గతంలో జరిగిన పంచాయితీ, జడ్పీ ఎన్నికల్లో అరాచకంగా వ్యవహరించిన వైసీపీ నేడు మున్సిపల్ ఎన్నిక నామినేషన్లలోనూ ‎ అదే విధంగా వ్యవహరించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ద్వజమెతారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో టీడీపీ శ్రేణుల్ని నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అన్ని విధాల ప్రయత్నించారు. కోర్టు ఆదేశాలు సైతం దిక్కరించి గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దుల్ని ‎ నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. జగన్ అరాచ‎క పాలనకు ఇదే నిదర్శనం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్టలి పెట్టు, పోలీసు, రెవిన్యూ యంత్రాగాన్ని ఉపయోగించి, క్యాస్ట్ , ఇన్న్ కమ్, నో డ్యూస్ వంటి సర్టిపికట్ల విషయంలో కూడా టీడీపీ అభ్యర్ధుల్ని ఇబ్బందులకు గురి చేశారు. 328 నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా టీడీపీ అభ్యర్దలు 322 మాత్రమే వేశారు. మిగతా 6 చోట్ల వైసీపీ అరాచకం వల్ల నామినేషన్లు వేయలేకపోయా. జగన్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి, సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారనేది మరో సారి రుజువైంది. కుప్పంలో నామినేషన్ వేస్తున్న అభ్యర్ది వెంకటేష్ పై దా-డి-కి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటని ప్రజలు ఆలోచిస్తున్నారు. గత రెండున్నరేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని, తప్పుల్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతల్ని, ప్రజాసంఘాల్ని, ఎన్నికల్లో పోటీ చేసే వారిపై దా-డు-లు చేస్తూ బెదిరింపులకు గురిచేశారు. వైసీపీ అరాచక పాలనలపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు బుద్ది చెప్పిన విధంగా మన రాష్ట్రంలో కూడా ఈ అరాచక పాలనకు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని జగన్ గ్రహించాలి.

tdp 0052021 2

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.... గురజాల నగర పంచాయితీలో టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఈసీకి, ఎస్సీకి ఆదేశాలు ఇచ్చినా వాటిని దిక్కరించి టీడీపీ అభ్యర్ద్యుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటే ప్రభుత్వం వ్యవస్ధలను ఏవిధంగా నిర్వీర్యం చేస్తుందో ఇదే ఉదాహరణ. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ప్రభుత్వమే వ్యవస్ధలను నిర్వీర్యం చేసేలా వ్యవహరించటం సిగ్గుచేటు. గత ఎన్నికల్లో అన్ని పత్రాలు సరిగా ఉన్నా టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు తొలగించారు. ఈ సారి కూడా అలా చేస్తారన్న భయంతో అన్ని నామినేషన్లకు ‎ చెక్ లిస్టును ఇచ్చాం. అవి ఈసీకి, కలెక్టర్ కి, కోర్టుకి, ఆర్వోకి మీడియాకు, సోషల్ మీడియాకు కూడా ఇచ్చాం. గత పంచాయితీ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారిని ఈ ఎన్నికలకు కూడా స్పెషల్ ఆఫీసర్ గా అక్కడే నియమించారు. ఆయన్ని తొలగించాలని కోర్టుని ఆశ్రయించాం. స్ధానిక వెలుగు అధికారులు, మహిళలతో పెద్దిరెడ్డి మీటింగ్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేల చేత ప్రతిపక్ష నేత చంద్రబాబుని బూతులు తిట్టించటం సిగ్గుచేటు. ఒక్క మీటింగ్ కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసిన ఘనత వైసీపి ప్రభుత్వానికే దక్కింది. ప్రధాన పక్షంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం సాగిస్తామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ చూస్తున్నాం. దేశంలోనే రైతులు ఆ-త్మ-హ-త్య-ల్లో మనం మూడో స్థానంలో ఉన్నాం. ఒక పక్క ప్రకృతి విపత్తులు, మరో పక్క పాలకుల అశ్రద్ధ. గిట్టుబాటు ధరలు ఉండవు, మార్కెటింగ్ సౌకర్యం ఉండదు, విపత్తుల పరిహారం ఉండదు, చివరకు ధాన్యం అమ్మితే, చెరకు అమ్మితే కూడా బకాయలు కోసం రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. పరిస్థితి ఇలా ఉంటే, ప్రభుత్వం మాత్రం, తామది రైతు ప్రభుత్వం అని చెప్తుంది. రైతు ఉత్సవాలు చేస్తుంది. మేము రైతులకు ఇచ్చే సంక్షేమం ఇంకా ఎవరూ ఇవ్వటం లేదని చెప్తుంది. తన తండ్రి పుట్టిన రోజుని, రైతు దినోత్సవం అని ప్రకటించారు. ఇలా ప్రభుత్వం ఇంత డబ్బా కొడుతుంటే, అసలు రైతులు పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది ? ఏమి జరుగుతుంది అనే విషయాల పై ఆత్మసాక్షి అనే సంస్థ ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో సంచలన విషయాలు అన్నీ బయట పడ్డాయి. దాదపుగా 30 వేల మంది రైతుల నుంచి ఈ సర్వే సాంపుల్స్ తీసుకున్నారు. మొత్తం 12 ప్రశ్నలు అడిగారు. మొత్తంగా కేవలం 44.5 శాతం మంది రైతులు మాత్రమే సంతృప్తి వ్యక్తం చేసారు. ముఖ్యంగా విద్యుత్ మోటార్లకే మీటర్ల వ్యవహారం పై, ఎక్కువ శాతం మంది రైతులు వ్యతిరేకించారు. ఇప్పటికే కొన్ని చోట్ల మీటర్లు పెడుతున్న సంగతి తెలిసిందే.

