వైసీపీ వ్యూహాలు బలే గమ్మత్తుగా ఉంటాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయటంలో వాళ్ళ స్టైల్ వేరు. ప్రజలను మాయ చేయటం, మభ్య పెట్టటం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అన్ని చోట్లా అది కుదురుతుంది కానీ చంద్రబాబ దగ్గర అది కుదురుతుందా ? మొన్న స్థానిక సంస్థలను టిడిపి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అన్ని చోట్లా టిడిపి వదిలేసింది. టిడిపి వదిలేసినవి పట్టుకుని, పోటీ లేని చోట మేమే గెలిచాం అంటూ వైసీపీ డబ్బా కొట్టింది. చివకు కుప్పంలో కూడా మేమే గెలిచాం అని చంద్రబాబు పని అయిపొయింది అంటూ చేసిన హడావాడి అంతా ఇంతా కాదు. బ్లూ మీడియా చేసిన హడావిడి అందరూ చూసారు. చంద్రబాబు కుప్పంలోనే ఓడిపోతారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. త్వరలోనే కుప్పంలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి మొన్న జరిగిన ఎన్నికల్లో జరగలేదు. అయితే కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకి బలం లేదని, చిత్తుగా ఓడిస్తాం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. ఇది చంద్రబాబ వరకు వెళ్ళింది. ఇక ఉపేక్షించేది లేదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు. కుప్పం పర్యటన పెట్టుకున్నారు. విషయం ఉన్న వాళ్ళు, చిల్లర ప్రచారాలు చేయరు, వాళ్ళ పనితనంతోనే సమాధానం చెప్తారు.

cbn 30102021 2

అలాగే చంద్రబాబు కూడా తనకు ఎంత బలం ఉందొ కుప్పంలోనే చూపిస్తానని, కుప్పం పర్యటన పెట్టుకున్నారు. నిన్న చంద్రబాబు కుప్పంలో అడుగు పెట్టారు. సహజంగా చంద్రబాబు సభలకు ఒక పరిమిత స్థాయిలోనే ప్రజలు వస్తారు. నిన్న కుప్పం పర్యటనలో మాత్రం, ప్రజలు కదం తొక్కారు. కను చూపు మేరలో జనం జనం జనం తప్ప, మరొకటి కనిపించ లేదు. ఎటు చూసినా ప్రజలే. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ప్రజలు విరగబడి వచ్చారు. కుప్పం ముద్దు బిడ్డ మా చంద్రబాబు అని చెప్పారు. విమర్శకులకు తనదైన శైలిలో చంద్రబాబు సమాధానం చెప్పారు. ఆ జనప్రభంజనం చూసిన వైసీపీ నేతలకు నోట మాట రాలేదు. నిజానికి కుప్పంలో వైసీపీకి క్యాడర్ లేదు. పక్క నియోజకవర్గాల నుంచి ప్రజలను తోలుకుని వచ్చి హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వ బలంతో, బుల్-డోజ్ చేసే ప్రయత్నం చేసారు. దీనికి చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ప్రజాభిమానంతోనే సమాధానం చెప్పి, వైసీపీ ఫేక్ ప్రొపగాండాను క్షణాల్లో భగ్నం చేసారు.

కోర్టుల వ్యవహరంలో వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అధికారులు తీరు ఇందులో గమనించాల్సిన అంశం. ప్రభుత్వ పెద్దలు చేసే పనులకు, అధికారులు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి. ఏ మాత్రం తేడా వచ్చినా, వైసీపీ పెద్దలకు ఏమి ఇబ్బంది ఉండదు కానీ, అధికారులు మాత్రం బలి అయిపోతున్నారు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, కింద స్థాయి అధికారులు వరకు, హైకోర్టు ఆగ్రహానికి గురి అయిన వారే. ప్రతి రోజు అధికారుల పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసే కేసులు చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య అధికారులు పై నాన్ బెయిలబుల్ వారెంట్లు, ఫైన్లు, శిక్షలు కూడా చూస్తున్నాం. అయినా అధికారులు మాత్రం ప్రతి రోజు బలి అవుతూనే ఉన్నారు. ప్రభుత్వం చేసే పనులకు అధికారులు ఇరుక్కుంటున్నారు. అటు ప్రభుత్వానికి చెప్పలేక, ఇటు కోర్టుల ముందు దోషులుగా నిలబడుతున్నారు. తాజాగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయి, నోటీసులు తీసుకుని కూడా, అధికారులు విచారణకు హాజరు కాకపొతే, వాళ్ళు ఎంత పెద్ద అధికారి అయినా సరే, వారి పైన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తాం అంటూ, హైకోర్టు హెచ్చరించిది. ఈ తరహా ఘటనలు ఉపేక్షించం అని, హైకోర్టు గురువారం హెచ్చరికలు జారీ చేసింది.

