జ‌గ‌న్ విద్వేష‌మే విజ‌యానికి బాట‌లు వేస్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతాడు. కుల‌,మ‌త‌,ప్రాంత విద్వేషాల‌నే విజ‌యానికి మార్గం మార్చుకుని 2019లో ముఖ్య‌మంత్రి అయ్యాడు. కాపు ఉద్య‌మం మాటున త‌న మ‌నిషి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంని దింపి విధ్వంసాలు సృష్టించి వేడుక చూశాడు. జ‌గ‌న్ సీఎం అవుతూనే ముద్ర‌గ‌డ తెర వెన‌క్కి వెళ్లిపోయాడు. అమ‌రావ‌తిపై విద్వేషంతో మూడు రాజ‌ధానులకి తెర లేపాడు. తెలుగుదేశం ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్లేందుకు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కొంద‌రు మేక‌వ‌న్నె పులుల‌ను చేర‌దీశాడు. వారిని ఒక్కో స‌మ‌యంలో ఒక్కొక్క‌రిపై ప్ర‌యోగించేవాడు. టిడిపి హ‌యాంలో 35 మంది క‌మ్మ డిఎస్సీల‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చేశార‌ని చేసిన విష ప్ర‌చారం ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో తిరుగుతున్నాయి. వాస్త‌వంగా 35 మందిలో న‌లుగురే క‌మ్మ‌. కానీ క‌మ్మ కేస్ట్ అంటే కోపంతో ర‌గిలిపోయేవారు ఇప్ప‌టికీ వైసీపీ విష‌ప్ర‌చార‌మైన క‌మ్మ డిఎస్పీల పోస్టుల‌ను షేర్ చేస్తూనే ఉంటారు. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వ‌న‌జాక్షిని కొట్టారంటూ అల్లిన క‌థ‌..క‌ట్టుక‌థేన‌ని తేలిపోయింది. ఇలా క‌మ్మ కులంపై కొన్ని వంద‌ల ఫేక్ ప్ర‌చారాల‌తో జ‌నంలోకి పంపారు వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి. ఇప్పుడు అధికారంలో ఉన్నా, అది నిలిచే అవ‌కాశాలు క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ కుల‌కుతంత్రాల‌కు తెర‌లేపారు. క‌మ్మ‌కులం మీదుగా టిడిపిపై విద్వేషం చిమ్మ‌డానికి పోసాని కృష్ణ‌ముర‌ళిని దింపారు. ఈడు చాల‌డ‌న్న‌ట్టు వైసీపీ తాబేదారు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ని తోడుగా పంపారు. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి వీళ్ల‌కు ఇచ్చిన టాస్క్ కేవ‌లం క‌మ్మ‌కులాన్ని తిడుతూ తెలుగుదేశాన్ని టార్గెట్ చేయ‌డ‌మే. అయితే అన్నిసార్లూ ``నాన్నా పులి`` అని అబ‌ద్ధ‌పు అరుపు అరిచిన మాదిరిగానే జ‌గ‌న్ రెడ్డి తాను చేయించిన విష‌ప్ర‌చారానికే చివ‌రికి బ‌లి అయ్యే అవ‌కాశాలున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కి ముందు మోహ‌న్ బాబు పోసాని కంటే ఎక్కువ మొరిగాడు. ఇప్పుడు ఒక్క చాన్స్ అల్లుడు ఓన్లీ వ‌న్స్ ఫ‌స‌క్ దెబ్బేసేస‌రికి ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క కుక్కిన పేనులా ప‌డి ఉంటున్నాడు.

