తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయికల్యాణిని ఎంత దౌర్జ‌న్య‌క‌రంగా అరెస్టు చేశారో రాష్ట్ర‌ప్ర‌జ‌లంతా చూశారు. అయితే ఆమె చేసిన నేర‌మేంటో తెలుసా? గ‌న్న‌వ‌రం టిడిపి కార్యాల‌యంపై వైసీపీ గూండా మూక‌లు దాడులు చేస్తుంటే, అడ్డుకోని పోలీసుల‌ని నిల‌దీసింది. బాధితురాలి స్థానంలో న్యాయం చేయాల‌ని ఆక్రోశించింది. అదే రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లులో ఉన్న మ‌న రాష్ట్రంలో ఘోర‌మైన నేరం. ద‌ళిత డ్రైవ‌ర్ ని చంపి ఇంటి డెడ్ బాడీ డోర్ డెలివ‌రీ చేసిన ఎమ్మెల్సీలకు ఘ‌న‌స్వాగ‌తాలు ప‌లికే అరాచ‌క‌స్వామ్యంలో ఒక మ‌హిళ‌ని ఎంత అగౌర‌వంగా, దుర్మార్గంగా అరెస్టు చేశారో ప్ర‌జ‌లంతా విస్తుపోయి చూశారు. బెడ్రూంలోకి చొర‌బ‌డి, క‌నీసం దుస్తులు మార్చుకునే టైం ఇవ్వ‌కుండా అత్యంత ఘోరంగా వ్య‌వ‌హ‌రించిన పోలీసులు మూల్పూరి క‌ళ్యాణ‌ఙ‌ భర్త సహా మరో ఇద్దరిపై హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కల్యాణిని సోమవారం ఉదయం అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లిన గన్నవరం పోలీసు సిబ్బందిని అడ్డుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో దుర్భాషలాడి.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారంటూ గన్నవరం ఎస్సై రమేష్ ఇచ్చిన ఫిర్యాదుపై హనుమాన్ జంక్షన్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 353, 341, 509ల కింద కేసు నమోదు చేశారు. A1గా భర్త మూల్పూరి సురేంద్ర కుమార్, A2గా అరుణ్ కుమార్, A3గా మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్ర‌శ్నిస్తే కేసు. త‌మ‌పై దాడులు జ‌రుగుతుంటే అడ్డుకుంటే కేసు. ఇదీ ప్ర‌స్తుతం రాష్ట్రంలో అరాచ‌క పాల‌న తీరు.

జ‌గ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి వేల‌కోట్లు ఖ‌ర్చు చేశారు. వ్య‌వ‌స్థ‌ల‌ని మేనేజ్ చేశారు. దీనికి ప్ర‌తిఫ‌లంగా తెలంగాణ సీఎం ఏం కోరుకుంటే ఏపీ సీఎం అది చేసి పెడుతూ వ‌చ్చారు. ఇద్ద‌రి మ‌ధ్యా విడ‌దీయ‌రాని ఆర్థిక‌, సంబంధాలు పెన‌వేసుకుపోయాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో అటు తెలంగాణ‌లోనూ, ఇటు ఏపీలో ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రం కావడంతో ఎవ‌రికి వారే త‌మ‌ని తాము కాపాడుకుని అధికారం నిల‌బెట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ కి ఏపీలో అడుగు పెట్టేందుకు ఒక ఊతం కావాలి. అదే విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశం. అటు బీజేపీని ఎదిరించేలా, ఇటు ఏపీలో త‌మ పార్టీని విస్త‌రించే ప్ర‌ణాళిక‌లా కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. విశాఖ  స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటామ‌ని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ ప్ర‌క‌టించారు. విశాఖలో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామ‌ని, ఈ  బహిరంగ సభకు తెలంగాణ‌ సీఎం కేసీఆర్ హాజరవుతారు తోట చంద్రశేఖర్ వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప‌రం కాకుండా ప‌క్క‌రాష్ట్ర‌మైన తెలంగాణ ఏకంగా కేంద్రంతో ఢీకొట్ట‌డానికి రెడీ అవుతుంటే...ఏపీ స‌ర్కారు మాత్రం చేష్టలుడిగి చూస్తోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. త‌మ మిత్రుడైన కేసీఆర్ త‌న మ‌నుగ‌డ కోసం విశాఖ   స్టీల్‌ప్లాంట్ విష‌యంలో త‌మ‌ని ఇర‌కాటంలో పెట్టేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ల‌బోదిబోమంటున్నారు.

