ముందు రోజు జ‌గ‌న్ రెడ్డి కాలి నొప్పి, త‌రువాత రోజుకే మాయం కావ‌డంతో నాలుగేళ్ల క్రితం కోడిక‌త్తి డ్రామాని గుర్తుకి తెచ్చింద‌ని టిడిపి నేత‌లు ఆరోపించారు. టిడిపి ఆరోప‌ణ‌లు ప‌క్క‌న‌పెడితే, తీవ్ర‌మైన కాలునొప్పితో అస‌లు న‌డ‌వ‌డానికి కూడా వీలు కావ‌డంలేద‌ని, అందుకే ఒంటిమిట్ట సీతారామ‌చంద్ర‌మూర్తి క‌ళ్యాణోత్స‌వానికి హాజ‌ర‌య్యే ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేస్తున్న‌ట్లు ముందు రోజు సీఎంవో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మ‌రుస‌టి రోజే చిల‌కలూరి పేట‌లో జ‌రిగిన ఫ్యామిలీ డాక్ట‌ర్ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి హాజ‌రై బెణికిన కాలుతోనే వేదిక‌పై చెంగు చెంగున ఎగురుతూ కేడ‌ర్ని ఉత్సాహంలో నింపారు. ఒంటిమిట్ట హెలికాప్ట‌ర్‌లో వెళ్లేందుకు స‌హ‌క‌రించ‌ని కాలు నొప్పి, చిల‌క‌లూరిపేట విడ‌ద‌ల ర‌జిని నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మానికి మాత్రం ఒక్క‌సారిగా మంత్ర‌మేసి కాలు బెణుకు త‌గ్గించిన‌ట్టు త‌గ్గిపోయిందా అని టిడిపి నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం సీఎం జగన్‌ వ్యాయామం చేస్తుండగా ఆయన కాలు బెణికింద‌ని, సాయంత్రానికి నొప్పి ఎక్కువైంద‌ని వైద్యుల సూచన మేరకు అధికారులు ఆయన ప్రయాణాలు రద్దు చేసుకున్నార‌ని విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప‌త్రిక‌ల‌లో అచ్చ‌య్యి ఇళ్ల‌కు వ‌చ్చేస‌రికి సీఎం షిక్క‌టి షిరున‌వ్వుల‌తో గురువారం విడుద‌ల ర‌జ‌ని ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన స‌భ‌లో చ‌లాకీగా తిరుగ‌తూ అందరినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ప‌డేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న ఒంటిమిట్ట‌లో కోదండ రాముడి కళ్యాణోత్సవాలు నిర్వహ‌ణ‌కి ప‌దిహేను రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జ‌రిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య‌మంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించడం ఆన‌వాయితీ. సీఎం జ‌గ‌న్ రెడ్డి కూడా ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం బ‌య‌లుదేరుతున్నార‌ని ఆయ‌న మీడియా హ‌డావిడి చేసిన అర‌గంట‌కే కాలు బెణుకు బ్రేకింగ్ వ‌దిలారు. జగన్మోహన్‌ రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే ఒంటిమిట్ట పర్యటన రద్దు చేసుకొన్నారని, అన్యమతస్థులు ప్రాపకం కోసమే ఉద్దేశపూర్వకంగా ఒంటిమిట్ట పర్యటన ఎగ్గొట్టారని బీజేపీ నేత‌లు ఆరోపించారు. కాలు నొప్పితో ఒంటిమిట్ట ప‌ర్య‌ట‌న ర‌ద్దుచేసుకుని, త‌రువాతి రోజే చిల‌క‌లూరిపేట కార్య‌క్ర‌మానికి వెళ్ల‌డం..ఇది మ‌రో కోడిక‌త్తి డ్రామా అని ఎద్దేవ చేశారు.