సాక్షిలో ఒక్క డేట్ త‌ప్పించి ఏదీ నిజం ఉండ‌దు అని టిడిపి అధికార ప్ర‌తినిధి జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లే జ‌నం కూడా బ‌లంగా న‌మ్ముతున్నారు. దీంతో సాక్షి, దాని అనుబంధ సంస్థ‌లైన టివీ9, ఎన్టీవీలు కూడా విశ్వ‌స‌నీయ‌త కోల్పోయాయి. జ‌గ‌న్ కోస‌మే ప‌నిచేసే ఐడ్రీమ్‌ని ఎవ‌రూ దేక‌డం లేదు. దీంతో కొత్త చాన‌ళ్లు హైర్ చేసుకోవ‌డం, ఐ డ్రీమ్ నుంచే కొత్త చాన‌ళ్ల‌ని క్రియేట్ చేసి వ‌స్తున్నారు. నాగ‌రాజు అనే ఐడ్రీమ్ యాంక‌ర్ కాటు వేసే నాగ‌రాజ‌ని అంద‌రికీ తెలిసిపోయింది. ఇది ఐడ్రీమ్ కాదు, వైఎస్ జ‌గ‌న్ డ్రీమ్ అని క్లారిటీ వ‌చ్చాక ఎవ‌రూ ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డానికి కూడా రావ‌డంలేదు. క‌ల్లం హ‌రికృష్ణారెడ్డి, నాగార్జున యాద‌వ్, బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి వంటి యూట్యూబ్ స్టార్లే గ‌తి అయ్యారు. ఇప్పుడు కొత్త‌గా సిగ్నేచ‌ర్ స్టూడియోస్ అని ఒక‌టి స్టార్ట్ చేశారు. అదీ ఐడ్రీమ్ వాళ్ల‌దే. సుమ‌న్ టీవీ చెప్ప‌క్క‌ర్లేదు. సాక్షిలో మొఖాలు చూడటంలేద‌ని, పున‌రావాస ప‌థ‌కం కింద పోస్టులు క‌ట్ట‌బెట్టి కొమ్మినేని శ్రీనివాస‌రావుని బ‌య‌ట‌కి పంపారు. ఏం చేసినా సాక్షిని దేకేవాడే లేడు. అందుకే డిజిట‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ చిన్నాల వాసుదేవ‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కొత్త కొత్త చానెళ్లు పెడుతున్నారు. ఇవ‌న్నీ ఎన్నిక‌ల వ‌రకే. ఏ చాన‌ల్ లోగో, పేరు మారినా..యాంక‌ర్ మాత్రం నాగ‌రాజే. అంటే అర్థం అవుతోంది క‌దా. ఈ సంస్థ‌ల వెనుక ఉన్న‌ది ఎవ‌రో?

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీరు చాలా భిన్నం. త‌న‌పై దా-డి జ‌రిగింద‌ని కేసు పెట్టాడు. ఆ కేసులో విచార‌ణ‌కి కోర్టు పిలిస్తే ట్రాఫిక్ స‌మ‌స్య అంటాడు. పాల‌న‌లో బిజీగా ఉన్నానని చెబుతాడు. ఈయ‌న చేస్తున్న పాల‌న అంద‌రికీ తెలుసు. చావులకి , పెళ్లిళ్ల‌కు వెళ్ల‌డం త‌ప్పించి ఆయ‌న చేసిన పాల‌న ఏమీ లేద‌ని ప్ర‌జ‌ల‌కి తెలుసు. కోర్టుల‌కి ప‌త్రాలే ఆధారం కాబ‌ట్టి ఆ మేర‌కు ప‌త్రాలు స‌మ‌ర్పించి త‌ప్పించుకుంటున్నాడు. నిందితుడిగా ఉన్న కేసుల్లోనూ కోర్టుకి రాడు. బాధితుడిగా ఉన్న కేసుల్లోనూ కోర్టుకి వెళ్ల‌డు. చిన్న‌పిల్ల‌లు బ‌డికి వెళ్ల‌న‌ని మారాం చేస్తే బడిదొంగ అని గేలి చేసేవారు. జ‌గ‌న్ కోర్టు విచార‌ణ‌కి పిలిస్తే, వెళ్ల‌కుండా ర‌క‌ర‌కాల సాకుల‌తో ఎగ్గొడుతుంటే కోర్టు దొంగ అని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. నాలుగేళ్ల త‌రువాత‌ విశాఖపట్నం విమానాశ్రయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దా-డి కేసుపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచార‌ణ ఆరంభ‌మైంది. ఈ కేసులో సాక్షి, బాధితుడిగా ఉన్న సీఎం జగన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలని గత వాయిదాకి జ‌డ్జి ఆదేశాలిచ్చారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బ‌దులు ఆయ‌న పీఏ కె నాగేశ్వ‌ర్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రానికి సీఎంగా బాధ్యతల నిర్వహణ ఉందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాల సమీక్షలు ఉన్నాయని, తాను కోర్టుకు హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంట‌గూట జ‌గ‌న్ రెడ్డి పిటిషన్ దాఖ‌లు చేశారు. అడ్వకేట్ కమిషనర్‍ సమక్షంలో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా త‌న సాక్ష్యం న‌మోదుకి అవ‌కాశం క‌ల్పించాల‌ని జ‌గ‌న్ రెడ్డి వేసిన పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి విచారణ షెడ్యూల్‍ను రద్దు చేసి ఈనెల 13కు వాయిదా వేశారు.

