద్దరూ వాదనలు వినిపించారు. ఈ నేపధ్యంలోనే లంచ్ మోషన్ పిటీషన్ పై వాదనలు విన్న ధర్మాసనం, నిష్పాక్షపాక్షికంగా ఎన్నికలు జరుపుతున్నప్పుడు ఎందుకు భయపడాలి, అందుకే వారు కోరుతున్నట్టే ప్రత్యేక అధికారిని, వీడియో రికార్డింగ్ చేయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయ్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన వైఎస్ వివేక కేసు మిస్టరీ ఇంకా ఇంకా సాగుతూనే ఉంది. ఈ కేసులో ఉన్న ట్విస్ట్ లు, ఏ తెలుగు సీరియల్ లో కూడా ఉండవు అంటే అతిశయోక్తి కాదేమో. వైఎస్ వివేక కేసుని మొదట చంద్రబాబు మీద తోసేసారు. తరువాత నెమ్మదిగా ఈ కేసులో ట్విస్ట్ లు మొదలు అయ్యాయి. ముందుగా జగన్ మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కావాలని గతంలో అడగటం, తరువాత వెనక్కు తీసుకోవటం హైలైట్. అక్కడ నుంచి సిబిఐ విచారణ వరకు ఈ కేసు సాగుతూనే ఉంది. తాజాగా రెండు రోజుల క్రిందట, వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్, తెలుగు రాజకీయాల్లో సంచలనం అయ్యింది. వివేక కేసు విషయంలో అనేక అనేక విషయాలు బయట పడ్డాయి. మరీ ముఖ్యంగా వైఎస్ కుటుంబం నుంచి ముగ్గురు పేర్లు ఇందులో బయటకు వచ్చాయి. అందులో ముఖ్యంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. వైఎస్ అవినాష్ రెడ్డి దీని వెనుక ఉన్నట్టు, ఎర్ర గంగి రెడ్డి చెప్పాడు అంటూ దస్తగిరి కోర్టు ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ ప్లాన్ మొత్తానికి సుపారీ రూ.40 కోట్లు అని తేల్చారు. రూ.40 కోట్లు అంటే మామూలు విషయం కాదు, దీని వెనుక ఎంత పెద్ద పెద్ద చేతులు లేకపోతే 40 కోట్లు ఇస్తారు అనేది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్న.

viveka 16112021 2

గత రెండు రోజులుగా ఈ వార్తలు హోరెత్తుతున్నాయి. అన్ని టీవీ చానల్స్ లో ఈ విషయం పై ప్రముఖంగా వార్తలు వచ్చాయి. బ్లూ మీడియా మాత్రం, ఇది పట్టించుకోలేదు, అది వేరే విషయం. అయితే ఇంత గోల జరుగుతున్నా వైసీపీ నుంచి కానీ, అవినాష్ రెడ్డి వైపు నుంచి కానీ, ఎవరి నుంచి కూడా ఈ విషయం పై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఎట్టకేలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ దీని పైన అనవసరంగా గోల చేస్తుందని, ఏ విషయం జరిగినా దాన్ని రాజకీయాలకు ముడి పెడుతున్నారని, వివేక కేసుని రాజకీయాలకు ముడి పెట్టవద్దు అని కోరుతున్నాం అని అన్నారు. వివేక చనిపోయిన క్షణాన దుఃఖంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, సిబిఐ విచారణ అడిగారని, అప్పట్లో కర్ణటక నుంచి కూడా వ్యక్తులు వచ్చారని సమాచారం ఉండటంతో, అప్పట్లో సిబిఐ విచారణ కోరినట్టు చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని, అంతే కాని ప్రతి విషయం రాజకీయాలకు ముడి పెట్టవద్దు అంటూ టిడిపి నేతల పై విమర్శించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు తిరుపతిలో పర్యటించిన సంగతి తెలిసిందే. అమిత్ షా మూడో రోజు అయిన సోమవారం, ఏపి బీజేపీ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ ఎప్పుడూ లేని విధంగా హాట్ హాట్ గా సాగింది. ఏపి బీజేపీ నేతల పై అమిత్ షా సీరియస్ అయ్యారు. అంతే కాదు, ఇక్కడ కొంత మంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడపుతున్న యవ్వరాల పైన ఆయన క్లాస్ పీకారు. కొంత మంది నేతలను ఉద్దేశిస్తూ, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారో, లేక బీజేపీ కోసం పని చేస్తున్నారో ఆలోచించాలని అన్నారు. ఇద్దరి వ్యక్తుల మధ్య ఏదో గొడవ జరిగితే ఏబీఎన్ ఛానల్ ల ను మీరు బ్యాన్ చేయటం ఏమిటి ? మీ వార్తలు ఇంకా ఎందులో వస్తున్నాయి ? సాక్షిలో మీ వర్తలు వస్తున్నాయా ? మరి సాక్షిని ఎందుకు బ్యాన్ చేయలేదు అంటూ అమిత్ షా క్లాస్ పీకారు. అలాగే వేరే పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలను ఎందుకు దూరం పెడుతున్నారని ? వారికి ఎందుకు తగిన గౌరవం పార్టీలోకి ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఇక అమరావతి ఉద్యమం పైన కూడా షా సీరియస్ అయ్యారు. అయితే సునీల్ దేవధర్‌ కలుగ చేసుకుని, అది టిడిపి పార్టీ నడుపుతున్న ఉద్యమం అని అందుకే తాము వెళ్లలేదని చెప్పే ప్రయత్నం చేయగా అమిత్ షా సీరియస్ అయ్యారు.