atmasakhi 05112021 2

ఇక ప్రభుత్వం పూర్తిగా నిర్ల్యక్షం చేసిన పంట కాలువల నిర్వహణపై కూడా ఆగ్రహంగా ఉన్నారు. కూలీలకు ఎక్కువ ఖర్చు అవుతుందని వాపోయారు. అలాగే కనీస మద్దతు ధర రావటం లేదని, తమ దగ్గర కొన్న పంట విషయంలో, ప్రభుత్వం వెంటనే డబ్బులు ఇవ్వటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇక కౌలు రైతులు పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని సర్వేలో తేలింది. ఇలా అనేక అంశాల పై ప్రభుత్వం పై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. చాలా కొన్ని అంశాల్లో మత్రమే, 50 శాతం పైగా సంతృప్తితో రైతులు ఉన్నారు. ఆత్మ సాక్షి సర్వే అనేది కొంత వైసీపీకి అనుకూలంగా ఉంటుంది అనే ప్రచారం ఉంది. ఆ సర్వేలోనే ఇంత వ్యతిరేకత ఉంది అంటే, వాస్తవంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఇది ఇలా ఉంటే, ఈ సర్వే వివరాలు గురించి తెలుసుకున్న ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. వెంటనే ఈ సర్వే పూర్తి వివరాలు ఇవ్వాలని, ఆ వివరాలు అన్నీ తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. మరి ప్రభుత్వం, ఇప్పటికైనా రైతుల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.

కుప్పంలో వైసీపీ అరాచకానికి తెర లేపింది. నామినేషన్ల సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ ను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్ళారు. 14వ వార్డుకు నామినేషన్ వేసేందుకు వెంకటేశ్ అనే వ్యక్తి రాగా, అతని వద్ద నుంచి నామినేషన్ పత్రాలు లాక్కెళ్ళారు. దీంతో విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. ఇక ఈ అంశం పై, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‍కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయిని లేఖలో తెలిపారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‍పై వైసీపీ నేతలు దా-డి చేశారని ఆ లేఖలో తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే కేంద్రం వద్దే దా-డి జరిగింది, మధ్యాహ్నం జరిగిన దా-డి-లో వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు, దా-డి-లో 30 మంది వరకు పాల్గొని వెంకటేశ్‍ను కొట్టి నామపత్రాలు చించివేశారు అంటూ, దాడికి సంబంధించిన ఫోటోలను చంద్రబాబు లేఖకు జతపరిచారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని, చంద్రబాబు లేఖలో తెలిపారు.

రెండు నెలల క్రితం ప్రశాంత్ కిషోర్ వస్తున్నారు, మనం రోడ్డు మీదకు వెళ్ళాలి, నేను కూడా ప్రజల మధ్య తిరుగుతాను, ఇక ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవాలి అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫేక్ రాతలు మొదలయ్యాయి అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా పేజిలో, ఇలాంటి ఫేక్ రాతలకు చెందిన వాటి గురించి అలెర్ట్ చేస్తూ, నేరుగా ప్రశాంత్ కిషోర్ , జగన్ పై అభియోగాలు వేస్తూ పోస్ట్ లు పెట్టారు. అటు వైపు నుంచి కనీస ఖండన లేదు, కనీస సమాధానం కూడా లేదు. మరి వాళ్ళు తామే చేసామని ఒప్పుకున్నట్టా, లేదా ఎందుకు ఖండించలేదో వారికే తెలియాలి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫేక్ లు అధికం అయిపోయాయి. తెలుగుదేశం పార్టీ వ్యక్తిలా సోషల్ మీడియా ఎకౌంటు పెట్టటం, బాలకృష్ణ ఫోటో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ని తిట్టటం, అలాగే జనసేన పార్టీ అంటూ, పవన్ బొమ్మ పెట్టుకుని చంద్రబాబుని తిట్టటం, ఈ మధ్యలో కులాన్ని కించపరచటం, ఆ మసుగులో మిగతా వారు మా కులాన్ని అంటారా అంటూ రెచ్చిపోవటం, ఇలాంటివి చూస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి ఆరోపణే ఇప్పుడు ఆధారాలతో సహా, తెలుగుదేశం పార్టీ మరొకటి చేసింది.

pk 05112021 2

ట్విట్టర్ లో టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడి పేరుతో ఒక మెసేజ్ తిరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ ముసుగులో ఉన్న కొన్ని అకౌంట్లు ఈ మెసేజ్ తిప్పుతున్నాయి. అందులో జనసేన పార్టీతో పొత్తు విషయంలో, పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని కించపరుచుతున్నట్టు, తాము ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు కావాలని అయ్యన్న అన్నట్టు వార్తలు వచ్చాయి. నిజానికి అయ్యన్న ఆ మాటలు అనలేదు. అంటే టిడిపి, జనసేన కలిస్తే ఏమి అవుతుందో వీళ్ళకు ముందే తెలుసు కాబట్టి, ఇలా ఫేక్ చేసి రెండు పార్టీల మధ్య గ్యాప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మెసేజ్ కాస్తా వైరల్ అవ్వటంతో, టిడిపి స్పందించింది. తమ అఫిషియల్ పేజిలో, అయ్యన్న అ వ్యాఖ్యలు చేయలేదని, ఇది జగన్, ప్రశాంత్ కిషోర్ కలిసి ఆడుతున్న ఫేక్ ప్రచారం అని, ఈ ఫేక్ ప్రచారం చేసే వారితో జాగ్రత్తగా ఉండాలి అంటూ, ప్రశాంత్ కిషోర్ కి డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడైనా ఈ అంశం పై ప్రశాంత్ కిషోర్ టీం స్పందిస్తుందా ? వివరణ ఇస్తుందా ?

Advertisements

Latest Articles

Most Read