ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన వివరణ పై సంతృప్తి చెందని హైకోర్టు, వారి పైన దర్యాప్తు చేయాలి అంటూ గుంటూరు జిల్లా జడ్జిని ఆదేశించిటంతో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది. సహజంగా మొన్నటి వరకు పోలీసుల తీరు పైనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చేది. అయితే మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ పై ఈ రోజు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయటం, విచారణాకు ఆదేశించటం సరి కొత్త పరిణామం. వివరాల్లోకి వెళ్తే టిడిపి నేతను బ్రహ్మం చౌదరిని పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా బ్రహ్మం చౌదరి, పోలీసులు తనని కొట్టారు అంటూ మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ముందు చెప్పుకున్నారు. ఆ గాయాలు కూడా కోర్టుకు చూపించారు. అతని స్టేట్మెంట్ అయితే మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ రికార్డ్ చేసారు కానీ, అతన్ని వైద్య పరీక్షలకు పంపకుండా, విడుదల చేయకుండా, రిమాండ్ వేయటం పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బ్రహ్మం చౌదరి హైకోర్టుకు వెళ్ళారు. ఇక ఇదే సమయంలో బ్రహ్మం చౌదరికి, 41 ఏ నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసారని, తన పైన పెట్టిన కేసులు అన్నీ, ఏడేళ్ళ లోపు కేసులు అని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నోటీస్ ఇవ్వాల్సి ఉందని, కోర్ట్ కు తెలిపారు.

hc mangalagiri 29102021 2

నోటీస్ ఇచ్చి, విచారణ చేసి పంపించి వేయాలని, ఒక వేళ నోటీస్ ఇచ్చిన తరువాత అరెస్ట్ చేయాలి అంటే, మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాల్సి ఉందని, అవేమి లేకుండానే పోలీసులు అరెస్ట్ చేసారని, నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయటమే కాకుండా, కస్టడీలో కొట్టారు అంటూ బ్రహ్మం చౌదరి హైకోర్టుకు తెలిపారు. దీని పై హైకోర్టు స్పందిస్తూ, మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ కు ఇలా ఎందుకు జరిగిందో చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది. దెబ్బలు తగిలయాని చెప్తే, వైద్య పరీక్షలకు ఎందుకు పంపించలేదని ప్రశ్నించింది ? 41 ఏ నోటీస్ విషయం కూడా ప్రశ్నించింది. ఇవన్నీ రికార్డులో రాసి కూడా, రిమాండ్ కు ఎందుకు తరలించాల్సి వచ్చిందో కోర్టుకు చెప్పాలని తెలిపింది. దీని పై వివరణ కోరింది. కోర్టు ఆదేశాలు ప్రకారం మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ఈ రోజు వివరణ ఇవ్వగా, కోర్టు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. గుంటూరు జడ్జిని విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు కింద కోర్టు మెజిస్ట్రేట్ లు అందరూ, రొటీన్ గా రిమాండ్ వేయటం కాకుండా, కేసు మెరిట్స్ ప్రకారం ఆదేశాలు ఇచ్చే అవకాసం ఉంది.

న్యాయమూర్తుల పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ రోజు హైకోర్ట్ ధర్మాసనం ముందు మరో సారి విచారణ జరిగింది. నిన్న హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు, సిబిఐ విశాఖపట్నం ఎస్పీ కోర్టు ముందు హాజరు అయ్యారు. పంచ్ ప్రభాకర్ వీడియోల పై హైకోర్టులో దాదాపుగా గంట సేపు చర్చ జరిగింది. పంచ్ ప్రభాకర్ వీడియోలు తొలగించాలి అని, యూట్యూబ్ కి తాము ఎప్పుడో లేఖ రాశామని సిబిఐ కోర్టుకు పేర్కొంది. అయితే తమకు ఎటువంటి లేఖ అందలేదని యూట్యూబ్ తరుపున హాజరు అయిన న్యాయవాది చెప్పటంతో హైకోర్టు ఆశ్చర్య పోయింది. హైకోర్టు రిజిస్టార్ జనరల్ ఇటువంటి అభ్యంతరక వీడియోలు ఏమైనా వస్తే కానీ, లేదా సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల పై అసభ్యంగా పోస్టులు పెడితే, రిజిస్టార్ జనరల్ నుంచి లేఖ వస్తే వాటిని వెంటనే తొలగించే విధంగా యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ఆదేశాలు ఇస్తే బాగుటుంది అని, స్టాండింగ్ కౌన్సిల్ అశ్వనీ కుమార్ హైకోర్టు ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో హైకోర్టు ధర్మాసనం స్పందించింది. హైకోర్టు సిబిఐకి లేఖ రాయటం, సిబిఐ మళ్ళీ సామాజిక మాధ్యమాలకు లేఖ రాయటం కాకుండా, నేరుగా రిజిస్టార్ జనరల్ లేఖ రాస్తే తాము సిద్ధంగా ఉన్నామని యూట్యూబ్ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

