ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు ఎలా టార్గెట్ అయ్యారో ఈ దేశం మొత్తం చూసింది. ఏకంగా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియానే టార్గెట్ చేసిన గొప్ప గొప్ప ఘనులు మన రాష్ట్రంలో ఉన్నారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే, ఆహా ఓహో అని రాసుకుంటారు. ఒక చిన్న వ్యతిరేక తీర్పు వచ్చిన దురుద్దేశాలు ఆపాదిస్తారు. ఇదే విషయం పై, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత ఆవేదన వ్యక్తం చేసారు. జస్టిస్‌ లలిత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె అందించిన సేవలకు గుర్తుగా, నిన్న హైకోర్టులో వీడ్కోల సభ జరిగింది. చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. జస్టిస్ లలిత ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా పని చేసారని, 12వేలకు పైగా కేసులు విచారించి, 4,325 కేసుల్లో తీర్పులు ఇచ్చారని, జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ లలిత మాట్లాడుతూ, కొన్ని కీలక అంశాలు ప్రస్తావిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇటీవల న్యాయమూర్తులను టార్గెట్ చేసిన విధానం పై ఆవేదన వ్యక్తం చేసారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని అన్నారు. న్యాయమూర్తులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.

lalitha 09112021 2

ఒత్తిడి వాతావరణంలోకి, న్యాయమూర్తులను నెట్టి, పని చేసేలా పరిస్థితిని తీసుకుని వచ్చారని అన్నారు. న్యాయవ్యవస్థను మసకబార్చే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. అయితే ఇలాంటి ఘటనలు కదిలే మేఘాలు లాంటివి అని, వెలుగుని ఎప్పుడూ ఆపలేవని అన్నారు. చట్టబద్ధమైన వ్యక్తుల మౌనం ప్రమాదకరం అని అన్నారు. తాను ఏ వ్యక్తికి భయపడకుండా, నిజాయతీగా వ్యవహరించానని, ఇందుకు గర్వ పడుతున్నాని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు కూడా చురకలు అంటించారు. ఈ మధ్య కాలంలో వాదనల సమయంలో, కొంత మంది న్యాయవాదులు, న్యాయమూర్తులతో, తీవ్ర వాదనలకు దిగుతున్నారని, ఈ ధోరణి మంచిది కాదని అన్నారు. ఇక రిమాండ్ విధించే క్రమంలో మేజిస్ట్రేట్ల తీరుని కూడా తప్పు బట్టారు. రిమాండ్ పిటీషన్ వస్తే, యాంత్రికంగా రిమాండ్ వేసేస్తున్నారని, అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న విషయం కూడా చూడటం లేదని, పవిత్రమైన విధిని నిర్వర్తిస్తున్నామన్న విషయాన్ని మేజిస్ట్రేట్లు మర్చిపోతున్నారని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి పై, ఈ మధ్య కాలంలో సిబిఐ ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయలేదు అనే చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులు పై సిబిఐ, ఇప్పటికే అనేక చార్జ్ షీట్లు కోర్టు ముందు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తరువాత అనేక సార్లు జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వాదనలు వినిపించారు. దాదాపుగా 2017 నుంచి, జగన్ పై సిబిఐ సాఫ్ట్ గానే వెళ్తూ వచ్చింది. మొన్నటి మొన్న రఘురామకృష్ణం రాజు బెయిల్ పిటీషన్ సందర్భంగా కూడా, సిబిఐ ఒక్క మాట కూడా జగన్ కు వ్యతిరేకంగా వాదించలేదు. అలంటి సిబిఐ చాలా రోజులు తరువాత, జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసింది. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో హెటిరో కంపెనీ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన జగన్ కేసుల్లో నుంచి తన పేరు కొట్టేయాలి అంటూ తెలంగాణా హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చిన సిబిఐ, జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో హెటిరో కంపెనీ పెట్టింది పెట్టుబడులు కాదని, ముడుపులే అని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారం పై తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్ కంపెనీలో, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండానే, రూ.1246 కోట్లు లబ్ది పొందారనే సిబిఐ పేర్కొంది.

