వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లోపల ఎలా ఉన్నా, బయటకు మాత్రం క్లౌడ్ 9లో ఉన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల ఫలితంతో తాము అసాధారణ వ్యక్తులం అన్నట్టు హడావిడి చేస్తున్నారు. ప్రజలు అంతా తమకే పట్టం కట్టారని, 90 వేల మెజారిటీ అంటే మాటలు కాదు అంటూ హడావిడి చేస్తున్నారు. సహజంగా ఎవరు అయినా ఇలాగే చేస్తారు. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, తమ పరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు అని చెప్పుకోవటం సహజం. అంటే మూడు సార్లు పెరిగిన కరెంటు చార్జీలకు ప్రజలు పట్టం కట్టారని అనుకోవాలా ? పెట్రోల్, డీజిల చార్జీల పెరుగుదలకు ప్రజలు పట్టం కట్టారని అనుకోవాలా ? అధ్వానమైన రోడ్డులు, అప్పులు, రాజధాని లేని రాష్ట్రం, ఇలా అనేక విధ్వంసాలకు ప్రజలు పట్టం కట్టారని అనుకోవాలా ? కాదు కదా ? మరి బద్వేల్ లో ఏమి జరిగింది ? బద్వేల్ లో జరిగింది ఉప ఎన్నిక. అక్కడ అభ్యర్ధి చనిపోతే జరిగిన ఉప ఎన్నిక.అదే కుటుంబం నుంచి వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వటంతో, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎన్నికకు దూరంగా ఉంది. తిరుపతిలో వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చారు కాబట్టి పోటీ పెట్టారు. బద్వేల్ లో అదే కుటుంబం నుంచి టికెట్ ఇచ్చారు కాబట్టి, టిడిపి ప్రధాన ప్రతిపక్షంగా దూరంగా ఉంది.ఇక కొద్దో గొప్పో బలం ఉన్న జనసేన కూడా ఈ ఎన్నికకు దూరంగా ఉంది. ఇక మిగిలింది ఒక శాతం కూడా ఓటింగ్ లేని బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ పోటీలో నిలిచాయి. అంటే ఈ ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి కానీ, తరువాత బలం ఉన్న పార్టీ జనసేన కానీ పోటీ చేయలేదు.

sajjala 02112021 2

మరి ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోలేమా ? అభ్యర్ధి చనిపోయారు కాబట్టి సానుభూతి, అలాగే ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయలేదు కాబట్టి, సులభంగా పెద్ద మెజారిటీతో గెలుపు అనేది అనివార్యం. గతంలో కంటే 8 శాతం ఓటింగ్ తక్కువ పడింది. అదీ కాక ఇక్కడ తిరుపతి లాగే దొంగ ఓట్ల జాతర జరిగిందని వీడియోలు కూడా వచ్చాయి. ఇలాంటి గెలుపుని కూడా గెలుపు అని గొప్పగా చెప్పుకుంటూ, డబ్బా కొడుతుంటే ఇంకా ఏమి చెప్పాలి ? అలా అనుకుంటే, ఇలాగే 2015లో తిరుపతి ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికకు దూరంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి 1,16,524 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు వైసిపీకి వచ్చింది కేవలం 90,228 మెజారిటీ మాత్రమే, అంటే అప్పటి టిడిపి కంటే 25 వేల మెజారిటీ తక్కువ. మరి అప్పుడు టిడిపి ఇలాగే చేసిందా ? వాస్తవంలో బ్రతకకుండా, పోటీ లేని చోట గెలుపుని కూడా అధికార పక్షం గొప్పగా చెప్తుంది అంటేనే, వాళ్ళు ఎదో విషయంలో భయపడుతూ, అన్నీ పెద్దదిగా చెప్పుకుని తిరుగుతున్నారని అర్ధం అవుతుంది.