rawat 30102021 2

కోర్టు ధిక్కరణ నోటీసులు తీసుకుని కూడా విచారణకు హాజరుకాకపోతే, అది కోర్టులను మరింతగా కించపర్చడమేనని అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక కేసు విషయంలో, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌.ఎస్‌ రావత్ కోర్టు ధిక్కరణ కింద నోటీసులు అందుకుని, విచారణకు హాజరు కాకా పోగా, విచారణ సమయంలో న్యాయవాదిని కూడా నియమించకపోవటం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బెయిలబుల్‌ వారెంట్‌ ఇష్యూ చేసి, రూ.5లక్షల పూచీకత్తు ఇవ్వాలి అంటూ సంచలన ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వ న్యాయవాది వెంటనే కోర్టు ముందు హాజరు అయ్యి, కోర్టుకు క్షమాపణలు చెప్పారు. వేరే కేసు విచారణ జరుగుతుంది కాబట్టి, హాజరుకాక పోయాం అని, క్షమాపణ కోరటంతో, కోర్టు ఆదేశాలు వెనక్కు తీసుకుంది. కౌంటర్ దాఖలు చేయలని ఆదేశించింది. అయితే అధికారులు ఎంత ఒత్తిడిలో ఉన్నారో ఈ విషయం చూస్తే అర్ధం అవుతుంది. అనేక కేసులు ఉండటంతో, ఏ కేసు ఎప్పుడు ఉందో కూడా, ఫాలో అప్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, అధికారులు మీద జాలి పడాల్సిన అంశం అని న్యాయనిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

సిబిఐ అంటే,ఈ దేశంలోనే అత్యుత్తమ దర్యాప్తు సంస్థ. అలాంటి సిబిఐ ఈ మధ్య కాలంలో అనేక విమర్శలు ఎదుర్కుంటుంది. ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా మరీ వన్ సైడ్ గా, గుడ్డిగా అయితే సిబిఐ వెళ్ళలేదు. ఈ మధ్య కాలంలో ఏపిలోని కేసులు విషయంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. ఇది ప్రజలకు మాత్రమే కలిగిన అనుమానం కాదు. రెండు రోజుల క్రితం హైకోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. జడ్జిల పై వ్యాఖ్యల కేసులో సిబిఐ తీరు అనుమానాస్పదంగా ఉందని, నిందితులకు సహకరిస్తున్నట్టుగా సిబిఐ తీరు ఉంది అంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేయటం, తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఇప్పుడు సిబిఐ చేసిన మరో పని కూడా చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (లీగల్‌ రిటైనర్‌) గా సిబిఐ పి.సుభాష్‌ అనే వ్యక్తిని నియమించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ వ్యక్తి జగన్ తరుపున సిబిఐ కేసుల్లో వాదనలు వినిపించిన వ్యక్తి. అంతే కాదు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్లీడర్ కూడా. ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కేసు వాదించకూడదు అనే షరతుతో ఆయన నియామకం జరిగింది. ఇలాంటి వ్యక్తిని సిబిఐ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గా నియమించటం ఆశ్చర్యాన్ని కలిగించింది.