ఉర‌వ‌కొండ స‌భ‌లో నారా లోకేష్ కొత్త విష‌యాలు వెల్ల‌డించారు. లోకేష్ చేసిన సెన్సేష‌న్ కామెంట్స్‌తో వైసీపీ వైనాట్ 175 కాదు, ఉన్న 151 మందిలో ఎంత మంది జ‌గ‌న్ రెడ్డితో ఉంటారో అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఉరవకొండ సభలో లోకేష్ త‌న ప్రసంగం తీరుని మార్చి వైసీపీ అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌ని టార్గెట్ చేశారు. ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్సీలు ఓడిపోవ‌డాన్ని జ‌గ‌న్ రెడ్డి ఓట‌మిగా భావిస్తూ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు హైద‌రాబాద్‌లో గ్రాండ్ పార్టీ చేసుకున్నార‌ని సంచ‌ల‌న విష‌యాల‌ను లోకేష్ వెల్ల‌డించారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ మూడుస్థానాల్లో ఓడిపోవ‌డంతో వైసీపీ నేత‌లే సంబ‌రాలు చేసుకున్నారనే ది ప్ర‌చారం కాద‌ని, నిజ‌మేన‌ని లోకేష్ వ్యాఖ్య‌ల‌తో తేలిపోయింది. జ‌గ‌న్ రెడ్డి ఓట‌మిని సెల‌బ్రేట్ చేసుకున్న‌ది సాదాసీదా మండ‌ల నేత‌లు కాదు. ఇద్ద‌రు ఎంపీలు, 17 మంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఉన్నారని ప్ర‌చారం సాగుతోంది. వైసీపీకి చెందిన ఓ ఎంపీ రిసార్ట్‌లో రాత్రి ఆరంభ‌మైన రాత్రి తెల్లార్లూ రంజుగా సాగిందట‌. మందు, విందు, చిందు, వినోదాల‌తో తేలియాడిన ఎంపీ, ఎమ్మెల్యేలు త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ రెడ్డికి ప‌ట్ట‌భ‌ద్రులు స‌రైన గుణ‌పాఠం చెప్పార‌ని గెంతులు వేశార‌ట‌. రిసార్ట్ పార్టీకి హాజ‌రైన వారిలో ఎక్కువ‌మంది జ‌గ‌న్ రెడ్డి సామాజిక‌వ‌ర్గీయులు ఉండ‌టం మ‌రో ట్విస్ట్‌. పార్టీ కోసం తామెంతో శ్ర‌మిస్తే ..గ‌డ్డిపోచ‌ల్లా తీసి పారేసిన త‌మ అధినేత‌కి టిడిపి మంచిగా గుణ‌పాఠం చెప్పింద‌ని పార్టీలోనే కేక‌లు వేశార‌ట ఎంపీలు. ఇప్ప‌టికే అస‌మ్మ‌తిలో బ‌య‌ట‌ప‌డిన కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, మేకపాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ఉండ‌వ‌ల్లి శ్రీదేవితోపాటు 17 మంది ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు ఎంపీల‌పైనా నిఘా తీవ్ర‌త‌రం చేశారని తెలుస్తోంది.

జ‌గ‌న్ రెడ్డి సీఎం అయ్యాక ఆయ‌న ధోర‌ణి పూర్తిగా మారిపోయింది. నియంత కంటే ఘోరంగా త‌యార‌య్యార‌ని వైసీపీలోనే గుస‌గుస‌లు ఆరంభం అయ్యాయి. ఎమ్మెల్యేల‌తో ఎప్పుడు స‌మావేశ‌మైనా త‌న ఫోటోతో గెలిచారు, మీరు కాక‌పోతే ఇంకొరు వ‌స్తార‌న్న‌ట్టు చాలా ధీమాగా ఉండేవారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చావుదెబ్బ‌తో న‌లుగురిపై స‌స్పెన్స‌న్ వేటు వేసి..తనంత ధైర్య‌వంతుడు లేనే లేడంటూ సొంత మీడియాలో సెల్ఫ్ డ‌బ్బా కొట్టించుకున్నాడు. అయితే అస‌లు విష‌యం టిడిపి వెల్ల‌డించింది. వైసీపీ నుంచి 40 మంది ట‌చ్‌లో ఉన్నార‌ని దాని సారాంశం. ఈ నేప‌థ్యంలో కోఆర్డినేష‌న్ మీటింగ్ కి పిలిచారు. ఈ స‌మావేశంలోనే 25 మందికి టికెట్లు ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్ రెడ్డి చెప్పేస్తార‌ని, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తార‌ని లీకులిచ్చారు. తీరా స‌మావేశం ఆరంభం అయ్యాక బ‌తిమాలుకునే ధోర‌ణిలో జగన్ స్వరంలో