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వర్తలు విని, ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ తిన్నారు. అసలు ఏమైందో తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే చాలా రోజులుగా నందమూరి బాలకృష్ణ భుజం నొప్పితో బాధ పడుతున్నారు. ఆయన కుడి భుజం గత ఆరు నెలలుగా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సర్జరీ ఒక్కటే మార్గం అని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. అయితే గత ఆరు నెలలు నుంచి ఆయన సినిమా షూటింగ్లు, అలాగే ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో, సర్జరీన వాయిదా వేస్తూ వచ్చారు. అఖండ సినిమా షూటింగ్ లో, గుర్రం మీద స్వారీ చేస్తూ, బాలయ్య కొన్ని సన్నివేశాలు చేసారు. ఆ సమయంలో కూడా బాలయ్య బాగా ఇబ్బంది పడ్డారని, నొప్పి ఎక్కువ కావటంతో, తిరిగి డాక్టర్లను సంప్రదించగా, సర్జరీ అవసరం ఆని చెప్పారు. దీంతో బాలయ్య అక్టోబర్ 31న, కుడి బుజం సర్జరీ కోసం, బంజారా హిల్స్ లోని కేర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రఘువీర్‌రెడ్డి, డాక్టర్‌ బి.ఎన్‌.ప్రసాద్‌ లతో కూడిన డాక్టర్ల బృందం, బాలయ్య కూడా దాదాపుగా నాలుగు గంటల పాటు శ్రమించి బాలయ్య కూడా సర్జరీ చేసారు. ఈ సర్జరీ కూడా విజయవంతం అయ్యిందని, హాస్పిటల్ వర్గాలు చెప్పాయి.

nbk 02112021 2

బాలయ్య కూడా పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నారని, బాలయ్య సన్నిహితులు చెప్పారు. బాలయ్యకు సర్జరీ జరగటం, సక్సెస్ అవ్వటం, ఏ ఇబ్బందులు లేకపోవటంతో, ఈ రోజు బాలయ్యను హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేసారు. దీంతో ఆయన ఈ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా వచ్చేసారు. అయితే ఇంత జరిగినా ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు, సర్జరీ అయినట్టు కూడా ఎవరికీ తెలియదు. అభిమానులకు ముందే ఈ విషయం చెప్తే, హాస్పిటల్ వద్దకు వస్తారనే ఉద్దేశంతో, డిశ్చార్జ్ అయ్యే ముందు, ఈ విషయం మీడియాకు చెప్పారు. ఈ రోజు బాలయ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో, ఆయనను డిశ్చార్జ్ కూడా చేసేసరని చెప్పటంతో, అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే బాలయ్య అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసారు. ఈ సినిమా మరో నెల రెండు నెలల్లో రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. ఇక మొదటి సారి బాలయ్య యాంకర్ కూడా అవతారం ఎత్తారు. అన్‌స్టాపబుల్ విత్ NBK పేరుతో ఈ కార్యక్రమం ఓటిటిలో రానుంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని మరోసారి ప్రభుత్వం తరుపు న్యాయవాదులు ఇరిటేట్ చేసిన సంఘటన ఇది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల పై, ప్రభుత్వ న్యాయవాదులు పై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనేక సార్లు ఇదే జరిగినా, ప్రభుత్వ అధికారాల్లో మార్పు కనిపించటం లేదు. డీజీపీ దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీ, ప్రినిసిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు, ఇతర ఉన్నాతధికారులను హైకోర్టు కోర్టుకు పిలిచినా, కొంత మంది పైన కోర్టు ధిక్కరణ పిటీషన్లు వేసినా , కొంత మందికి శిక్షలు వేసినా కూడా, అధికార వర్గాల్లో మార్పు కనిపించటం లేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఇలా చేస్తున్నారా, లేక అధికారులే ఇలా అవగాహనలేక చేస్తున్నారో కానీ, హైకోర్ట్ చేతిలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. ప్రభుత్వ స్కూల్స్ ఉన్న ప్రాంగణంలో, గ్రామ సచివాలయాలు, అలాగే రైతు భరోసా కేంద్రాలు ఇలా అనేక, భవనాలు కడుతూ ఉండటంతో, గతంలో హైకోర్టు ఈ అంశం పై ఆదేశాలు ఇస్తూ, ఆ భవనాలు వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు అమలు కాక పోవటంతో, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీని పైన సుమోటోగా కేసు నమోదు చేసి, కోర్టు ధిక్కరణ కింద కేసు బుక్ చేసింది.