cbi 30102021 2

అటు జగన్ కు సిబిఐ కేసులు వాదించే లాయరే, ఇప్పుడు సిబిఐ తరుపున వాదించే లాయర్ ఎలా అవుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పై అనేక సిబిఐ కేసులు ఉన్నాయి, అవి తెలంగాణా కోర్టుల్లో ఉన్నాయని సమర్ధించుకున్నా, ఇక్కడ జడ్జిల పై కేసు కానీ, డాక్టర్ సుధాకర్ కేసు కానీ, వివేక కేసు కానీ, ఇలా అనేక కేసులు వైసిపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిబిఐ పని చేస్తుంది. హైకోర్టులో ఈ కేసులు విషయం పై అనేక ప్రత్యుత్తరాలు జరగాల్సి ఉంటుంది. అలాంటి వాటికి, జగన్ కు సన్నిహితంగా ఉండే లాయర్ ని, సిబిఐ ఎలా నియమిస్తుంది, అసలు ఇంకా సిబిఐ ఎందుకు, ఏమి న్యాయం చేస్తుంది అనే విమర్శలు వస్తున్నాయి. సుభాష్ నియమాకం వెనుక, వైసీపీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల తరుపున వాదించే లాయరే సిబిఐ తరుపున ఉంటే, అసలు ఆయనే ఎలా వాదనలు వినిపించగలరు అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి సిబిఐ ఈ తప్పు సరి చేస్తుందో లేదో చూడాలి.

కేసిఆర్, జగన్ మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల ముందే, అక్కడ జగన్,ఇక్కడ మనం వస్తున్నాం అని చెప్పారు. తరువాత చంద్రబాబు గెలిచిన తరువాత, చంద్రబాబుని ఇబ్బందులు పెడుతూనే వచ్చారు. మళ్ళీ 2019 ఎన్నికల సమయానికి, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని తన మంత్రులను పంపించి చంద్రబాబుకు వ్యతిరేకంగా కులాలను రెచ్చగొట్టటం, ఎన్నికల్లో జగన్ కు అన్ని రకాల సహకారాలు అందించటం తెలిసిందే. తరువాత జగన్ గెలిచిన తరువాత, ఒకరి నోట్లో ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు, దావత్ లు చేసుకున్నారు. జగన్, కేసీఆర్ కు కావాల్సినవి అన్నీ ఇచ్చేసారు. ఇలా ఎంతో అద్భుతంగా సాగింది. ఏమైందో, ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీ నెమ్మదిగా మాటల యుద్ధం మొదలు పెట్టింది. సహజంగా కేసీఆర్ అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకునే గుణం కాబట్టి, ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. రెండు రోజుల నుంచి ఒక కొత్త చర్చ మొదలయ్యింది. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ తల్లి బదులు తెలుగు తల్లి వచ్చిందని, రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి వేయాలనే ఉద్దేశం కేసీఆర్ కు ఉందని, అందుకే ఆంధ్రాలో కొత్త పార్టీ అంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

kcr 30102021 2

కోట్లాడి రాష్ట్రం సాధించి, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రా ప్రస్తావన ఎందుకు అని దీని వెనుక ఏదో కుట్ర ఉందని అన్నారు. అన్నట్టే, తరువాత రోజు పేర్ని నాని మాట్లాడుతూ, కేసీఆర్ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, రెండు తెలుగు రాష్ట్రాలు కలిపిస్తే చాలు అని, పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా ఒక తీర్మానం చేస్తే చాలని రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోవచ్చు అని అన్నారు. దీని పై రేవంత్ రెడ్డి మళ్ళీ స్పందించారు. వీరి ఇద్దరి వ్యాఖ్యలు వెనుక పెద్ద కుట్ర ఉందని, జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళగానే, ఉమ్మడి రాష్ట్రానికి సియం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు పేర్ని నాని వ్యాఖ్యలను టిఆర్ఎస్ పార్టీ ఖండించలేదు అంటేనే, అర్ధం అవుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం మళ్ళీ జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, గత వారం రోజులుగా జరుగుతున్న విషయాలు వీటికి మూలం అని రేవంత్ అన్నారు. మరి ఇవి రాజకీయ ఆరోపణలేనా ? లేక నిజంగానే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ? ఏమో మన రాజకీయ నాయకులు మామూలు వాళ్ళు కాదు మరి.

 

Advertisements

Latest Articles

Most Read