జడ్జి మారినా, జస్టిస్ మారదని ఒక నానుడి ఉంది. మనం చేసే పనులు చట్ట వ్యతిరేకంగా ఉంటే, ఏ జడ్జి అయినా ఒకే రకమైన తీర్పు ఇస్తారు. కాకపోతే ఆ జడ్జిలు వాడే పదాల్లో తేడా ఉంటుంది ఏమో కానీ, జస్టిస్ లో తేడా ఉండదు. ఎందుకు అంటే, ఎవరు అయినా సరే చట్టం, న్యాయం ప్రకరామే తీర్పులు ఇస్తారు. మన రాష్ట్రంలో వైసీపీ పార్టీలాగా కొంత మంది, తమ అసమర్ధతను, చేతకాని తనాన్ని, జడ్జిల మీద తోసేసి కాలం గడుపుతూ ఉంటారు. ప్రజలలో జడ్జిలు, కొన్న పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయి అనే సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. ఏ జడ్జి అయినా, చట్టానికి లోబడే తీర్పులు ఇస్తారు. మన రాష్ట్ర హైకోర్టుకు ఈ మధ్యనే కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు. ఆయనే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర. వచ్చి వారం రోజులు కూడా కాలేదు కానీ, ఆయన ఎంత టఫ్ అనేది ఇప్పటికే ఆయన కేసులు డీల్ చేస్తున్న విధానం చూస్తే అర్ధం అవుతుంది. గతంలో జస్టిస్ కేకే మహేశ్వరి, జస్టిస్ అనుప్ కుమార్ గోస్వామి చీఫ్ జస్టిస్ లుగా చేసారు. వారికి మించి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర టఫ్ గా ఉన్నారు. ప్రధానంగా గత ఏడాది కాలంగా సాగుతున్న సిబిఐ కేసు విషయంలో, అసలు కుట్ర ఏమిటో బయట పెట్టే విధంగా, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర వ్యవహరిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటుంది.

cji 29102021 2

జడ్జిల పై, న్యాయస్థానాల పై కామెంట్స్ చేసిన వారి కేసులో, సిబిఐ గత ఏడాది కాలంగా సాగదీస్తూ వస్తుంది. మొత్తం 90 మంది ఉంటే, ఏదో ఒక పది మందిని చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చూపించి, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ ప్రజా ప్రతినిధుల జోలికి సిబిఐ వెళ్ళలేదు. ముఖ్యంగా వెళ్ళు అందరూ టీవీల్లో కామెంట్స్ చేసారు. జడ్జీలు, చంద్రబాబు ఫోన్లు చూడాలి అని మాట్లాడిన వారిని కూడా సిబిఐ టచ్ చేయలేదు. ఇక పంచ్ ప్రభాకర్ అనే వాడిని కూడా ఇప్పటికీ పట్టుకోలేదు. దీని పై చీఫ్ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర సీరియస్ అయ్యారు. అతన్ని ఎందుకు పట్టుకోలేక పోతున్నారని ? నోటీస్ ఇచ్చి రమ్మంటే వస్తారా అని ప్రశ్నించారు. అంతే కాదు, ఇప్పటికీ పోస్టింగ్ లు ఎందుకు వస్తున్నాయి అని, సిబిఐ తీరు అనుమానాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పుడు ఏపి మా స్వరాష్ట్రం అని, న్యాయ వ్యవస్థ పై చేస్తున్న దా-డి, ఏపి రాష్ట్రం మీద చేస్తున్న దా-డిగా చూస్తున్నాం అని అన్నారు. మేము వీధుల్లోకి వచ్చి పోట్లాడటలేం కదా అని ప్రశ్నించారు. మొత్తానికి చీఫ్ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, సిబిఐని గడగడలాడిస్తున్నారు. కుట్ర మొత్తం తేల్చే దాకా వదిలి పెట్టేలా లేరు.

చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మధ్య కొనసాగుతుంది. ఉదయం నుంచి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో, వైసీపీ మరింతగా రెచ్చిపోయింది. బ్యానర్లు చింపటం, కరెంటు ఆపటం, టిడిపి శ్రేణులను అడ్డుకోవటం, ఇలా అన్నీ చేసారు. అయినా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. కొద్ది సేపటి క్రితం కుప్పం బస్టాండ్‌ వద్ద నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. అయితే ఈ సభ మొదలై చంద్రబాబు ప్రసంగం మొదలు పెట్టిన తరువాత కొంత మంది హాల్ చల్ చేసారు. అతని దగ్గర బాంబు ఉందని, అనుమానం రావటంతో ఒక్కసారి గా ఉలిక్కి పడ్డారు. చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉన్న ఎన్ఎస్జీ కమండాలో పొజిషన్ తీసుకున్నారు. బులిట్ ప్రూఫ్ జాకెట్లు తీసారు. చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చంద్రబాబు చుట్టూ వచ్చేసారు. ఈ లోపు టిడిపి శ్రేణులు ఆ వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద డమ్మీ బాంబు ఉందని, మరొకరి దగ్గర రాళ్ళు, కర్రలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సమయంలో ఏమి జరుగుతుందో చంద్రబాబుకు కూడా అర్ధం కాలేదు. స్టేజ్ పై నుంచే రాళ్ళూ ఉన్నాయా, బాంబులు తెచ్చారా అని వాకబు చేసారు. పోలీసులకు అప్పగించటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

cbn kuppam 29102021 2

ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడ ఉన్న పోలీసులను వాళ్ళు ఎలా వచ్చారు అని ప్రశ్నించారు. పోలీసులు ఇలాగే చూసి చూడనట్టు వదిలేస్తే మంచిగా ఉండదని అన్నారు. తప్పుడు పనులు చేసే వారి పై ఎంక్వయిరీ కమిషన్ వేస్తాం అని, వారిని వదిలిపెట్టే సమస్యే లేదని చంద్రబాబు అన్నారు. న్యాయంగా ఉంటే తలొగ్గి ఉంటాం అని, దుర్మార్గాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా క్షోభ పెడుతున్నారని , దీని కోసం పోలీసులను వాడుకుంటున్నారని, పోలీసులు కూడా ఇటువంటివి మానేస్తే మంచిది అని అన్నారు. కుప్పంలో లేని సంస్కృతీన తీసుకుని వచ్చారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసి వదిలి పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు కుప్పం వస్తే బాంబులు వేస్తాం అంటూ ఇటీవల వైసీపీ నేతలు చెప్పటంతో, ఈ సంఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. టిడిపి కార్యకర్తలు అతన్ని పట్టుకోవటంతో, ప్రమాదం తప్పింది. లేకపోతే ఏమి జరిగేదో మరి.

చంద్రబాబు కుప్పం పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్యే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా చంద్రబాబు పర్యటన కోసం టిడిపి శ్రేణులు కట్టుకున్న ఫ్లేక్సీలను ఎక్కడికక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇది వైసీపీ వారి పనే అని టిడిపి ఆరోపిస్తుంది. దీంతో భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న టిడిపి కార్యకర్తలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేసారు. అయినా ఇంకా సంఘటనలు ఆగక పోవటంతో, టిడిపి శ్రేణులు కూడా వైసీపీ ఫ్లెక్సీలు చించివేసారు. కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న వైసిపీ బ్యానర్లను టిడిపి చించి వేసే ప్రయత్నం చేయగా, వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరు వర్గాలను చెదరగొట్టారు. భారీ సంఖ్యలో చంద్రబాబు పర్యటన కోసం వచ్చిన టిడిపి శ్రేణులు, తమ అధినేత ఫ్లేక్స్ లు చించివేయటం పై ఆగ్రహం వ్యక్తం చేసాయి. దీంతో వీరు కూడా వైసిపీ ఫ్లెక్సీలను కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసారు. అయితే పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం చంద్రబాబు ఆర్ అండ్ బి అతిధి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కుప్పంలో భారీ వర్షం పడుతూ ఉండటంతో, చంద్రబాబు గెస్ట్ హౌస్ కే పరిమితం అయ్యారు.