జ‌గ‌న్ విద్వేష‌మే విజ‌యానికి బాట‌లు వేస్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతాడు. కుల‌,మ‌త‌,ప్రాంత విద్వేషాల‌నే విజ‌యానికి మార్గం మార్చుకుని 2019లో ముఖ్య‌మంత్రి అయ్యాడు. కాపు ఉద్య‌మం మాటున త‌న మ‌నిషి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంని దింపి విధ్వంసాలు సృష్టించి వేడుక చూశాడు. జ‌గ‌న్ సీఎం అవుతూనే ముద్ర‌గ‌డ తెర వెన‌క్కి వెళ్లిపోయాడు. అమ‌రావ‌తిపై విద్వేషంతో మూడు రాజ‌ధానులకి తెర లేపాడు. తెలుగుదేశం ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్లేందుకు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కొంద‌రు మేక‌వ‌న్నె పులుల‌ను చేర‌దీశాడు. వారిని ఒక్కో స‌మ‌యంలో ఒక్కొక్క‌రిపై ప్ర‌యోగించేవాడు. టిడిపి హ‌యాంలో 35 మంది క‌మ్మ డిఎస్సీల‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చేశార‌ని చేసిన విష ప్ర‌చారం ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో తిరుగుతున్నాయి. వాస్త‌వంగా 35 మందిలో న‌లుగురే క‌మ్మ‌. కానీ క‌మ్మ కేస్ట్ అంటే కోపంతో ర‌గిలిపోయేవారు ఇప్ప‌టికీ వైసీపీ విష‌ప్ర‌చార‌మైన క‌మ్మ డిఎస్పీల పోస్టుల‌ను షేర్ చేస్తూనే ఉంటారు. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వ‌న‌జాక్షిని కొట్టారంటూ అల్లిన క‌థ‌..క‌ట్టుక‌థేన‌ని తేలిపోయింది. ఇలా క‌మ్మ కులంపై కొన్ని వంద‌ల ఫేక్ ప్ర‌చారాల‌తో జ‌నంలోకి పంపారు వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి. ఇప్పుడు అధికారంలో ఉన్నా, అది నిలిచే అవ‌కాశాలు క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ కుల‌కుతంత్రాల‌కు తెర‌లేపారు. క‌మ్మ‌కులం మీదుగా టిడిపిపై విద్వేషం చిమ్మ‌డానికి పోసాని కృష్ణ‌ముర‌ళిని దింపారు. ఈడు చాల‌డ‌న్న‌ట్టు వైసీపీ తాబేదారు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ని తోడుగా పంపారు. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి వీళ్ల‌కు ఇచ్చిన టాస్క్ కేవ‌లం క‌మ్మ‌కులాన్ని తిడుతూ తెలుగుదేశాన్ని టార్గెట్ చేయ‌డ‌మే. అయితే అన్నిసార్లూ ``నాన్నా పులి`` అని అబ‌ద్ధ‌పు అరుపు అరిచిన మాదిరిగానే జ‌గ‌న్ రెడ్డి తాను చేయించిన విష‌ప్ర‌చారానికే చివ‌రికి బ‌లి అయ్యే అవ‌కాశాలున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కి ముందు మోహ‌న్ బాబు పోసాని కంటే ఎక్కువ మొరిగాడు. ఇప్పుడు ఒక్క చాన్స్ అల్లుడు ఓన్లీ వ‌న్స్ ఫ‌స‌క్ దెబ్బేసేస‌రికి ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క కుక్కిన పేనులా ప‌డి ఉంటున్నాడు.

ప్ర‌ధాన మంత్రి మోదీ వైఖ‌రి చూస్తుంటే జ‌గ‌న్ రెడ్డి ఏమి చేసినా రైట్, కేసీఆర్ ఏ త‌ప్పు చేయకున్నా రాంగ్ అన్న‌ట్టుంది ప‌రిస్థితి. శనివారం సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని.. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారన్నారు. తెలంగాణ‌లో తండ్రి, కొడుకు, కుమార్తె ఇలా అందరూ అధికారంలో ఉన్నారని.. కుటుంబ పాలక కారణంగానే అవినీతి పెరిగిపోయిందన్నారు. కుటుంబ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. 42 వేల కోట్ల అవినీతిలో ఆల్రెడీ 30 కేసులు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ రెడ్డి అవినీతి గురించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎప్పుడూ మాట్లాడ‌రు. ప‌రిమితికి మించి అప్పులు చేసినా, ఇంకా అప్పులు జ‌గ‌న్ రెడ్డికి ఇస్తూనే ఉన్నారు. ఢిల్లీలో లిక్క‌ర్ స్కాములో 100 కోట్లు చేతులు మారాయ‌ని కేసీఆర్ కుమార్తెని టార్గెట్ చేసిన బీజేపీ పెద్ద‌లు..అదే స్కాముతో సంబంధం ఉన్న వైసీపీ నేత‌ల జోలికి రావ‌డంలేదు. ఏపీలో ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తోన్న మ‌ద్యం ద్వారా వేల‌కోట్లు జ‌గ‌న్ సిండికేట్ కొల్ల‌గొడుతోంద‌ని ఆరోప‌ణ‌లున్నా ఇటువైపే దృష్టి పెట్ట‌డంలేదు. అంటే జ‌గ‌న్ రెడ్డికి మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టున్నారు.

Advertisements

Latest Articles

Most Read