rrr 16112021 2

వెనుక సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేయాలని అనుకోవద్దని, మీరు పట్టించుకోక పోవటం వల్లే కదా, ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి ఆ ఉద్యమాన్ని క్యాష్ చేసుకుంది అని ఫైర్ అయ్యరు. వాళ్ళకు టిడిపి మద్దతు ఉందని, వారిని మనం దూరం పెడితే, నష్టపోయేది మనమే కదా అని ప్రశ్నించటంతో రాష్ట్ర బీజేపీ నేతలు షాక్ తిన్నారు. ఇంకా ఓడిపోయిన టిడిపిని టార్గెట్ చేస్తే ఏమి వస్తుందని ప్రశ్నించారు. ఇక పొతే అమిత్ షా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి మోసాల పైన, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన పైన, రఘురామకృష్ణ రాజు గట్టిగా పోరాడుతున్నారని, అతన్ని పార్టీలోకి తీసుకుందాం అని, మన పార్టీకి మరింత బలం చేకూరుతుందని అమిత్ షా చెప్పారు. ఇప్పటికే బీజేపీ, వైసీపీ ఒక్కటి అనే ప్రచారం ఉందని, అది తప్పు అని ప్రజలకు సంకేతాలు వెళ్ళాలని, రఘురామకృష్ణం రాజుని మన పార్టీలోకి తీసుకుంటే, ఈ అపవాదు కూడా ప్రజల్లో పార్టీ పై పోతుందని అన్నారు. మరి రఘురామరాజు గారు ఈ వార్తల పై ఎలా స్పందిస్తారో ? అయితే రఘురామరాజు వస్తే, తమ పరిస్థితి ఏమిటో అని కొంత మంది బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తుంది.

ఆంధ్రపదేశ్ హైకోర్టులో నిన్న, ప్రభుత్వానికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నిన్న అమరావతి మార్పు విషయం పై, దాఖలైన పిటీషన్ల పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోజు వారీ విచారణ ప్రారంభం అయ్యింది. నిజానికి రోజు వారీ విచారణలో ఇది మూడో బెంచ్. గత రెండు సార్లు, వాదనలు వినటం, చీఫ్ జస్టిస్ బదిలీ కావటంతో, ఇప్పుడు మూడో సారి ఫుల్ బెంచ్ విచారణ జరుపుతుంది. చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బెంచ్ లో మొత్తం ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. త్రిసభ్య ధర్మాసనం, నిన్నటి నుంచి ఈ విచారణ ప్రారంభించింది. అయితే విచారణ ప్రారంభం కాగానే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఈ పిటీషన్లకు తోడుగా మరొక అనుభంద పిటీషన్ వేసారు. అందులో, బెంచ్ లో ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వారిని ఈ విచారణ నుంచి తప్పించాలి అంటూ, చీఫ్ జస్టిస్ ను కోరారు. త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న ఇదరి న్యాయమూర్తులకు ప్రభుత్వం, అమరావతిలో ఫ్లాట్లు ఇచ్చిందని, వారికి ఆర్ధికపరమైన ప్రయోజనాలు ఈ అంశంతో ముడి పడి ఉన్నాయి కాబట్టి, వారు ఈ పిటీషన్ విచారణలో ఉండకూడదు అంటూ అనుబంధ పిటీషన్ వేసారు.

hc 16112021 2

దీని పైన చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఘాటుగానే బదులు ఇచ్చారు. ఒక ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి వినతులు రావటం దురదృష్టకరం అని అన్నారు. గతంలో కూడా ఇదే న్యాయమూర్తులు, అమరావతి కేసుల విచారణలో ఉన్నారని, అప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు. ఒక వైపు న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని చెప్తూనే, ఇప్పుడు ఇలాంటి పిటీషన్లు వేస్తున్నారని అన్నారు. అమరావతిలో చాలా మంది న్యాయమూర్తులకు ప్రభుత్వం ఫ్లాట్లు ఇచ్చిందని, అది విధానపరమైన నిర్ణయం అని అన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట, ఎవరికో ఒక జడ్జిలకు భూములు ఉంటాయని, అలా అనుకుంటే అసలు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ కేసు కూడా ఇక్కడ వాదించకూడదని అన్నారు. తాను కూడా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా కాబట్టి, తాను కూడా ఈ పిటీషన్ విచారణ చేయకూడదా అని ప్రశ్నించారు. ఈ పిటీషన్ ఈ హైకోర్టులో విచారణ చేయటానికి, మీకు అభ్యంతరం ఉంటే, వేరే హైకోర్ట్ కు ఈ కేసు బదిలీ చేయాలని, సుప్రీం కోర్టుని అడగవచ్చని చీఫ్ జస్టిస్ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read