cbi 09112021 2

జగన్, విజయసాయి రెడ్డిలు కుట్ర పూరితంగా, వ్యవహరించారని, తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని, జగన్ ఈ ముడుపులు పొందారని పేర్కొంది. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని, ఆ కంపెనీకి లబ్ది చేకుర్చి, క్విడ్ ప్రోకో ద్వారా పెట్టుబడులు పెట్టించారని తేల్చి చెప్పింది. ఒక పక్క ప్రభుత్వం ద్వారా భూకేటాయింపులు పొంది, తరువాత జగన్ కంపెనీల్లో, పెట్టుబడులు పెట్టటాన్ని, రెండు కలిపి చూడాలని, అందుకే ఇది క్విడ్ ప్రోకో అయ్యిందని సిబిఐ వాదించింది. ఇన్నేళ్ళు గడుస్తున్నా, ఇంకా విచారణ డిశ్చార్జ్ పిటీషన్ల దగ్గరే ఉంది అంటూ సిబిఐ కోర్టుకు తెలిపింది. హెటిరో కంపెనీ నుంచి జగతిలోకి వచ్చిన పెట్టుబడులు కరెక్ట్ అని చెప్పటానికి, విజయసాయి రెడ్డి డెలాయిట్‌ సంస్థ నుంచి తప్పుడు రిపోర్ట్ తెప్పించిన ఆధారాలు కూడా కోర్టు ముందు ఉంచింది. ఈ మొత్తం వ్యవహారంలో హెటిరో కంపెనీ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి పాత్ర ఉందని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, అందుకే అతని క్వాష్ పిటీషన్ కొట్టేయాలని సిబిఐ వాదించింది. అయితే ఇప్పుడు సిబిఐ, ఇంతలా జగన్, విజయసాయి రెడ్డిలను టార్గెట్ చేయటం పై చర్చ నడుస్తుంది.

నిన్న అనంతపురం జిల్లాలో, SSBN కాలేజీ దగ్గర, ప్రభుత్వ నిర్ణయమైన ఎయిడెడ్ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా విద్యార్ధులు చేసిన నిరసనలో, పోలీసుల చేతిలో గాయపడ్డ విద్యార్ధిని జయలక్ష్మి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఉదయం నుంచి మీడియాలో జయలక్ష్మి ఆచూకీ లభించటం లేదు అంటూ, పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం తమకేమీ తెలియదంటూ, ఎలాంటి ప్రకటన చేయటం లేదు. ఇప్పటి వరకు జయలక్ష్మి క్షేమ సమాచారం బయటకు రాలేదు. అయితే నిన్న పోలీసుల దా-డిలో గాయపడ్డ జయలక్ష్మి, తల్లిదండ్రులు, నిన్న సాయంత్రం నుంచి అదృశ్యం అయ్యారు. ఇంటికి కూడా తాళం వేసి ఉండటంతో, బంధువులతో పాటుగా, స్నేహితులు కూడా కంగారు పడుతున్నారు. పోలీసులు మాత్రం విషయం చెప్పటం లేదు. మరో పక్క జయలక్ష్మి ఇంటి పరిసరాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారని, ఎవరినీ ఇంటి వైపు వెళ్ళకుండా చూస్తున్నారని, పోలీసుల పై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండటంతో, స్థానికులు భయాందోళనలో ఉన్నారు. అయితే రేపు నారా లోకేష్ అనంతపురం వచ్చి, జయలక్ష్మిని పరామరిస్తారనే వార్తల నేపధ్యంలోనే, ఆ కుటుంబాన్ని పోలీసులే దాచేసి ఉంటారని టిడిపి ఆరోపిస్తుంది.