ఇటీవ‌లే టిడిపి యువ‌నేత లోకేష్ జ‌గ‌న్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ వేశారు. ``జ‌గ‌న్ ప‌ని అయిపోయింది. లండ‌న్ వెళ్లేందుకు ల‌గేజీ స‌ర్దుకో`` అని దాని సారాంశం. ఈ లండ‌న్ క‌థేంటి? అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే జ‌గ‌న్ కి లండ‌న్‌కి ఏదో సంబంధం ఉండే ఉంటుంద‌ని చాలా మంది అనుమానిస్తున్నారు. నాలుగు ఎమ్మెల్సీలు ఓడిపోయి వైసీపీ తొలిసారిగా డిఫెన్స్‌లో ప‌డిన కీల‌క స‌మ‌యంలో హ‌ఠాత్తుగా జ‌గ‌న్ రెడ్డి లండ‌న్ ప‌య‌నం అవుతుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. గ‌డ‌ప గ‌డ‌ప‌కీ మ‌న ప్ర‌భుత్వం, జ‌గ‌న్ మా భ‌విష్య‌త్తు కార్య‌క్ర‌మాలు ఊపిరి స‌ల‌ప‌కుండా రాష్ట్రంలో జ‌రుగుతున్నాయి. ఏడాదిలో ఎన్నిక‌లు రానున్నాయి. చుట్టూ ఇంత ఒత్తిడితో కూడిన స‌మ‌స్య‌లుంటే హ‌ఠాత్తుగా సీఎం లండ‌న్ బ‌య‌లుదేరుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వైఎస్ జగన్ విదేశీ పర్యటన పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మైన‌ద‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. భార్య వైఎస్ భారతి, కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డితో కలిసి ఈ నెల 21వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లి వారం రోజులు అక్క‌డే ఉంటారు. జ‌గ‌న్ రెడ్డి సీఎం అయ్యాక ఆయ‌న వెళ్లింది ఎక్కువ‌సార్లు లండ‌నే. త‌న కుమార్తె అక్క‌డ ఉన్నా, ప్ర‌తీసారీ లండ‌న్ వెళ్ల‌డం వెనుక ఏదో పెద్ద మ‌త‌ల‌బే ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీకి ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని, అధికారంలో ఉన్న‌ప్పుడు తాను వ్య‌వ‌హ‌రిస్తున్న నియంతృత్వ వైఖ‌రికి ప‌ద‌విపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని, అందుకే విదేశాల‌లో సెటిల‌య్యేందుకు ఇప్ప‌టి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని టిడిపి నేత‌లు సైటైర్లు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే లోకేష్ వేసిన లండ‌న్ ట్వీటు, ఇప్పుడు జ‌గ‌న్ లండ‌న్ టూరు మ్యాచ్ అవుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read