మార్పుకి వైసీపీ ఎమ్మెల్యేలు షాక‌య్యారు. నా ఫోటోతో గెలిచారు, పీకేస్తాను, విసిరేస్తాను, నా బ‌ట‌న్ నేను నొక్కుతున్నాను, మీరే ఇక చేయాలి అంటూ చెప్పే డైలాగులు ఒక్క‌టి జ‌గ‌న్ రెడ్డి నోటి నుంచి రాలేదు. ఏ ఒక్క ఎమ్మెల్యేని వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేనంటూ కొత్త జ‌గ‌న్ నాట‌కం చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇంత‌లో ఎంత మారిపోయాడంటూ ముక్కున వేలేసుకున్నారు. ఎమ్మెల్సీల ఎన్నిక‌ల్లో ఓడించి త‌మ అధినేత జ‌గ‌న్‌కి బుద్ధిచెప్పిన‌ చంద్రబాబుకి వైసీపీ ఎమ్మెల్యేలు మ‌న‌సులోనే థ్యాంక్స్ చెబుతున్నార‌ట‌. టిడిపి దెబ్బకు జ‌గ‌న్ రెడ్డి దెయ్యం దిగింద‌ని, ఎమ్మెల్యేల‌ను గుర్తిస్తున్నార‌ని, ఈ పరిస్థితికి దారి తీయటానికి చంద్రబాబు కారణం అని, అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఆయనకు థాంక్స్ చెబుతున్నారు.

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి ఈ సారి టికెట్ ఇచ్చేది లేద‌ని సీఎం జ‌గ‌న్ రెడ్డి చెప్పేశార‌ని, అందుకే ఆయ‌న అల‌క‌బూనార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మంగ‌ళ‌గిరి సీటు ఇవ్వ‌న‌ని  సీఎం జగన్ రెడ్డి చెప్పేశార‌ట క‌దా అని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నిస్తే, కుప్పంలో చంద్ర‌బాబు పోటీ చేస్తారా అంటూ, ఎదురు ప్ర‌శ్నించ‌డంతో అస‌లు గుట్టుర‌ట్ట‌య్యింది. తాడేప‌ల్లిలో  సీఎం స‌మావేశానికి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి గైర్హాజ‌రు కావ‌డంతో మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు నిజ‌మ‌య్యాయి. ఇటీవ‌లే మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి త‌న‌యుడు పెళ్ల‌య్యింది. ఆ పెళ్లికి సీఎంని ఎమ్మెల్యే ఆహ్వానించ‌లేదు. సీఎం ఎన్నిక‌ల స‌న్నాహాక స‌మావేశంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన వ‌ర్క్ షాపుకి ప‌క్క‌నే ఉండి కూడా ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి డుమ్మా కొట్ట‌డం ఇద్ద‌రి మ‌ద్యా గ్యాప్ బాగా పెరిగింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల టిడిపి నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి ఈ సారి మంగ‌ళ‌గిరి వైసీపీ టికెట్ ఇస్తున్నార‌ని, మంగ‌ళ‌గిరి సీటు ఇచ్చేది లేద‌ని తేల్చేయ‌డంతోనే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అలిగార‌ని వైసీపీకి చెందిన మీడియా సంస్థ‌ల‌లో క‌థ‌నాలు రావ‌డంతో ..జ‌రుగుతున్న‌ది ప్ర‌చారం కాదు వాస్త‌వ‌మేన‌ని తేలిపోయింది. ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన స‌మావేశానికి ఎందుకు వెళ్లలేదంటే పంటికి చికిత్స చేయించుకున్నాన‌ని ఓ మాట‌, త‌న కొడుకు పెళ్లి అయ్యాక 16 రోజుల పండ‌గ వ‌ల్ల వెళ్ల‌లేద‌ని మ‌రో మాట చెప్ప‌డం అనుమానాల‌కు మ‌రింత ఊతం ఇస్తోంది. మ‌రోవైపు సీఎం ఇంటి ప‌క్క‌నే ఉన్న నియోజ‌క‌ర్గంలో ఇసుక‌, గ్రావెల్ మాఫియాతో వంద‌ల కోట్లు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి దోచేశార‌ని, దీనిపై సీఎం నిల‌దీశార‌ని, ఆ కోపంతోనే వైసీపీతో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read