atp 09112021 2

ఇప్పటికే లోకేష్ ఆ విద్యార్ధినితో ఫోన్ లో మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. రేపు లోకేష్ అనంతపురం వచ్చి, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే మరింతగా ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందని, ప్రభుత్వం భయపడి ఉంటుందని భావిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో పోలీసులు చెప్తే కానీ తెలియదు. అయితే, పోలీసులు నిన్న చేసిన లాఠీచార్జ్ కు నిరసిస్తూ, ఈ రోజు విద్యార్ధి సంఘాలు బంద్ కు పిలుపు ఇచ్చాయి. బంద్ లో భాగంగా, పోలీసులకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టే దిశగా విద్యార్ధులు సిద్ధం అయ్యారు. అయితే విద్యార్ధులకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ర్యాలీ చేయకూడదు అనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. భారీ ఎత్తున పోలీసులు మొహరించి, విధ్యార్ధులను అడ్డుకుంటున్నారు. ఈ రోజు మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్ధులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రేపు మళ్ళీ నారా లోకేష్ పర్యటన ఉండటంతో, ఈ మొత్తం వ్యవహరం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

విశాఖపట్నంలోని ఫార్మాసిటీలో ఆంధ్రా షుగర్ కంపెనీ కొనుక్కున్న నలభై రెండు ఎకరాల ఒప్పందాన్ని, ఏపి ప్రభుత్వం రద్దు చేయటం‌పై ఏపీ హైకోర్టు, ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈ అంశం పై నిన్న ఉత్తర్వులు ఇస్తూ, స్టేటస్కో విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర షుగర్స్ కొనుక్కున్న చోట ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తాం అంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీఐఐసీ, రాంకీ, ఆంధ్రా షుగర్ మధ్య ట్రై పాక్షిక ఒప్పందం గతంలో జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఏపీఐఐసీ నుంచి ఆంధ్రా షుగర్స్ ఆ భూమిని విక్రయించింది. అయితే ఆ భూమిలోకి బ్యాక్ వాటర్ వస్తుండటం అలాగే, ఇక్కడ మరో కంపెనీ అయిన రాంకీ ఫార్మా కనీస సహకారం కూడా లేకపోవటంతో, ఆ భూమిలో ఎలాంటి అభివృద్ధి జరగకుండా, ఇబ్బందులకు గురి అయ్యామని ఆంధ్రా షుగర్స్ తెలిపింది. అయితే వివిధ కారణాలతో ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని చెప్పి సేల్ డీడ్ తో పాటుగా ట్రై పాక్షిక ఒప్పందం, రద్దు చేస్తూ కొన్ని రోజుల క్రితం ఏపీఐఐసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం జారీక్ చేసిన ఈ ఉత్తర్వుల పై, ఆంధ్రా షుగర్స్ హైకోర్టులో సవాల్ చేసింది. ఆంధ్రా షుగర్స్ తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తమ వాదనలు బలంగా వినిపించారు.

rs 09112021 2

సేల్ డీడ్‌ రద్దు చేయటం అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన గత తీర్పులకు పూర్తి విరుద్ధం అని, సేల్ దీద్ రద్దు ఎలా చేస్తారు అంటూ వాదించారు. అభివృద్ధి చేయటానికి రెడీగా ఉన్నారని, అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్తున్నారని, అటు వైపు నుంచి, మిగతా పక్షాల నుంచి సహకారం రాలేదని కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా, ఒప్పందం రద్దు చేయటంతో పాటుగా, సెల్ డీడ్ కూడా రద్దు చేసారని, సేల్ డీడ్ రద్దు చేసిన విధానం, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు ఇది విరుద్ధం అని, ఆ తీర్పులు అన్నీ కోర్టు ముందు ఉంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కోర్టు నిర్ణయం ప్రకటించాలని అభ్యర్ధించారు. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా, ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ అంశం పై స్టేటస్ కో విధించింది. ఈ అంశంపై యధాతధ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Latest Articles

Most Read