cbi 29102021 2

అదే విధంగా ఫేస్బుక్, వాట్స్ అప్ లకు కూడా ముకుల్ రోహ్తగీ, కపిల్ సిబల్ కూడా న్యాయవాదులుగా హాజరు అయ్యి, వాళ్ళు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించారు. హైకోర్టు రిజిస్టార్ జనరల్ నుంచి లేఖ వచ్చిన మరుక్షణమే ఈ చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. అయితే పంచ్ ప్రభాకర్ వెనుక కొంత మంది రాజకీయ నాయకులు ఉన్నారని, ఆయన కేవలం తోక మాత్రమే అని, ముండెం తల, వేరే చోట ఉన్నాయని స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టుకు చెప్పింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, అమెరికాలో ఉన్న ఆ ప్రభాకర్ తోకనే కాట్ చేద్దాం అని పేర్కొంది. పంచ్ ప్రభాకర్ విషయం పై ఏమి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని స్టాండింగ్ కౌన్సిల్ అడగటంతో, అఫిడవిట్ వేస్తామని సిబిఐ చెప్పింది. ఇన్ని రోజులు అయినా పోస్టులు ఎందుకు ఆగటం లేదని హైకోర్టు ప్రశ్నించింది. సిబిఐ దార్యప్టు చేస్తున్నా పరిస్థతిలో మార్పు లేదని చెప్పింది. పంచ్ ప్రభాకర్ ఐడెంటిటీ దొరకటం లేదని, సిబిఐ చెప్పగా, హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హైకోర్టు మీద వ్యాఖ్యలు చేస్తున్న వారినే మీరు పట్టుకోక పొతే సామాన్యులు పరిస్థితి ఏమిటి అని హైకోర్టు ప్రశ్నించింది.

తెలుగుదేశం పార్టీలో చేరిన జీవీ రెడ్డికి టిడిపి అధినేత చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. జీవీ రెడ్డిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తూ, నిన్న టిడిపి ఏపి అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేసారు. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను, పార్టీ ఆశయాలను ప్రజల్లో బలంగా వినిపించేందుకు, మీడియాలో తమ పార్టీ వాణి వినిపించేందుకు జీవి రెడ్డిని పార్టీ ఉపయోగించుకోనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందినా జీవీ రెడ్డి, మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయినా కూడా, ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున బలంగా వాదించే వారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తులసి రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వారు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కావటంతో, సమకాలిక రాజకీయ విశ్లేషణను ప్రజల్లో బలంగా వినిపిస్తూ, ప్రజలకు అర్ధం అయ్యే భాషలో చెప్పే వారు. టీవీలలో అనేక డిబేట్లలో పాల్గునే వారు. అయితే మారిన పరిస్థితులు కారణంగా, ఆయన టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దసరా పండుగ ముందు చంద్రబాబుని కలిసారు. చంద్రబాబుతో పలు విషయాలు చర్చించిన అనంతరం, పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవటం, చంద్రబాబు కూడా ఒప్పుకోవటం జరిగింది.