hc 02112021 2

ఈ కేసు నిన్న విచారణకు వచ్చింది. హైకోర్టు సీనియర్ న్యాయవాది బట్టు దేవానంద్ బెంచ్ ముందుకు ఈ పిటీషన్ రాగా, నిన్న విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంలో, హైకోర్టు అడిగిన సమాచారం ఇవ్వకుండా, వేరే సమాచారం ఇవ్వటంతో హైకోర్టు ఆశ్చర్య పోయింది. ప్రభుత్వ స్కూల్స్ ప్రాంగణంలో, గ్రామ సచివాలయ భావనలను తొలగింపునకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా, హైకోర్టు కోరగా, ఇద్దరు అధికారుల మధ్య జరిగిన సంభాషణ ఫైల్ ని, కోర్టు ముందు ఉంచారు. దీంతో హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఫైల్స్ కోర్టు ముందు పెడితే ఉపయోగం ఏమిటి అని ? మిమ్మల్ని ఏమి అడిగాం, మీరు ఏమి ఇచ్చారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఫైల్స్ మా ముందు పెట్టి, మమ్మల్ని భ్రమింపచేస్తున్నారా అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించింది. వీటి కోసం మళ్ళీ వేల పేజీల జిరాక్స్ తో ప్రజాధనం నిరుపయోగం చేసారని, వెంటనే వాస్తవ రిపోర్ట్ ఇవ్వాలని చెప్తూ, కేసుని 15వ తేదీకి వాయిదా వేసింది.

ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థల్లో ఒకటి, న్యాయ వ్యవస్థ. అలాంటి న్యాయ వ్యవస్థ టార్గెట్ అయితే, సిబిఐ ఈ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించే పరిస్థితితో, ఏపి హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సంచలన ఆదేశాలు ఇవ్వటానికి రెడీ అవుతుంది. ఇదే కనుక జరిగితే, ఇప్పటికే మసకబారిన సిబిఐ వ్యవస్థ, మరింతగా కిందకు దిగే అవకాసం ఉంది. ఒక కేసు విషయంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఏకంగా హైకోర్టు పైన, న్యాయమూర్తుల పైన దా-డి చేసారు. హైకోర్టు రిజిస్టార్ కేసు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుసా దేశంలో మొదటి సారి, రక్షించమంటూ హైకోర్టే కేసు పెట్టటం. విచారణ చేసిన హైకోర్టు, ఈ కేసుని సీరియస్ గా పరిగణించి, సిఐఐ దర్యాప్తుకు ఆదేశించింది. అయితే సిఐడి దర్యాప్తు సరిగా సాగక పోవటంతో, హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్ప చెప్పింది. అయితే ఇప్పుడు సిబిఐ విచారణ కూడా సరిగా సాగటం లేదు. దీంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు ఈ కేసు పై విచారణ జరిగింది. దీని పై ఈ రోజు అత్యవసర విచారణ జరిగింది. అయితే స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ మాట్లాడుతూ, హైకోర్టు రిజిస్టార్ నుంచి లెటర్ వెళ్ళిన వెంటనే, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్‌ నుంచి పంచ్ ప్రభాకర్ పోస్ట్ లు తొలగించినట్టు కోర్టుకు చెప్పారు.

hc cbi 02112021 2

అయితే ఇదే సందర్భంలో కల్పించుకున్న సిబిఐ, తాము కూడా ఈ విషయంలో లెటర్ రాసినట్టు చెప్పారు. అయితే ఈ విషయం పై హైకోర్టు సిబిఐ పై ఫైర్ అయ్యింది. లెటర్ రాసి ఏమి ఉపయోగం అంటూ సిబిఐని ప్రశ్నించింది. పంచ్ ప్రభాకర్ ని మీరు ఎలా పట్టుకుంటారో చెప్పండి అంటూ సిబిఐని ప్రశ్నించింది. సిబిఐ నుంచి సరైన సమాధానం రాకపోవటంతో, హైకోర్టు ఉగ్ర రూపం దాల్చింది. కోర్టు చెప్పింది మీరు వినటం లేదు, మీరు చెప్పింది మేము వినాల్సిన అవసరం లేదు, ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏమిక్ హేయాలో చూస్తాం అని, దీని పై ఆదేశాలు ఇస్తాం అంటూ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. అవసరం అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తాం అంటూ మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసు అని హైకోర్టు చెప్పింది. సాయంత్రం ఆదేశాలు ఇస్తాం అని చెప్పింది. ఒక వేళ సిబిఐ కాకుండా మరో ప్రత్యెక దర్యాప్తు బృందాన్ని కోర్టు నియమిస్తే, ఇది సిబిఐకి చెంపపెట్టు అనే చెప్పాలి. మరి ఏమి జరుగుతుందో సాయంత్రం తేలిపోతుంది.

Advertisements

Latest Articles

Most Read