kuppam 29102021 2

వాస్తవానికి ఈ పాటికే చంద్రబాబు బహిరంగ సభ ప్రారంభం కావాల్సి ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో, ఆయన బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కుప్పం రావటానికి చాలా సమయం పట్టింది. అక్కడకు చేరుకోగానే వర్షం కూడా మొదలు కావటంతో, కార్యక్రమం ఆలస్యం అయ్యింది. వర్షం ఆగిన తరువాత, ఆయన రోడ్ షో మొదలు పెట్టి, భారీ బహిరంగ సభలో పాల్గుననున్నారు. తరువాత ముగ్గురు నేతల ఇళ్ళకు కూడా చంద్రబాబు వెళ్లనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు కూడా కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం కనిపించ లేదని, వైసిపీ అధికార బలంతో, తమను ఇబ్బందులు పెడుతున్న నేపధ్యంలో, కార్యకర్తల్లో ఎమోషన్ పెరిగిపోయిందని, బదులు తీర్చుకోవటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు పర్యటనకు అనేక ఇబ్బందులు కల్పిస్తున్న వేళ, భారీగా వచ్చిన టిడిపి శ్రేణులతో, ఏ నిమిషాన ఏమి జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.

అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. కొద్ది సేపటి క్రితం లంచ్ మోషన్ పిటీషన్ పై విచారణ చేసింది. అయితే ఇంకా లిఖిత పూర్వ ఉత్తర్వులు హైకోర్టు నుంచి రావలసి ఉంది. నిన్న అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించారు. నవంబర్ ఒకటి నుంచి, డిసెంబర్ 17 వరకు, 40 రోజుల పాటు చేయి తలపెట్టిన న్యాయస్థానం టు దేవస్థానం, మహా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర డీజీపీ నిన్న ఉత్తర్వులు జారీ చేసారు. అమరావతిలోని హైకోర్టు దగ్గర నుంచి తిరుపతి వెంకన్న గుడి వరకు ఈ పాదయాత్ర ఉండాల్సి ఉంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ తో పాటు, ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. అయితే డీజీపీ మాత్రం అనుమతి నిరాకరించారు. దీంతో రైతులు నిన్న లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. హైకోర్టు ఈ లంచ్ మోషన్ పిటీషన్ కు అనుమతి ఇచ్చి, ఈ రోజు మధ్యానం 2.15 నిమిషాలకు దీని పైన విచారణ మొదలు పెట్టింది. అటు ప్రభుత్వం వైపు నుంచి, రైతులు వైపు నుంచి పూర్తీ స్థాయిలో వాదనలు జరిగాయి. డీజీపీ అనుమతి నిరాకరిస్తూ పేర్కొన్న అంశాలు సహేతుకమైన కారణాలు కావని, న్యాయవాది లక్ష్మీ నారాయణ వాదించారు.

amaravatiarmers 29102021 2

నేలపాడులో ఉన్న హైకోర్టు దగ్గర నుంచి, తిరుపతిలో ఉన్న వెంకన్న ఆలయం వారకు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారని, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే రైతులు పోలీసులుకు ఇచ్చారని, అటువంటి అప్పుడు సిల్లీ కారణాలతో ఈ అనుమతి నిరాకరించటం అనేది సమంజసం కాదని న్యాయవాది వాదించారు. మరో పక్క ప్రభుత్వం మాత్రం కేవలం శాంతి భద్రతల అంశం సాకుగా చూపిస్తూ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని చెప్తుంది. ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని, ఈ నేపధ్యంలో అమరావతి రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా వెళ్తే, ఇతర ప్రాంతాలకు వెళ్తే ఇబ్బంది అవుతుందని వాదిస్తుంది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని షరతులతో అనుమతి ఇస్తామాని కోర్టు చెప్పింది. దీనికి సంబంధించి షరతులు ఏమిటి అనే దాని పై హైకోర్టు పూర్తి ఆర్డర్ కాపీలో పొందుపరిచే అవకాసం ఉంది. మరి కొద్ది సేపట్లో ఉత్తర్వులు రానున్నాయి.

Advertisements

Latest Articles

Most Read