gvreddy 29102021 2

ఈ నెల 21న ఆయన టిడిపిలో చేరారు. చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవీ రెడ్డి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. టిడిపిలో చేరటం సంతోషంగా ఉందని, జగన్ మోహన్ రెడ్డి విధ్వంసక పాలనను ఎదుర్కోవటానికి, బలమైన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. చంద్రబాబు అభివృద్ధి కోరుకునే వ్యక్తీ అని, జగన్ వినాశకాలు కోరుకునే వ్యక్తి అని జీవీ రెడ్డి అన్నారు. రాష్ట్రం మరింతగా నాశనం కాకూడదు అంటుంటే, అందరూ చంద్రబాబుని బలపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఇప్పుడు జీవీ రెడ్డికి చంద్రబాబు మరిన్ని బాధ్యతలు ఇచ్చారు. ఆయనను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. ఇక్కడ టిడిపి చెప్తున్న మరో మాట, టిడిపి పై వైసీపీ వేసిన కుల ముద్ర అంతా ఫేక్ అని, టిడిపి కుల పిచ్చి ఉన్న పార్టీ అయితే, జీవీ రెడ్డి టిడిపిలో ఎందుకు చేరతారని, టిడిపి అభివృద్ధి కాంక్షించే పార్టీ అని, అన్ని వర్గాలను ఆదరించే పార్టీ అని టిడిపి శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నేటి నుంచి రెండ్రోజుల పాటు కుప్పంలో పర్యటన చేయనున్నారు. ఇవాళ, రేపు పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గుంటారు. నేడు కుప్పంలో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించనున్నారు. పలువురు పార్టీ నేతల ఇళ్లకు కూడా చంద్రబాబు నాయుడు వెళ్తారు. రేపు కుప్పంలో వ్యాపార సంఘాల నేతలు, సభ్యులతో చంద్రబాబు భేటీ అవుతారు. కుప్పం పర్యటన కోసం చంద్రబాబు ఈ రోజు ఉదయం బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ చంద్రబాబుకు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబుకి బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో అభిమానులు స్వాగతం పలికే సమయంలో, కారు డోర్ లో పడి, చేతి వేలికి స్వల్ప గాయమైంది. దీంతో చంద్రబాబు మళ్ళీ కార్ లోకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నారు. స్వల్ప గాయం కావటం అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన పర్యటన కొనసాగుతుంది. ఇది ఇలా చంద్రబాబు కుప్పం పర్యటన నేపధ్యంలో, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలకటానికి వెళ్తూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముఖ్యంగా పలమనేరు నుంచి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనకు అవరోధాలు కలిగించాలి అనే ఉద్దేశంతోనే, పోలీసుల ఇలా అడ్డుకుంటున్నారని కూడా టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు.

cbn 29102021 2

పోలీసులు తీరుకు టిడిపి శ్రేణులు ధర్నా చేయటంతో, పోలీసులు వారిని వదిలేసారు. ఇక కుప్పంలో, వైసిపి శ్రేణులు అరాచకం చేస్తున్నాయి. కుప్పం లక్ష్మిపురం క్రాస్ రోడ్ వద్ద టిడిపి శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. దీంతో టిడిపి శ్రేణులు అక్కడ పెద్ద ఎత్తున ధర్నాకు దిగాయి. అయితే కుప్పం పర్యటనను ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి అంటూ, వైసిపీ శ్రేణులు చూస్తున్నారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంస్కృతీ ఎప్పుడూ కుప్పంలో లేదని, చంద్రబాబు వస్తున్న నేపధ్యంలో, ఇలాంటి పనులకు వైసీపీ పాల్పడుతూ, కుప్పంలో కొత్త సంస్కృతీ తెస్తున్నారని వాపోతున్నారు. కుప్పం పర్యటనను అడ్డుకోవాలని గతంలో వైసీపీ నేతలు అనేక ప్రకటనలు చేసారు. అయితే ఇప్పుడు చంద్రబాబు పర్యటన మొదలు కాక ముందే, వైసీపీ శ్రేణులు అరాచకాలు మొదలు పెట్టాయి. చంద్రబాబు పర్యటనకు పెద్ద ఎత్తున వస్తున్న టిడిపి శ్రేణులను చూసి, వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యి, ఏమి చేయాలో అర్ధం కాక, ఇలాంటివి చేస్తున్నారని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read